housing lands
-
పేదల ఇళ్లను కూడా వదల్లేదు.. చంద్రబాబు మరో కుట్ర
-
కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన
-
పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని మరోసారి రుజువు అవుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్ చేస్తుండటం దేశంలోనే ప్రప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం భారీ ఎత్తున మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ నేడో, రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించింది. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు దక్కేవి కాదు. డి–పట్టాలు కావడంతో అనుభవించడం మినహా వాటిపై సర్వ హక్కులు లేకపోవడంతో పేదలు వాటిని అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. అందుకే ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది. అంటే పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది. ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పేదలు ఇబ్బంది పడకూడదనే.. చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన డి–పట్టాలను క్రమబద్ధీకరించుకోవడం ప్రస్తుతం ఎంత కష్టమో తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చే ప్రక్రియ ఎంతో క్లిష్టంగా ఉంది. పేదలు అలా ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారతాయి. ఇళ్ల పట్టాల చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు. యుద్ధప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వం తరఫున వీఆర్వో పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఈ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మంగళవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. పేదలకిచ్చే కన్వేయన్స్ డీడ్లు సరిగా ఉన్నాయో లేదా, అందులో కచ్చితమైన డేటా ఉందా లేదా చూడడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన ప్రింటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి జేసీలు గంట గంటకు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ సమయంలో వీఆర్వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది. -
ఏపీ: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు జీవో జారీ
సాక్షి, విజయవాడ: జర్నలిస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గత కేబినెట్ భేటీలో తీసుకున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్ణయం మేరకు.. ఇవాళ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ప్రతీ జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వుల్లో విషయాన్ని ప్రస్తావించింది. 60:40 శాతం చెల్లింపు పద్దతిలో ఇళ్ల స్థల కేటాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. కనీసం 5 ఏళ్లు అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ వర్తించనుంది. జిల్లా ఇంచార్జ్ మంత్రి నేతృత్వంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కమిటీలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఆ కమిటీలో జర్నలిస్టులకు సభ్యులుగా అవకాశం కల్పించనుంది కూడా. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఆన్ లైన్లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను రూపొందించి.. 45 రోజుల్లోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
పేదల ఇళ్ల స్థలాలపై అడ్డుపడలేం!
‘‘మేం ఉండే చోట పేదలుండటానికి వీల్లేదు!. వాళ్లకు ఇక్కడ స్థలాలిస్తే ‘సామాజిక తూకం’ దెబ్బతింటుంది’’ అంటూ న్యాయస్థానాలకు వెళ్లి ఓడిపోయిన వారు... మరిన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మరిన్ని కోర్టులకు వెళుతున్నారు తప్ప... అవి పేదల ఇళ్లే కదా అని వదిలేయటం లేదు. సోమవారం కూడా వీరు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కనీసం ‘స్టే’ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ తరఫున వాదించడానికి గతంలో భారత సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్‌గా పనిచేసిన హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ వంటి సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారంటే... వీరి వెనక ఎంతటి ఆర్థిక బలమున్న మనుషులున్నారో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అసలు రాజధాని రైతుల పేరిట దాఖలు చేస్తున్న పిటిషన్లను ఇంతటి ఖరీదైన న్యాయవాదుల్ని పెట్టుకుని మరీ హైకోర్టుల్లోను, సుప్రీం కోర్టుల్లోను ఎలా నడిపిస్తున్నారనేది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. తెలుగుదేశం కూడా వీళ్ల పిటిషన్లకు ఇన్నేసి కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చుపెడుతోందో... ఒకవంక అలా చేస్తూ మరోవంక రాజధాని ప్రాంతంలో ఆందోళనల పేరిట శాంతిభద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి ఎందుకు వెళుతోందో అర్థం కాని విషయం. అసలు ఆ ప్రాంతంలో పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థలాలివ్వకూడదని చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు? ఇదేమీ ఆయన సొంత రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు కదా? ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా ఆయన్ని రామోజీరావు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? రాజధాని ప్రాంతంలో పేదలకు ఓ కాలనీ ఉంటే తప్పా? వారూ అందరితో పాటు అక్కడ బతికితే తప్పేంటి? సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతి ప్రాంతంలో 50 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. సామాజిక న్యాయాన్ని పరిరక్షిస్తూ, రాజధానిలో అన్ని వర్గాల ప్రజలు నివసించేలా సీఆర్డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లే అవుట్లు పేదల ఇళ్ల స్థలాల కోసం శరవేగంగా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్–5 జోన్‌కి వ్యతిరేకంగా, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఊట్ల శివయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం జస్టిస్ అభయ్.ఎస్.ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం మూడు రాజధానుల పిటిషన్లతో దీన్ని జత చేస్తున్నట్లు పేర్కొంది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదని, హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. అమరావతి భూములకు ఈడబ్ల్యూఎస్ స్కీమ్‌ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుందన్నారు. దీన్ని ఏపీ ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వ్యతిరేకించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. సీజేఐ సూచనల మేరకు.. రాజధానికి సంబంధించి ఇతర వ్యాజ్యాలు మరో ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీం ప్రస్తావించింది. ఆయా పిటిషన్లతో వీటిని జత చేస్తామని పేర్కొంటూ శుక్రవారం లోపు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీనిపై సీజేఐ సూచనలు తీసుకుని జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందున్న పిటిషన్లతో కలిపి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలంది. ఈ కేసులో కేవియట్ దాఖలు చేసిన మస్తాన్ వలీ తరఫు న్యాయవాది అభిజిత్‌సేన్ గుప్తా కోర్టుకు హాజరయ్యారు. ఈ పిటిషన్లు గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పేదల విజయం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారని, కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడం పేదల విజయమని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సుప్రీంకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలోనే ఉందన్నారు. ఒకసారి భూములిచ్చాక వాటిపై ప్రభుత్వానికే హక్కులుంటాయన్నారు. -
ఎన్టీఆర్ జిల్లాలో అదనంగా 168 ఎకరాలు కేటాయింపు
-
Andhra Pradesh: నిరుపేదకు న్యాయ ‘పట్టం’
సాక్షి, అమరావతి: నిలువ నీడలేని దాదాపు 50,000 నిరుపేద కుటుంబాలకు మంచి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందంటూ అసంబద్ధమైన వాదనలతో రైతుల ముసుగులో కోర్టుకెక్కిన టీడీపీ నేతలకు చెంపపెట్టు లాంటి తీర్పును వెలువరించింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించేందుకు హైకోర్టు నిరాకరించింది. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలివ్వకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని రైతుల పేరుతో కొందరు దాఖలు చేసిన అభ్యర్థనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈమేరకు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టి వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 45, ఇళ్ల పట్టాల కేటాయింపు ప్రధాన వ్యాజ్యాలు తాము వెలు వరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని వర్గాల అభివృద్ధితోనే.. రాజధానిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు మేరకే ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. రాజధాని నగర నిర్మాణం చేపట్టేందుకు, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిస్తూ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. అన్ని వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్), దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాల అభివృద్ధి కూడా రాజధాని అభివృద్ధిలో భాగమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రైతులు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులిస్తే అది న్యాయ ఔచిత్యాన్ని ఉల్లంఘించినట్లవుతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా అడ్డుకోండి.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏను అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతుల పేరుతో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలను కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై గత నెల 21న వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ధర్మాసనం తన నిర్ణయాన్ని వెలువరించడానికి ముందే రాజధాని రైతుల తరఫు న్యాయవాది సంజయ్ సూరనేని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చేస్తోందని, అందువల్ల ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆ లేఖలో కోరారు. దీంతో ధర్మాసనం రైతుల వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టింది. రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దేవ్‌దత్ కామత్, సీనియర్ న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఆర్డీఏ తరఫున కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. రైతులు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం తన నిర్ణయాన్ని వెలువరించింది. పిటిషనర్లు ప్రభావితం కావడం లేదు.. ‘గత మాస్టర్ ప్లాన్‌లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) ఇళ్ల స్థలాల కోసం ఎలాంటి నిర్దిష్ట ప్రాంతాన్ని కేటాయించలేదు. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇస్తోందని, ఆ భూమి ల్యాండ్ పూలింగ్ స్కీంలోని లేఔట్లలో భాగం కాదని మా దృష్టికి తెచ్చారు. పేదలకు ఇప్పుడు కేటాయిస్తున్న స్థలంతో పిటిషనర్లకు (రాజధాని రైతులు) ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. పేదలకు ఇవ్వదలచిన స్థలం ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించింది. రాజధాని అభివృద్ధిలో భాగమైన నవ నగరాలు చెక్కు చెదరకుండా ఉండటమన్న అంశం సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూములపై పిటిషనర్లకు ఎలాంటి హక్కు లేనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు చేస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ప్రత్యక్షంగా వారు ఏ విధంగానూ ప్రభావితం కారు. రాజధాని అభివృద్ధి కోసం పూలింగ్‌లో భాగంగా తమ భూములిచ్చామని పిటిషనర్లు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ కూడా అందులో భాగమని, ఎలక్ట్రానిక్ సిటీని దెబ్బ తియ్యడమంటే తమ హక్కులను హరించడమేనని వారు వాదిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. అందువల్ల పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మేం సుముఖంగా లేం’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
‘హౌస్’ ఫుల్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రణాళికతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఆయా కాలనీల్లో అవసరమైన రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ ముందుకు సాగుతోంది. – కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాక్షి, అమరావతి: పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర గృహ నిర్మాణ–పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సేకరించి.. ఏకంగా 68,677 ఎకరాలు పంపిణీ చేసిందని కొనియాడింది. ఇళ్ల స్థలాల పట్టాలన్నీ మహిళల పేరుపై మంజూరు చేయడం ద్వారా వారి సాధికారతకు తోడ్పడుతోందని మెచ్చుకుంది. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్న బృహత్తర లక్ష్య సాధన కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదని, వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం కొత్తగా ఏకంగా 17,005 జగనన్న కాలనీలను నిర్మిస్తోందని వివరించింది. దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘సరసమైన గృహాలు–ఉత్తమ పద్ధతులు’ అంశంపై అధ్యయనం చేసిన కేంద్ర గృహ నిర్మాణ – పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇటీవల నివేదికను విడుదల చేసింది. దీనిని హౌసింగ్– పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన హౌసింగ్ మిషన్ డైరెక్టరేట్ ఇతర రాష్ట్రాలకు అందజేసింది. ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అనుసంధానం చేసి, లబ్ధిదారులకు ప్రయోజనాలు అందిస్తోందని ఆ నివేదికలో పేర్కొంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనతో గృహాలకు ఎల్పీజీని, ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన కింద విద్యుత్, జలజీవన్ మిషన్ కింద తాగునీరు, జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అండగా నిలిచిందని వెల్లడించింది. వీటితో పాటు మహిళా సాధికారతలో భాగంగా అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం చేస్తూ.. పిల్లలను చదివించేందుకు తల్లులకు అధికారం కల్పించే పథకాన్ని అమలు చేస్తోందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ నివేదికలో ఇంకా ఏముందంటే.. భారీ ఉపాధి, ఆర్థిక ప్రగతికి దోహదం ► రెండు దశల్లో 30 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొలి దశలో 15 లక్షలకు పైగా (ప్రస్తుతం టిడ్కోఇళ్లతో కలిపి 21.25 లక్షలకు పైగా) ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇంత పెద్ద ఎత్తున గృహాల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం ఇస్తోంది. ► తాపీ పని, వడ్రంగి వంటి 30 వృత్తిపరమైన వర్గాలకు చెందిన వ్యక్తులకు భారీగా ఉపాధి కలుగుతుంది. ప్లంబింగ్, ఇతర తక్కువ ఆదాయ వర్గాలు, రోజువారీ వేతనాలు, అనధికారిక రంగ వలస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఉత్తమ విధానాలతో నిర్మాణంలో వేగం ► ఇళ్ల నిర్మాణం వేగంగా సాగడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తమ విధానాలను అమలు చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులందరికీ సబ్సిడీ ధరలపై స్టీలు, సిమెంట్‌ను సరఫరా చేయడంతో పాటు ఇసుకను ఉచితంగా అందజేస్తోంది. ► బ్యాంకులతో లబ్ధిదారులను అనుసంధానం చేయడం ద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించింది. పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు ఇచ్చేలా జగనన్న కాలనీల లే–అవుట్లను రూపొందించింది. ► ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన నాణ్యమైన గృహోపకరణాలను తయారీ దారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే రివర్స్ టెండరింగ్ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఇళ్ల నిర్మాణాలకు పూర్తి సహకారం ఉండటంతో ఏపీలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ట్రాన్స్జెండర్లకు కూడా ఇళ్లు ► చిత్తూరు నగరంలో వీధి వ్యాపారాలు చేస్తున్న 17 మంది ట్రాన్స్జెండర్లకు గృహాలను మంజూరు చేసింది. తద్వారా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బందిని అధిగమించేలా చేసి.. వివక్ష నుంచి విముక్తి కలిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని సౌకర్యాలతో వారు సొంత ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ► సొంత ఇంటి రూపంలో ఆస్తి సమకూరడంతో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు మరింత మెరుగైన జీవనోపాధి పొందేందుకు అవకాశం లభించింది. వీరిలో కొందరు ప్రభుత్వ సహాయంతో చిన్న చిన్న దుకాణాలు, టైలరింగ్ నిర్వహిస్తున్నారు. తాటి ఆకుల గుడిసెల్లో ఉండే వారికి పక్కా ఇళ్లు ► గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు పంచాయతీ ఎస్సీ, ఎస్టీ కాలనీలో 111 మందికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. వీరందరూ మట్టి, వెదురు కర్రలు, తాటి ఆకులతో రూపొందించిన గుడిసె తరహా ఇళ్లలో నివసించే వారు. వారికి ఇళ్లు మంజూరు చేయడంతో కొత్త ఇంటి స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నారు. ► ఇళ్ల నిర్మాణ పనుల కోసం స్థానిక పంచాయతీ 15 నీటి కనెక్షన్లు ఇచ్చింది. కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక శాశ్వత విద్యుత్ కనెక్షన్లతో పాటు వీధి లైట్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. ► నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో తొలి దశలో 27,888 నివాస యూనిట్లు చేపట్టారు. ఇందులో వెంకటేశ్వరపురంలో 4,800 యూనిట్లు పూర్తయ్యాయి. 3,000 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. రెండవ దశ కింద 18,864 యూనిట్లతో 70 శాతం పూర్తయ్యాయి. కనీస మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించారు. మూడవ దశ కింద 5,464 యూనిట్లు నిర్మిస్తున్నారు. -
పేదల స్థలాలపై రామోజీ కన్ను
ఇబ్రహీంపట్నం రూరల్: పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై రామోజీరావు కన్ను పడిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ ధ్వజమెత్తారు. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామం సర్వే నెంబర్లు 189, 203లో (రామోజీ ఫిల్మ్‌సిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు) రాయపోల్, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ముకునూర్ గ్రామాలకు చెందిన 576 మందికి రామోజీ ఫిల్మ్ సిటీ పరిధిలోన ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే నేటికీ లబ్ధిదారులను ఆ స్థలాల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా రామోజీ అడ్డుకుంటున్నారని జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన లబ్ధిదారులతో కలిసి నాగన్‌పల్లి నుంచి కేటాయించిన భూముల ప్రాంతం వరకు పాదయాత్ర చేపట్టారు. ఎర్ర జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ ఆయా భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులను ఉద్దేశించి జాన్‌వెస్లీ మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి ఆ భూములను టూరిజం పేరుతో రామోజీ సంస్థ దక్కించుకోవాలని చూస్తోందని ఆగహ్రం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు రామోజీరావు దరఖాస్తు చేసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఫిల్మ్ సిటీ పరిధిలోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిలో 12 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తే ఇప్పటికీ లబ్ధిదారులను భూముల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఫిల్మ్ సిటీ పరిధిలో ఇంకా 160 ఎకరాలకి పైగా ప్రభుత్వ మిగులు భూమి ఉందనీ, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయని వారికి ఇక్కడే స్థలాలు ఇవ్వాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. భూములు పేదలకు దక్కకుండా కోర్టులో కేసులు వేసి రామోజీ అడ్డుపడుతున్నారని, అయితే లబ్ధిదారుల కోసం పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రామోజీపై లోకాయుక్తలో సుమాటోగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రామోజీపై చర్యలు తీసుకోకుంటే ఈ నెల 28న కలెక్టరేట్ ముట్టడి .. ప్రభుత్వం స్పందించి రామోజీపై చర్యలు తీసుకోవాలనీ లేకుంటే ఈ నెల 28వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని జాన్ వెస్లీ హెచ్చరించారు. అప్పటికీ స్పందించకుంటే ప్రజలను సమీకరించి ఇళ్ల స్థలాల్లో గుడిసెలు వేయిస్తామన్నారు. అక్కడే వంటా వార్పు కార్యక్రమాలతో ఇళ్ల స్థలాలను ఆక్రమిస్తామని ఆయన తేల్చిచెప్పారు. మొదటి భూకబ్జా దారుడు రామోజీనే... జిల్లాలో ప్రభుత్వ భూములను మొట్ట మొదటి సారిగా కాజేసింది రామోజీ రావేనని రంగారెడ్డి జిల్లా సీపీఎం కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ ఆరోపించారు. íఫిల్మ్ సిటీలో ఉన్న రోడ్లు, చెరువులు, కుంటలను కబ్జా చేశారని నిందించారు. పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రెవెన్యూ యంత్రాంగం అండదండలతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రామోజీరావుపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు.. సీపీఎం పోరు పాదయాత్ర సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. టియర్‌గ్యాస్ వాహనాలను కూడా సిద్ధంగా పెట్టారు. అయితే ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల యాదయ్య, సామేలు, జగదీష్, జిల్లా నాయకులు కందుకూరి జగన్, సీహెచ్ జంగయ్య, అలంపల్లి నర్సింహ, ఏర్పుల నర్సింహ, శ్యాం సుందర్, వెంకటేష్, బుగ్గరాములు, జగన్‌లతో పాటు ఆయా గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్‌సిటీని ముట్టడిస్తాం: సీపీఎం -
ఏపీ హైకోర్టు తీర్పుతో పేదవాడి ఇంట సంతోషం
-
విశాఖలో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపునకు లైన్‌క్లియర్
-
CM YS Jagan: బాధితులకు బాసట
ఈ రోజుకు ఘటన జరిగి 13 రోజులైంది. మన అధికారులు, సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొన్నారనేది చూడటానికి ముఖ్యమంత్రి హోదాలో నేను ఇవాళ వచ్చాను. ఇంత పకడ్బంధీగా, ఇంత కచ్చితంగా, మోస్ట్ ఎఫీషియెంట్‌గా.. ఆర్భాటం, హంగామా లేకుండా సహాయ కార్యక్రమాలు కొనసాగాయి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది కాబట్టే అందరికీ మేలు జరుగుతోంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, తిరుపతి: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. బాధితులకు సురక్షిత ప్రదేశంలో ఐదు సెంట్ల స్థలం ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇల్లు కూడా కట్టించి ఇస్తుందని హామీ ఇచ్చారు. గురువారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలైన వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో, చిత్తూరు జిల్లా వెదళ్లచెరువు ఎస్టీ కాలనీలో పర్యటించారు. ధ్వంసమైన ఇళ్లు, వంతెనలను పరిశీలించారు. తొలుత పులపత్తూరులో కాలినడకన గ్రామం మొత్తం కలియదిరుగుతూ స్వయంగా బాధితులతో మాట్లాడారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఈ గ్రామంలో 293 ఇళ్లు కొట్టుకుపోయిన పరిస్థితిని కళ్లారా చూశానని చెప్పారు. చాలా నష్టం జరిగిందని, ఆ సమయంలో అధికారులు స్పందించిన తీరు, సహాయం అందించిన విధానం మీ అందరి నోటి ద్వారా విన్నానన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలకు ఐదు సెంట్ల ఇంటి స్థలం పట్టాలను పంపిణీ చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ జిల్లా పులపత్తూరులో కూలిపోయిన ఇంటిని, చిత్తూరు జిల్లా పాపానాయుడుపేటలో వరద ప్రభావానికి సంబంధించిన చిత్రాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు అభినందనలు ► అధికారులు బాగా స్పందించినందుకు అభినందిస్తున్నాను. ఇవ్వాల్సిన సహాయం, చేయాల్సిన పనులను 99 శాతం బాగా చేశారు. మీ గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిటింగ్ కోసం జాబితాలు ప్రదర్శించారు. ఇంకా ఎక్కడైనా ఒకరో, ఇద్దరో మిగిలిపోయి ఉంటే ఆ జాబితాలు చూసుకుని.. గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయండి. మీకు సాయం అందేలా చూస్తారు. ► పింఛా, అన్నమయ్య రిజర్వాయర్లపై ఆధారపడిన వ్యవసాయం పూర్తిగా నీటి పాలైంది. పొలాల్లో పేరుకుపోయిన ఇసుకను తొలగించడానికి ప్రభుత్వం ప్రతి హెక్టారుకు రూ.12,500 చొప్పున ఇస్తుంది. ఈ జాబితాలో ఎవరైనా మిస్ అయితే ఫిర్యాదు చేయొచ్చు. ఈ–క్రాప్ ద్వారా ప్రతి రైతుకు పరిహారం ► ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులందరికీ పరిహారం ఇస్తాం. ఎందుకంటే చాలా కాలం నుంచి సాగు చేస్తున్నా, తమకు టైటిల్ డీడ్ లేదని చాలా మంది ఫిర్యాదు చేశారు. అందుకే ఈ–క్రాప్ డేటా ఆధారంగా అందరికీ పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం. ► పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు కూడా సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఆసరా ద్వారా ఇప్పటికే సహాయం చేసినప్పటికీ, ఈ పరిస్థితుల్లో పని చేసుకోలేక పోతున్నామని, అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నందున సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందువల్ల వీరికి ఏదో ఒక వి«ధంగా మంచి చేస్తాం. పది రోజుల్లో ప్రైవేట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ► ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు కూడా నష్టం జరిగింది. కొందరి వాహనాలు, మరికొందరి ఆటోలు నీళ్లలో కొట్టుకుపోయాయి. వారు తమ వాహనాల నంబర్లు ఇస్తే ఏదో ఒక విధంగా ఆదుకుంటాం. ఇక్కడే జాబ్ మేళాలు పెట్టి.. ఔట్ సోర్సింగ్ లేదా ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తాం. బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తాం. ఇదంతా పది రోజుల్లో జరుగుతుంది. ► ప్రత్యేకంగా ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాం. వారంతా ఆదివారం వరకు ఇక్కడే ఉంటారు. అన్ని పనులు పర్యవేక్షిస్తారు. రాబోయే రెండు నెలలు కూడా ప్రతి మంగళ, శుక్రవారాల్లో వీరు వారికి కేటాయించిన గ్రామాల్లోనే బస చేస్తారు. అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ఆ డ్యాముల రీడిజైన్ ► పింఛా, అన్నమయ్య డ్యామ్‌లు కనీవినీ ఎరుగని వర్షాలకు దెబ్బతిన్నాయి. 2.15 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి అన్నమయ్య డ్యామ్ కెపాసిటీ అయితే, ఏకంగా 3.20 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో దెబ్బతింది. అయినా కలెక్టర్ అప్రమత్తంగా వ్యవహరించి లోతట్టు ప్రాంతాల వారిని ముందు రోజు సాయంత్రమే సురక్షితంగా తరలించారు. అదే జరగకపోతే నష్టం దారుణంగా ఉండేది. అందుకే కలెక్టర్‌ను అభినందిస్తున్నా. ► పింఛా డ్యామ్, అన్నమయ్య డ్యామ్‌లను వెంటనే రీ డిజైన్ చేయాలని ఆదేశించాం. ఇప్పటి కంటే ఎక్కువ వరద వచ్చినా తట్టుకునే విధంగా డిజైన్ చేసి కడతాం. నందలూరు బ్రిడ్జి వరకు అన్ని చోట్ల నిర్వాసిత ప్రాంతాలకు వరద నీరు రాకుండా రక్షణ గోడ కట్టాలని ఆదేశించాం. ఈ గ్రామాలకు ఏ కష్టం వచ్చినా వేగంగా ఆదుకుంటున్నాం. ఇక్కడి నేతలు మిథున్‌రెడ్డి, అమర్నాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఇంకా ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ► ఇంత వేగంగా సహాయ కార్యక్రమాలు గతంలో ఏనాడూ జరగలేదు. గతానికి, ఇప్పటికీ తేడా ఏమిటంటే.. ఆర్భాటం, హంగామా లేకుండా పనులు చేసి చూపించగలిగాం. అధికార యంత్రాంగమంతా మమేకమై 10–13 రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ మంచి చేయడం సంతోషం కలిగించే విషయం. ► ఇంతటి కష్టంలో కూడా చెరగని చిరునవ్వుతో ఆప్యాయత చూపించినందుకు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి పేరుపేరున కృతజ్ఞతలు. చిత్తూరు జిల్లా వెదళ్లచెరువులో ఎస్టీ కాలనీవాసుల సమస్యలు తెలుసుకుంటున్న సీఎం జగన్ స్వర్ణముఖిపై వంతెన పరిశీలన ► ఏర్పేడు మండలం పాపానాయుడు పేట – గుడిమల్లం రహదారిలో ఇటీవల కొట్టుకుపోయిన స్వర్ణముఖి నదిపై వంతెనను గురువారం రాత్రి ముఖ్యమంత్రి పరిశీలించారు. 195 మీటర్ల పొడవు ఉన్న బ్రిడ్జి కొట్టుకు పోయిందని అధికారులు వివరించారు. ► పాపానాయుడుపేట – చెన్నంపల్లికి వెళ్లేందుకు స్వర్ణముఖి, నక్కలవాగుపై వంతెనలు లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నదీ ప్రవాహం వల్ల 15 గ్రామాలకు రాకపోకలు లేవని చెప్పారు. ► చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన వరద నష్టానికి సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. -
మధ్య తరగతి ప్రజలకు ఉగాదికి ‘ప్లాట్లు’!
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు తొలిదశలో మూడు లక్షల ఇళ్ల స్థలాలను వచ్చే ఏడాది ఉగాది రోజు (ఏప్రిల్ 2) ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కోవిడ్ సమయంలో ఉపాధి హామీ ద్వారా కూలీలకు పనులు కల్పించడం చాలా ముఖ్యమని, జూన్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు కల్పించటాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మాణం చేపట్టనున్న మెడికల్ కాలేజీలన్నింటికీ ఈ నెల 30వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ‘జగనన్న తోడు’ పథకాన్ని జూన్ 8న, ‘వైఎస్సార్ వాహన మిత్ర’ జూన్ 15న, ‘వైఎస్సార్ చేయూత’ జూన్ 22న అమలు చేయనున్నట్లు ప్రకటించారు. లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ చేపట్టి మార్పులు చేర్పులు చేయాలని ఆదేశించారు. ఈ నెల 31వతేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ ఏపీ పాల ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. జూన్ 1వ తేదీన పేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సిందేనని, ఈలోగా మిగతా పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధమై రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలని కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ‘స్పందన’లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్ మధ్య తరగతి ప్రజలకు (ఎంఐజీ) ఇళ్ల స్థలాలు... పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు తొలిదశలో 3 లక్షల ఇళ్ల స్థలాలను వచ్చే ఏడాది ఉగాది రోజు (ఏప్రిల్ 2న) ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వివాదాలు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం 17 వేల ఎకరాల భూమి కావాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణ చేపట్టి మూడు కేటగిరీల్లో 133.33 గజాలు, 146.66 గజాలు, 194.44 గజాలలో ప్లాట్లు అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా అర్హులకు ప్లాట్లు కేటాయించాలి. వాటిలో భూగర్భ కేబుల్, విద్యుత్ వ్యవస్థ, వీధి దీపాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నీటి సరఫరా, వాటర్ డ్రెయిన్ల నిర్మాణం లాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. 14 టీచింగ్ ఆస్పత్రులకు 30న... రాష్ట్రంలో కొత్తగా 16 బోధనాస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే పులివెందుల, పాడేరు ఆస్పత్రులకు భూమి పూజ జరిగింది. మిగిలిన 14 టీచింగ్ ఆస్పత్రులకు ఈనెల 30న ఒకేసారి శిలాఫలకాలు ఆవిష్కరించబోతున్నాం. ఆ మేరకు ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయండి. ఉపాధి హామీ పనులు కోవిడ్‌తో సహజీవనం తప్పదు. అదే సమయంలో అన్ని కార్యక్రమాలు యథావిథిగా జరగాలి. కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పనులు చాలా ముఖ్యం. మనకు ఈ ఏడాది 20 కోట్ల పని దినాలు మంజూరయ్యాయి. వచ్చే నెల చివరిలోగా 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలన్నది మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరాలంటే ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలి. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో 7.41 కోట్ల పని దినాల కల్పన మాత్రమే జరిగింది. నిజానికి ఈ నెలలో మన టార్గెట్ 10.46 కోట్ల పని దినాలు. జూన్ చివరిలోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాల్సి ఉంది. జూన్ 1న ఇళ్ల నిర్మాణం మొదలు.. ఎట్టి పరిస్థితులలోనూ ఇళ్ల నిర్మాణం జూన్ 1న ప్రారంభం అవుతుంది. ఆ ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక పురోగతి (బూస్టప్) మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. స్టీల్, సిమెంట్ వినియోగం పెరుగుతుంది. మరోవైపు ఉపాధి దొరుకుతుంది. వీటన్నింటి వల్ల ఎకానమీ బూస్టప్ అవుతుంది. మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌజింగ్ వెబ్సైట్లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డుల మ్యాపింగ్ లాంటివి చాలా చోట్ల పూర్తి కావాల్సి ఉంది. వచ్చే స్పందన కార్యక్రమం నాటికి అవన్నీ పూర్తి చేయాలి. ఆ మేరకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. మోడల్ హౌస్ తప్పనిసరి.. ఎక్కడ ఇళ్ల నిర్మాణం చేయాలన్నా నీటి వసతి తప్పనిసరి. అన్ని లేఅవుట్లలో నీటి కనెక్షన్లు ఉండేలా చూడండి. తొలిదశలో 9,024 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం తలపెట్టగా వాటిలో 8,798 లేఅవుట్లలో నీటి సదుపాయం కల్పించాల్సి ఉంది. డిస్కమ్‌లు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుని వెంటనే నీటి సదుపాయం కల్పించాలి. ఆ పనులన్నీ ఈనెల 31లోగా పూర్తి చేయాలి. కలెక్టర్లు క్రమం తప్పకుండా ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, డిస్కమ్ అధికారులతో సమీక్షించాలి. ఇప్పటికే పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన 3.84 లక్షల ఇళ్ల నిర్మాణాలు వెంటనే మొదలు పెట్టవచ్చు. ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా మోడల్ హౌస్ నిర్మించాలి. తొలిదశలో 9,024 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం మొదలు పెడుతున్నా ఇప్పటి వరకు కేవలం 5,148 లేఅవుట్లలో మాత్రమే మోడల్ హౌస్‌లు కట్టారు. మిగిలిన వాటిలో కూడా వెంటనే పనులు పూర్తి చేయాలి. అప్పుడే మనకు నిర్మాణ వ్యయం కూడా తెలుస్తుంది. అన్ని లేఅవుట్లలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ కేబుళ్లు, నీటి సరఫరా వ్యవస్థ, ఫైబర్ కేబుళ్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టి పనులు చేయాలి. ఆ మేరకు అన్నింటిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలను వచ్చే నెల 20 కల్లా సిద్ధం చేసి పంపాలి. ఇక జూన్ 1న పనులు మొదలవుతాయి కాబట్టి అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా చూడండి. 90 రోజుల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు మొత్తం 28,81,962 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా అన్నింటినీ ఇవ్వడం జరిగింది. కోర్టు కేసులున్న 3,77,122 ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా 1,53,852 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా 40,990 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో కూడా అర్హులను గుర్తించండి. ఇప్పటికే గుర్తించిన అర్హులకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంపై దృష్టి పెట్టండి. వారిలో 17,945 మందిని ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో, మరో 2,964 మందికి కొత్త లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుంది. మిగిలిన 1,32,943 మందికి సంబంధించి భూసేకరణ జరగాలి. దీనిపై దృష్టి పెట్టి వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చొరవ చూపండి. ఇళ్ల నిర్మాణం.. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. వాటిలో పట్టణ ప్రాంతాల్లో 15.10 లక్షల ఇళ్లుండగా మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.తొలి విడత ఇళ్లలో 14.89 లక్షల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరు పత్రాలు జారీ చేశాం. టిడ్కో ఇళ్లు: రాష్ట్రంలో 2,62,216 టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా వాటిలో 2,14,450 ఇళ్లకు సేల్ అగ్రిమెంట్ల పంపిణీ జరిగింది. ఇంకా 47,766 ఇళ్లకు సంబంధించి సేల్ అగ్రిమెంట్ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. వాటిలో అనర్హులకు కేటాయించిన ఇళ్లతో పాటు సాఫ్ట్వేర్ సమస్యల వల్ల నిల్చిపోయిన ఇళ్లు ఉన్నాయి. కలెక్టర్లు చొరవ చూపి వీలైనంత త్వరగా వాటన్నింటిని పరిష్కరించాలి. ఖరీఫ్‌కు సన్నద్ధత: ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నందున రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇచ్చే విత్తనాలు మొదలు ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఉండాలి. అది మనం (ప్రభుత్వం) ఇచ్చే అష్యూరెన్స్. కల్తీ లేని సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ సీజన్లో 8.08 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీతో రైతులకు ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 1.35 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ జరిగింది. జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి కావాలి. వ్యవసాయ సలహా కమిటీలు.. అన్ని ఆర్బీకేల పరిధిలో వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటు కావాలి. ఇప్పటి వరకు 10,498 ఆర్బీకేలకు సంబంధించి, 8,650 మాత్రమే ఆ కమిటీలు సమావేశమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా ఆ కమిటీలు చురుగ్గా పని చేయాలి. కమిటీలు రైతులకు క్రాప్ ప్లానింగ్ ఇవ్వాలి. ఎరువులపై దృష్టి పెట్టాలి.. ఈ ఖరీఫ్‌లో 20.2 లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంటుందని అంచనా. ఆ మేరకు కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ప్రతి జిల్లాలో కలెక్టర్లు నీటి పారుదల సలహా బోర్డుల సమావేశాలు నిర్వహించాలి. జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆ పని చేయాలి. జాయింట్ కలెక్టర్లు తరచూ పర్యటించాలి. ఈ–క్రాపింగ్ ఎలా జరుగుతుందన్నది సమీక్షించాలి. ఎందుకంటే రైతుకు ఏ మేలు చేయాలన్నా ఈ–క్రాపింగ్ తప్పనిసరి. రూ.1.45 లక్షల కోట్ల రుణాలు.. జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలను కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. అప్పుడే పంటల రుణాల పంపిణీ పక్కాగా ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీకి సంబంధించి పంట రుణాలు, ఇతర రుణాలన్నీ కలిపి మొత్తం రూ.1,44,927 కోట్లు రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం. కౌలు రైతులకు కూడా ఈ ఖరీఫ్‌లో పంటల సాగు హక్కుల కార్డు (సీసీఆర్సీ)లు ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు జరగాలి. ఆర్బీకేల ద్వారా తమకు న్యాయం జరగలేదని ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయవద్దు. కాబట్టి కలెక్టర్లు ప్రతి రోజూ ఆర్బీకేలపై దృష్టి పెట్టాలి. రైతు సంతోషంగా ఉంటేనే..: రైతు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం బాగా పని చేస్తోందని అర్ధం. రైతులు, వ్యవసాయాన్ని మనం బాగా చూసుకుంటే దాదాపు 62 శాతం ప్రజలకు మేలు చేసిన వాళ్లమవుతాం. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి. ఆక్వా గిట్టుబాటు ధరలు తగ్గకూడదు.. ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించాం. మార్కెట్లో అంతకన్నా ధరలు తగ్గితే కలెక్టర్లు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఏ వ్యాపారీ రైతులను మోసం చేసే పరిస్థితి రాకూడదు. పంటలకు కచ్చితంగా గిట్టుబాటు ధర రావాలి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తప్పనిసరిగా రైతులకు దక్కాలి. రైతులు నష్టపోకుండా కలెక్టర్లు చొరవ చూపాలి. ఈనెల, వచ్చే నెలలో పథకాలు, కార్యక్రమాలు ఈనెల 31న పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణ మొదలు కానుంది. జూన్ 8న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం). జూన్ 15న వైఎస్సార్ వాహనమిత్ర. జూన్ 22న వైఎస్సార్ చేయూత (45 ఏళ్లకు పైబడిన మహిళలకు సాయం). అర్హులైన ఏ ఒక్కరికీ పథకం మిస్ కాకూడదు. కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. ► దివంగత వైఎస్సార్ జయంతి రోజైన జూలై 8 నాటికి ఆర్బీకేల నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కానీ చాలా పనులు జరగాల్సి ఉంది. మొత్తం 10,408 ఆర్బీకే భవనాల నిర్మాణం మొదలు పెడితే దాదాపు సగం మాత్రమే దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మిగిలిన వాటిలో కొన్ని బేస్మెంట్, మరికొన్ని శ్లాబ్ లెవెల్లోనే ఉన్నాయి. వాటిపై కూడా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు (గ్రామీణ), ఏఎంసీయూ, బీఎంసీయూ, అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌ల భవనాల నిర్మాణాలను నిర్ధారించుకున్న సమయంలోగా పూర్తి చేయడంపై కలెక్టర్లు దృష్టి సారించాలి. ► సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ)ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్ సవాంగ్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అధైర్యం వద్దు.. మీకూ స్థలం వస్తుంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ సంతృప్త స్థాయిలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృఢ సంకల్పానికి గండి కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు తాత్కాలికంగా 3.77 లక్షల మందికిపైగా పేదల గూడుకు అడ్డంకులు సృష్టించారు. న్యాయస్థానాలను ఆశ్రయించి 3,77,403 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కాకుండా అడ్డుకున్నారు. అయితే న్యాయ వివాదాల కారణంగా పేదలు అధైర్య పడకుండా భరోసా కల్పించేందుకు వారికి ఇళ్ల స్థలం మంజూరైందని, కేసులు తేలగానే ఇళ్ల స్థలాల పట్టాలిస్తామని పేర్కొంటూ అధికారులు లేఖలు పంపారు. న్యాయస్థానాల్లో కేసులున్న లబ్ధిదారులందరికీ సీఎం ఆదేశాల మేరకు లేఖల పంపిణీ పూర్తి చేశారు. ఇంత భారీగా ఇదే తొలిసారి.. ఇప్పటివరకు దేశ చరిత్రలోగానీ రాష్ట్ర చరిత్రలోగానీ పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇంత పెద్దఎత్తున సేకరించిన దాఖలాలు లేవు. తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలను సంతృప్త స్థాయిలో అందచేసేందుకు ఏకంగా 68 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించి పంపిణీ చేయించారు. సుమారు 30.66 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. టీడీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తేవడంతో 3.77 లక్షల మంది పేదలకు మాత్రం ఇళ్ల స్థలాల పట్టాలను ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అయితే దీన్ని శాశ్వతంగా అడ్డుకోలేరని, న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరింపచేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు గృహ నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కోర్టు కేసుల వల్ల పంపిణీ ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారులు ఆందోళన చెందకుండా అధికారులు లేఖలు పంపారు. దురుద్దేశపూర్వకంగా దాఖలైన కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు -
ఇళ్లు కట్టుకునేందుకు 7.69 లక్షల మంది సంసిద్ధత
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 7.69 లక్షల మందికి పైగా లబ్ధిదారులు తామే ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. వీరిలో ఇప్పటికే 41వేల మందికి పైగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాక అందులో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటి స్థలం పట్టాల మంజూరు సమయంలో గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారులకు మూడు ఆప్షన్లను ఇచ్చి ఏ ఆప్షన్ కావాలంటూ వారి అభిప్రాయాన్ని తెలుసుకుంది. అవి.. ► తొలి ఆప్షన్‌గా.. ప్రభుత్వం చూపిన నమూనా ప్రకారం ఇంటి నిర్మాణానికి నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలనూ చెల్లిస్తుంది. లబ్ధిదారులు దగ్గరుండి ఇల్లు కట్టుకోవచ్చు. ► రెండో ఆప్షన్‌గా.. లబ్ధిదారుడు ఇంటి సామాగ్రి తెచ్చుకుని కట్టుకోవచ్చు. పనుల పురోగతి ఆధారంగా దశల వారీగా డబ్బులు లబ్ధిదారులకు ఇస్తామని తెలిపింది. అవసరమైతే ఇళ్ల స్థలాల దగ్గరకే తక్కువ ధరకు సిమెంట్, ఇసుక కూడా సరఫరా చేస్తుంది. ► మూడో ఆప్షన్‌గా.. లబ్ధిదారుడు ఇల్లు కట్టించి ఇవ్వమని కోరితే, ప్రభుత్వమే స్వయంగా కట్టి ఇస్తుంది. లే అవుట్లలో కట్టి చూపుతున్న మోడల్ ఇంటి తరహాలో, నాణ్యమైన మెటేరియల్‌తో కట్టించి ఇస్తారు. లబ్ధిదారులు ఎలా కోరుకుంటే అలా చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో.. అత్యధికంగా 7,69,204 మంది లబ్ధిదారులు రెండో ఆప్షన్‌ను ఎంచుకున్నారు. వీరిలో ఇప్పటికే ఈ నెల 10 నాటికి 41,535 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. వీరికి అవసరమైతే స్థలాల వద్దకే సిమెంట్, ఇసుకను తక్కువ ధరకే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మిగతా సామాగ్రి కూడా సరఫరా చేయమంటే ప్రభుత్వం చేస్తుంది. లేదంటే లబ్ధిదారులే సామాగ్రి తెచ్చుకుని నిర్మాణాలు చేసుకుంటుంటే పనుల పురోగతి ఆధారంగా దశల వారీగా డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు కాలనీల్లో నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రెండో ఆప్షన్ లబ్ధిదారులకు సిమెంట్, ఇసుక సరఫరా తొలిదశలో.. అత్యధిక మంది రెండో ఆప్షన్ ఎంచుకున్నారు. వారే నిర్మాణ సామాగ్రి తెచ్చుకుని నిర్మాణాలు చేసుకుంటే పనులు పురోగతి ఆధారంగా దశల వారీగా డబ్బులిస్తాం. వారు కోరుకుంటే ఇళ్ల స్థలాల దగ్గరకే తక్కువ ధరకు సిమెంట్, ఇసుక కూడా సరఫరా చేస్తాం. ఇంకా ఏమైనా సామాగ్రి సరఫరా చేయమని లబ్ధిదారులు అడిగితే చేస్తాం. ఇళ్ల నిర్మాణాలు చేసుకునే వారికి అన్ని విధాలా సహకారం అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మంచి రోజు చూసుకుని మే తొలి వారంలో మరికొంత మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. –అజయ్ జైన్ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
జోరుగా ఇళ్ల మంజూరు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఇళ్ల మంజూరు కార్యక్రమం కొనసాగుతోంది. గృహ నిర్మాణశాఖ అధికారులు పట్టాలు పొందిన లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించి ఇళ్లు మంజూరు పత్రంతో పాటు ప్రత్యేకంగా పాసు పుస్తకం అందజేస్తున్నారు. లబ్ధిదారుడి పేరు, మంజూరైన స్కీమ్, ఇంటి విలువ, హౌసింగ్ ఐడీ నంబర్, లే అవుట్ పేరు, కేటాయించిన ప్లాటు నంబర్, బ్యాంకు ఖాతా తదితర వివరాలను పాసు పుస్తకంలో పొందుపరిచారు. ఇంటి నిర్మాణానికి మార్కింగ్ అనంతరం బేస్మెంట్, రూఫ్ లెవల్, స్లాబ్ లెవల్, ఫినిషింగ్ స్థాయిల్లో ఎంత మేరకు స్టీలు, సిమెంట్ వాడారనే వివరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 1902కి ఫోన్ చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఆయా జిల్లాలకు చెందిన గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. పరికరాల కొనుగోలుకు 15లోగా టెండర్లు సొంతంగా ఇళ్ల పట్టాలు, పొసెషన్ సర్టిఫికెట్ కలిగి ఉండి సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చే లబ్ధిదారులకు వర్క్ ఇన్స్పెక్టర్లు మార్కింగ్ ఇస్తున్నారు. నియోజకవర్గాల మార్కింగ్ వివరాలను ఏఈలు సేకరించి రోజూ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు అందజేయాలి. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన పరికరాల కొనుగోలు టెండర్లను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి లేఅవుట్ వద్ద పరికరాలు, ధరల వివరాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్లు పూర్తి కాగానే నిర్మాణాలు.. ఇళ్ల నిర్మాణాల కోసం పరికరాలు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో టెండర్లను ఆహ్వానించాం. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి చేయాలని ఆదేశించాం. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తాం. –అజయ్ జైన్, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి -
కాలనీల నిర్మాణంలో చెరగని సంతకం
వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణంలో మన సంతకం కనిపించాలి. మనం పోయిన తర్వాత కూడా ఈ కాలనీలు ఉంటాయి. మన పేర్లు చిర స్థాయిగా నిలిచిపోతాయి. కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి. రోడ్లను వినూత్న రీతిలో నిర్మించాలి. ఎలివేషన్ బాగుండాలి. వీధి దీపాలు, కరెంటు స్తంభాల ఏర్పాటులో కూడా వినూత్న పద్ధతులను అనుసరించాలి. ప్రతి కాలనీ వెలుపల బస్టాప్ ఉండాలి. దీనిని అధునాతనంగా తీర్చిదిద్దాలి. కాలనీ ఎంట్రన్స్ వినూత్న రీతిలో.. పెద్ద పెద్ద లేఅవుట్స్‌లో ఎలా ఉంటాయో.. అలా ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం మంచి మొక్కలు నాటాలి. ఈ కాలనీలను మురికి వాడలుగా మార్చే పరిస్థితి తలెత్తకుండా ఈ విషయాలన్నింటిపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను దీవిస్తున్నారని చెప్పారు. మన సంతకం కనిపించేలా అన్ని సౌకర్యాలతో వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలు, నాణ్యత అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని, అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని చెప్పారు. వారందరి దీవెనలు మీకు లభిస్తాయని, తనతో పాటు మీ అందరికీ ఈ సంతోషం ఉంటుందన్నారు. లబ్ధిదారుకి నేరుగా ఇంటి స్థలం పట్టా అందించడమే కాకుండా, ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా వెంటనే చూపిస్తున్నామని.. అందుకే ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ కార్యక్రమాన్ని ఈ నెల 20వరకు పొడిగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 39 శాతం ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తయిందన్నారు. 17 వేలకు పైగా ఉన్న వైఎస్సార్ జగనన్న కాలనీలకు గాను 9,668 కాలనీల్లో ఇళ్లస్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటికి కూడా ఆయా లేఅవుట్లలోనే ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పారు. పెండింగ్ కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. సీఎం జగన్మోహన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు పారదర్శకంగా ప్రక్రియ పాలనలో పారదర్శకతను ఒకస్థాయికి తీసుకెళ్లాం. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని చెప్పాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ విషయం కనిపించేలా బోర్డు పెట్టాం. రేషన్ కార్డు 10 రోజుల్లో, పెన్షన్ కార్డు 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ 20 రోజుల్లో, ఇంటి స్థలం పట్టా 90 రోజుల్లో ఇస్తామని చెప్పాం. కలెక్టర్లు నిరీ్ణత సమయంలోగా దరఖాస్తులను పరిశీలించి, అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలి. మనం సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నాం. అర్హులందరికీ తప్పకుండా ఇంటి పట్టా రావాలి. దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి నిబంధనలను చూసుకుంటూ నిర్ణీత కాలంలోగా పట్టా ఇవ్వాలి. లే అవుట్లు – మౌలిక వసతులు లే అవుట్లలో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమమైతే, మౌలిక సదుపాయాలు కల్పించడం మరో కార్యక్రమం. రోడ్లు, విద్యుత్, తాగునీరు లాంటి కనీస సదుపాయాలు కల్పించాలి. కాలనీ పరిమాణం బట్టి ఇతర సామాజిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. స్కూళ్లు, అంగన్వాడీలు, పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ లాంటివి రావాలి. కాలనీ పరిమాణం, జనాభాను బట్టి వీటిని ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తయారు చేయాలి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి. ఒక లే అవుట్లో పనులు ప్రారంభించాక అవన్నీ పూర్తి కావాలి. కాలనీలో పనులు మొదలుపెట్టిన తర్వాత అందులో అన్ని ఇళ్లనూ పూర్తి చేయాలి. ఒకవేళ అదనంగా ఇళ్లు మంజూరు చేయాల్సి వస్తే.. వెంటనే ప్రణాళిక రూపొందించుకుని నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుందాం. కలెక్టర్లు సవాల్‌గా తీసుకోవాలి భవిష్యత్ తరాలు మన పేర్లను గుర్తుంచుకునేలా కాలనీల నిర్మాణం జరగాలి. డిజైన్లు, ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కొన్ని సూచనలు చేశాను. కలెక్టర్లు దీన్ని సవాల్‌గా తీసుకోవాలి. మీ సమర్థతను చూపించుకునే అవకాశం ఇది. కాస్త ధ్యాస పెట్టగలిగితే మంచి కాలనీలు వస్తాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి వ్యవస్థలను కల్పించడంపై ఇప్పుడే దృష్టి పెట్టాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఆప్షన్ వెంటనే తీసుకోవాలి. ఆప్షన్లు తీసుకునే కార్యక్రమం 20 నాటికి పూర్తి కావాలి. ఏకకాలంలో మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ఎన్ఆర్ఈజీఎస్ (నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్–జాతీయ ఉపాధి హామీ పథకం)కింద లబ్ధిదారులకు జాబ్ కార్డులిచ్చి, వారి పేరుతో బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలి. పేమెంట్ల విడుదలకు ఏపీ హౌసింగ్ వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మ్యాపింగ్, జియోట్యాగింగ్ ఒకేసారి సమాంతరంగా పూర్తి చేయాలి. నీరు, విద్యుత్ ముఖ్యం నీటి సరఫరా, విద్యుత్ చాలా ముఖ్యమైన అంశాలు. వీటికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలపై డీపీఆర్‌లు తయారు చేయాలి. చాలా పెద్ద పెద్ద కాలనీలున్నాయి. కొన్నిచోట్ల నగర పంచాయతీలు చేస్తున్నాం. మురుగు నీటిని శుద్ధిచేసే ప్లాంట్ల కోసం కూడా డీపీఆర్‌లు తయారు చేయాలి. ప్రతి కాలనీలో ఒక మోడల్ హౌస్‌ను కట్టండి. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ నాణ్యత చాలా ముఖ్యం. పేద వాళ్ల నుంచి ఎవరైనా అవినీతికి పాల్పడితే అది క్షమించరాని నేరం. అవినీతి జరిగితే పేదవాళ్ల ఉసురు తగులుతుంది. ప్రతి అధికారికీ కలెక్టర్లు ఈ విషయం తెలియజేయాలి. మనం చేసిన పనుల ద్వారా మనకు సంతృప్తి మిగలాలి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఇంట్లో విద్యుత్ సరఫరా కోసం వాడే వైరు, ప్రతి వస్తువు నాణ్యతతో ఉండాలి. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న కాలనీ వరకు ఇసుక, ఇతర వస్తువుల సరఫరా జరిగేలా చూడాలి. మెటీరియల్‌కు సంబంధించి 20వ తేదీ నాటికి టెండర్లు పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. పంపిణీ ఆగిన చోట లబ్ధిదారులకు లేఖలు రాయండి ‘గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వలంటీర్ల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. వారికి మంచి శిక్షణ ఇవ్వండి. వీరి సేవలను వినియోగించుకోవడంపై ఎస్వోపీ తయారు చేయండి. డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలనూ వినియోగించుకోవాలి. కోర్టు కేసుల వల్ల స్థలాల పంపిణీ ఆగిపోయిన ప్రాంతాల్లో లబి్ధదారుల మనసులో అలజడి ఉంటుంది. వారికి భరోసా కల్పించేలా లేఖలు ఇవ్వాలి. కేసులు పరిష్కారం కాగానే వారికి వెంటనే ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పాలి’ అని సీఎం అన్నారు. సమీక్షలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు నీలంసాహ్ని పాల్గొన్నారు. -
అర్హులైతే చాలు... ఇంటి పట్టా చేతికి
ఇదో మహా యజ్ఞం.. వడివడిగా నిర్విఘ్నంగా సాగుతున్న గొప్ప సంకల్పం... మరి దానికి సన్నద్ధత కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. అందుకే 30 లక్షల పైచిలుకు ఇళ్ల పట్టాలివ్వటం,వాటిని నిర్మించి ఇవ్వటం అనే భగీరథ లక్ష్యాన్ని తలకెత్తుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. నిర్దేశించుకున్న సమయంలోగా అందుకోవాలంటే వినూత్న ఆలోచనలు, ప్రణాళికలతో పాటు కార్యాచరణ కూడా విభిన్నంగా ఉంటే తప్ప సాధ్యం కాదనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశం. అందుకే అనితర సాధ్యమైన ఈ లక్ష్యాన్ని అందుకోవటానికి ఇబ్బందులుండకూడదని.. కావాల్సిన భూమి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందే కొనుగోలు చేసింది. మొత్తం 68,677 ఎకరాల్లో 25,433 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి. మిగిలిన భూమి మొత్తం ప్రైవేట్ వర్గాల నుంచి సేకరించిందే. సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లుగానే ఎలాంటి వివక్షకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండగ వాతావరణంలో కొనసాగుతోంది. అర్హులందరికీ పిలిచి మరీ ఇంటి పట్టాను అందచేస్తుండటం పట్ల అక్క చెల్లెమ్మలలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. తెనాలిలో కౌన్సిలర్ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న కొర్రా లక్ష్మీ కృష్ణవేణి ఇందుకు నిదర్శనం. పట్టణంలోని 13వ వార్డులో నివాసం ఉండే ఆమె ప్రభుత్వం మంజూరు చేసే నివేశన స్థలం కోసం అర్జీ పెట్టుకున్నారు. అధికారుల పరిశీలనలో ఆమె అర్హురాలిగా తేలడంతో అదే వార్డు నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థిని కుర్రా సుజాత, శ్రీను దంపతుల సమక్షంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శనివారం ఇంటి పట్టాను అందుకున్నారు. కేవలం పేదలా.. కాదా? అన్న అంశాన్ని మాత్రమే పరిశీలించి పార్టీ గురించి పట్టించుకోకుండా తనకు ఇంటి పట్టా ఇవ్వడంపై లక్ష్మీ కృష్ణవేణి హర్షం వ్యక్తం చేస్తున్నారు. 7 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలతో పోటీపడి సాగుతున్నాయి. దేశ చరిత్రలోనే ఎక్కడా, ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 30.75 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం నివాస స్థలాలు / ఇళ్లు మంజూరు చేయడంతో తమ జీవితకాల స్వప్నం సాకారమైందంటూ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా తమకు గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఇప్పుడు ఎవరినీ అడక్కుండానే ప్రభుత్వం నివాస స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా మంజూరు చేసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్దకు వెళ్లి చూసుకోవడం ద్వారా సొంతింటి కల నెరవేరిందన్న ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఏ ఒక్క అర్హుడికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం జగన్ పదేపదే చెప్పడం, అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాకుండా ప్లాట్ల కేటాయింపు కూడా లాటరీల ద్వారా జరపడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు సగం వరకు పట్టాల పంపిణీ పూర్తైనట్లు అనధికారిక అంచనా. పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు ఈనెల 7వతేదీ వరకు కొనసాగనున్నాయి. విజయవాడ పడమటలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా పట్టాల పంపిణీ.. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండల పరిధిలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేదలకు శనివారం పట్టాలు అందజేశారు. మిగిలిన చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ కొనసాగింది. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 2,559 మంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. తొమ్మిది రోజుల వ్యవధిలో 35,151 మందికి పట్టాలు అందాయి. విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక నియోజకవర్గాల్లో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 22,256 మందికి పట్టాలు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 9,697 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా తొమ్మిది రోజుల్లో మొత్తం 69,659 మందికి ఇళ్ల పట్టాలు అందచేశారు. ఏలూరు నియోజకవర్గం పోణంగిలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని 3,385 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆచంట నియోజకవర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు 1,248 మందికి పట్టాలు అందజేశారు. కృష్ణా జిల్లాలో 8,638 మందికి ఇళ్ల పట్టాలను అందచేశారు. మచిలీపట్నం నియోజకవర్గం తపసిపూడిలో సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పట్టాలు అందజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం లేబర్ కాలనీలో దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో మంత్రి కొడాలి నాని ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం, వెంకటాపురం, మండలపాడులో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేదలకు పట్టాలు అందించారు. విజయనగరం జిల్లాలో 17,438 పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో ఇళ్ల పట్టాలు 12,479 కాగా టిడ్కో ఇళ్లు 2664, పీసీ/ఈఆర్ పట్టాలు 2295 ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 36,307 పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 1,08,830 పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో 4,150 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా ఇప్పటి వరకు మొత్తం 36,744 మందికి పట్టాలిచ్చారు. మొత్తం 84,027 పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో తొమ్మిదో రోజు 6,021 మందికి పట్టాలు ఇచ్చారు. కర్నూలు జిల్లాలో శనివారం 9,988 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 13,661 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మదనపల్లి నియోజకవర్గంలో రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3,917 మందికి ఇళ్ల పట్టాలు, 20 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలను అందజేశారు. వైఎస్సార్ జిల్లాలో శనివారం 5,696 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 60,152 మందికి పట్టాల పంపిణీ పూర్తయింది. -
పేదల కళ్లల్లో ఆనందం
సాక్షి నెట్వర్క్: పేదల జీవితాల్లోకి వేవేల సంక్రాంతి వెలుగులు ఒక్కసారిగా వచ్చినట్లుంది. సొంతింటి కల సాకారం అవుతోందన్న ఆనందం అక్కచెల్లెమ్మల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించినప్పటి నుంచి పట్టాల పంపిణీ నిర్విఘ్నంగా సాగుతోంది. ఏడో రోజైన గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. గురువారం పంపిణీ చేసిన పట్టాలతో సహా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 86,488 , కృష్ణాజిల్లాలో, 62,670 పట్టాలను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లాలో 26,476, తూర్పుగోదావరి జిల్లాలో 63,384 మందికి పట్టాలు పంపిణీ పూర్తయింది. పశ్చిమగోదావరి జిల్లాలో 59,177 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 32,560, విశాఖ జిల్లాలో 26,345 మందికి పట్టాలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లాలో 17,165 పట్టాల పంపిణీ పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలో 14,193 మంది లబ్ధిదారులు పట్టాలు అందుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో 54,421 మంది ఇళ్ల పట్టాలు అందుకున్నారు. కాగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7వ రోజు గురువారం 8,498 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం 2,839 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో గురువారం 3,889 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంత్రులు మేకతోటి సుచరిత ,కొడాలి నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బంధువులు వస్తారేమో! నా భర్త 40 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇద్దరు ఆడబిడ్డల్లో పెద్ద బిడ్డ అనారోగ్యంతో మృతి చెందింది. మనవడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కూతురి కుటుంబం ఊరు వదిలి వెళ్లిపోయింది. రెక్కల కష్టం చేసే ఓపిక లేదు. పింఛనే ఆధారం. చిన్న ఇంటిలో ఒక్కదాన్నే అద్దెకు ఉంటున్నాను. ఇప్పుడు నాకు ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తామని జగనయ్య చెప్పాడు. చాలా సంతోషంగా ఉంది. నా సొంత ఇంట్లోనే తనువు చాలిస్తానన్న ధైర్యం వచ్చింది. ఇంటి కోసమైనా దూరంగా ఉన్న బంధువులు వచ్చి నా కర్మకాండలు సక్రమంగా చేస్తారేమో. నాకు ఇల్లు కట్టిస్తున్న ఆ మహానుభావుడు చల్లగా ఉండాలి. – తమ్మిశెట్టి చినకాకమ్మ, నరమాలపాడు, గుంటూరు జిల్లా. -
భూ సేకరణ, ఇళ్ల స్థలాల పంపిణీని ఆపలేం
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రైవేట్ సంప్రదింపుల ద్వారా చేస్తున్న భూ సేకరణ ప్రక్రియను, ఈ నెల 25న ఇళ్ల స్థలాల పంపిణీని నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం నవరత్నాల కింద పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి సంప్రదింపుల ద్వారా భూమిని సేకరించడం చట్టవిరుద్ధమంటూ బీజేపీ నేత సాగి విశ్వనాథరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నెల 25న ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టనుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ కోర్టుకు నివేదించారు. ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ప్రభుత్వ చర్యల ద్వారా సదరు భూ యజమాని ప్రభావితమై.. అతను కోర్టుని ఆశ్రయిస్తే, అప్పుడు జోక్యం చేసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన భూ సేకరణ ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తెలిపింది. భూ సేకరణ ప్రక్రియ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. విచారణను జనవరి 22కు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
పేదలకు మంచి జరుగుతుంటే అడ్డుకుంటారా?
డిసెంబర్ 25న 27 లక్షల మందికి పట్టాలు ఇచ్చేటప్పుడే మొత్తం 175 నియోజకవర్గాల్లోని 17,436 లేఅవుట్లకు గాను 8,494 లేఅవుట్లలో తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టబోతున్నాం. 15 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరిగి ఇళ్ల స్థలాలు ఇస్తారు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టి రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతోపాటు ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి కలిసి వచ్చిన అరుదైన ముహుర్తమైన ఈ నెల 25న ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. దేశ చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా ఒకేసారి 30.66 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే ప్రతిపక్షం కోర్టులో కేసులు వేయించి, దుర్మార్గంగా వ్యవహరిస్తూ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. మేనిఫెస్టో అన్నది స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా చంద్రబాబు ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతుండటం దారుణం అని, ఎందుకింత కడుపు మంట అని ధ్వజమెత్తారు. క్లారిటీ లేకుండా వక్రీకరిస్తూ మాట్లాడుతున్న చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చించాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల (టిడ్కో)పై మంగళవారం సభలో చర్చ సందర్భంగా చంద్రబాబు అసత్య ఆరోపణలు చేయడంపై జగన్ జోక్యం చేసుకుంటూ వాస్తవాలేమిటో వివరించారు. అవేమిటంటే.. దేశ చరిత్రలోనే ప్రథమం దేశ చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా ఒకేసారి 30.66 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించాం. అయితే చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసులు వేయించి, స్టేలు తెచ్చి 3,65,680 ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. దీంతో ఈ నెల 25న 27 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఆ రోజు క్రిస్మస్ పండగ, వైకుంఠ ఏకాదశి. అంత మంచి ముహూర్తం అరుదుగా వస్తుంది. 11 వేలకు పైగా పంచాయతీల్లో 17,436 వైఎస్సార్ – జగనన్న కాలనీలు కనిపించబోతున్నాయి. – ప్రతి పేద వాడికి సెంటున్నర స్థలం. పట్టణాల్లో అయితే సెంటు స్థలం. ఇప్పుడు మనం 68,677 ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. ఇందులో 25,359 ఎకరాల ప్రైవేట్ భూములను రూ.10,150 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలినవి ప్రభుత్వ భూములు. మొత్తంగా ఈ భూముల మార్కెట్ విలువ రూ.23,535 కోట్లు. అంత విలువ చేసే భూములను 30.66 లక్షల మంది పేదలకు పంచుతున్నాం. చంద్రబాబు కుటిల రాజకీయాలు – ఇల్లు ఇవ్వడం అంటే హ్యూమన్ డిగ్నిటీకి సంబంధించిన విషయం. ఎకనామిక్, హెల్త్ పారామీటర్స్‌లో ఒక మెట్టు ఎక్కినట్లు లెక్క. ప్రతి ఇంట్లో నలుగురు ఉంటారనుకుంటే, దాదాపు 1.20 కోట్ల మందికి.. రాష్ట్రంలో నాలుగో వంతు ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు రకరకాల పద్ధతుల్లో కోర్టులో కేసులు వేయిస్తున్నందుకు బాధ కలుగుతోంది. – ప్రకాశం జిల్లాకు చెందిన మక్కెన శ్రీనివాసులు (ఫోటో చూపుతూ) ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనార్ధన నాయుడి శిష్యుడు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా పని చేశాడు. 24 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్న ఒంగోలులో స్టే తెచ్చారు. అక్కడ మైనింగ్ వద్దని, ట్రిపుల్ ఐటీ పెట్టాలని కోరిన వారే ఇప్పుడు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని కోర్టుల్లో కేసు వేశారు. – తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 110 ఎకరాల్లో పోర్టు పక్కనే 4,800 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకున్నాం. నిజానికి ఆ స్థలం పక్కనే చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు మొదలు పెట్టారు. సగం కట్టారు. ఇప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు సతీష్ (ఫొటో చూపుతూ) కోర్టుకు పోయి, అవి మడ భూములని చెప్పారు. నిజానికి అవి మడ భూములు కాకపోయినా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కలవడం.. వ్యవస్థలను మేనేజ్ చేయడం, కోర్టుల ద్వారా స్టే రావడం జరిగింది. – ఇదే రాజధాని ప్రాంతంలోని సీఆర్డీఏ పరిధిలో 54 వేల ఇళ్లు పేదలకు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడితే, కోర్టులో కేసు వేశారు. అమరావతిలోని ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇస్తే, భౌగోళికంగా అసమానతలు ఏర్పడతాయని (డెమోగ్రఫిక్ ఇమ్బ్యాలెన్స్– కులాలు, వర్గాల సమీకరణలు మారిపోతాయని) పేర్కొన్నారు. దాన్ని చూసి కూడా కోర్టు స్టే ఇచ్చింది అంటే పరిస్థితి ఏమిటి? బాబుకు కమ్యూనిస్టుల తోడు – చంద్రబాబుకు ఈ మధ్య కమ్యూనిస్టులు తోడయ్యారు. సీపీఐని చూస్తే, వారు కమ్యూనిస్టులని మర్చిపోవాలి. వారు కమ్యూనలిస్టులు అయిపోయారు. విశాఖలో సీపీఐ జిల్లా కార్యదర్శి లోకనాథమ్ పిల్ వేశాడు. అక్కడ అక్షరాలా 1.52 లక్షల మందికి 5,364 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం. నిజానికి ఆ ల్యాండ్ పూలింగ్‌లో ఏ సమస్యా లేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినా పిల్ వేశారు. స్టే తెచ్చారు. – అనంతపురానికి చెందిన గోకంటి సాయినాథరెడ్డి పరిటాల సునీతకు బాగా దగ్గరగా ఉంటాడు. చెట్లు కొట్టేస్తున్నారని ఆయన అక్కడ కోర్టులో కేసు వేయగా, స్టే వచ్చింది. – కర్నూలు జిల్లాలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సొంత పీఏ మురళీమోహన్‌రెడ్డి కోర్టులో కేసు వేశాడు. ఇక్కడ ప్రభుత్వ భూమి. అది వాటర్ బాడీ అని కేసు వేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి, స్టే తీసుకు వచ్చారు. – విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో జీవీ రమణ అనే వ్యక్తి కేసు వేశాడు. ప్రభుత్వ భూమిని గ్రేజింగ్ ల్యాండ్ అని ఆయనంతట ఆయనే ఊహించుకుని కేసు వేసి, స్టే తెచ్చాడు. 27 లక్షల స్థలాల పంపిణీ – మిగిలిన 27 లక్షలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు.. వాటిలో 2.62 లక్షలు టిడ్కోకు సంబంధించినవి ఉన్నాయి. మరో 4.86 లక్షల స్థలాలు పొజిషన్ సర్టిఫికెట్లు, ఎన్క్రోచ్మెంట్లకు సంబంధించినవి ఉన్నాయి. వారందరికీ ఈ నెల 25న ఇంటి స్థలాలు ఇవ్వబోతున్నాం. 17 వేలకు పైగా ఉన్న ఇళ్ల స్థలాల లేఅవుట్లలో 13 లక్షల మొక్కలు కూడా నాటుతున్నాం. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు – గతంలో కట్టిన ఇళ్లకు, ఇప్పుడు కడుతున్న ఇళ్లకు తేడా చూడాలి. పేదలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రూ.1.80 లక్షలతో కడుతున్న ఇల్లు ఎలా ఉంటుందన్నది చూద్దాం. (వీడియో చూపారు) – ఆ ఇళ్ల నిర్మాణంలో మెటీరియల్ ప్రభుత్వమే సేకరిస్తోంది. లబ్ధిదారుడు కోరితే ఇస్తాం. లేబర్ ఖర్చు కూడా ఇస్తాం. సిమెంట్, స్టీల్ రివర్స్ టెండరింగ్‌లో తక్కువ ధరకు సేకరిస్తున్నాం. ఇసుక ఫ్రీ. మెటల్ సేకరణ బాధ్యత కలెక్టర్లకు ఇచ్చాం. లబ్ధిదారుడు స్వయంగా కట్టుకుంటామంటే నిర్మాణ పురోగతికి అనుగుణంగా డబ్బు ఇస్తాం. – గతంలో కేవలం 224 చదరపు అడుగుల ఇల్లు ఇవ్వగా, మనం 340 ఎస్ఎఫ్టీ ఇల్లు కడుతున్నాం. గతంలో లివింగ్ రూమ్ కమ్ కిచెన్, బెడ్రూమ్, టాయిలెట్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కిచెన్, లివింగ్ రూమ్, బెడ్రూమ్, వరండా, టాయిలెట్, రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, నాలుగు లైట్లు, పైన సింటెక్స్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసి ఇస్తున్నాం. – తొలి దశలో కట్టే 15.60 లక్షల ఇళ్ల వల్ల దాదాపు రూ.28,084 కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి. కూలీలకు ప్రత్యక్షంగా 21.70 కోట్ల పని దినాలు, పరోక్షంగా 10 కోట్ల పని దినాలు లభిస్తాయి. – ఈ పెద్ద మనిషి (చంద్రబాబు) రూ.1,410 కోట్లు బకాయి పెట్టాడు. ఇందులో రూ.430 కోట్లు ఇప్పటికే కట్టాం. ఇంకొక రూ.908 కోట్లు ఈ నెల 25న లబ్ధిదారులకు అందజేస్తాం. చంద్రబాబు హయాంలో ఎన్ని ఇళ్లు? – చంద్రబాబు నాయుడు హయాంలో.. అంటే, 2019 మే 31 నాటికి ఎన్టీఆర్ రూరల్ హౌజింగ్ కింద 4.56,929 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 47,120 ఇళ్లు, పీఎంఏవై అర్బన్ కింద 91,120 ఇళ్లు, విశాఖలో హుద్‌హుద్ తుపాను స్పెషల్ హౌజింగ్ కింద 8,817 ఇళ్లు కట్టారు. మొత్తం 6,03,986 ఇళ్లు కట్టారు. – చంద్రబాబు అ«ధికారంలోకి రావడానికి ముందు, అంటే 2014కు ముందు 4,76,509 ఇళ్లు మంజూరు చేస్తే, 2,00,867 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. టిడ్కో ఇళ్లు – వాస్తవాలు – శాంక్షన్ అయిన టిడ్కో ఇళ్లలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయన్నది చాలా ముఖ్యం. 300 చదరపు అడుగుల టిడ్కో ఇంటినే తీసుకుంటే, శాంక్షన్ అంటే కేంద్రం ఇచ్చేది కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే. దానికి రూ.2.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. మరో రూ.2.65 లక్షల రుణం లబ్ధిదారుడి పేరుతో బ్యాంక్ రుణం మంజూరు చేయించాలి. అవన్నీ జరిగితేనే ఒక ఇల్లు గ్రౌండ్ అవుతుంది. పనులు జరుగుతాయి. – అప్పుడు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు 7 లక్షలు. వాటిలో గ్రౌండ్ అయినవి కేవలం 2.62 లక్షలు మాత్రమే. ఈ 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు సంబంధించి దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యే స్థాయిలో ఉన్నవి దాదాపు 77 వేల ఇళ్లు మాత్రమే. – వాటిలో ఏ విధమైన మౌలిక వసతులు లేవు. టాయిలెట్లు, డ్రైనేజీ లేదు. కరెంటు, నీళ్లు లేవు. వాటన్నింటినీ పూర్తి చేయడానికి రూ.3 వేల కోట్లు ఇచ్చాం. వాటితో ఈ నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయమని చెప్పాం. ఎందుకంటే అవన్నీ చేస్తే తప్ప, ఇళ్లలోకి వెళ్లలేని పరిస్థితి. ఆ పనులు చేయాలని ఏనాడూ చంద్రబాబు అనుకోలేదు. – మరోవైపు రూ.3,200 కోట్లు బకాయి పెట్టాడు. ఇంకా శ్లాబ్‌లు వేసి వదిలేసిన ఇళ్లు 38 వేలు. సగంలో ఆగిపోయిన ఇళ్లు 71 వేలు. పునాదులు కూడా పూర్తి కానివి 1.20 లక్షల ఇళ్లు. ఆ రూ.3200 కోట్ల బకాయిలు తీర్చే బాధ్యత తీసుకోవడమే కాకుండా రూ.1,250 కోట్లు విడుదల చేశాం. పనులు సాగుతున్నాయి. పనులు పూర్తి కావాలంటే ఇంకా రూ.9,500 కోట్లు కావాలి. ఆ మేరకు ఈ ఏడాది, వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది నిధులు మంజూరు చేసి ఇళ్లన్నీ పూర్తి చేస్తాం. టిడ్కో ఇళ్ల స్థలాలు కూడా నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చినవే. మరి ఈ పెద్ద మనిషి (చంద్రబాబు) క్రెడిట్ ఎలా తీసుకుంటాడు? వారికి కూడా మేలు.. – 365 ఎస్ఎఫ్టీ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు కట్టాల్సిన రూ.50 వేలకు గాను రూ.25 వేలు, 430 ఎస్ఎఫ్టీ ఇళ్ల లబ్ధిదారులు కట్టాల్సిన రూ.లక్షకు గాను రూ.50 వేలు కడితే చాలు. మిగతాది ప్రభుత్వం భరిస్తుంది. – గతంలో చంద్రబాబు హయాంలో చేపట్టిన 2.62 లక్షల ఫ్లాట్లలో 63,744 ఫ్లాట్లకు సంబంధించి 2019 డిసెంబర్లో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి రూ.392 కోట్లు ఆదా చేశాం. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఆలోచించండి. మిగిలిన 1.90 లక్షలకు పైగా ఫ్లాట్ల నిర్మాణంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో, చంద్రబాబు జేబులోకి ఎంత పోయిందో ఆలోచించండి. చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలి మేనిఫెస్టో అన్నది స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతుండటం దారుణం. క్లారిటీ లేకుండా వక్రీకరిస్తూ మాట్లాడుతున్న చంద్రబాబును ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చించకపోతే సమాజానికి, రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం. – మా మేనిఫెస్టో మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్. నేను పాదయాత్రలో ఏం మాట్లాడాను.. మేనిఫెస్టోలో ఏం రాశాము అన్నది చెబుతాను (వీడియో చూపారు, చదివి వినిపించారు). ‘పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. అడుగు రూ.2 వేలకు అమ్మారు. రూ.3 లక్షలను కేంద్ర, రాష్ట్రాలు ఇస్తాయి,. మరో 3 లక్షల రూపాయలను పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుంటారు. 20 ఏళ్ల పాటు నెల నెలా రూ.3 వేలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి. ఈ అప్పు భారం రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది’ అని నేను సరిగ్గా ఏది మాట్లాడానో అదే మేనిఫెస్టోలో పెట్టాము. – అంత క్లియర్ కట్‌గా మేము చెబితే చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు. మేనిఫెస్టోలో మేము చెప్పిన దాంట్లో ఒక లైన్ తీసేసి, ఆయనకు అనుకూలంగా మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఎక్కడికక్కడ వక్రీకరిస్తున్నారు. స్వాగతిస్తున్నామంటూనే రాజకీయాలా? టీడీపీ ద్వంద్వ వైఖరిపై సీఎం జగన్ ధ్వజం ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మంచి బిల్లును స్వాగతిస్తున్నట్లు ఒకవైపు చెబుతూ మరోవైపు రాజకీయంగా మెలిక పెట్టాలనే ప్రతిపక్ష టీడీపీ వైఖరి ఏమాత్రం సరికాదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇంటర్నెట్, ఆన్లైన్ గురించి గొప్పగా మాట్లాడే చంద్రబాబు గత ఐదేళ్లలో ఆన్లైన్ జూదాన్ని నియంత్రించడానికి చట్టం ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీశారు. గత సర్కారు ఈ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. స్వాగతిస్తున్నాం కానీ.. రాష్ట్రంలో ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ (సవరణ)–2020 బిల్లుపై శాసనసభలో మంగళవారం చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ దీన్ని స్వాగతిస్తున్నామని.. కానీ రాష్ట్రంలో కొందరు అధికార పార్టీ నేతలు ఆఫ్‌లైన్ జూదాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు క్లబ్‌ను మూసివేసి నిజాంపట్నంలో జూదాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేయడంపై అధికారపార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జూదాలు ఎక్కడ, ఎవరు నిర్వహిస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ దశలో హోంమంత్రి మేకతోటి సుచరిత జోక్యం చేసుకుంటూ టీడీపీ సభ్యులు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. గేమింగ్ యాక్ట్–1974 ప్రకారం పేకాట లాంటి జూదాలను మాత్రమే నియంత్రించే అవకాశం ఉందని, ఆన్లైన్ జూదం, బెట్టింగ్‌లను వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా నిర్వహిస్తుండటం వల్ల నియంత్రణలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అందుకే ఆన్లైన్ జూదం, బెట్టింగ్‌లను నిషేధిస్తూ గేమింగ్ యాక్ట్–1974కు సవరణ తెస్తూ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. మంత్రి బంధువైనా వదల్లేదు.. పేకాట శిబారాలపై చర్యలు తీసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులను అధికారపార్టీ నేతలు నియంత్రిస్తున్నారంటూ టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ మరోసారి ఆరోపణలు చేయడంతో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘కర్నూలు జిల్లాలో మంత్రి జయరాం దూరపు బంధువు ఒకరు గ్రామంలో పేకాట నిర్వహిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి బంధువు అని వదిలేయకుండా కేసు నమోదు చేశారు’ అని గుర్తు చేశారు. ఆన్లైన్ జూదానికి యువత బానిసలు కారాదనే ఉద్దేశంతో వీటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘జూదం, ఆన్లైన్ జూదానికి అడుకట్ట వేసేందుకు వెంటనే ప్రత్యేక టోల్ ప్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే నిర్వాహకులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. అనంతరం ఏపీ గేమింగ్(సవరణ)–2020 బిల్లును శాసనసభ ఆమోదించింది. -
పట్టాల పండుగకు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వనీయకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు తన పార్టీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయించడంతో కోర్టు స్టేలు ఇచ్చినచోట మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో అర్హులందరికీ ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతి చోటా లేఔట్లను పరిశీలించి.. ప్లాట్లవారీగా నంబర్ రాళ్లు ఏర్పాటు చేయడంతోపాటు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి లాటరీ పూర్తి కాని చోట్ల త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చింది. ఏయే లేఔట్లపై కోర్టు స్టేలు ఉన్నాయో.. ఇందుకు కారణాలేమిటో తెలుసుకుని వాస్తవాలు వివరించడం ద్వారా ‘స్టే’ వెకేట్ చేయించడంపై కలెక్టర్లు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లాల కలెక్టర్లు శుక్ర, శనివారాల్లో సమీక్షించారు. జిల్లాల వారీగా కోర్టు వివాదాలు లేకుండా పంపిణీకి సిద్ధం చేస్తున్న లేఔట్లు, లబ్ధిదారుల డేటా పంపాలని రెవెన్యూ శాఖ కలెక్టర్లను ఆదేశించింది. 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసి సచివాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను పొందుపరిచారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 90 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 66,518 ఎకరాల భూమిని సేకరించి లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఎంపికైన 80 వేల మంది కోసం వచ్చే నెల 10లోగా స్థల సేకరణతోపాటు ప్లాట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్థలాల పంపిణీతోపాటు వచ్చే నెల 25న 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు కోర్టు వివాదాలు ఉన్న స్థలాలను పక్కన పెట్టి.. ప్రత్యామ్నాయ స్థలాలు చూసి వీలైనంత ఎక్కువమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 1,42,976 మంది అర్హులను ఎంపిక చేయగా 4,316 మందికి ఎంపిక చేసిన లేఔట్ల విషయంలో కోర్టు స్టేలు ఉన్నాయి. దీంతో 4,316 మందికి ప్రత్యామ్నాయ స్థలాలు చూసి మొత్తం 1,42,976 మందికి లబ్ధి చేకూర్చే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 2,88,384 మందికి స్థలాలు ఇచ్చేందుకు ఎలాంటి వివాదం లేదు. కోర్టు కేసుల వల్ల పెండింగ్‌లో ఉన్నవారిలో మరో నాలుగైదువేల మందికి ప్రత్యామ్నాయ స్థలాలు చూసి ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో 71,237 మందిని ఎంపిక చేయగా కోర్టు స్టేల వల్ల 1,711 మందికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ స్థలాలు చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు స్టేల వల్ల ఈ నెల 25న పంపిణీ చేయని వారికి స్టేలు వెకేట్ చేయించి లేదా ప్రత్యామ్నాయ స్థలాలు చూసి తర్వాత పంపిణీ చేయనున్నారు. పారదర్శకంగా అర్హుల ఎంపిక ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్న సీఎం వైఎస్ జగన్ ఆశయానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడా కోర్టు స్టేలు లేవు. అత్యంత పారదర్శకంగా 1,10,634 మంది అర్హులను ఎంపిక చేశాం. డిసెంబర్ 25న వీరందరికీ పట్టాలను అందజేస్తాం. – సి.హరికిరణ్, కలెక్టర్, వైఎస్సార్ జిల్లా దేశంలోనే ఎక్కడా లేదు దేశ చరిత్రలోనే ఎక్కడా ఒకేసారి ఇంతమందికి నివాస స్థల పట్టాలిచ్చిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి దీన్ని యజ్ఞంలా భావించడం వల్లే పేదల కల సాకారమవుతోంది. కోర్టు స్టేలు ఉన్నవి మినహాయించి జిల్లాలో సుమారు 1.15 లక్షల మందికి టిడ్కో ఇళ్లు, పొజిషన్ సర్టిఫికెట్లు, నివాస స్థలాలకు డి.ఫారం పట్టాలు ఇవ్వనున్నాం. – వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్, విశాఖపట్నం -
డిసెంబర్ 25న రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ
-
డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ
ప్రతిపక్ష కుటిల రాజకీయాల వల్ల పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పేదలకు సెంటు, సెంటున్నర స్ధలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారు. ఈ యుద్ధంలో గెలుస్తాం. దేవుడు మనకు అండగా ఉంటాడు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. గ్రామీణ ఇళ్లకు సంబంధించి చంద్రబాబు వదిలి పెట్టి పోయిన బకాయిలు రూ.1,432 కోట్లు ఉన్నాయి. అందులో ఈ వారంలో సుమారు రూ.470 కోట్లు విడుదల చేయబోతున్నాం. ఆ తర్వాత మిగిలిన రూ.962 కోట్లు డిసెంబర్ 25న బటన్ నొక్కి విడుదల చేస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు స్టేలు ఉన్న చోట మినహా, మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ డి–ఫామ్ పట్టా ఇచ్చి, ఇంటి స్థలం కేటాయించాలని స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అదే రోజు (డిసెంబర్ 25) తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30,68,281 మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాల కోసం గుర్తించామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే ఈ కార్యక్రమం మొదలు పెట్టామని, గిట్టని వాళ్లు కోర్టులకు వెళ్లి.. పేదలకు ఇంటి స్థలం ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. స్పందన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు కుటిల రాజకీయం ► తొలుత మార్చి 25న ఉగాది రోజు పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలనుకున్నాం. ప్రతిపక్షం రాజకీయంతో వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజున, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న, దివంగత నేత వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, చివరగా అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున అనుకున్నా వాయిదా పడుతూ వచ్చింది. ► ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించాం. వాటి మార్కెట్ విలువ రూ.23 వేల కోట్లు. మొత్తం 30,68,821 మంది పేదలకు డిసెంబర్ 25న పంచబోతున్నాం. కొత్తగా 1.20 లక్షల మందికి.. ► దరఖాస్తు చేసుకుంటే అర్హులకు 90 రోజుల్లో ఇస్తామన్నాం. ఆ మేరకు 1.20 లక్షల మందిని కొత్తగా జాబితాలో చేర్చాం. ఇందులో 80 వేల మంది కోసం కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంది. కాబట్టి వేగంగా ఆ పని చేయండి. ► డిసెంబర్ 10వ తేదీ లోగా భూసేకరణతో పాటు, ప్లాట్ల గుర్తింపు 100 శాతం పూర్తి కావాలి. అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే, వారినీ కొత్త జాబితాలో చేర్చాలి. వచ్చే నెల 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నాటికి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారుల జియో ట్యాగింగ్ పూర్తి కావాలి. ► పథకాన్ని అమలు చేసేందుకు ఆ రోజు నాటికి కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి. కోర్టు స్టేలు ఉన్న చోట వాటిని వెకేట్ చేయించుకునేలా కలెక్టర్లు గట్టి ప్రయత్నం చేయాలి. సచివాలయాల పాత్ర ► ఇళ్ల నిర్మాణంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి. డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌తో పాటు, వలంటీర్లు కూడా పని చేస్తారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం మొదలు, వారికి అవసరమైన అన్ని పనులు చేస్తారు. ► జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఆ బా«ధ్యత చూస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్వాలిఫైడ్. వారి సేవలు ఉపయోగించుకోండి. అందుకు తగిన ఎస్ఓపీ ఖరారు చేయండి. ► తొలి దశలో నిర్మించనున్న ఇళ్లను 18 నెలల్లో (2022 జూన్ నాటికి) పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండో దశలో గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. వచ్చే ఏడాది 2021 డిసెంబర్లో వాటి నిర్మాణం ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. వచ్చే ఏడాది ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వ అతి పెద్ద కార్యక్రమం. తొలి దశలో 167 నియోజకవర్గాలలో ఇళ్ల నిర్మాణాలు మొదలు కానున్నాయి. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అత్యంత నాణ్యతతో కొత్త ఇళ్ల నిర్మాణం ► నవరత్నాలులో చెప్పిన మరో కార్యక్రమం అమలు చేయబోతున్నాం. తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నాం. ఒక్కో ఇంటిని రూ.1.80 లక్షల వ్యయంతో, అన్నీ ఒకే మాదిరిగా నిర్మిస్తారు. ఒక్క రూపాయి కూడా పేదలపై భారం పడదు. ► ఇంటి నిర్మాణానికి అవసరమైన పూర్తి సామగ్రి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సరఫరా అవుతుంది. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. క్వాలిటీ అనేది ప్రభుత్వానికి ట్రేడ్ మార్క్. బ్రాండ్ ఇమేజ్. కాబట్టి ఎక్కడా రాజీ పడొద్దు. ► పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తారు. 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుము అవసరం అవుతుంది. ఈ ఇళ్ల నిర్మాణం వల్ల 21 కోట్ల పని దినాలు లభించనున్నాయి. మెటీరియల్ ఇస్తాం. లేబర్ కాంపొనెంట్ వారికే ఇస్తాం. ఆ విధంగా దగ్గరుండి పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం. -
మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలో కొనసాగుతున్న రిలే దీక్షలు
తాడికొండ: పరిపాలన వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల అభివృద్ధి కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథిగా ఆదివారం గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కేవలం తమ వర్గం వారి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఆయన ఏనాడూ న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకుంటున్న ఆయనకు పేదలపై ప్రేమ ఏపాటిదో అర్థమవుతోందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ వామపక్షాల నాయకులు పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటూ చంద్రబాబుకు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అమరావతి రాజధాని కన్వీనర్ మల్లవరపు నాగయ్యమాదిగ, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పిడతల అభిషేక్, ఎంఏసీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాంబయ్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొదమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అక్కచెల్లెమ్మలకు రూ.20 వేల కోట్ల ఆస్తి
సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు రాష్ట్ర, దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల రూపంలో రూ.20 వేల కోట్ల ఆస్తిని పంపిణీ చేసేందుకు మొట్టమొదటి సారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏకంగా 62 వేల ఎకరాల భూమిని అన్ని విధాలా సిద్ధం చేసింది. మొత్తం 29,50,985 మంది లబ్ధిదారులకు ఈ ఆస్తిని ఇళ్ల స్థలాల రూపంలో ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇళ్ల స్థలాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6,607.45 కోట్లు వ్యయం చేసింది. గతంలో అరకొరగా ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఆ స్థలాలపై లబ్ధిదారులకు పూర్తి హక్కు ఉండేది కాదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మల పేరు మీద రిజస్ట్రేషన్ చేసి ఇవ్వాలని, శాశ్వతంగా ఆ ఇళ్ల స్థలాలపై వారికి హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. – అయితే తెలుగుదేశం నేతలు ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాలకు వెళ్లారు. దీంతో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. తీర్పు కోసం ఎదురు చూస్తోంది. – ఈ లోగా లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల స్థలాల లే అవుట్లు, రాళ్లతో సహా డిమార్కింగ్ పూర్తి చేశారు. ప్లాట్ల లేఅవుట్లలో మొక్కలు నాటడం, ఇళ్ల స్థలాల పట్టాల డాక్యుమెంట్లలో ఫొటోలు, ప్లాట్ల నంబర్ల నమోదుతో పాటు, సరిహద్దులు స్పష్టంగా రాయడం వంటివి పూర్తి చేశారు. గతనాకి, ఇప్పటికి తేడా స్పష్టం – గత తెలుగుదేశం ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల కోసం పది లక్షల ఎకరా>లతో ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది తప్ప పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను కూడా ఇతర అవసరాల పేరుతో లాగేసుకుంది. – ప్రస్తుత ప్రభుత్వం ఇందుకు భిన్నంగా పేదల కోసం ఏకంగా 62 వేల ఎకరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ప్రభుత్వ భూమి లేని చోట వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి కొనుగోలు చేసింది. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక – కులం, మతం, ప్రాంతం, పార్టీ, రాజకీయాలకు అతీతంగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశారు. – ‘నాకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే వారికి ఇంటి స్థలం మంజూరు చేయాల్సిందే’ అని సీఎం జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో అర్హులను ఎంపిక చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితా ప్రదర్శించారు. – రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం బీసీలే. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో కూడా వీరికే అగ్రస్థానం దక్కింది. -
పేదల ఇళ్ల స్థలాలకు బాబే అడ్డంకి
-
పేదల ఇళ్ల స్థలాలకు బాబే అడ్డంకి
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటి మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారని, దీనిపై వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా చంద్రబాబునాయుడు, ఆయన పార్టీకి చెందిన వారు నానా రకాలుగా కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. అయినప్పటికీ చివరకు న్యాయం, మంచే గెలుస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అప్పటి వరకు మనో స్థైర్యం కోల్పోకూడదని అన్నారు. మంగళవారం ఆయన స్పందన కార్యక్రమంపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అతి త్వరలో మంచి రోజు వస్తుంది ► ఆగస్టు 15న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. కానీ వాయిదా పడింది. అతి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేపట్టే మంచి రోజు వస్తుంది. ► ఆలోగా ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, లాటరీ తదితర ప్రక్రియలన్నీ పూర్తి కావాలి. బ్యాంకర్లు ఇబ్బంది పెట్టకుండా చూడాలి ► వైఎస్సార్ చేయూత సొమ్ముపై బ్యాంకులకు హక్కు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళలకు ఆ సొమ్ము నేరుగా అందేలా కలెక్టర్లు బ్యాంకర్లతో మాట్లాడాలి. ► మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, రిలయన్స్, అమూల్, అల్లానా గ్రూపులతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ► 19 లక్షల మంది మహిళలు వివిధ జీవనోపాధి మార్గాల కింద ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. ఈ కార్యక్రమం అమలుపై రాష్ట్ర స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి 8 మంది మంత్రులతో కూడిన బృందం సమీక్ష చేస్తుంది. ప్రతి వారం కంపెనీ ప్రతినిధులు, కలెక్టర్, సెర్ప్ ప్రతినిధులు, బ్యాంకర్లు సమీక్ష చేయాలి. ► సెప్టెంబర్ నెలలో ఆసరాకు సంబంధించిన లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంతో అనుసంధానం అవుతారు. ఆ సమయంలోగా ‘చేయూత’ మహిళలు తమ జీవనోపాధి కార్యక్రమాలను గ్రౌండ్ చేసుకునేలా చూడాలి. ఇ– క్రాప్ బుకింగ్‌పై దృష్టి పెట్టండి ► ఇ– క్రాపింగ్ పూర్తి కాకపోతే తర్వాత కార్యక్రమాలు దెబ్బ తింటాయి. సంబంధిత జేసీలు దీనిపై దృష్టి పెట్టాలి. మండలాన్ని, ఆర్బీకేను ఒక్కో యూనిట్‌గా తీసుకుని ఎరువుల పంపిణీలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ► వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి కస్టమర్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మండల స్థాయిలో కూడా రైతుల గ్రూపుల ఏర్పాటుతో పాటు, యంత్రాలను డెలివరీ చేయాలి. హై వ్యాల్యూ యంత్ర పరికరాలతో హబ్స్ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి. ► ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక ఎకరా భూమిని గుర్తించాలి. ఇక్కడ గోడౌన్లు, పంటను ఆరబెట్టుకోవడానికి ప్లాట్ ఫాం, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్స్, పశువుల శాల, కలెక్షన్ సెంటర్ తదితర కార్యకలాపాల కోసం ఇక్కడ వసతులు కల్పిస్తాం. ‘నాడు–నేడు’ పనుల్లో వేగం పెరగాలి ► ఉపాధి హామీ పనుల కింద రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగంగా జరగాలి. గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం 2021 మార్చి నాటికి పూర్తి కావాలి. ► అంగన్ వాడీలను 10 రకాల సదుపాయాలతో వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తున్నాం. 55 వేల అంగన్వాడీల్లో నాడు–నేడు కింద పనులు చేపడతాం. వచ్చే వారానికి ప్రణాళిక సిద్ధం అవుతుంది. ► స్కూళ్లలో నాడు–నేడుపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 5న స్కూళ్లు తెరవాలని ఆలోచిస్తున్నాం. ఈలోగా పనులన్నీ నాణ్యతతో పూర్తి చేయాలి. స్కూళ్లకు ఫర్నిచర్ చేరడం మొదలవుతోంది. ► సెప్టెంబర్ 1న సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ్ ప్లస్, సెప్టెంబర్ 5న జగనన్న విద్యాకానుక, సెస్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా ప్రారంభిస్తున్నాం. రూ.22 వేల కోట్ల విలువైన ఆస్తులను దాదాపు 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు అదేపనిగా కేసులు వేయిస్తున్నారు. కలెక్టర్లు సమీక్షలు నిర్వహించి, కౌంటర్లు ఫైల్ చేసి కేసులు త్వరగా ముగిసేలా చూడాలి. కొంత సమయం పట్టినా, చివరకు మంచే గెలుస్తుంది. -
ఆవ భూముల్లో ఆవగింజంత అవినీతి లేదు
తాడితోట (రాజమహేంద్రవరం): ఆవ భూముల్లో ఆవ గింజంత కూడా అవినీతి జరగలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళల పేరిట ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారానికి తెరతీశారు. ► హైదరాబాద్‌లో కాపురం ఉంటూ.. అవినీతి సొమ్ముతో అజీర్తి చేసి ఆవలింత వచ్చినప్పుడల్లా అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ► 30 లక్షల ఇళ్లు నిర్మించడం కోసం ఒక మోడల్ హౌస్‌ను సందర్శిస్తే కోట్లాది రూపాయలు అవినీతి జరిగిపోయిందని కొన్ని పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ► అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం 54 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే కోర్టును ఆశ్రయించి పేదోళ్లకు అందకుండా ప్రయత్నిస్తున్నారు. ► ఆవ భూముల్లో రూ.500 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. అక్కడ ఖర్చు చేసిందే రూ.170 కోట్లు అని తెలుసుకోవాలి. ► ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని ప్రధాన మంత్రికి చంద్రబాబు ఉత్తరం రాశారు. ఆధారాలు చూపించాలని డీజీపీ అడిగితే.. మీరెవరు అడగడానికి అని ప్రశ్నించిన వారే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం విడ్డూరం. -
ప్రజాద్రోహి చంద్రబాబు
అనంతపురం సెంట్రల్: రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నిజం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డుకుంటున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న చంద్రబాబు ప్రజాద్రోహిగా మిగిలిపోతారన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. ► కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ► స్టేట్ డిస్టెన్స్ పాటిస్తూ ఇళ్ల పట్టాలు పంపిణీ జరగకుండా ఆ పార్టీ శ్రేణులకు డైరెక్షన్ ఇచ్చి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు. ► టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా పట్టాలు పొందిన భూములపై నేడు కేసులు వేయిస్తుండటం దారుణం. ► ఫోన్ ట్యాపింగ్‌పై రాద్దాంతం చేయడం తగదు. ఏవైనా ఆధారాలుంటే సమర్పించాలి. -
మీ వాదనలు హైకోర్టులోనే వినిపించండి
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టులోనే నివేదించండని సుప్రీంకోర్డు పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, మెహ్‌ఫూజ్ నజ్కీ, ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాదులు దివ్యేష్ ప్రతాప్ సింగ్, రంజిత్ కుమార్ విచారణకు హాజరయ్యారు. పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందిస్తూ ‘హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై మేం జోక్యం చేసుకోవడం లేదు. హైకోర్టులో దీనిపై ఈనెల 27న విచారణ ఉన్నట్టుగా న్యాయవాదులు తెలిపారు. మీ వాదనలు అక్కడే నివేదించండి. హైకోర్టు ఈ విచారణను వేగవంతం చేయొచ్చు..’ అని ఉత్తర్వులు జారీ చేశారు. -
తొలి దశలో 15 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదల కోసం ప్రభుత్వం 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. రాష్ట్రంలో అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుండటంతో వారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే 26 వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఔట్లు వేసి పట్టాలు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక డిజైన్.. ► మొదటి విడతలో 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు వీలుగా గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ► ఇందులో భాగంగా ప్రీ–కాస్ట్ ఆర్సీసీ శ్లాబ్‌తో లబ్ధిదారులకు సరసమైన ఖర్చుతో ఇళ్లు నిర్మించేందుకు డిజైన్‌ను తయారు చేశారు. ► నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన సెంట్రింగ్ మెటీరియల్ సరఫరా చేసేందుకు గృహనిర్మాణ శాఖ టెండర్లు పిలిచింది. ► ప్రీ–కాస్ట్ ఆర్సీసీ శ్లాబ్‌తో నిర్మాణాల కోసం అనుభవం ఉన్న కంపెనీల నుంచి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. ► భారీ నిర్మాణాల్లో అనుభవం ఉన్న కంపెనీలకే అవకాశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ► ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ► నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ► లబ్ధిదారులు సొంతంగా లేదా అధికారుల పర్యవేక్షణలో నిర్మించుకునేందుకు కూడా అవకాశం కల్పించనున్నారు. ► టీడీపీ హయాంలో 2014 నుంచి 2016 వరకు ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేకపోయారు. ► ఆ తర్వాత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లతోపాటు వివిధ పథకాల కింద 6.20 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. ► ఇందులో 3.50 లక్షల వరకు మాత్రమే పూర్తి చేసినా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా నిధులన్నీ సార్వత్రిక ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించారు. ► టీడీపీ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను ఏం చేద్దామనే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
నాలుగు ముక్కలతో ‘పిల్’లా?
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల పేరుతో ప్రచార వ్యాజ్యాలను దాఖలు చేసే పిటిషనర్లు హైకోర్టును స్వర్గధామంలా భావిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వ్యాజ్యాల ద్వారా వారంతా ప్రభుత్వాన్ని నడపాలని, శాసించాలని ఉబలాటపడుతున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పేదలకు ఇళ్ల పథకం కింద మైనింగ్ భూములు కేటాయిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పొన్నవోలు పలు అంశాలను ప్రధాన న్యాయమూర్తి (సీజే)జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో పేదలకు శాశ్వత గృహ కల్పన లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుత కేసే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని కోర్టుకు నివేదించారు. వీరి లక్ష్యమంతా ప్రభుత్వాన్ని ఎలాగైనా ప్రజలకు దగ్గర కాకుండా చేయడమేనన్నారు. న్యాయస్థానాలను మభ్యపెట్టే యత్నాలు.. ►ప్రకాశం జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సంబంధించి మక్కెన తిరుపతిస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన కుమారుడు మక్కెన శ్రీనివాసులు పిల్ దాఖలు చేశారు. తిరుపతిస్వామి పిటిషన్లో తన వయసును 50 సంవత్సరాలుగా పేర్కొంటే శ్రీనివాసులు తన వయసును 51 ఏళ్లుగా చూపారన్నారు. అంటే తండ్రి కంటే కుమారుడి వయసే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం 30 చట్టాలను ఉల్లంఘించిందని పిల్లో పేర్కొన్న పిటిషనర్, ఎలా ఉల్లంఘించిందో మాత్రం ఎక్కడా చెప్పలేదు. ►ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించిందంటూ రకరకాల ఆరోపణలుతో నాలుగు ముక్కలు రాసేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో పిటిషన్లు వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడిందో ఒక్క ముక్క కూడా చెప్పడం లేదు. ►ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఏకైక ఎజెండా, జెండాతోనే వీరంతా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి అసంతృప్త, అరాచక శక్తులను ఆదిలోనే అణచివేయాలి. లేనిపక్షంలో న్యాయవ్యవస్థకు పెనుముప్పుగా మారతారు. ►దీనిపై అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. ముందు జీతభత్యాలు నిర్ణయించండి తర్వాత పోస్టులు నోటిఫై చేయండి వినియోగదారుల కమిషన్ పోస్టుల భర్తీపై హైకోర్టు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్ట నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ చైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ముందు చైర్మన్, సభ్యుల జీతభత్యాలను నిర్ణయించి, అనంతరం పోస్టులను నోటిఫై చేయాలని సూచించింది. ఆ తర్వాతే దరఖాస్తులను ఆహ్వానించి, అంతిమంగా వాటిని సెలక్షన్ కమిటీ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నెల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. వినియోగదారుల ఫోరంలలో పై పోస్టుల భర్తీకి ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అజయ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పులను ప్రభుత్వం సంతోషంగా స్వీకరించ లేకపోతోంది హైకోర్టుకు రిజిస్ట్రార్ జనరల్ నివేదన హైకోర్టు ఇచ్చిన వ్యతిరేక తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా స్వీకరించలేకపోతోందని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్.భానుమతి హైకోర్టుకు నివేదించారు. హైకోర్టులో కోవిడ్‌ను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బీసీ సంఘం అధ్యక్షుడి హోదాలో వి.ఈశ్వరయ్య రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ మంత్రికి ఫిర్యాదులు చేశారని తెలిపారు. జస్టిస్ ఈశ్వరయ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్‌గా నియమించిందన్నారు. ఇప్పుడు హైకోర్టును రెడ్ జోన్‌గా ప్రకటించాలని కోరుతూ పిల్ దాఖలు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కూడా ఈశ్వరయ్య చేసిన ఆరోపణలనే తన పిటిషన్లో పేర్కొందని తెలిపారు. పిల్‌ను విచారణకు తీసుకోవాలా? వద్దా అన్న అంశంపై ఉత్తర్వులిస్తామని ధర్మాసనం వెల్లడించింది. -
పునరావాస కాలనీలకు పోలవరం నిర్వాసితులు
దేవీపట్నం: పోలవరం నిర్వాసితులకు పునరావాస కాలనీల్లో సిద్ధమైన ఇళ్లను అందచేసే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు), రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దేవీపట్నం మండలం ఇందుకూరు–2, పోతవరం–2 పునరావాస కాలనీలను ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. సకల సదుపాయాలతో కూడిన సొంత ఇళ్లను చూసి ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేశారు. గిరిజన నిర్వాసితులకు దేవీపట్నం మండలం పరిసర గ్రామాల్లో ఎనిమిది చోట్ల కాలనీలు నిర్మిస్తున్నారు. వాటిలో ప్రస్తుతం వెయ్యి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగా మరో వెయ్యి గృహాల నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. టీడీపీ హయాంలో పోలవరం పనులను ప్రణాళిక లేకుండా చేపట్టడం, కాఫర్ డ్యామ్‌లపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది గోదావరి వరద ముంపులో చిక్కుకుని గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కాలనీల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసింది. సమన్వయంతో వేగంగా కాలనీల నిర్మాణం: కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ► అతి తక్కువ సమయంలో అన్ని శాఖల సమన్వయంతో కాలనీల నిర్మాణం పూర్తి చేశామని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పోలవరం పరిపాలన అధికారిని కూడా నియమించిందన్నారు. ► పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులవుతున్న వారు త్యాగజీవులని, వారికి ఏ సమస్య రాకుండా పూర్తిస్థాయిలో పునరావాస ప్యాకేజీ, భూమికి భూమి అందజేస్తామని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో వరదల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ► ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి ఓ.ఆనంద్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. -
30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆస్తి రూ. 20000 కోట్లు
-
అక్క చెల్లెమ్మలకు ఆస్తి రూ. 20000 కోట్లు
‘ఆగస్టు 15న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. అప్పటికి కోర్టు కేసులు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో ఉన్నాం. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లుగానే అదే రోజు పేదలకు కూడా స్వాతంత్య్రం వస్తుందని భావిస్తున్నాం’ పేదలకు ఇళ్ల స్థలాలను డి–పట్టాల కింద, అసైన్డ్ కింద ఈ రోజైనా ఇవ్వొచ్చు. కానీ డి–పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్లు అవుతుంది. అనుకోకుండా కోర్టు కేసుల కారణంగా ఆలస్యం అయింది ‘రాష్ట్రంలో దాదాపు 1.5 కోట్ల ఇళ్లుంటే.. 20 శాతం అంటే దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం’ జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేద్దామనుకున్నాం. దీనిద్వారా ఎంతో మంది పేదల జీవితాలకు పెద్ద ఆధారం దొరుకుతుందని చాలా ఆశపడ్డాం. దురదృష్టవశాత్తూ కొంతమంది తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లారు. దీనివల్ల ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చింది. కోవిడ్ వల్ల కేసులు డిస్పోజ్ కాలేదు.మంచి కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాస్త ఆలస్యమైనా ధర్మం గెలుస్తుంది. మనం మంచి ఆలోచనతో చేస్తున్నాం. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాం – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.20 వేల కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల స్థలాల పట్టాల రూపంలో జూలై 8న ఇవ్వడం ద్వారా ఎంతో మంది పేదల జీవితాలకు పెద్ద ఆధారం లభిస్తుందని చాలా ఆశ పడ్డామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తూ కొంతమంది తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లారని, దీనివల్ల ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చిందని కానీ కోవిడ్ వల్ల కేసులు డిస్పోజ్ కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పేదలందరికీ ఆగస్టు 15వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అప్పటికి కోర్టు కేసులు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందన్నారు. దాదాపు 40 రోజుల సమయం లభించినందున దీన్ని సద్వినియోగం చేసుకుని లేఅవుట్లలో మొక్కలు నాటడం, ఇళ్ల స్థలాల పట్టాల డాక్యుమెంట్లలో ఫొటోలు, ప్లాట్ల నెంబర్ల నమోదుతో పాటు సరిహద్దులు స్పష్టంగా పొందుపరచడం లాంటి కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలని కలెక్టర్లను సీఎం కోరారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పలు అంశాలపై జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచేలా చేయాలి.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా నేపథ్యంలో మరింత మెరుగ్గా ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఇది చరిత్రలో నిలిచిపోయే పని. ఫలానా ప్రభుత్వంలో, ఫలానా కలెక్టర్ ఉన్నప్పుడు మాకు మేలు జరిగిందని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు. దీన్ని ఇంకా ఎలా బాగా చేయాలన్నది ఆలోచించాలి. 62 వేల ఎకరాలు.. 20 వేల కోట్లు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 62 వేల ఎకరాలను సేకరించాం. ప్రైవేటు ల్యాండ్‌కు రూ.7,500 కోట్లు కాగా ప్రభుత్వం భూమి విలువ మరో రూ.7500 కోట్లు ఉంది. ఎన్ఆర్ఈజీఏ పనుల ద్వారా రూ.2 వేల కోట్లు, విశాఖపట్నం, సీఆర్డీఏ, టిడ్కో స్థలాల విలువ మరో రూ.2 వేల కోట్లు.. అలా దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ఆస్తులను 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతికి ఇస్తున్నాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు సగం ఇళ్ల నిర్మాణాన్ని తరువాత నెలలోనే మొదలు పెట్టాలని లక్ష్యంగా పని చేస్తున్నాం. అందుకు అనుమతులు కూడా తీసుకున్నాం. ఇంకా ఎవరికైనా అర్హత ఉండి కూడా ఇంటి స్థలం రాకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే రేషన్ కార్డు, పెన్షన్ కార్డు, 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మరోసారి గుర్తు చేస్తున్నా. నాకు ఓటు వేయకపోయినా సరే అర్హత ఉంటే వారికి ఇంటి స్థలం ఇవ్వాలి. ఒక్క బిల్లూ పెండింగ్‌లో ఉండకూడదు ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.5,500 కోట్లు ఇవ్వగా రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే అన్ని బిల్లులను అప్లోడ్ చేస్తే ఈ నెలలోనే పూర్తిగా చెల్లిస్తాం. ఇళ్ల స్థలాల పట్టాలిచ్చే నాటికి ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో లేకుండా ఉండాలి. భూసేకరణతో సహా ఏ పనికి సంబంధించిన బిల్లు కూడా పెండింగ్‌లో ఉండకూడదు. గత సర్కారు తీరు దారుణం టీడీపీ సర్కారు నిరుపేదలకు 6.2 లక్షల ఇళ్లు కడతామని చెప్పి కేవలం 3.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టింది. వాటికీ రూ.1,300 కోట్లు బకాయి పెట్టారు. ఇక పట్టణ గృహ నిర్మాణంలో మరీ దారుణంగా వ్యవహరించారు. 7 లక్షల ఇళ్లు అని చెప్పి కేవలం 3 లక్షల ఇళ్లను మాత్రమే ప్రారంభించి సగంలో ఆపారు. ఆ పనులకు సంబంధించి మరో రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టారు. సీఎంగా ఉన్నవారికి పేదలకు ఇళ్లు కట్టాలన్న తపన, తాపత్రయం ఉంటే ఇంత దారుణ పరిస్థితి ఉండేది కాదు. ఉపాధిలో 8 కోట్ల పనిదినాలు అభినందనీయం.. కరోనా సమయంలోనూ మే నెలలో దాదాపు 8 కోట్ల పనిదినాలు కల్పించిన కలెక్టర్లను ప్రశంసిస్తున్నా. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 43 లక్షల కుటుంబాలకు రూ.4,117 కోట్లు ఉపాధి హామీ లేబర్ కాంపొనెంట్ కింద ఇవ్వగలిగాం. మెటీరియల్ కాంపొనెంట్ విషయంలో కలెక్టర్లు దృష్టి పెట్టాలి. స్థలాలు గుర్తించి వేగంగా పనులు.. గ్రామ సచివాలయాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించి వెంటనే అప్రూవల్స్ ఇవ్వాలి. ఆగస్టు 31 నాటికి అన్ని గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలి. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ కోసం కూడా స్థలాల గుర్తింపు వేగంగా పూర్తి కావాలి. కరోనా పరీక్షల్లో రికార్డు కరోనా పరీక్షల్లో రాష్ట్రం రికార్డు సృష్టించింది. 10 లక్షలకు పైగా కోవిడ్ టెస్టులు చేశాం. అందుకు అధికారులు, కలెక్టర్లకు అభినందనలు. 85 శాతం కేసులు ఇంట్లోనే నయం అవుతున్నాయి. హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వాకబు చేయాలి. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ నాణ్యమైన సేవలందించాలి. కోవిడ్‌తో కలిసి బతకాల్సిన సమయం ఇది. వ్యాక్సిన్ కనుగొనే వరకు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కోవిడ్ లక్షణాలుంటే ఏం చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? అనే అంశాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేయడం వల్ల ప్రజలు వైద్యం చేయించుకోవడం సులభం అవుతుంది. వైద్య సాయం అందించే కాల్ సెంటర్లు, టెలి మెడిసిన్ నంబర్లు పక్కాగా పనిచేయాలి. ఆ యంత్రాంగం సరిగ్గా ఉందా? లేదా? అనేది తనిఖీ చేసి నిర్ధారించుకోవాలి. ఇసుక కొరతనే మాటే వినిపించకూడదు వర్షాలు బాగా కురుస్తున్నందున ఇసుక రీచ్‌ల్లోకి నీరు చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే వారం, పది రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో పెద్ద ఎత్తున ఇసుకను నిల్వ చేయాలి. కలెక్టర్లు చర్యలు చేపట్టి బ్యాక్లాగ్ క్లియర్ చేయటంతోపాటు స్టాక్ యార్డుల్లో పూర్తిగా నిల్వ చేయాలి. ఇసుక కొరత ఉందనే మాట ఎక్కడా వినిపించకూడదు. కలెక్టర్లు, జేసీలు ఏం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలియదు. ఎక్కడా ఇసుక కొరత రాకూడదు. ముఖ్యంగా ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఇసుక బ్యాక్ లాగ్‌ను వెంటనే క్లియర్ చేయాలి. -
పట్టాల సంబరం
-
పేదోడి ఇంటిపైనా అబద్ధాలేనా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే చంద్రబాబు, ఆయన ముఠా ఓర్వ లేక విష ప్రచారానికి దిగడం దారుణం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలనే కార్యక్రమం యజ్ఞంలా సాగుతోందన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున (జూలై 8) ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి సీఎం జగన్ చరిత్రకెక్కనున్నారన్నారు. ఆ తర్వాత ఆగస్టు 26న 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణాలు, భూ సేకరణపై హౌసింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అజయ్‌జైన్‌తో కలిసి శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే పెద్ద లక్ష్యాన్ని సీఎం జగన్ నిర్దేశించుకున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► ఒక రాజకీయ నాయకుడు ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉండాలో వైఎస్ జగన్ నిరూపించారు. కరోనా లాంటి విపత్కర సమయంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేశారు. ► చంద్రబాబు రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు, లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిపోయినా రాష్ట్రంలోని కోట్లాది మంది అకౌంట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నగదు జమ చేశారు. ► మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా 25 లక్షలకు బదులు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు జగన్ ఇవ్వబోతుంటే చంద్రబాబు, ఆయన బృందం, ఆయనకు వత్తాసు పలుకుతున్న మీడియా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ► 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యమా అని చాలా మంది మాట్లాడారు. కానీ ఇప్పటికే 26.77 లక్షల మందిని అర్హులుగా గుర్తించి గ్రామ సచివాలయాల్లో జాబితా ప్రదర్శించాం. మే నెలలో కొత్తగా వచ్చిన 6.08 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. వీటిలో సగానికిపైగా అర్హత ఉన్నాయనుకున్నా ఆ సంఖ్య 30 లక్షలకు దాటుతుంది. మీ హయాంలో కంటే తక్కువ ధరే.. ► ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే చంద్రబాబులా గృహ ప్రవేశాలు చేయాలని ఇక్కడ ఎవరూ అనుకోవడం లేదు. టిడ్కో వంటి సంస్థలకు రూ.3వేల కోట్లు, హౌసింగ్ కార్పొరేషన్‌కు రూ.1300 కోట్లు బకాయిలు పెట్టి పారిపోవాలనుకోవడం లేదు. వాటిని మేము తీరుస్తున్నాం. అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు. ► గతంలో చంద్రబాబు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు సేకరించిన భూమికి ఎకరానికి రూ.49.27 లక్షలు, 2018లో ధవళేశ్వరం వద్ద టిడ్కో కోసం 24 ఎకరాలను ఎకరం రూ.64 లక్షల చొప్పున కొన్నారు. కానీ ఈవేళ అదే ప్రాంతంలో మేము ఇచ్చింది ఎకరానికి రూ.45 లక్షలు మాత్రమే. ► ఇళ్ల స్థలాలకు డబ్బులు తీసుకుంటున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదు. పూర్తి పారదర్శకతతో జరుగుతున్న ప్రక్రియ ఇది. లాటరీ విధానంలో ఇళ్ల స్థలాలను కేటాయిస్తారు. ఎవరైనా డబ్బులు అడిగితే స్పందనలో లేదా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. అబద్ధాలు చెప్పడం వల్లే ఇవాళ చంద్రబాబు ఆ స్థానంలో ఉన్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని అజయ్ జైన్ చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, లబ్ధిదారులను జియో ట్యాగింగ్ చేస్తున్నామని చెప్పారు. ► సమావేశంలో ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, హౌసింగ్ ఎండీ జీఎస్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన లే అవుట్లు ► దేశంలో ఎక్కడా ఇంత పారదర్శకతతో ఏ పథకం అమలు కావడం లేదు. ఇంటి స్థలాన్ని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గజం రూ.25 వేలు, రూ.30 వేలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంటి స్థలాలు ఇస్తున్నారు. ► ఇళ్ల స్థలాల కోసం 42 వేల ఎకరాలను సమకూర్చాం. అవసరమైతే మరింత సేకరిస్తాం. రూ.6,500 కోట్లు కేటాయించి.. ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు వెచ్చించాం. లే అవుట్లు యుద్ధ ప్రాతిపదికన తయారవుతున్నాయి. -
అందమైన కాలనీలు.. పేదలకు ఆవాసాలు
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఒక కొత్త చరిత్ర ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో దాదాపు 20 శాతం కుటుంబాలకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సంబంధించిన కాలనీలు రూపుదిద్దుకుంటుండటం కనిపిస్తోంది. కాలనీల ఏర్పాటు గతంలోలా బలహీన వర్గాల గృహ సముదాయంలా ఉండదు. ఎలాంటి వసతుల్లేని అగ్గిపెట్టెల్లాంటి.. డబ్బాల్లాంటి ఇళ్లు కాదు. విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించారు. ఇల్లు లేదనే వారు ఉండకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. అర్హత ఉన్నప్పటికీ ఇంటి స్థలం రాలేదని ఎవరైనా అంటే.. ఏ విధంగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలో అందులో సూచించారు. వారి దరఖాస్తులు తీసుకుని అర్హత ఉంటే వెంటనే మంజూరు చేస్తున్నారు. ఇదంతా పారదర్శక పద్దతుల్లో, అవినీతికి తావు లేకుండా జరిగిపోయింది. ఇది ఒక చరిత్ర. ఏ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన దాఖలాల్లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం లే అవుట్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులలో అంతర్గత రహదారులతో సహా సిద్ధమైన ఇళ్ల లేఅవుట్ మౌలిక సదుపాయాలకు పెద్దపీట ► అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని మామూలుగా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రచారం చేసుకుంటుండటం మనం చూశాం. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రీతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని పరితపిస్తూచర్యలు తీసుకుంటోంది. ► ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఇల్లు లేని అర్హులందరికీ నివాస స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తున్న లే అవుట్లలో మౌలిక సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని, దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు తెల్ల కార్డే అర్హతగా ఎంపిక చేసిన సుమారు 30 లక్షల మందికి నివాస స్థలాలను విక్రయ దస్తావేజుల (కన్వేయన్స్ డీడ్ల) రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 30 అడుగుల రోడ్లు ► ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రూపొందిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీ(లేఅవుట్ల)ల్లో 30 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారులు నిర్మించనున్నారు. విశాలమైన రోడ్ల నిర్మాణానికి స్థలాలు వదిలేసి ప్లాట్లు వేస్తున్నారు. ► కొన్ని జిల్లాల్లో అక్కడి పరిస్థితులు, లేఅవుట్ పరిమాణాన్ని బట్టి 40 నుంచి 60 అడుగుల వెడల్పుతో ప్రధాన రోడ్ల నిర్మాణానికి వీలుగా లేఅవుట్లు ప్లాన్ చేశారు. విజయనగరం జిల్లాలో అతి పెద్ద లే అవుట్.. ► జిల్లా కేంద్రమైన విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామంలో 357.50 ఎకరాల్లో అతి పెద్ద లేఅవుట్ రూపొందిస్తున్నారు. ► ఇక్కడ పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు బజార్లు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందించడానికి లే అవుట్‌ను సిద్ధం చేస్తున్నారు. సామాజిక అవసరాల కోసం స్థలాలు ► అధిక విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న పెద్ద లేఅవుట్ల(కాలనీల)లో విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పార్కులు లాంటి మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఖాళీ స్థలాలు వదిలేసి ప్లాట్లు ప్లాన్ చేశారు. ► సామాజిక అవసరాలకు అవసరమైనంత మేరకు స్థలాలు వదిలేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏమి కావాలన్నా అక్కడే దొరికే విధంగా వీటిని ప్లాన్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పచ్చని తోటల మధ్య.. ► చాలా చోట్ల గ్రామాలకు, పట్టణాలకు ఆనుకొని పచ్చని తోటలు, చెట్లతో నిండిన కొండలు, పొలాల పక్కన జగనన్న కాలనీల కోసం స్థలాలు ఎంపిక చేశారు. ► దీంతో గృహ నిర్మాణం తర్వాత అక్కడ నివసించే వారికి స్వచ్ఛమైన గాలి అందనుంది. పచ్చదనంతో వాతావరణం కూడా చల్లగా ఉండనుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండ్ల తోటలు, పచ్చని పొలాల పక్కన లే అవుట్లు చూడ ముచ్చటగా రూపు దిద్దుకుంటున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి కాలనీలకు అవసరమైన తాగునీరు, విద్యుత్తు సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించనుంది. నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు... ► దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వచ్చే నెల 8వ తేదీన 29 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ► ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తమ ఉద్దేశం కాదని, వచ్చే నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇల్లు లేని కుటుంబం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. అందువల్ల నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాలకు ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. ఒకే నమూనాలో ఇళ్లు ► పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత నిర్మించే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీ అని పేరు పెట్టనున్నారు. ఈ కాలనీల్లో ఇళ్లన్నీ ఒకే నమూనాలో నిర్మిస్తారు. ప్రతి ప్లాటుకు నంబర్ ఉంటుంది. ► బెడ్రూమ్, పెద్ద హాలు, కిచెన్, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ప్రతి లబ్ధిదారునికీ ఇల్లు నిర్మించేలా ప్లాన్ రూపొందించారు. ► ప్రతి కాలనీలో డ్రైనేజి, తాగునీటి పైపులైను, విద్యుత్తు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ► తూర్పు గోదావరి జిల్లా 3,65,224 మంది లబ్ధిదారులతో ప్రథమ స్థానంలో ఉంది. కొత్తగా వచ్చిన అర్జీలను పరిశీలించి అర్హులను ఎంపిక చేశాక ఈ సంఖ్య మరింత పెరగనుంది. ధరలు ఎక్కువగా ఉన్నందున భూసేకరణ వ్యయం కూడా ఇక్కడ ఎక్కువే. వైఎస్సార్ జిల్లాలో 7,284 ప్లాట్లతో ఒకే కాలనీ ► వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని 7,284 మందికి నివాస స్థలాలు ఇచ్చేందుకు లేఅవుట్ సిద్ధమవుతోంది. ► ఇక్కడ 257.53 ఎకరాల్లో గృహాలు నిర్మించేందుకు రోడ్లు, పార్కులు, వాణిజ్య సముదాయం, సామాజిక అవసరాలు, మౌలిక సదుపాయాల కోసం స్థలాల్ని కేటాయించి మాస్టర్ ప్లాన్ తరహాలో జిల్లా అధికారులు ప్లాట్లు వేస్తున్నారు. ► ఈ కాలనీ ప్రధాన రహదారి (30 మీటర్ల) 98.42 అడుగుల వెడల్పుతో ప్లాన్ చేశారు. కాలనీలో కొన్ని రోడ్లను 65.61 అడుగులు, మరికొన్ని రహదారులను 39.37 అడుగులు, కొన్ని అంతర్గత రహదారులను 30 అడుగుల వెడల్పుతో ప్లాన్ చేశారు. ► కాలనీలో మొత్తం 33, 390 మీటర్ల పొడవున రహదారులు ప్లాన్ చేశారు. 99 % భూసేకరణ పూర్తి ► గత నెల 25 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 26,77,778 మందిని ఇళ్ల స్థల పట్టాల పంపిణీకి అర్హులుగా ఎంపిక చేశారు. వలస వెళ్లడం, ఇతర కారణాలవల్ల ఎవరి పేరైనా లబ్ధిదారుల జాబితాలో లేకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 5వ తేదీ వరకూ ప్రభుత్వం తిరిగి గడువు ఇచ్చింది. ► వీరి అర్జీలను పరిశీలించి రెండు మూడు రోజుల్లో వీరిలో అర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చే కసరత్తు గ్రామ, వార్డు సచివాలయాల్లో సాగుతోంది. మొత్తంగా దాదాపు 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ► ఇళ్ల స్థల పట్టాల పంపిణీ కోసం 45,848.57 ఎకరాలు అవసరమని అధికారులు లెక్క కట్టారు. సంఖ్య పెరిగితే ఇది పెరిగే అవకాశం ఉంది. ఇందులో 26,366.57 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. మిగిలిన 19,482 ఎకరాల ప్రయివేటు భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే 99 శాతం భూసేకరణ పూర్తయింది. ఇందులో 3,816 ఎకరాలను విశాఖపట్నంలో భూ సమీకరణ కింద తీసుకున్నారు. సకల సౌకర్యాలతో వైఎస్సార్ జగనన్న కాలనీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ఇవ్వాలనే ఉద్దేశంతో విస్తృత ప్రచారం కల్పించి మరోమారు దరఖాస్తులు సేకరించాం. వీరిలో అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తాం. కొత్తగా ఎంపికయ్యే వారి కోసం అదనపు భూమి సేకరణ, ఫ్లాటింగ్ కార్యక్రమాలు ఈ నెలాఖరుకు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. – హరికిరణ్, కలెక్టర్, వైఎస్సార్ జిల్లా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు ఇల్లులేని దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చేలా ఇప్పటికే 2.50 లక్షల మంది అర్హులను ఎంపిక చేశాం. సీఎం ఆదేశాల మేరకు మరోసారి దరఖాస్తులు ఆహ్వానించగా విశాఖ జిల్లాలో 50 వేల అర్జీలు వచ్చాయి. వీరిలో అర్హులందరినీ లబ్ధిదారులుగా చేర్చే కసరత్తు చేస్తున్నాం. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజి లాంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఈ మేరకు స్థలాలు వదిలేసి లే అవుట్లు వేశాం. లాటరీ ద్వారా పారదర్శకంగా ప్లాట్లు కేటాయిస్తున్నాం. – వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్, విశాఖ జిల్లా అప్పట్లో చెప్పులరిగేలా తిరిగినా రాలేదు ఇళ్ల స్థలాల పంపిణీతో జగనన్న మాబోటి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మాబోటి పేదలు ఎన్నో ఏళ్లుగా ఇంటి స్థలం కోసం అర్జీలు ఇచ్చి అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా స్థలం రాలేదు. ఇప్పుడు జగనన్న అందరికీ ఇస్తుంటే చంద్రబాబు చూడలేక అసూయతో ఏదేదో మాట్లాడుతున్నారు. మా జిల్లాలో ఇళ్ల స్థలాలు రాకుండా చేయడం కోసం కొందరిని కోర్టుకు పంపించారు. – దొడ్డి వీర దుర్గ, వాకతిప్ప, తూర్పుగోదావరి జిల్లా జగన్‌ను ఎవరూ మరువరు అనేక సంక్షేమ పథకాల ద్వారా మాలాంటి పేదలను ఆదుకోవడమే కాకుండా సొంతింటి కల నెరవేర్చుతున్న జగన్ బాబును ఎన్నటికీ మరువబోం. ఆ బాబు దయతో సొంత గూడు వస్తుందన్న ధీమా ఉంది. – పైలా దేవి, కె.వెంకటాపురం, విశాఖపట్నం నాడు 25 లక్షలు.. నేడు 30 లక్షలు.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు గృహాలు కట్టించే విషయంలో ప్రభుత్వ లక్ష్యం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. తొలుత 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం జగన్ తొలి కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. ఆ తర్వాత ఆ సంఖ్య 26 లక్షలు, 27 లక్షలకు పెరిగింది. తాజాగా 30 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ తర్వాత బెడ్రూమ్, హాలు, కిచెన్, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ప్రతి లబ్ధిదారునికీ ఇల్లు నిర్మించేలా ప్లాన్ రూపొందించారు. కలలో కూడా ఊహించలేదు ఒకేసారి అన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. పేదల కలలను జగనన్న సాకారం చేస్తుంటే చూడలేక తెలుగుదేశం వారు అసత్యాలతో అవాకులు, చెవాకులు పేలుతున్నారు. పేదలకు ఇంటి స్థలం, ఇల్లు రాకుండా చేయాలని చూస్తే చంద్రబాబుకు మాలాంటి లక్షలాది మంది ఉసురు తప్పకుండా తగులుతుంది. ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకోవాలి. – కింతల అమ్మాయమ్మ, చినమిల్లిపాడు, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా -
రూపాయి కూడా అప్పు లేకుండా ఇల్లు..
-
పేదల ఇళ్లకు తీపి కబురు
పేదల ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పేదవాడిపై ఒక్క రూపాయి కూడా అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాలి. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో పనులు కొనసాగాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేద వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో శుభవార్త వినిపించారు. గత సర్కారు పేదలకు పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల 3,38,144 మంది ఇళ్ల లబ్ధిదారులకు రూ.1,323 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. గత ప్రభుత్వం బకాయిలు పెట్టినా పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొరపాట్లకు తావివ్వకుండా నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్మాణాలు నాసిరకంగా ఉంటాయనే అభిప్రాయం తొలగిపోవాలన్నారు. పేదల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో పూర్తి చేస్తే పుణ్యం దక్కుతుందని, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై సీఎం జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల సంఖ్యను పెంచాలి... దివంగత వైఎస్సార్ జయంతి రోజైన జూలై 8వతేదీన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమంపై సమీక్షించారు.భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. కేటాయించిన స్థలం వద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. – తొలి విడతలో చేపట్టబోయే 15 లక్షల నిర్మాణాలపై సీఎం సమీక్షించారు. విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇళ్ల సంఖ్యను పెంచాలని సీఎం ఆదేశించారు. రూపాయి కూడా అప్పు లేకుండా ఇల్లు.. – పేదలకు నిర్మించబోయే ఇళ్లలో కల్పించే సదుపాయాలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. డిజైన్‌లో భాగంగా పడక గది, వంట గది, లివింగ్ రూం, మరుగుదొడ్డి, వరండా సహా సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. – పేదల ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. పేదవాడిపై ఒక్క రూపాయి కూడా అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాలన్నారు. పేదలకు గృహ వసతి కల్పించాలనే సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో పనులు కొనసాగాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి.. – చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రభుత్వం నాణ్యతతో పనులు చేస్తుందనే పేరు రావాలని సీఎం పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పాటయ్యే కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. – సమీక్షలో గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ తీరుపై భగ్గుమన్న గిలకలదిండి పేదలు
మచిలీపట్నం: పేదల ఇళ్ల స్థలాలు కోసం ఎంపిక చేసిన భూమిపై టీడీపీ నాయకులు తప్పుడు కేసులు వేసి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మచిలీపట్నం గిలకలదిండి గ్రామస్తులు మంగళవారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళవారం సంబంధిత భూమిలో స్థానిక పేదలు పిల్లాపాపలతో కలిసి బైఠాయించారు. వివరాల్లోకి వెళితే.. ► మచిలీపట్నం శివారు గిలకలదిండి గ్రామానికి ఆనుకుని ఉన్న 40 ఎకరాల్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. లోతట్టుగా ఉన్న ఆ స్థలాన్ని ఎత్తు చేసే పనులు కొనసాగుతున్నాయి. ► గిలకలదిండికి చెందిన సుమారు 1,100 కుటుంబాలకు ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే జాబితా సిద్ధమైంది. తాజాగా ప్లాట్లుగా విభజించే పనులు జరుగుతున్నాయి. ► అయితే, ఆ భూమిలో మడ అడవులున్నాయని, దీనివల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు కోర్టును ఆశ్రయించి.. ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే తెచ్చినట్లు తెలుసుకున్న గ్రామస్తులు కోపోద్రిక్తులై ఆందోళనకు దిగారు. ► నిరుపేదలకు స్థలాలు రాకుండా అడ్డుపుల్ల వేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ► అధికారంలో ఉన్నంత కాలం తమను పట్టించుకోని రవీంద్ర ఇప్పుడు ప్రభుత్వ పథకాలేవీ అందకుండా కుట్రలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. ► సమాచారం అందుకున్న తహసీల్దార్ సునీల్‌బాబు రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ► అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, పేదలకు తప్పకుండా న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపచేశారు. ► ఆ భూమి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించే నిమిత్తం డ్రోన్ కెమేరాతో ఆ ప్రాంతాన్ని వీడియో తీయించారు. ► గిలకలదిండి వద్ద ఎంపిక చేసిన భూమి ప్రభుత్వానికి చెందినదని, వాటిపై స్టే ఇచ్చినట్లుగా న్యాయస్థానం నుంచి తమకెలాంటి పత్రాలు అందలేదని తహసీల్దార్ సునీల్‌బాబు మీడియాకు తెలిపారు. -
పేదల ఇళ్లకు సైంధవుడతడు
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి తెలుగుదేశం పార్టీ మోకాలడ్డుతోంది. వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేసిన ప్రభుత్వ రెవెన్యూ భూమిని.. ‘మడ’ అడవులు అంటూ రాజకీయం చేస్తోంది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు గజం జాగా కూడా ఇవ్వలేకపోయిన చంద్రబాబు.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందని ట్విట్టర్ వేదికగా చిచ్చు రగిల్చారు. దీని ఆధారంగా తన వాళ్లతో కోర్టులో కేసు వేయించి కథ నడుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరం దుమ్ములపేట సమీపాన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎర్రగ్రావెల్తో చదును చేసిన 116 ఎకరాల ప్రభుత్వ భూమిపై చంద్రబాబు, టీడీపీ నేతలు లేని వివాదాన్ని లేవనెత్తడం పట్ల పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన 4,650 మంది నిరుపేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ లబ్ధిదారుల్లో 80 శాతం మంది ఎస్సీ, బీసీ వర్గాల వారే ఉన్నారు. మహిళల పేరున పట్టాలు ఇవ్వడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఒకే సారి ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తే ప్రభుత్వానికి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కుట్రకు తెరతీశారు. మడ అడవులను నరికి ఇళ్ల స్థలాల కోసం చదును చేసి పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నారని, దీంతో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని, తుపాను ముప్పు ఉంంటుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా రచ్చకు బీజం వేశారు. ఆ పార్టీకి చెందిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అనుచరుడైన టీడీపీ మాజీ కార్పొరేటర్ భర్త తుమ్మల రమేష్‌తో హైకోర్టులో కేసు వేయించి ఇళ్ల స్థలాల పంపిణీకి మోకాలడ్డారు. పైగా ఆ కేసును టీడీపీకి చెందిన మాజీ మంత్రి సమీప బంధువే వాదిస్తుండడం గమనార్హం. ఆ అడవులతో సంబంధం లేదు.. ► చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టు ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన 116 ఎకరాల భూమికి, మడ అడవులకు అసలు సంబంధమే లేదు. కోరంగి మడ అడవులు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ► ఈ 116 ఎకరాల భూమికి, కోరంగి మడ అడవులకు మధ్య సుమారు 10 కిలోమీటర్లు పైగా దూరం ఉంటుంది. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటం వల్ల ఈ భూముల్లో పెరిగిన చిన్నచిన్న మొక్కలను చూపి చంద్రబాబు అండ్ కో మడ అడవులంటూ యాగీ చేస్తోంది. ► పెద్ద, పెద్ద తుపాన్లు వచ్చినప్పుడు సైతం కాకినాడకు 6 నాటికల్ మైళ్ల దూరాన సముద్రం మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ హోప్ ఐలాండ్ కాకినాడకు రక్షణ కవచమనే వాస్తవాన్ని వ్యూహాత్మకంగా విస్మరించారు. ► ఎలాంటి జల వనరులు లేని ఖాళీ భూమి వల్ల ఏకంగా 54 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని చంద్రబాబు ట్వీట్ చేయడం తగదని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఆ భూములు ముమ్మాటికీ ప్రభుత్వానివే కాకినాడలోని ప్రభుత్వ భూమిని పోర్టు విస్తరణ కోసం 1978లో ఇచ్చారు. అందులో చాలా ఏళ్లుగా 116 ఎకరాలు ఖాళీగా ఉండడాన్ని గుర్తించాం. కాకినాడ స్మార్ట్ సిటీలో ఇళ్ల స్థలాల కోసం నిరుపేదల నుంచి సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చాయి. తొలి దశలో సుమారు ఐదు వేల మంది అర్హులకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించాం. పక్కాగా రెవెన్యూ భూములనే విషయం నిర్ధారించుకుని.. పోర్టు, అటవీ, మత్స్యశాఖలను సంప్రదించాకే చదును చేయించాం. ఈ భూములను మడ అడవులుగా గతంలో ఎప్పుడూ నోటిఫై చేయలేదు. – డి మురళీధర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ టీడీపీ కుతంత్రాలను ప్రజల్లోకి తీసుకువెళతాం పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి లక్ష్యానికి టీడీపీ అడ్డుపడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా కేంద్రంలో దశల వారీగా 30 వేల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే ఇలా అడ్డుపడడం దారుణం. వాస్తవాలను ప్రజలకు తెలియచేస్తాం. ఎన్ని అవరోధాలు సృష్టించినా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ స్థలాలు పంపిణీ చేస్తాం. – ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, కాకినాడ సిటీ. పేదల స్థలాలకు అడ్డుపడుతున్నారు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు సూచన మేరకు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇతర తెలుగుదేశం నాయకులు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో అనేక కంపెనీలకు ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టి పేదలకు గజం జాగా కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. – వాసుపల్లి కృష్ణ, మత్స్యకార నాయకుడు, కాకినాడ నాడు 70 ఎకరాలు ఎలా కేటాయించారు? ► 2018లో సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ప్రభుత్వ భూములకు సమీపాన 70 ఎకరాలు కాంకర్ (కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కంపెనీకి ఎలా కేటాయించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వివాదం సృష్టిస్తోన్న 116 ఎకరాల భూమికి సమీపాన 53 ఎకరాల్లో సుమారు 1,100 ఇళ్లను టిడ్కో ద్వారా గత సర్కార్ నిర్మించినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? ఇదీ వాస్తవం.. ► కోరంగి పరిసర ప్రాంతాల్లో 86 వేల ఎకరాల్లో అభయారణ్యం విస్తరించి ఉంది. ప్రస్తుతం పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన 116 ఎకరాలు (సర్వే నంబర్లు 376/పి1, 374/పి1, 387, 1985/పి, 1990, 2004/పి) ఏ ప్రభుత్వ రికార్డుల్లో అభయారణ్యంగా నమోదు కాలేదు. ఇదే విషయాన్ని ఓడరేవులు, అటవీ, గుడా (గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), మత్స్యశాఖలు స్పష్టం చేస్తున్నాయి. -
జూలై 8న 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు
ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తులు నాకు వచ్చాయి. నేను గ్రామాల్లోకి వెళ్లి.. ఇంటి పట్టా ఎవరికైనా లేదా? అని అడిగితే.. ‘లేదు’ అని ఎవ్వరూ అనకూడదు. అర్హత ఉన్న వారెవ్వరూ కూడా ఇంటి స్థలం పట్టా లేదని చెప్పకూడదు. మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో.. దేశంలోనే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇంతటి భారీ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. జిల్లా, మండల వ్యవసాయ సలహా మండళ్లు ఇచ్చే సూచనలపై రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) రైతులకు అవగాహన కలిగించి, అవి ఆచరణలో పెట్టేలా చర్యలు చేపడతాయి. కలెక్టర్లు ప్రతి రోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యవసాయం మీద సమీక్ష చేయాలి. మనిషికి గుండె ఎలానో.. వ్యవసాయ రంగానికి ఆర్బీకేలు కూడా అలానే పని చేయాలి. రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ముగ్గురు జేసీలను నియమిస్తున్నాం. ఇందులో ఒకరికి పూర్తిగా వ్యవసాయం బాధ్యతలు అప్పగిస్తాం. నాడు–నేడు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా గ్రామాల రూపు రేఖలు మారుస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కలెక్టర్లు తమవిగా భావించి విజయవంతం చేయాలి. అప్పుడే గ్రామాలపై మన సంతకం స్పష్టంగా కనిపిస్తుంది. తుపాను మనకు ఉండకపోవచ్చని ఐఎండీ చెబుతోంది. ఇది మంచి విషయం. కాకపోతే అకాల వర్షాలు ఉండొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. సాక్షి, అమరావతి: పేదలందరికీ జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అర్హులైన 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఎవరు మిగిలిపోయినా మళ్లీ అవకాశం కల్పించాలన్నారు. మరో 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం, తాగు నీరు, నాడు–నేడు కింద కార్యక్రమాలు, గృహ నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఉపాధి హామీ కార్యక్రమాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మే 30న రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ప్రారంభం ► ఈలోగా జిల్లా, మండల స్థాయి వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పడాలి ► నేడు మత్స్యకార భరోసా.. 15న రైతు భరోసా ► వ్యవసాయానికి ప్రత్యేకంగా ఒక జేసీ గ్రామాల రూపురేఖలు మార్చే కార్యక్రమాలన్నింటినీ కలెక్టర్లు తమవిగా భావించాలి రైతు భరోసా కేంద్రాలు ► ఈనెల 30న రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ప్రారంభం అవుతాయి. ఈ లోగా మండల, జిల్లాస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు ఏర్పాటు కావాలి. ఏ గ్రామంలో ఏ పంట వేయాలి? ఏ పంట వేస్తే మంచి రేటు వస్తుంది? అన్న విషయాలపై ఈ బోర్డులు సలహాలిస్తాయి. ► రెండు మూడు రోజుల్లో మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టులు వస్తాయి. గ్రామ సచివాలయాల్లో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇచ్చే సమాచారం.. కలెక్టర్లకూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాదిరిగా వస్తుంది. ప్రతి రోజూ వాళ్లు రిపోర్టులు అప్లోడ్ చేయాలి. ఆ రోజూ ఏమీ లేకపోయినా.. అప్పుడు ఉన్న యథాతథ పరిస్థితిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ► కనీస గిట్టుబాటు ధర కంటే తక్కువ రేట్లు వస్తుంటే.. గ్రామ స్థాయిలోకి వెళ్లి మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఆర్బీకేలు.. విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగు మందుల సరఫరా.. తదితర బాధ్యతలు కూడా తీసుకుంటాయి. ఆర్బీకేలను ముందుండి నడిపించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. ► మరో ఏడాదిలోగా జనతా బజార్లు వస్తాయి. మూడింట ఒక వంతు పంటను ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం కింద కొనుగోలు చేస్తుంది. ఆర్బీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కలెక్టర్లు కల్పించాలి. నేడు మత్స్యకార భరోసా ► మే 6వ తేదీన మత్స్యకార భరోసా కింద సాయం అందిస్తాం. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. ఎవరి పేరైనా అందులో లేకపోతే.. ఎన్రోల్మెంట్ ఎలా చేయించుకోవాలన్న దానిపై సమాచారం కూడా పెట్టాం. ► రేపు ఎవ్వరూ నా పేరు లేదు.. ఎలా అప్లై చేయాలో తెలియడం లేదు.. అన్న మాట రాకూడదు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. పథకాల అమలులో వివక్షకు తావు లేదు. మనకు ఓటు వేయని వారికి కూడా అన్నీ ఇస్తున్నాం 15న వైఎస్సార్ రైతు భరోసా ► ఇచ్చిన మాట మేరకు ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతులకు పెట్టుబడి సాయం కింద మే 15వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా ఇస్తున్నాం. 46,69,000 మంది లబ్ధిదారులకు గత ఏడాది మొత్తం రూ.6,534 కోట్లు.. ఒక్కో రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున ఇచ్చాం. ► ఇప్పటికే రూ.2 వేల చొప్పున ఈ పథకంలో ఇవ్వగా.. మే 15న రూ.5,500 చొప్పున ఇస్తున్నాం. బ్యాంకులు తమ అప్పు కింద జమ చేసుకోలేని విధంగా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో వేస్తున్నాం. ► రెండో విడత రూ.4 వేలు అక్టోబర్‌లో, మూడో విడత జనవరిలో సంక్రాంతి సందర్భంగా రూ.2 వేల చొప్పున ఇస్తున్నాం. ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను 2 నెలల్లో ఇస్తామని చెప్పాం. ఈ నెల 22న మొదటి విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. వీటిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. రైతులకు క్రెడిట్, డెబిట్ కార్డులు ► వచ్చే అక్టోబర్ నాటికి రైతులకు డెబిట్ కార్డులు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులు వీటి ద్వారా డబ్బు తీసుకోవచ్చు.. లేదా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుక్కోవచ్చు. ► దీంతోపాటు రైతులకు క్రెడిట్ కార్డులు కూడా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. రైతు పంట వేసిన తర్వాత పంట రుణం రాలేదు అన్న మాట వినకూడదని ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తోంది. ► ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇ– క్రాపింగ్ చేస్తారు. దీని ఆధారంగా రైతులకు బ్యాంకులు కచ్చితంగా రుణాలు ఇవ్వాలి. ఆ రుణం మీద వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద జీరో వడ్డీ వర్తిస్తుంది. ► పంట రుణాలు రావడమే కాదు.. ఆ రుణాలకు సున్నా వడ్డీ కూడా వర్తింప చేయడం ఈ క్రెడిట్ కార్డుల ఉద్దేశం. గత ప్రభుత్వం హయాంలో సున్నా వడ్డీ పథకం లేదు. మనం దీన్ని అమల్లోకి తీసుకు వస్తున్నాం. రెవెన్యూ వ్యవస్థలో మార్పు ► ప్రతి జిల్లాకు ముగ్గురు జేసీలను పెడుతూ ఉత్తర్వులు ఇవ్వబోతున్నాం. ఎవరెవరు ఏం చేయాలన్న దానిపై విధి విధానాలు కూడా పొందుపరుస్తున్నాం. ఒక జేసీకి పూర్తిగా వ్యవసాయం బాధ్యతలు అప్పగిస్తాం. ► నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ఆసుపత్రులు, స్కూళ్ల అభివృద్ధి పనులు చురుగ్గా సాగేలా వీరికి బాధ్యతలు అప్పగిస్తాం. గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాల్లో నిర్దేశించిన సమయంలోగా ఫలానా సర్వీసులు అందిస్తామని మనం చెప్పాం. ఆ నిర్ణీత కాలంలోగా ఆ సర్వీసులు అందాలి. కచ్చితంగా అది జరుగుతుందా.. లేదా.. అన్నది నేను పర్యవేక్షిస్తాను. దరఖాస్తు చేసినా రాలేదన్న మాట వినిపించకుండా చూసుకునే బాధ్యత కలెక్టర్లదే. అర్హత ఉంటే ఇంటి స్థలం పట్టా ఇవ్వాల్సిందే ► అర్హత ఉన్నవారందరికీ ఇంటి స్థలం పట్టా ఇవ్వాలి. కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే చేద్దాం. ఎవరూ కూడా తమకు అన్యాయం జరిగిందనే మాట అనకూడదు. అర్హత ఉండీ కూడా ఇవ్వలేదనే మాట రాకూడదు. నాకు ఓటు వేయని వారికైనా సరే ఇవ్వాల్సిందే. ఈ లోగా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేయాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించాలి. అర్హతల వివరాలు కూడా పెట్టాలి. అందులో పేరు లేకపోతే ఎవరికి దరఖాస్తు చేయాలో కూడా వివరాలు ఉంచాలి. మే 6 నుంచి 21 వరకు సోషల్ ఆడిట్ కోసం జాబితాలు ప్రదర్శించాలి. అ తర్వాత మరో 15 రోజులు వెరిఫికేషన్.. తర్వాత తుది జాబితా ఖరారు కోసం జూన్ 7లోగా తుది జాబితాను ప్రదర్శించాలి. తాగునీరు ► వేసవి నేపథ్యంలో తాగునీటికి సమస్యలు రాకుండా చూసుకోవాలి. నీళ్లకు ఇబ్బందులున్న మున్సిపాల్టీలు, ఇతర ప్రాంతాలపై వెంటనే కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ► అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎక్కడికక్కడ తగిన చర్యలు తీసుకోవాలి. ► వీలైన చోట బోర్లు, లేదంటే.. ట్యాంకర్ల ద్వారా విస్తారంగా నీటిని అందించాలి. దీనిపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి. విలేజ్ క్లినిక్స్ ► విలేజ్ క్లినిక్స్ చాలా ముఖ్యం. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పరుచుకోవడం ద్వారా మాత్రమే కరోనా లాంటి విపత్తులను అడ్డుకోగలం. ► ఆ మేరకు చర్యలు తీసుకున్నప్పుడు 90 శాతం సమస్యలు తీరిపోతాయి. ఇందులో విలేజ్ క్లినిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. గ్రామాల రూపురేఖలు మార్పు ► ఒక గ్రామంలోకి మనం అడుగు పెట్టినప్పుడు నాడు–నేడు ద్వారా అభివృద్ధి చెందిన స్కూళ్లు.. నాలుగు అడుగులు వేస్తే నిరంతరం ఏఎన్ఎం ఉన్న విలేజ్ క్లినిక్స్, మరో నాలుగు అడుగులు వేస్తే రైతు భరోసా కేంద్రం, ఇంకో నాలుగు అడుగులు వేస్తే జనతా బజార్, గ్రామ సచివాలయం కనిపించాలి. ఇవన్నీ కూడా గ్రామం రూపురేఖలను మారుస్తాయి. ► విలేజ్ క్లినిక్స్‌కు సంబంధించి 5 వేల పైచిలుకు స్థలాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. అర్బన్ ప్రాంతాల్లో కూడా మ్యాపింగ్ చేయాల్సి ఉంది. ► ఆర్బీకేల్లో కట్టాల్సిన 6,982 నిర్మాణాలకు గాను 3,000 స్థలాలను గుర్తించాలి. ఇవన్నీ మార్చి 2021 నాటికి పూర్తి కావాలి. మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యమైన కార్యక్రమం. ► నాడు– నేడు కింద 15 వేలకు పైగా స్కూళ్లలో చేపట్టిన పనులు జూలై ఆఖరుకల్లా పూర్తి కావాలి. విలేజ్ క్లినిక్స్, స్కూళ్లలో నాడు–నేడు, ఆర్బీకేలపై ప్రతిరోజూ కలెక్టర్లు సమీక్ష చేయాలి. ► ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యుడు వీపీఆర్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధి హామీలో పని దినాలను ఇంకా పెంచాలి. కోవిడ్ –19 కారణంగా ఇప్పటి వరకు తక్కువగా ఉండొచ్చు. వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో పని దినాలను ఎక్కువగా కల్పించాలి. -
బీపీఎల్ కుటుంబాలకే ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల స్థలాల పంపిణీకి దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలనే అర్హులుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రాష్ట్రంలో ఇళ్లు లేనివారందరికీ సంతృప్త స్థాయిలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి దశలవారీగా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే.. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు లబ్ధిదారుల ఎంపికతోపాటు కొన్ని నిబంధనలను మార్చాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ఆగకుండా కొనసాగించడంలో భాగంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం నిబంధనలను ప్రభుత్వం స్వల్పంగా సవరించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసినందున కొత్త నిబంధనల ప్రాతిపదికగా వారి జాబితాను పునఃపరిశీలించి.. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలనే ఎంపిక చేసి జాబితాను సవరించనున్నారు. అనంతరం సవరించిన జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మార్చిన నిబంధనలతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉషారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నివాస స్థలం పట్టా ధర రూపాయే.. ► పేదలకు ఇచ్చే స్థలం పట్టా ధరను రూపాయిగా నిర్ణయించారు. కన్వేయన్స్ డీడ్ రూపంలో ఇవ్వదలిచినందున స్టాంప్ పేపర్‌కు రూ.10, లామినేషన్‌కు రూ.10 కలిపి రూ.21గా ఖరారు చేశారు. ► కొత్త నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలను విక్రయించడానికి వీలుకాదు. ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఐదేళ్లు నివాసం ఉన్న తర్వాత అత్యవసరమైతేనే వేరే వారికి విక్రయించవచ్చు. ► పేదల పట్టాలను కన్వేయన్స్ డీడ్ రూపంలో ఇవ్వనుంది. డూప్లికేషన్ లేకుండా చేయడం, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చేయడం కోసమే ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. -
ఉగాది రోజు ఇళ్ల పట్టాలు
సాక్షి, అమరావతి: ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంక్షలు తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవరోధం తొలగిపోయింది. ఈ నేపథ్యంలో ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో 26 లక్షల మందికి నివాస స్థల పట్టాలను కన్వేయన్స్ డీడ్స్ (విక్రయ దస్తావేజుల) రూపంలో ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సంక్షేమం ఇక చకచకా.. నిధులు విడుదల - ఇళ్ల స్థలాల కోసం భూమి ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపు, ప్లాట్ల అభివృద్ధి కోసం రెవెన్యూ శాఖ తాజాగా బుధవారం రూ.1,400 కోట్లు విడుదల చేసింది. - రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పేరుతో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి జీఓ జారీ చేశారు. - ఈ నిధుల్లో కృష్ణాకు రూ.450 కోట్లు, గుంటూరుకు రూ.450 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాకు రూ.200 కోట్లు, పశ్చిమ గోదావరికి రూ.300 కోట్లు చొప్పున కేటాయించారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి దాకా ప్రభుత్వం రూ.5000 కోట్లు విడుదల చేసింది. - త్వరితగతిన ఫ్లాటింగ్, పట్టాలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులు జిల్లాల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. -
ఉగాదికి పండుగే
-
ముచ్చటైన లేఅవుట్లు
సాక్షి, అమరావతి: ఆహ్లాదకరమైన వాతావరణం.. అద్దంలా చదును చేసిన ప్లాట్లు.. చక్కటి రోడ్లు.. అందమైన పార్కులు.. పాఠశాల, ఆస్పత్రి తదితర మౌలిక వసతుల కల్పనకు విశాలమైన స్థలాలతో కూడిన లేఅవుట్లు.. ప్రతి ప్లాటుకూ నంబర్.. ఇదేదో రియల్టర్ సంస్థల ప్రకటన కాదు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఉగాది పర్వదినం రోజున పేదలకు నివాస స్థలాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న లేఅవుట్లలో కల్పిస్తున్న సౌకర్యాలివి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 26.6 లక్షల మందికి వీటిని విక్రయ దస్తావేజుల (కన్వేయన్స్ డీడ్ల) రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లుచేస్తోంది. రాష్ట్రంలో ఎవరికీ ఇల్లులేదనే మాట వినిపించకూడదు.. ప్రతిఒక్కరికీ నివాస యోగ్యం కల్పించాలనే ఉదాత్త ఆశయంతో సీఎం వైఎస్ జగన్ సర్కారు యజ్ఞంలా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు అహరహం శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో భూమి చదును ముమ్మరంగా జరుగుతోంది. ప్రధాన రహదారులు 30 అడుగులు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రూపొందిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీలకు 30 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారులు ఏర్పాటుచేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడి పరిస్థితులు, లేఅవుట్ పరిమాణాన్ని బట్టి మరింత విశాలంగా నిర్మించేందుకు యోచిస్తున్నారు. ఇక పెద్దపెద్ద లేఅవుట్లు అన్నింటిలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, పార్కులు లాంటి మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తున్నారు. చుట్టూ పచ్చని చెట్లు.. కొండలు ఇక రాష్ట్రంలో అనేకచోట్ల గ్రామాలకు, పట్టణాలకు వెలుపల పచ్చని చెట్లు, కొండలు, పొలాల పక్కన వైఎస్సార్ జగనన్న కాలనీల కోసం స్థలాలు ఎంపిక చేశారు. దీంతో స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన గాలి వస్తోంది. పచ్చదనంతో వాతావరణం కూడా చల్లగా ఉంటోంది. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో ఏర్పాటుచేస్తున్న కాలనీ కొండను ఆనుకుని సుందరంగా ఉంది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో చాలాచోట్ల ఇలాగే ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో తోటలు, పొలాల పక్కన కాలనీలు సుందరంగా రూపుదిద్దుకోనున్నాయి. 22,43,561 మంది లబ్ధిదారులు.. 43,457 ఎకరాలు – ఈనెల రెండో తేదీ నాటికి జిల్లాల నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం మొత్తం 22,43,561 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. – వీరికి ప్లాట్ల కోసంతోపాటు రహదారులు, సామాజిక అవసరాలకు కేటాయించిన దానితో కలిపి మొత్తం 43,457.27 ఎకరాలు అవసరమని అధికారులు లెక్కగట్టారు. (సాంకేతిక కారణంలో మూడు, నాలుగు ప్రాంతాల వివరాలు వీటిలో చేర్చలేదు) – కానీ, 26,976.68 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు వారు గుర్తించారు. – మిగిలిన 12,693.29 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు. నివాసానికి పూర్తి అనుకూలంగా ఉండాల్సిందే పేదలకు స్థలాలిచ్చి కట్టించే ఇళ్లు వారికి పూర్తి అనుకూలంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం. ఇందులో భాగంగానే అన్ని విధాలా లబ్ధిదారులకు సౌకర్యవంతమైన ప్రాంతాలనే ఎంపిక చేయాలని ఆయన పదేపదే ఆదేశించారు. ఈ విషయంలో సీఎం ఏమి చెప్పారంటే.. – 26.6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఒకేరోజు ఇచ్చి 30 లక్షల మందికి (సొంతంగా స్థలాలు ఉన్న వారితో కలిపి) నాలుగేళ్లలో ఇళ్లు కట్టించి ఇవ్వడమన్నది మహా యజ్ఞం లాంటిది. – ఈ గొప్పపనికి సార్థకత ఏర్పడాలంటే ఇళ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలి. అందువల్ల ఎంపిక చేసిన ప్రాంతాలను లబ్ధిదారులకు చూపించి వారు అంగీకరిస్తేనే ముందుకెళ్లండి. ఒకే నమూనాలో ఇళ్లు – వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లన్నీ ఒకే నమూనాలో నిర్మించనున్నారు. – ఒక్కో ఇంట్లో ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ప్లాన్ రూపొందిస్తున్నారు. – ప్రతి కాలనీలో డ్రైనేజి, తాగునీటి పైపులైను, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. – దశల వారీగా నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది సర్కారు లక్ష్యం. ‘తూర్పు’లో అత్యధికంగా లబ్ధిదారులు ఇళ్ల స్థలాలకు ఎంపికైన లబ్ధిదారుల సంఖ్య విషయంలో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. – ఈ జిల్లాలో ఇప్పటివరకు 3,29,532 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. – అధికారులు ఈ జిల్లాలో మొత్తం 1,129 లేఅవుట్లు రూపొందిస్తున్నారు. – ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ భూసేకరణ జరుగుతోంది. – ఇక లబ్ధిదారుల సంఖ్య పరంగా చూస్తే కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. పులివెందులలో 7,284 ప్లాట్లతో ఒకే కాలనీ.. మరోవైపు.. వైఎస్సార్ జిల్లా పులివెందులలో కూడా 7,284 మందికి నివాస స్థలాలిచ్చేందుకు 257.53 ఎకరాల్లో అధికార యంత్రాంగం మరో భారీ లేఅవుట్ రూపొందించింది. – ఈ కాలనీ ప్రధాన రహదారిని 98.42 అడుగుల (30 మీటర్లు) వెడల్పుతో నిర్మించనున్నారు. – ఇందులో కొన్ని రోడ్లను 65.61 అడుగులు, మరికొన్ని రహదారులను 39.37 అడుగులు, కొన్ని అంతర్గత రహదారులను 30 అడుగుల వెడల్పుతో ప్లాన్ చేశారు. – కాలనీలో మొత్తం 33,390 మీటర్ల పొడవున రోడ్లు నిర్మిస్తారు. ప్రజలకు అన్ని సౌకర్యాలతో కాలనీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కాలనీలకు సకల సౌకర్యాలతో ఏర్పాటుచేస్తున్నాం. ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసి చదును చేసి లేఅవుట్లు రూపొందిస్తున్నాం. – హరికిరణ్, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాలకు ఎక్కువ డిమాండు ఉంది. భూమి ధర కూడా ఎక్కువే. అందువల్ల ఇక్కడ భూసేకరణకే రూ.2వేల కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం. భూములిచ్చిన రైతులందరికీ జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – మురళీధర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అతిపెద్ద లేఅవుట్.. విజయనగరం జిల్లా గుంకలాం గ్రామంలో 341 ఎకరాల్లో రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద లేఅవుట్ రూపుదిద్దుకుంటోంది. 16,043 మందికి ఇక్కడ ప్లాట్లు ఇచ్చేందుకు భూమిని చదును చేస్తున్నారు. విజయనగరానికి సమీపంలోనే ఉన్నందున ఈ ప్రాంతం పట్టణంలో కలిసిపోనుంది. -
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు
-
నచ్చాలి.. మెచ్చాలి..
సాధ్యమైనంత వరకు నివాస స్థలాల కోసం అసైన్డ్ భూములను తీసుకోవద్దు. వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి భూములను తీసుకోవాల్సి వస్తే.. అసైనీలకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి. ఎవరికీ ఇబ్బంది కలిగించొద్దు. ఈ విషయాన్ని అధికారులు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అన్ని విధాలా అనుకూలమైన, నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ నివాస స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలన్నది బృహత్తర కార్యక్రమమని, దీనిని తంతుగా మార్చవద్దని సీఎం నొక్కి చెప్పారు. ఉగాది పర్వదినం సందర్భంగా నివాస స్థల పట్టాల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల పట్టాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రజాసాధికార సర్వే (పీఎస్ఎస్) ప్రామాణికం కాదని, గ్రామ సచివాలయ, క్షేత్ర స్థాయి సిబ్బంది సర్వేనే కొలబద్ద అని స్పష్టం చేశారు. అర్హులు ఎంత మంది ఉన్నా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి యజ్ఞంలా భావించాలి పేదలకు నివాస స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం యజ్ఞంగా భావిస్తోందని, అందువల్ల ఏ ఒక్కరూ ఈ మహా క్రతువును తంతుగా భావించవద్దని సీఎం ఉద్బోధించారు. అందువల్ల అన్ని విధాలా అనుకూలంగా, ఆవాస యోగ్యంగా ఉండే ప్రాంతాలను ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సూచించారు. ఈ ప్రాథమిక విషయాన్ని ఎవరూ మరచి పోవద్దన్నారు. ఉపయోగం లేని చోట నివాస స్థల పట్టాలు ఇవ్వడంలో అర్థముండదని నొక్కి చెప్పారు. పట్టాలు ఇస్తున్న స్థలాలు సంతృప్తి కలిగించేలా, ఆవాస యోగ్యంగా ఉండాలన్న అంశాలను అధికారులు స్థలాలను ఎంపిక చేసే సమయంలో ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు. 1 నుంచి గ్రామాల్లో సీఎం పర్యటన - ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నేను గ్రామాల్లో పర్యటిస్తా. ఈ సమయంలో ర్యాండమ్‌గా కొన్ని పల్లెలకు వెళ్లి పరిశీలిస్తా. లబ్ధిదారుల ఎంపిక, పథకాలు అమలు జరుగుతున్న తీరును స్వయంగా వాకబు చేసి తెలుసుకుంటా. ఎక్కడైనా పొరపాట్లు జరిగినట్లు తేలితే కచ్చితంగా అధికారులను బాధ్యులను చేస్తా. - ఇళ్ల పట్టాలు ఇవ్వగానే ఇళ్లు కట్టడానికి లబ్ధిదారులు అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో అధికారులు హడావుడిగా వ్యవహరించరాదు. ఈ మేరకు అందరు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. - ఇళ్ల పట్టాల కోసం సడలించిన అర్హత నిబంధనలను గ్రామ సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలి. జాబితాలో పేర్లు లేని అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఇది అవసరం. - ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలకు లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతే ప్లాటింగ్ చేయాలి. లేకపోతే ఇందు కోసం వెచ్చించిన సొమ్ము వృధా అవుతుంది. - ఇళ్ల పట్టాల కోసం కేటాయించిన స్థలాల్లో మొక్కలు పెంచాలి. - మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీల్లో లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. పేదలకు కట్టించే ఇళ్ల డిజైన్ బాగుండాలి. ఇందుకు ప్రతిపాదనలు తయారు చేయాలి. ఇంటి స్థలం లేని వారు ఇక ఉండరాదు. - అభ్యంతరకర ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే ప్రత్యామ్నాయం చూపాలి. వారికి ఇళ్ల పట్టాలు ఎక్కడ ఇస్తున్నామో చెప్పాలి. వారికి ఇళ్లు కట్టి అప్పగించిన తర్వాతే అభ్యంతరకర ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని కోరాలి. - ఇళ్ల పట్టాల కోసం అధికారులు గుర్తించిన స్థలాల వివరాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. స్థానికుల అభిప్రాయాలను స్వీకరించాలి. - ప్రజలను సంతోష పరిచేలా మన కార్యక్రమాలు ఉండాలి. అందుకు బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టలేదు. ‘అమ్మఒడి’ తర్వాత ప్రభుత్వం చేపడుతున్న మరో అతిపెద్ద కార్యక్రమం ఇది. దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. -
నివాస స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే పట్టా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వం దరఖాస్తు (డీకేటీ) పట్టా రూపంలో ఇచ్చిన నివాస స్థలాలు ఎవరి అధీనంలో ఉంటే వాటిపై వారికే హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. 2019 జనవరి 21వ తేదీకి ముందు చేతులు మారిన నివాస స్థల డీకేటీ పట్టాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.ఉషారాణి జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి డీకేటీ పట్టాల రూపంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు చాలావరకు అనధికార లావాదేవీల ద్వారా చేతులు మారాయి. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్(పీఓటీ) చట్టం ప్రకారం వీటి క్రయవిక్రయాలకు ఆస్కారం లేదు. అందువల్ల విక్రయ రిజిస్ట్రేషన్లు జరగవు. ఈ నేపథ్యంలో అనధికారికంగా కొనుగోలు చేసిన స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే డీకేటీ పట్టాల రూపంలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారు ఆర్థిక సమస్యలుంటే 20 ఏళ్ల తర్వాత విక్రయించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు పీఓటీ చట్టానికి సవరణ చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. దీంతో గతేడాది జనవరి 21వ తేదీకి ముందు నివాస స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే పట్టా ఇవ్వాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమో జారీ చేసింది. గతంలోనే ఈ మెమో ఇచ్చినప్పటికీ కొందరు కలెక్టర్లు/ రెవెన్యూ అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని నివృత్తి చేస్తూ తాజాగా ప్రభుత్వం మరో మెమో పంపింది. వేరే వారికి ఇచ్చిన నివాస స్థలాలను ఎవరు పడితే వారు కొనుగోలు చేసినా, స్వాధీనం చేసుకున్నా పట్టా ఇవ్వడం కుదరదు. ఇల్లు గానీ, నివాస స్థలం గానీ లేనివారికి మాత్రమే ఇలా పట్టా ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. పీఓటీ చట్ట సవరణ నేపథ్యంలో ఇప్పటివరకూ ఇళ్ల స్థలాలు పొందినవారు వాటిని 20 ఏళ్ల తర్వాత విక్రయించుకోవచ్చు. -
ఇళ్ల స్థలాలపై కసరత్తు ముమ్మరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నివాస గృహ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వచ్చే ఉగాది సందర్భంగా ఇంటి స్థలం పట్టా జారీ చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఉగాది పర్వదినం సందర్భంగా 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం లబ్ధిదారుల ఎంపిక, అవసరమైన భూమి సేకరణకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే నివాస స్థల పట్టాల జారీకి 22 లక్షల మంది అర్హులను అధికారులు ఖరారు చేశారు. వీరి జాబితాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో పెట్టారు. నాలుగైదు రోజులుగా పలు వార్డు, గ్రామ సచివాలయాల్లో గ్రామసభలు కూడా నిర్వహించి లబ్ధిదారుల జాబితాలకు ఆమోదం తెలిపారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదన్న మాట ఉండరాదని, సంతృప్త స్థాయిలో లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో అర్హుల జాబితాలో పేర్లు లేని వారు జనవరి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వివాదం లేని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారికి (రెండు సెంట్ల లోపు) పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి కేవలం రూపాయికే వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ఏదైనా కారణాల వల్ల ఎవరి పేరైనా అర్హుల జాబితాలో లేకపోతే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి వరకూ వచ్చే దరఖాస్తులను పరిశీలించి అర్హులందరి పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చి నివాస స్థల పట్టాలు ఇచ్చే దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్.. జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ఈ మొత్తం ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 21,948.72 ఎకరాలు సిద్ధం గ్రామీణ ప్రాంతాల్లో 19,389.05 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,559.67 ఎకరాలు ఇప్పటి వరకు మొత్తం 21,948.72 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అధికారులు గుర్తించారు. ఇది కాకుండా ఇంకా అవసరమైన భూమిని గుర్తించేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. అవసరాలకు సరిపడా ప్రభుత్వ భూమి లేని ప్రాంతాల్లో సంప్రదింపుల ద్వారా సేకరించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)భూ సేకరణకు పరిశ్రమల శాఖ జారీ చేసిన జీఓఎంఎస్ నంబరు 181 (తేదీ 19–12–2016), పీఎంఏవై కింద ఇళ్ల నిర్మాణానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీఓఎంఎస్ నంబరు 214 (తేదీ 9–7–2018) ప్రకారం జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ భూ యజమానులతో సంప్రదించి భూమిని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన మొత్తాన్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ నెల 22వ తేదీ నాటికి సుమారు 22 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక
సాక్షి, అమరావతి: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. గ్రామ, వార్డు వలంటీర్లు అర్హుల జాబితాను రూపొందించి, సమర్పించిన తర్వాత దానిని గ్రామసభలో చదివి వినిపించాలని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హులను తొలగించాలని, అర్హుల పేర్లు లేకపోతే గ్రామసభలో చర్చించి చేర్పించాలని పేర్కొన్నారు. ఇందుకు షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ‘‘లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సెప్టెంబర్ 25వ తేదీలోగా పూర్తి చేయాలి. 30వ తేదీలోగా ఎక్కడ ఎంత భూమి కావాలో ఖరారు చేసి, తదనుగుణంగా నివేదికలు రూపొందించాలి. ఇప్పటికే ఇల్లు లేదా ఇంటి స్థలం పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేస్తే తిరస్కరించాలి. డూప్లికేషన్‌ను నివారించడానికి ఆధార్‌ను జత చేయడం తప్పనిసరి చేయాలి’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. నేటి నుంచి ఉప ముఖ్యమంత్రి సమీక్షలు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని సజావుగా పూర్తి చేయడానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు నేటి నుంచి తేదీ నుంచి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజుతో కలిసి జిల్లాల్లో పర్యటించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ నిర్ణయించుకున్నారు. జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేస్తారు. ‘‘నిష్పక్షపాతంగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాం. ఇంత తక్కువ కాలంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేదల పట్ల ఉన్న అభిమానానికి, ముందుచూపునకు ఇది నిదర్శనం’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. 30,152.73 ఎకరాల భూమి గుర్తింపు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా 30,152.73 ఎకరాల భూమిని గుర్తించారు. రాష్ట్రంలో 1,45,72,861 కుటుంబాలుండగా, 1,26,26,879 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామ, వార్డు వాలంటీర్లు సేకరించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. 25,64,897 కుటుంబాల వారు ఇళ్ల స్థలాలు పొందడానికి అర్హులని తాత్కాలికంగా నిర్ణయించారు. 1,00,61,982 కుటుంబాల వారు నివాస స్థలాలు పొందడానికి అనర్హులని తాత్కాలికంగా తేల్చారు. మిగిలిన కుటుంబాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికాగానే గ్రామసభలు నిర్వహించి, లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇందులో అనర్హుల పేర్లు ఉన్నట్లు తేలితే తొలగిస్తారు. అర్హుల పేర్లు జాబితాలో చేరలేదని తేలితే పునఃపరిశీలిస్తారు. అర్హులని తేలితే జాబితాలో చేరుస్తారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరూ ఉండరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూమిని సమకూర్చే పనిని వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీనాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఏడాది మార్చి 25న ఉగాది సందర్భంగా అర్హులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. -
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి బ్యూరో: తమ ప్రభుత్వంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఉగాది నాటికల్లా ఇళ్ల స్థలాలు ఇస్తామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) హామీ ఇచ్చారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇంటి స్థలం కన్నా రెట్టింపు మొత్తంలో పాత్రికేయులకు స్థలం కేటాయిస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా భ్రమల్లో కాకుండా కలను నిజం చేసి చూపుతామన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాదబీమాను మంగళవారం సాయంత్రానికి రెన్యూవల్ చేస్తామని, అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని చెప్పారు. పాత్రికేయులపై జరిగిన దాడుల కేసుల పురోగతిపై రాష్ట్ర హోంమంత్రితో చర్చిస్తానని మంత్రి నాని హామీ ఇచ్చారు. మంత్రి పేర్ని నానికి జర్నలిస్టు సంఘం నాయకులు సన్మానం చేసి, జ్ఞాపికను బహూకరించారు. -
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నివాస స్థలాలు లేని 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వాలంటే రూ.40 వేల కోట్లు కావాలని రెవెన్యూ శాఖ తయారు చేసిన గణాంకాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సరైన అంచనాలు, ప్రణాళికలు లేకుండా ఇలాంటి అంచనాలు వేసి భయపెట్టొద్దని హితవు పలికారు. ఇచ్చిన హామీని తక్కువ ఖర్చుతో అమలు చేసే మార్గాలు చూడాలన్నారు. 25 లక్షల ఇళ్ల స్థల పట్టాల జారీకి రూ.40 వేల కోట్లు అవుతుందని లెక్కలు వేయడమంటే ఇక దాన్ని ముట్టుకోవద్దని చెప్పడమేనని, ఇలా భయపడేలా చేస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడానికి 83,833 ఎకరాలు అవసరమని, ఇందుకు రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని రెవెన్యూ శాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ సిద్ధం చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సిద్ధం కాగానే ముఖ్యమంత్రి కలుగజేసుకుని ఆ గణాంకాలు అవసరం లేదని, పక్కన పడేయాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో ఇంటి స్థలం లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతాం. 25 లక్షల మంది మహిళల పేరుతో నివాస స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పాం. వచ్చే ఉగాది నాడు పండుగలా నివాస స్థలాలు పంపిణీ చేస్తాం. గత పాలకుల్లాగా పట్టాలు ఇచ్చి స్థలాలెక్కడో చూపని పరిస్థితి ఉండకూడదు. ఏయే గ్రామాల్లో ఎంతమందికి ఇంటి స్థలాలు లేవో గ్రామ వలంటీర్లు లెక్క తీస్తారు. ఆయా గ్రామాల్లో వారికి పట్టాలు ఇవ్వడానికి ఎంత భూమి కావాలో.. ప్రభుత్వ భూమి ఎంత ఉందో చూడండి. ఎక్కడైనా కొంత తక్కువ ఉంటే కొనుగోలు చేద్దాం. ఎకరా రూ.20 లక్షలు అని, రూ.40 లక్షలు అని ఏవేవో లెక్కలు వేస్తే ఎలా?’ అని సీఎం ప్రశ్నించారు. దీంతో మన్మోహన్సింగ్ పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత ఉన్నందున మల్టీ స్టోరీడ్ భవనాలు ఇద్దామని, గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇద్దామని ప్రతిపాదించారు. దీనికి స్పందించిన సీఎం పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 3, జీ ప్లస్ 4కు అనుగుణంగా నంబర్ ఆఫ్ ప్లాట్లు ప్లాన్ చేసుకుని అన్ డివైడెడ్ షేర్‌కు పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్థలాలు ఇద్దామన్నారు. కాగా పట్టణ గృహ నిర్మాణంలో గతంలో భారీ స్కామ్ జరిగిందని సీఎం వైఎస్ జగన్ ఎత్తి చూపారు. ‘300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితమే. సబ్సిడీతో సిమెంటు వస్తోంది. అలాంటప్పుడు చదరపు అడుగుకు రూ.1,100 మించి కాదు. వాస్తవం ఇది కాగా.. గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.2,200 పెట్టి స్కామ్‌గా మార్చింది. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షలు కలిపి రూ.3 లక్షలు ఇస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇది సరిపోతుంది. కానీ గత పాలకులు దీన్ని రూ.6 లక్షలకు పెంచారు. ఇంత ఎందుకవుతుందో నాకు అర్థం కావడం లేదు. రివర్స్ టెండరింగ్‌కు వెళదాం’ అని సీఎం పేర్కొన్నారు. మానవత్వంతో ముందుకెళ్దాం గిరిజన ప్రాంతాల్లో ఎస్సీలకు, ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇవ్వాలన్నా చట్టం అంగీకరించదనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి ప్రస్తావించారు. ఈ అంశంపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కలుగజేసుకుని 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీలులేదని తెలిపారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ జోక్యం చేసుకుని కోస్తాలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని గ్రామాల పక్కనే అటవీ ప్రాంతం ఉన్నందున ఐదు ఎకరాల వరకూ ఇళ్ల స్థలాలకు వినియోగించుకునేలా చట్ట సవరణ చేసే విషయం పరిశీలించాలని కోరారు. ‘రమణన్న చెప్పినట్లుగా చేద్దాం. ముఖేష్ అన్నా (ముఖేష్ కుమార్ మీనాను ఉద్దేశించి) ముందు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు పట్టాలు ఇవ్వండి. మిగిలినవారికి ఎలా ఇవ్వాలో ఆలోచిద్దాం’ అని సీఎం పేర్కొన్నారు. -
ఏలూరులో వామపక్షాల ఆందోళన
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వామపక్షాలు బుధవారం ఆందోళనకు దిగాయి. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వాలంటూ వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఏలూరు ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. ఈ ప్రభుత్వం పేదలను విస్మరిస్తుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఏలూరు ఎమ్మార్వో ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.