తెలంగాణ ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ బుధవారం వేములవాడ మండలం అగ్రహారం వద్ద వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించారు.
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ బుధవారం వేములవాడ మండలం అగ్రహారం వద్ద వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న క్వారీల్లో బ్లాస్టింగ్ల వలన పనులకు అంతరాయం కలుగుతున్నందున వాటిని నిలిపివేయాలని కోరారు.