Vanchana Garjana Deeksha
-
‘వంచనపై గర్జన’ పోస్టర్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచకుండా రాష్ట్రాన్ని వంచనకు గురిచేసిన కేంద్రంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా నిరసనకు సిద్ధమైంది. డిసెంబర్ 27 (గురువారం)న జంతర్‌మంతర్ వద్ద ‘వంచనపై గర్జన’ దీక్ష కార్యక్రమాన్ని నిర్వస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సీనియర్ నేతలు విజసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ బుధవారం కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ‘వంచనపై గర్జన’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 'వంచనపై గర్జన' దీక్ష దీక్ష కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, తాజా మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు భాగం కానున్నారు. -
గుంటూరులో హోదాపై వైఎస్సార్సీపీ వంచన దీక్ష
-
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వంచనపై గర్జన దీక్ష శిబిరంలో పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎల్లుట్ల మారుతీ నాయుడు, మహేష్, నాగార్జున ఫ్యాన్స్ వెంకట్, నాని, యాసిన్, బాబ్జాన్, శర్మాస్‌వలి తదితరులకు తాజా మాజీ ఎంపీ, పార్టీ జిల్లా ఇన్చార్జి మిథున్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీరు గతంలో వైఎస్సార్సీపీలో ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీకి వెళ్లారు. అయితే హృదయం నిండా వైఎస్సార్సీపీపై అభిమానం ఉంచుకుని ఇతర పార్టీలో కొనసాగలేక తిరిగి వచ్చామన్నారు. పార్టీ అవిర్భావం నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నానని అనివార్య కారణాల వల్ల టీడీపీలో చేరినా అక్కడ ఉండలేక తిరిగి పార్టీలో చేరానని మారుతీనాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తామని వారు ప్రకటించారు. -
గర్జించిన అనంతపురం
సాక్షి, అనంతపురం: కేంద్రరాష్ట్రాల వంచనపై అనంతపురం గర్జించింది. నాలుగేళ్లపాలనలో ప్రభుత్వాలు చేసిన మోసాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ఎండగట్టారు. అదే సమయంలో హోదా ఆకాంక్షను ఎలుగెత్తిచాటారు. వైఎస్ జగన్ నాయకత్వంలో హోదా సాధించితీరుతామని స్పష్టంచేశారు. బీజేపీ, టీడీపీల వంచనపై వైఎస్సార్ సీపీ చేపట్టిన గర్జన దీక్ష విజయవంతమైంది. దీక్షా వేదిక అయిన అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానం హోదా నినాదంతో మార్మోగింది. ఈ కార్యక్రమానికి పార్టీశ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు నల్లదుస్తులు ధరించి దీక్షకు హాజరయ్యారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన మోసాలను నేతలంతా ఎండగట్టారు. ప్రత్యేకహోదా ఆకాంక్షను ఎలుగెత్తిచాటారు. హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పారు. హోదాకు కాకుండా ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారు? ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోదీ, చంద్రబాబు ఏ1 ఏ2 ముద్దాయిలని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. హోదా వల్లే పరిశ్రమలు వస్తాయని అన్నారు. ఏపీ విభజన చట్టం హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేసిన ఉద్యమాలను చంద్రబాబు కావాలని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాకు కాకుండా ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. ప్రత్యేక హోదా కోసమే ఎంపీ పదవులకు తాము రాజీనామాలు చేస్తే, చంద్రబాబు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసమే పదవులను వదులుకున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని వ్యాఖ్యానించారు. ఏపీలో 150 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో జగన్‌దే జయం అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలివిగల మోసకారి అని, వచ్చే ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయాలని అభ్యర్థించారు. ఆయన రాజకీయ చరిత్రంతా దుర్మార్గాలే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు, దగాకోరని.. ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంతా దుర్మార్గాలకు నిదర్శనమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రజల గురించి పోరాడలేదని.. అంతటితో ఆగకుండా హోదా కోసం ఉద్యమం చేసిన వాళ్లను జైళ్లో పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో భూమన మాట్లాడారు. 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఎవరైతే హోదా ఇస్తారో.. వారికే తమ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విశిష్టతను చాటిచెప్పిన ధీరుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ ఆశయాలే వైఎస్సార్సీపీ సిద్ధాంతాలని భూమన వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే! రాష్ట్ర ప్రయోజనాల కోసమే మమల్నిరాజీనామ చేయాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో మిథున్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో బాబు విఫలమయ్యారని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామ చేయడం గర్వంగా ఉందని విథున్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అశోక్ బాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుందని దూషించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సొమ్ముపై చంద్రబాబు కన్ను పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ.200 కోట్లను అమరావతికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. -
రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారు
-
రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చింది బాబే: ఆర్కే
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఉద్యమ సారధి అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. చంద్రబాబు నాలుగేళ్లుగా బీజేపీని ఏమీ అనలేదని పేర్కొన్నారు. హోదా గురించి ప్రధానమంత్రి మోదీని చొక్కా పట్టుకొని అడిగే ధైర్యం బాబుకి లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో హోదాపై మాట్లాడితే మైక్ కట్ చేయించారని గుర్తుచేశారు. ప్యాకేజీలన్నీ ముఖ్యమంత్రి, మంత్రులే స్వాహా చేశారన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చింది చంద్రబాబేనని విమర్శించారు. రాజధాని పేరుతో బాబు దోపిడీ చేస్తున్నారని ఆర్కే ఆరోపించారు. -
‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం’
సాక్షి, అనంతపురం: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో రాచమల్లు మాట్లాడారు. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఎమ్మెల్యేలు పార్టీ మారారని ఆయన అన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష ఓ బోగస్ అని, 11 రోజులు దీక్ష చేసిన ఆయన కొత్త పెళ్లికొడుకులా కనిపించారని రాచమల్లు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు దీక్షా నియమాలు తెలియవని తెలిపారు. చంద్రబాబు గద్దె దిగేదాకా నల్ల కండువా ధరిస్తానని ఆయన అన్నారు. -
‘జైళ్లో పెట్టించిన ఘనుడు చంద్రబాబు’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు, దగాకోరని.. ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంతా దుర్మార్గాలకు నిదర్శనమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రజల గురించి పోరాడలేదని.. అంతటితో ఆగకుండా హోదా కోసం ఉద్యమం చేసిన వాళ్లను జైళ్లో పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో భూమన మాట్లాడారు. 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఎవరైతే హోదా ఇస్తారో.. వారికే తమ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విశిష్టతను చాటిచెప్పిన ధీరుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ ఆశయాలే వైఎస్సార్సీపీ సిద్ధాంతాలని భూమన వివరించారు. సీఎం రమేష్ అభాసుపాలయ్యారు దోచుకోవడం.. దాచుకోవడమే టీడీపీ నేతల సిద్ధాంతమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీల త్యాగం చారిత్రాత్మకమని కొనియాడారు. అయితే టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దొంగదీక్షతో అభాసుపాలయ్యారని, ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని కోరుముట్ల అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, వంచనపై గర్జన దీక్ష, ఏపీకి ప్రత్యేక హోదా, కోరుముట్ల శ్రీనివాసులు, చంద్రబాబు నాయుడు -
ఏ1 మోదీ.. ఏ2 చంద్రబాబు
సాక్షి, అనంతపురం: ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబులు ఏ1 ఏ2 ముద్దాయిలని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వంచనపై గర్జన దీక్షలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు వస్తాయని అన్నారు. ఏపీ విభజన చట్టం హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేసిన ఉద్యమాలను చంద్రబాబు కావాలని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాకు కాకుండా ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసమే ఎంపీ పదవులకు తాము రాజీనామాలు చేస్తే, చంద్రబాబు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసమే పదవులను వదులుకున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని వ్యాఖ్యానించారు. ఏపీలో 150 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో జగన్‌దే జయం అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలివిగల మోసకారి అని, వచ్చే ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయాలని అభ్యర్థించారు. -
బాబు ఎలా మోసపోయారు?
అనంతపురం జిల్లా: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రం స్పందించకపోతే కడప ఉక్కు పరిశ్రమ తానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అనటం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పెట్టిన అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడలేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన పిరికిపంద చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిజమైన పోరాట యోధుడుగా ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబులో ధర్మమూ లేదూ.. పోరాటమూ లేదని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబులో ధర్మం లేదు..పోరాటం లేదు
-
హోదా తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు
-
చంద్రబాబు ముఖ్యమంత్రా?
సాక్షి, అనంతపురం: ‘మనం ఇప్పుడు కూడా నడుం కట్టకపోతే చంద్రబాబు దుష్టపాలన అంతం కాదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లు, మరో 10 లక్షలు రేషన్ కార్డులు, 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించార’ని తిరుపతి వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సోమవారం అనంతపురం లోని ఆర్ట్స్ కాలేజీలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 60 ప్రభుత్వ సంస్థలను మూసేసిన ఈయన ముఖ్యమంత్రా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబును ‘పీకే ముఖ్యమంత్రి అనొచ్చు’ అంటూ ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలోనైనా ఈ జన్మభూమి కమిటీలు ఉన్నాయా అని సూటిగా అడిగారు. చంద్రబాబు ఒక పిరికిపంద అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ ఒక్కసారన్నా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారా అని సూటిగా అడిగారు. సింహం సింగల్‌గా వస్తుంది.. పిరికివాడు భయపడుతూ వెళ్తాడని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముగ్గురు వైఎస్సార్ సీపీ ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. విభజన చట్టాన్ని చంద్రబాబుకు సత్తా ఉంటే అమలు చేయించాలి లేదంటే మిన్నకుండాలని సూచించారు. ముఖ్యమంత్రికి, టీడీపీ అధ్యక్షుడికి తేడా లేకుండా పోయిందని విమర్శించారు. స్వలాభాలు, ప్యాకేజీ కోసం హోదాను తాకట్టు పెట్టారని.. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హత లేదని ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రతి రంగాన్ని, అందర్నీ మోసం చేశారని ఆరోపించారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరి.. ఆ తర్వాత ప్యాకేజీ సరిపోతుందని చెప్పి.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యంలో ఉన్నామని మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. దళితుల పట్ల చంద్రబాబు గౌరవం లేదని, దళితులను అవమానించారని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి మేలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పేరుతో పేదవాడి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయారని, వైఎస్సార్ పాలన సువర్ణయుగమని ప్రశంసించారు. -
‘రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం’
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం హామీలు ఇచ్చారని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారన్నారని.. ప్రత్యేక హోదాతో పాటు 7 వెనుకబడ్డ జిల్లాలను ఆదుకుంటామన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోందన్నారు. అనంతలో అత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చి ఉంటే రాయలసీమ ఈ పాటికి అభివృద్ధి చెంది ఉండేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఎంపీలు రాజీనామాలు చేశారని, ఆమరణ దీక్షలు చేశారన్నారు. హంద్రీనీవా ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు పనులు వేగంగా జరిగాయన్నాయన్నారు. ఈ పోరాటం అధికారం కోసం కాదని.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్సార్సీపీకి ముఖ్యమని వివరించారు. ప్రజల కోసం పోరాటాలు చేస్తే వారిని తెలుగుదేశం పార్టీ భౌతికంగా తుదిముట్టించిందని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, పోరాటాలు సాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. -
ఆ రెండు మళ్లీ వస్తున్నాయి.. జాగ్రత్త
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీలు నాలుగేళ్ల పాటు ప్రజలను మోసం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం అనంతపురంలో జరుగుతున్న వంచన గర్జన దీక్షలో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. నాలుగేళ్లపాటు రాష్ట్రాన్ని వంచించిన పార్టీలు మళ్లీ మోసం చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో హోదా కోసం దీక్షలు, ఉద్యమాలు చేసిన వారిపై కేసులు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికే తెలుగుదేశం నేతలు దొంగదీక్షలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలు టీడీపీని దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలకు మోసం చేశారని ద్వజమెత్తారు. నాలుగేళ్లుగా టీడీపీ అవినీతి పాలన చేస్తుందని అన్నారు. చట్టప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హక్కులను చంద్రబాబు కాలరాశారని బొత్స మండిపడ్డారు. విభజన హామీల అమలుకై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాడుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. విభజన హామీల అమలు కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం, బీజేపీలు చేసిన మోసాలపై ప్రజలకు అప్రమత్తం చేయడానికే వంచనపై గర్జన దీక్ష చేపట్టినట్లు చెప్పారు. -
అనంతలో ప్రారంభమైన వంచనపై గర్జన దీక్ష
అనంతపురం జిల్లా: అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో వంచనపై గర్జన దీక్ష ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా ప్రత్యేక హోదా కోసం పదవీత్యాగం చేసిన తాజా మాజీ ఎంపీలు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి రూపొందించిన వైఎస్ జగన్ నవరత్నాల ఫ్లెక్సీని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దీక్ష ప్రారంభానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తాజా మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్ రావు, మిథున్ రెడ్డితో పాటు పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్యకర్తలు పెద్ద ఎత్తులో హాజరయ్యారు. -
అనంతపురంలో వంచనపై గర్జన దీక్ష