
ప్రతి సినిమాకు కొత్త లుక్ ట్రై చేయడంలో ముందుంటారు హీరో నందమూరి బాలకృష్ణ. దాదాపు అన్ని సినిమాల్లోనూ కొత్తగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్వకత్వంలో బాలకృష్ణ BB3 అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో BB3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా కోసం బాలయ్య న్యూలుక్‌లోకి మారిపోయాడు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సరసన నటిస్తోంది. తాజాగా హోలీ సంబరాల్లో పాల్గొన్న బాలకృష్ణ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నాడు. వరుస డిజాస్టర్స్‌లో ఉన్న బాలయ్యకు ఈ సినిమా కీలకంగా మారింది. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశముంది. మే28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
చదవండి : చిరు, బాలయ్యలతో బాలీవుడ్ భామ రొమాన్స్!
రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment