
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టులోనే నివేదించండని సుప్రీంకోర్డు పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, మెహ్‌ఫూజ్ నజ్కీ, ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాదులు దివ్యేష్ ప్రతాప్ సింగ్, రంజిత్ కుమార్ విచారణకు హాజరయ్యారు. పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందిస్తూ ‘హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై మేం జోక్యం చేసుకోవడం లేదు. హైకోర్టులో దీనిపై ఈనెల 27న విచారణ ఉన్నట్టుగా న్యాయవాదులు తెలిపారు. మీ వాదనలు అక్కడే నివేదించండి. హైకోర్టు ఈ విచారణను వేగవంతం చేయొచ్చు..’ అని ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment