కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదు : రేవంత్‌ | Cm Revanth Reddy Slams Kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదు : రేవంత్‌

Published Wed, Nov 20 2024 3:27 PM | Last Updated on Wed, Nov 20 2024 4:07 PM

Cm Revanth Reddy Slams Kcr

సాక్షి, కరీంనగర్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదని అని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. వేములవాడలో కాంగ్రెస్‌ ప్రజా విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

  • కేసీఆర్‌ను చిత్తుగా ఓడించిన మార్పు రాలేదు

  • బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్‌ దొబ్బింది

  • పదేళ్లలో రుణమాఫీ చేసుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు

  • కేసీఆర్ అసెంబ్లీ కి రా..రుణమాఫీ లెక్కలు మేము చెప్తాం

  • రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలో కేసీఆర్‌ నెట్టారు

  • కేసీఆర్‌ గడీలను కూల్చివేసేందుకే పాదయాత్ర చేశా

  • 10 ఏళ్లలో కేసీఆర్‌ చేయలేని పనులన్నీ చేసి చూపిస్తున్నాం

  • మిడ్‌ మానేరు నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలి

  • 10ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాజన్న దేవాలయాన్ని ఎందుకు పట్టించుకోలేదు

  • కాంగ్రెస్‌ పార్టీ మాట ఇస్తే.. దాన్ని నిలిబెట్టుకునేందుకు ఎంతదూరమైనా వెళ్తుంది

  • తెలంగాణలో ప్రాజెక్ట్‌లను కట్టింది కాంగ్రెస్సే.. ఇప్పుడున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేది కాంగ్రెస్సే 

  • బీఆర్‌ఎస్‌,బీజేపీ నేతలు పనిచేసి ఉంటే ప్రాజెక్ట్‌లు ఎందుకు మిగిలిపోయాయి 

  • కరీంనగర్‌ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించింది

  • ఇదే కరీంనగర్‌ గడ్డపై తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సోనియా గాంధీ ఆనాడు మాట ఇచ్చారు  

  • ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చారు

  • బండి సంజయ్‌ రెండుసార్లు కరీంనగర్‌ ఎంపీ అయ్యారు. ఏమైనా అభివృద్ది చేశారా?

  • కరీంనగర్‌ జిల్లా గురించి బండి సంజయ్‌ పార్లమెంట్‌లో ఎప్పుడైనా మాట్లాడారు 

  • కేంద్రం నుంచి బీజేపీ నేతలు ఏమైనా నిధులు తెచ్చారు

  • కరీంనగర్‌ ఎమ్మెల్యేని కలవాలనంటే జర్మనీ వెళ్లాల్సి వచ్చేది

  • స్వతంత్య్ర భారతంలో  కొండంగల్ నుంచి ఎవరూ మంత్రి కాలేదు

  • మా ప్రాంతం నష్టపోయింది.. అందుకే అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నా

  • మా ప్రాంత నిరుద్యోగులకు ఉధ్యోగాలు రావాలని ఫార్మా విలేజ్ తెస్తే ..అధికారులపై దాడులు చేశారు

  • కేటీఆర్, హరీష్ రావు బాషను కేసీఆర్ సమర్దిస్తున్నారా..?

  • పరిశ్రమలు పెట్టొద్దా కేసీఆర్

  • కాళేశ్వరం కింద భూములు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సేకరించలేదా  

  • అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ జరగాల్సిందే

  • భూమి కోల్పోయిన రైతుకు మేలు జరిగేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది

TG GOVT: మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement