
గర్జించే రూలర్ రొమాంటిక్‌గా మారిపోయాడు. హీరోయిన్‌తో కలిసి అదుర్స్ అనేలా స్టెప్పులేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రూలర్’. ఇందులో సోనాల్ చౌహాన్, వేదిక కథాయికలుగా నటిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన అందమైన పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియోలో బాలయ్య బాబు సోనాల్ చౌహాన్‌తో కలిసి అందమైన లొకేషన్లలో చిందులు వేస్తున్నాడు.
‘యాలయాల ఇయ్యాల డియ్యా డియ్యాల..’ అంటూ సాగుతున్న ఈ పాట మెలోడీ గీతంతో అలరిస్తోంది. డైలాగులతో కేక పుట్టించే బాలయ్య కాస్త రూటు మార్చి హీరోయిన్‌తో రొమాన్స్ పండించాడు. లొకేషన్ల ఎంపికతోపాటు హీరోహీరోయిన్ల కాస్ట్యూమ్స్ పాటకు సరితూగేలా ఉన్నాయి. ‘అలారమేదో మోగినాది గుండె మారుమూల..’ అంటూ సాగే ఈ పాట యూత్ గుండెల్లో అలారం మోగించేట్లు కనిపిస్తోంది. అనురాగ్ కులకర్ణి, అనుష మణిలు ఈ గీతాన్ని ఆలపించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. చదవండి: ఆ స్ఫూర్తితోనే రూలర్ చేశాం
Comments
Please login to add a commentAdd a comment