‘జై సింహా’కు కూడా నైట్‌ షోస్‌ | AP govt permits Special Night shows for Jai Simha | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 11 2018 2:25 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

AP govt permits Special Night shows for Jai Simha - Sakshi

బుధవారం విడుదలైన అజ్ఞాతవాసి సినిమాకు అర్థరాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు షో వేసుకునేందుకు అనుమతించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జై సింహా సినిమాకు కూడా అదే పర్మిషన్ ఇచ్చింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న జై సింహా సినిమాకు అర్థరాత్రి కూడా షో వేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 12వ తేదినుంచి 16వ తేది వరకు అర్థరాత్రి సినిమా ప్రదర్శనకు అనుమతించారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాతో సంక్రాంతి సీజన్ లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement