Taraka Ratna's Wife Alekhya Reddy Shared Her Son Tanya Ram Photo - Sakshi
Sakshi News home page

Taraka Ratna: తండ్రి ఫొటో పట్టుకుని తారకరత్న కొడుకు అలా.. ఫొటో షేర్‌ చేసిన అలేఖ్య

Mar 29 2023 3:09 PM | Updated on Mar 29 2023 3:56 PM

Taraka Ratna Wife Alekhya Reddy Shared Her Son Tanya Ram Photo - Sakshi

దివంగత నటుడు నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న మరణం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరైంది. భర్త మరణాంతరం అలేఖ్య ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో తరచూ ఎమోషనల్‌ పోస్ట్స్‌ షేర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: అలీ రేజాతో రొమాంటిక్‌ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్‌ రియాక్షన్‌

అంతేకాదు వారి పెద్ద కూతురు నిష్క కూడా తండ్రిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతుంది. తండ్రితో ఉన్న జ్ఞాపకాలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మరో పోస్ట్‌ చేసింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో పెద్ద కూతురు నిష్క గురించి ప్రస్తావించే ఆమె తాజాగా తనయుడు ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. ఇందులో ఆమె కొడుకు తాన్యారామ్‌ తారకరత్న ఫొటో పట్టుకుని కనిపించాడు.

చదవండి: మై స్వీట్‌ బ్రదర్‌ అంటూ ఫొటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌

ఇక దీనికి అలేఖ్య ‘పెద్దయ్యాక నాన్నలా అవుతాను’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. తాన్యారామ్‌ తండ్రి ఫొటోను పట్టుకుని ఉన్న ఈ ఫొటో కన్నీళ్లు తెప్పిస్తుంది. అలా చూసి అందరి హృదయాలు బరువెక్కుతున్నాయి. అలా తారకరత్న కొడుకు  కాగా తారకరత్నా, అలేఖ్య రెడ్డిది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. పెద్దలను ఎదరించి వీరు ఒక్కటయ్యారు. అది నచ్చని నందమూరి కుటుంబం తారకరత్నా, అలేఖ్యలను దూరం పెట్టారు. అప్పటి నుంచి వేరుగా ఉంటున్న వీరి జీవితంలో తారకరత్న మృతి తీరని విషాదాన్ని నింపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement