Agraharam
-
ఊరిని కొని దానమిచ్చిన పాలకుడు
సాక్షి, హైదరాబాద్: అదో ఊరు.. వాగు ఒడ్డున ఉంది. స్థానిక పాలకుడు దానికి సరిపడా పైకం ఇచ్చి కొనుగోలు చేసి దాన్ని అగ్రహారంగా దానమిచ్చాడు. ఇలా ఊరిని కొని దానమివ్వటం కొంత విచిత్రంగా అనిపించే వ్యవహారమే అయినా.. తాజాగా వెలుగు చూసిన ఓ శాసనం ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి సమీపంలో ఉన్న దొమ్మాట గ్రామం కథ ఇది. అది 14వ శతాబ్దం. స్థానిక పాలకుడు పైడిమర్రి నాగా నాయనిగారనే స్థానిక పాలకుడు ఈ గ్రామాన్ని తగు పైకం చెల్లించి కొనుగోలు చేశాడు. తర్వాత దాన్ని అగ్రహారంగా బ్రాహ్మణ కుటుంబాలకు దానం చేశాడు. అప్పటి నుంచి దొమ్మాట అగ్రహారంగా ఆ ఊరు కొనసాగింది. ఆ తర్వాత ఓసారి గ్రామానికి సమీపంలోనే ఉన్న కృష్ణమ్మ చెరువు, గురుజకుంట వాగు పొంగి గ్రామం మునిగిపోయింది. దీంతో వ్యవసాయ పొలాల ఆధారంగా కొందరు వాగుకు ఆవల, కొందరు వాగుకు ఈవల ఇళ్లు కట్టుకోవటంతో క్రమంగా రెండు ఊళ్లుగా అవి ఎదిగాయి. కొందరు ఆ దొమ్మాట ఊళ్లోని గుళ్ల శిల్పాలు, వీరగళ్లులు, శాసనాన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఆ శాసనం పొలాల మధ్య పడి ఉండగా తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ దాన్ని గుర్తించారు. ఇది దొమ్మాట గ్రామ శాసనమేనని, అందులో.. ‘పాహిడిమరి నాగాన్నాయనిగారు ధారణశేశి ఇచ్చిన అగ్రహారం దొమ్మాటకుంను ఆ బుని..దేయాన్న జొమా..న.. అన్న పంక్తులు (కొన్ని అక్షరాలు మలిగిపోయాయి) ఉన్నాయని శాసనాన్ని గుర్తించిన చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. శాసనంపైన సూర్యచంద్రుల గుర్తులున్నాయి. కానీ అది ఏ చక్రవర్తి/రాజు హయాంలో చోటుచేసుకుందో శాసనంలో ప్రస్తావించలేదు. -
ఆమ్రపాలి మన ఆడపడుచే!
ఒంగోలు సబర్బన్: ఆమ్రపాలి.. రెండు మూడేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంలో ఉన్న డైనమిక్ లేడీ. టెలివిజన్ చానళ్లలోనూ తరచూ దర్శనమిచ్చే యువ కలెక్టర్ మన ఆడపడుచే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వే గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్.అగ్రహారం గ్రామం. తెలంగాణ రాష్ట్రం వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్‌గా తనదైన శైలిలో విధులు నిర్వహిస్తున్న కాటా ఆమ్రపాలి ఒంగోలు వాసికావడం గర్వకారణం. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేసి ప్రస్తుతం వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి కాటా వెంకటరెడ్డి ఫ్రొఫెసర్.. ఎన్.అగ్రహారానికి చెందిన ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. పద్మావతి స్వగ్రామం టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. ఆయన చిన్నతనంలో ఎలిమెంటరీ విద్య ఆలకూరపాడు పాఠశాలలోనే జరిగింది. హైస్కూలు విద్య టంగుటూరు, ఇంటర్మీడియేట్, డిగ్రీ సీఎస్ఆర్ శర్మ కళాశాలలో, పీజీ విద్య విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఎన్.అగ్రహారంలో ఉంది. ఎన్.అగ్రహారంలోని ఆమ్రపాలి కుటుంబానికి చెందిన ఇల్లు, ఆమ్రపాలి తండ్రి కాటా వెంకటరెడ్డి కుటుంబమంతా ఉన్నతాధికారులే.. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి కూడా ఐఆర్ఎస్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపికయిన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. మానస గంగోత్రి 2007 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. ఐఆర్ఎస్లో 184వ ర్యాంక్ సాధించింది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్. తమిళనాడు ఐఏఎస్ కేడర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్‌లో డైరెక్టర్‌గా చేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉపెన్నికకు రెండు సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఫిబ్రవరి 18న వివాహం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేస్తున్న అమ్రపాలికి ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన వివాహం నిశ్చయమయింది. ఆమ్రపాలి చేసుకోబోయే వ్యక్తి కూడా ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన షమీర్ శర్మ జమ్మూ పట్టణానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన డయ్యూ–డామన్‌లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. జమ్మూలో ఫిబ్రవరి 18న వివాహం జరగనుంది. ఫిబ్రవరి 25న సికింద్రాబాద్‌లోని సికింద్రాబాద్ క్లబ్లో రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
గోపవరం (బద్వేలు): బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని అగ్రహారంలో ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో ప్రియురాలు ఝాన్సీసుమతి (21) మృతి చెందింది. ప్రియుడు పందీటిబాలుడు కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అగ్రహారానికి చెందిన పిచ్చయ్య, కేశమ్మ దంపతుల మూడవ కుమార్తె ఝాన్సీసుమతి ఇంటర్మీడియట్ వరకు చదివి ఇంటి వద్ద ఉంది. అదే గ్రామానికి చెందిన పందీటిబాలుడుతో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. అయితే తమ పెద్దలు కులాంతర వివాహానికి అడ్డుపడతారేమోనని వారు విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపలేదు. ఇంతలో ప్రియుడు బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లి గత నెలలో స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రియుడు బాలుడుకు అట్లూరు మండలంలో వివాహ నిశితార్థం జరిగింది. డిసెంబర్ 3, 4 తేదీల్లో వివాహం జరగనుంది. ఈ క్రమంలో ఈ ప్రేమికుల మధ్య ఏం జరిగిందో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రియుడు, ప్రియురాలు గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బద్వేలు పట్టణంలోని గుంతపల్లె క్రాస్‌రోడ్డు వద్ద విష ద్రావణం తాగారు. ఈ విషయాన్ని బాలుడు తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే వీరిద్దరిని బద్వేలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అయితే తమ కుమార్తె ఎక్కడికి వెళ్లిందోనని ఆమె తల్లిదండ్రులు గాలింపు మొదలు పెట్టారు. ఇంతలో బుధవారం అర్ధరాత్రి 130 గంటల సమయంలో మీ అమ్మాయి చనిపోయిందని తల్లిదండ్రులకు తెలిపారు. ప్రియుడు బాలుడిని మాత్రం బంధువులు కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదని తెలిసింది. తమ కుమార్తెను అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ఇంటి నుంచి తీసుకెళ్లి ఆతహత్యాయత్నానికి ఉసిగొలిపి చంపారని మృతదేహంతో అమ్మాయి తల్లిదండ్రులు ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ రామాంజినాయక్ అగ్రహారానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వారి బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -

అగ్రహారంలో మహిళ హత్య
వేములవాడ రూరల్ : వేములవాడ మండలం అగ్రహారం జోడాంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం రాత్రి ఓ మహిళ హత్యకుగురైంది. పట్టణ సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కల్పన(28) తల్లిదండ్రులు ఆమె పదిహేడో ఏటనే మృతిచెందారు. అప్పటి నుంచి ఆమె పెద్దమ్మ వీరబత్తిని గౌరమ్మ కల్పన బాగోకులు చూసింది. అదే గ్రామానికి చెందిన గౌడ శ్రీనివాస్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిపించింది. వీరికి కుమారుడు(10), కూతురు(8) ఉన్నారు. కుటుంబ కలహాలతో ఏడాది క్రితం విడిపోయారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం శ్రీనివాస్ తన ఇద్దరు పిల్లలతో షోలాపూర్ వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం కల్పన సామగ్రితో తనlపెద్దమ్మ ఇంటికి వెళ్లింది. కొన్ని రోజులు అక్కడ ఉంటానని కోరింది. తన ఇంట్లో వేరే వారు అద్దెకు ఉంటున్నారని, వారం రోజుల్లో వారిని ఖాళీ చేయించి, ఆ గదిని ఇస్తానని చెప్పింది. చేసేదేమీ లేక కల్పన వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె సమాచారం ఎవరికీ తెలియలేదు. ఇంతలో ఆగ్రహారం ఆలయ వెనుక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంఘటన స్థలంలో ఉన్న బ్యాగు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని మృతురాలు సిరిసిల్లకు చెందిన కల్పనగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కల్పన పెద్దమ్మ గౌరమ్మ తన కూతురును గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోలీసుల అదుపులో నిందితుడు..? కల్పన హత్యతో సంబంధం ఉందన్న అనుమానంతో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నట్లు తెలిసింది. మృతురాలి సెల్‌ఫోన్ ఆధారంగా డాటా హత్య కేసును 24 గంటల్లో ఛేదించడానికి పట్టణ సీఐ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. -
'వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయండి'
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ బుధవారం వేములవాడ మండలం అగ్రహారం వద్ద వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న క్వారీల్లో బ్లాస్టింగ్ల వలన పనులకు అంతరాయం కలుగుతున్నందున వాటిని నిలిపివేయాలని కోరారు. -
కాటేసిన విద్యుత్ తీగలు
అంతవరకు తోటి పిల్లలతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ సరదాగా గడిపిన ఆ బాలుడ్ని మృత్యువు విద్యుత్ తీగల రూపంలో కాటేసింది. అవి తగిలీ తగలడమే పెద్దశబ్దంతో క్షణాల్లో మంటు వ్యాపించాయి. ఆ మంటలో చిక్కుకున్న బాలుడ్ని అతికష్టమ్మీద స్థానికులు బయటకు తెచ్చినా సకాలంలో ఆస్పత్రికి తరలించేందుకు వాహన సౌకర్యం లేకపోవడంతో సుమారు గంటన్నర పాటు మృత్యువుతో పారాడి చివరకు ప్రాణాలు విడిచాడు. చీడికాడకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల అగ్రహారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చీడి కాడ: అడవుల అగ్రహారానికి చెందిన దాలిబోయిన రవితేజ (11) గ్రామంలోని యూపీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. నిరుపేదలైన రవితేజ తల్లిదండ్రులు చిలుకు, నాగేశ్వరిలు ఉపాధి కోసం మద్రాస్‌కు వలసవెళ్లారు. దీంతో రవితేజ వృద్ధురాలైన నాయనమ్మ సన్నెమ్మ వద్ద గ్రామంలోనే ఉంటూ చదువుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన రవితేజ ఐదు గంటల సమయంలో తోటి పిల్లలతో రామాలయం ఎదుట షటిల్ ఆడుతున్నాడు. షటిల్ కాక్ పక్కనే ఉన్న కమ్యూనిటీ భవనం శ్లాబ్‌పై పడింది. అదే శ్లాబ్‌ను అనుకుని ఎల్టీ లైన్ విద్యుత్ తీగలున్నాయి. కాక్ తెచ్చేందుకు శ్లాబ్ ఎక్కిన రవితేజ వాటిని తాకడంతో ఒక్కసారిగా మంటల చేలరేగాయి. హాహాకారాలు చేస్తున్న అతడిని చూసి వైఎస్సార్ సీపీ నాయకుడు గంటా మత్స్యరాజు పరుగున ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం మంటల్లో చిక్కుకున్న రవితేజను కిందికి దించారు. అప్పటికే ఆ బాలుడి పొత్తికడుపు కాలిపోయి పేగులు మొత్తం బయటకొచ్చాయి. కుడి కాలు ముడుకు నుంచి దిగువకు చర్మం మొత్తం కాలి ఎముకలు మిగిలాయి. మృత్యువుతో పోరాడుతున్న ఆ బాలుడ్ని ఆస్పత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేయగా ఏ వాహనమూ అందుబాటులో లేదని సమాధానం చెప్పారని సర్పంచ్ నానాజీ తెలిపారు. ప్రవేటు వాహనంలో తరలించేందుకు ప్రయత్నించగా రవితేజ పరిస్థితిని చూసి వాహన యజమానులెవరూ ముందుకు రాలేదు. దీంతో సాయంత్రం 5.30 నుంచి 7గంటల వరకు రవితేజ తనను ఆస్పత్రికి తీసుకువెళ్లండంటూ రోదించి.. రోదించి చివరకు కన్నుమూశాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తన కళ్లల్లో పెట్టుకుని చూసిన మనుమడు మృతి చెందాడాన్ని జీర్ణించుకోలేని నాయనమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.