సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన ముగ్గురు ముఖ్య నేతలకు పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక అధికార ప్రకటన వెలువడింది.
► రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి... కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
► తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తారు.
► పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను విజయ సాయిరెడ్డికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ముగ్గురు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు
Published Thu, Jul 2 2020 5:37 AM | Last Updated on Thu, Jul 2 2020 5:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment