‘నంద్యాలకు రాజకీయ గారడీల మనిషి’ | ysrcp mla rachamallu prasada reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘నంద్యాలకు రాజకీయ గారడీల మనిషి’

Published Sat, Aug 19 2017 5:15 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

‘నంద్యాలకు రాజకీయ గారడీల మనిషి’ - Sakshi

‘నంద్యాలకు రాజకీయ గారడీల మనిషి’

నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ..‘రాజకీయ గారడీల మనిషి నంద్యాల వచ్చారు. ఓటర్లను మాయ చేయడానికి చంద్రబాబు వచ్చారు. బాబు మూడేళ్ల పాలనపై తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మళ్లీ మళ్లీ చంద్రబాబు అవే అబద్ధాలు చెబుతున్నారు. ఆయన మాటలు ఎవరూ నమ్మొద్దు. దాదాపు 40 నెలలుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఇప్పటిదాకా నంద్యాలను స్మార్ట్‌ సిటీగా మార్చలేదు. అలాంటిది ఏడాదిన్నరలో నంద్యాలను ఎలా స్మార్ట్‌ సిటీగా మారుస్తారు. చంద్రబాబువి స్కీమ్‌లు కాదు...అన్నీ స్కామ్‌లు. ఆయన ఇచ్చిన ఇళ్ల హామీ ఏమైంది. ఇళ్లు కట్టిస్తారట. బ్యాంకుకు తనఖా పెట్టిస్తారట. ఇదేనా మీ అభివృద్ధి. అప్పులతో ఇంట్లోకి వెళ్లాలా? సెంట్‌ స్థలంలోనే కట్టే ఇళ్లను ఇళ్లు అంటారా? పేదవాడిని మరింత అప్పుల ఊబిలోకి చంద్రబాబు నెడుతున్నారు.’  అని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement