
సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రాజకీయ పార్టీల మాస్కులను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్, జనసేనలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం.. హరికృష్ణ మృతదేహం సాక్షిగా చంద్రబాబు ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు.
వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం అని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment