
►జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
► మహాప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్
► తారకరత్న వెంటే వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబునాయుడు
► ఫిల్మ్ చాంబర్ నుంచి మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర
► తండ్రి మోహన కృష్ణ చేతుల మీదుగా తారకరత్న అంతిమ సంస్కారాలు
► పాడె మోసిన బాలకృష్ణ, మిగతా కుటుంబసభ్యులు
► కన్నీరుమున్నీరవుతున్న నందమూరి కుటుంబసభ్యులు
తారకరత్న మృతితో నందమూరి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే తారకరత్న అకాల మరణం చెందడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అజాత శత్రువుగా, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకొని తారకరత్నకు నివాళులు అర్పించారు. బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం మేరకు మధ్యాహ్నం 3.30గంటల తర్వాత తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. తారకరత్నకు ఆయన తండ్రి మోహన్ కృష్ణ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.