వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతున్న అనంత వెంకట్రామిరెడ్డి
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం హామీలు ఇచ్చారని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారన్నారని.. ప్రత్యేక హోదాతో పాటు 7 వెనుకబడ్డ జిల్లాలను ఆదుకుంటామన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోందన్నారు. అనంతలో అత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చి ఉంటే రాయలసీమ ఈ పాటికి అభివృద్ధి చెంది ఉండేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఎంపీలు రాజీనామాలు చేశారని, ఆమరణ దీక్షలు చేశారన్నారు. హంద్రీనీవా ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు పనులు వేగంగా జరిగాయన్నాయన్నారు. ఈ పోరాటం అధికారం కోసం కాదని.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్సార్‌సీపీకి ముఖ్యమని వివరించారు. ప్రజల కోసం పోరాటాలు చేస్తే వారిని తెలుగుదేశం పార్టీ భౌతికంగా తుదిముట్టించిందని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, పోరాటాలు సాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment