
‘రూలర్’చిత్రంలో ఐరన్ మ్యాన్ లుక్‌లో కనిపించి అదరగొట్టారు నందమూరి బాలకృష్ణ. తన చిత్రాల్లోన్ని పాత్రలకు పూర్తి న్యాయం చేయడానికి భాష, వేషం, ఆహార్యం పూర్తిగా మార్చేసుకోవడంలో ఆయన ఏ మాత్రం వెనకాడరు. తాజాగా మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని బాలయ్య పాత్రను డిఫరెంట్‌గా డిజైన్ చేశారట బోయపాటి. దీనిలో భాగంగా ఈ చిత్రంలో ‘ఆఘోర’ క్యారెక్టర్‌లో బాలయ్య కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్.
ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ వారణాసిలో ప్రారంభమైంది. కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వారణాసి నుంచి తిరిగొచ్చారు. అయితే ఈ మధ్య ఓ కార్యక్రమంలో బాలయ్య డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చారు. చిన్నపాటి జుట్టు, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోయపాటి సినిమాల్లో ఆయన లుక్ ఇదేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అప్పట్లో గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఈ నందమూరి నటసింహం. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. అంజలి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.
చదవండి:
2008లో ఓ వ్యక్తిని ప్రేమించా: అనుష్క
అమలా పరిణయం
Comments
Please login to add a commentAdd a comment