
వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతున్న విశ్వేశ్వర్‌రెడ్డి
అనంతపురం జిల్లా: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రం స్పందించకపోతే కడప ఉక్కు పరిశ్రమ తానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అనటం సరికాదన్నారు.
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పెట్టిన అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భయపడలేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన పిరికిపంద చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిజమైన పోరాట యోధుడుగా ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబులో ధర్మమూ లేదూ.. పోరాటమూ లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment