
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచకుండా రాష్ట్రాన్ని వంచనకు గురిచేసిన కేంద్రంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా నిరసనకు సిద్ధమైంది. డిసెంబర్ 27 (గురువారం)న జంతర్‌మంతర్ వద్ద ‘వంచనపై గర్జన’ దీక్ష కార్యక్రమాన్ని నిర్వస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సీనియర్ నేతలు విజసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ బుధవారం కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ‘వంచనపై గర్జన’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 'వంచనపై గర్జన' దీక్ష దీక్ష కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, తాజా మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు భాగం కానున్నారు.