
నందమూరి తారకరత్న మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన చిన్నవయసులోనే అర్థాంతరంగా తనువు చాలించడం కలిచివేస్తుంది. తారకరత్న చనిపోయి సుమారు 2నెలలు కావొస్తున్నా ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భర్తను కోల్పోయిన అలేఖ్యా రెడ్డి తారకతరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది.
తాజాగా మరోసారి భర్తను తలుచుకుంటూ అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యింది. పిల్లలతో తారకరత్న గడిపిన క్యూట్ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ.. నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేకపోతున్నా అంటూ ఇన్‌స్టాలో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు.. మాకే చాలా బాధగా అనిపిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా జనవరి 27న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆసుపత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.