‘జైళ్లో పెట్టించిన ఘనుడు చంద్రబాబు’ | Bhumana Karunakar Reddy Slams Chandrababu At Vanchana Garjana Deeksha | Sakshi
Sakshi News home page

‘జైళ్లో పెట్టించిన ఘనుడు చంద్రబాబు’

Published Mon, Jul 2 2018 2:18 PM | Last Updated on Tue, Jul 24 2018 1:16 PM

Bhumana Karunakar Reddy Slams Chandrababu At Vanchana Garjana Deeksha - Sakshi

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు, దగాకోరని.. ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంతా దుర్మార్గాలకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిజాయితీగా పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రజల గురించి పోరాడలేదని.. అంతటితో ఆగకుండా హోదా కోసం ఉద్యమం చేసిన వాళ్లను జైళ్లో పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. 

ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో భూమన మాట్లాడారు.  2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఎవరైతే హోదా ఇస్తారో.. వారికే తమ మద్దతు ఉంటుందని వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విశిష్టతను చాటిచెప్పిన ధీరుడు వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్‌ ఆశయాలే వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలని భూమన వివరించారు.

సీఎం రమేష్‌ అభాసుపాలయ్యారు
దోచుకోవడం.. దాచుకోవడమే టీడీపీ నేతల సిద్ధాంతమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదంటూ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల త్యాగం చారిత్రాత్మకమని కొనియాడారు. అయితే టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ దొంగదీక్షతో అభాసుపాలయ్యారని, ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని కోరుముట్ల అన్నారు.
భూమన కరుణాకర్‌ రెడ్డి, వంచనపై గర్జన దీక్ష, ఏపీకి ప్రత్యేక హోదా, కోరుముట్ల శ్రీనివాసులు, చంద్రబాబు నాయుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement