![MLA Balka Suman Comments On TPCC President Revanth Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/3/balka-suman.jpg.webp?itok=axFk8wEm)
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అంటున్నాడు. ఓటుకు నోటు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అంటూ మండిపడ్డారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమ్మేళనంలో బాల్క సుమన్ మాట్లాడుతూ, ఈటల రాజేందర్‌ను పెద్ద కొడుకులా కేసీఆర్ చూశాడని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పని చేయకుండా అవతలోడికి పని చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను విమర్శించిన వ్యక్తి ఈటల అంటూ ఆయన దుయ్యబట్టారు. బీజేపీ చెప్పే అబద్దాలకు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మధ్య హుజురాబాద్‌లో పోటీ జరుగుతుందన్నారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారం చేయడంలో బీజేపి దిట్ట, వాటిని తిప్పి కొట్టడంలో ముందు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment