బాబు నిజాలు చెబితే టీడీపీకి మనుగడే ఉండదు: కాకాణి | Kakani Govordhan Reddy comments on Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు నిజాలు చెబితే టీడీపీకి మనుగడే ఉండదు: కాకాణి

Published Thu, Sep 7 2017 1:42 AM | Last Updated on Tue, Oct 30 2018 6:08 PM

బాబు నిజాలు చెబితే టీడీపీకి మనుగడే ఉండదు: కాకాణి - Sakshi

బాబు నిజాలు చెబితే టీడీపీకి మనుగడే ఉండదు: కాకాణి

సాక్షి, హైదరాబాద్‌ : ‘ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దు.. చేసేదే చెప్పండి..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఎమ్మెల్యేలకు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీలో అందరూ కాకపోయినా ఓ పదిశాతం మంది ఎమ్మెల్యేలు నిజాలు చెప్పడం ప్రారంభించినా.. అధికారపార్టీకి మనుగడే ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కాకాని విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 
ఓటుకు కోట్లు కేసులో నిజాలు చెప్పాలి
అబద్ధాలు చెప్పొద్దంటున్న చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో నిజాలు చెప్పాలి. రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు సాగిస్తున్న ఇసుక, ఆలయ భూముల దోపిడీపై నిజాలే చెబితే అధికార పక్షం ప్రజాగ్రహంలో కొట్టుకుపోతుం ది. చంద్రబాబు గానీ, ఆయన ఎమ్మెల్యేలుగానీ నిజాలు చెబితే వారు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా..?, చంద్రబాబు సిగ్గు విడిచి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు నవ్విపోతారనైనా ఆయనకు లేదు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మూడున్నరేళ్లుగా వైఎస్సార్‌ సీపీ ఎండగడుతోంది. చంద్రబాబు హామీలు ఇచ్చి తప్పడంపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ’’ అని కాకాణి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement