Akhanda Title Song Released | Balakrishna's Akhanda Movie Title Song - Telugu Cinema News
Sakshi News home page

Akhanda: అదిరిపోయిన 'అఖండ' టైటిల్‌ సాంగ్‌

Published Mon, Nov 8 2021 1:29 PM | Last Updated on Mon, Nov 8 2021 1:55 PM

Akhanda Title Song: Balakrishna Roars As Aghora - Sakshi

Akhanda Title Song Released: బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అఖండ'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి అఖండ టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ ఆలపించిన ఈ సాంగ్‌ భారీ విజువల్స్‌తో గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది.

పాట విడుదలైన కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సింహా’,‘లెజెండ్‌’వంటి బెగ్గెస్ట్‌ హిట్స్‌ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement