వాటర్ గ్రిడ్‌ను తమ ఊరిలో ఏర్పాటు చేయాలంటూ ఇబ్రహీంపట్నం మండల ప్రజలు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ నివాసాన్ని ముట్టడించారు. అంతకు ముందు మెట్‌పల్లిలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.