
జీవితాంతం తోడుండాల్సిన భర్త అర్ధాంతరంగా తనువు చాలిస్తే ఏ భార్య తట్టుకుంటుంది? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ మహిళ మనసు ఎంత తల్లడిల్లుతుంది? భర్తే సర్వస్వమనుకున్న అలేఖ్యా రెడ్డిని నందమూరి తారకరత్న అకాల మరణం అశనిపాతంలా తాకింది. తను లేని జీవితాన్ని ఊహించుకోలేక కుమిలికుమిలి ఏడుస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. తాజాగా భర్తపై ఉన్న ప్రేమను బయటపెడుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అలేఖ్య.
'జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేశాం. నీ చివరి రోజుల వరకు కలిసి ఫైట్ చేశాం. కార్లలో నిద్రించిన రోజుల నుంచి ఇప్పటివరకు.. మన జీవిత ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేశాం. నువ్వు ఒక వారియర్ నాన్నా.. నువ్వు చూపించినంత ప్రేమ మాపై ఇంకెవ్వరూ చూపించలేరు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తారకరత్న చేయి పట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసింది. దీనిపై అలేఖ్య స్నేహితురాలు స్పందిస్తూ.. 'మీరెన్ని కష్టాలు పడ్డారో అతి కొద్దిమందికే తెలుసు. ఎంత పోరాడాలో అంతవరకు పోరాడారు. కానీ ఆ దేవుడు కొన్నిసార్లు దయ లేనివాడిగా వ్యవహరిస్తాడు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. ఎల్లప్పుడూ నీవెంటే ఉంటాను అల్లూ' అని రాసుకొచ్చింది. మిగతా నెటిజన్లు సైతం 'మేమంతా మీకున్నాం అక్కా, ధైర్యంగా ఉండండి' అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: శ్రీదేవి లవ్ స్టోరీ తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment