
నందమూరి తారకరత్న మరణం అటు అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని నింపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కడవరకు తోడుంటాడనుకుంటే ఇలా అర్థంతరంగా తనువు చాలించడంతో అలేఖ్య రెడ్డి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అప్పటి నుంచి భర్తను తలుచుకుంటూ అతనితో ఉన్న ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది అలేఖ్యా రెడ్డి. చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్
ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ''ఈ జీవితానికి నువ్వూ నేను మాత్రమే!.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చి వెళ్ళావు. వాటితో నేను ముందుకు వెళతాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను'' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్యా రెడ్డి.
ఇక మరొక పోస్టులో తారకరత్న చిన్ననాటి ఫోటోను, తన కుమారుడి ఫోటోను షేర్ చేస్తూ.. వీళ్లే తన స్టార్స్ అంటూ పేర్కొంది. కాగా నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. చదవండి: మెసేజ్ చేసినందుకు నేరుగా ఇంటికి వెళ్లిన డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment