నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటా..!
సాక్షి, జగిత్యాల: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటానని బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డా.సంజయ్ అన్నారు. సోమవారం కోరుట్లలోని పట్టణంలోని 15 వార్డుల్లో కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని అన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో కోరుట్ల పట్టణంలో ప్రతీ ఒక్క రోడ్డును బీటీ, సీసీలుగా మార్చామని గుర్తు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశ్, కౌన్సిలర్లు అన్వర్, గంగాధర్, ఎంబేరి నాగభూషణం, సత్యం, సజ్జు పాల్గొన్నారు.
► ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేవారికే ఎన్నికల్లో పట్టం కట్టాలని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరారు. కుస్తాపూర్, సిరిపూర్ గ్రామాల్లో ప్రచారంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్నారు. జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు కమిటీ జిల్లా సభ్యుడు మల్లయ్య, మండల అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ నాగేష్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచులు గోవింద్‌నాయక్, లక్ష్మీ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మేలు చేకూరుతుందని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. కుస్తాపూర్, రత్నాపూర్, సిరిపూర్, ముత్యంపేట, గుండంపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
► దీపావళి పండుగను పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని పలు ఆలయాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ పూజలు చేశారు. స్థానిక త్రిశక్తి ఆలయ ఆవరణలో చిన్నారులు క్రికెట్ ఆడుతుండడాన్ని గమనించిన సంజయ్.. బ్యాటింగ్ చేసి ఆనందపరిచారు. పలు కుల సంఘాలతో సంజయ్ సమావేశయ్యారు. రజక, ముదిరాజ్, కాపు సంఘాల నాయకులను మద్దతివ్వాలని కోరారు. 25వార్డులో సంజయ్ తల్లి ప్రచారం నిర్వహించారు. పట్టణానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు సోమవారం కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
► డాక్టర్ సంజయ్‌ను గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు జగన్రావు, విజయ్ తిమ్మాపూర్ తండాలో ఇంటింటా ప్రచారం చేశారు.
ఇవి చదవండి: ఆ వివరాలు ఆఫిడవిట్లో.. పొందుపర్చలేదని.. బీఆర్ఎస్ అభ్యర్ధిపై దుమారం!