
సాక్షి, అనంతపురం: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో రాచమల్లు మాట్లాడారు. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఎమ్మెల్యేలు పార్టీ మారారని ఆయన అన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష ఓ బోగస్ అని, 11 రోజులు దీక్ష చేసిన ఆయన కొత్త పెళ్లికొడుకులా కనిపించారని రాచమల్లు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు దీక్షా నియమాలు తెలియవని తెలిపారు. చంద్రబాబు గద్దె దిగేదాకా నల్ల కండువా ధరిస్తానని ఆయన అన్నారు.