Rachamallu prasadareddy
-
‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం’
సాక్షి, అనంతపురం: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో రాచమల్లు మాట్లాడారు. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఎమ్మెల్యేలు పార్టీ మారారని ఆయన అన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష ఓ బోగస్ అని, 11 రోజులు దీక్ష చేసిన ఆయన కొత్త పెళ్లికొడుకులా కనిపించారని రాచమల్లు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు దీక్షా నియమాలు తెలియవని తెలిపారు. చంద్రబాబు గద్దె దిగేదాకా నల్ల కండువా ధరిస్తానని ఆయన అన్నారు. -
‘నంద్యాలకు రాజకీయ గారడీల మనిషి’
నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ..‘రాజకీయ గారడీల మనిషి నంద్యాల వచ్చారు. ఓటర్లను మాయ చేయడానికి చంద్రబాబు వచ్చారు. బాబు మూడేళ్ల పాలనపై తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మళ్లీ మళ్లీ చంద్రబాబు అవే అబద్ధాలు చెబుతున్నారు. ఆయన మాటలు ఎవరూ నమ్మొద్దు. దాదాపు 40 నెలలుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటిదాకా నంద్యాలను స్మార్ట్ సిటీగా మార్చలేదు. అలాంటిది ఏడాదిన్నరలో నంద్యాలను ఎలా స్మార్ట్ సిటీగా మారుస్తారు. చంద్రబాబువి స్కీమ్‌లు కాదు...అన్నీ స్కామ్‌లు. ఆయన ఇచ్చిన ఇళ్ల హామీ ఏమైంది. ఇళ్లు కట్టిస్తారట. బ్యాంకుకు తనఖా పెట్టిస్తారట. ఇదేనా మీ అభివృద్ధి. అప్పులతో ఇంట్లోకి వెళ్లాలా? సెంట్ స్థలంలోనే కట్టే ఇళ్లను ఇళ్లు అంటారా? పేదవాడిని మరింత అప్పుల ఊబిలోకి చంద్రబాబు నెడుతున్నారు.’ అని ధ్వజమెత్తారు.