
అనంతపురం సెంట్రల్: రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నిజం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డుకుంటున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న చంద్రబాబు ప్రజాద్రోహిగా మిగిలిపోతారన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..
► కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
► స్టేట్ డిస్టెన్స్ పాటిస్తూ ఇళ్ల పట్టాలు పంపిణీ జరగకుండా ఆ పార్టీ శ్రేణులకు డైరెక్షన్ ఇచ్చి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు.
► టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా పట్టాలు పొందిన భూములపై నేడు కేసులు వేయిస్తుండటం దారుణం.
► ఫోన్ ట్యాపింగ్‌పై రాద్దాంతం చేయడం తగదు. ఏవైనా ఆధారాలుంటే సమర్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment