
సాక్షి, అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం వెనుక సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపట్టిన ఆయన ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ఎన్‌ఐఏ విచారణకు సహకరించలేదని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ఎన్‌ఐఏ విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఓ చారిత్రాత్మక ఘట్టమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ నాయకుడు ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టలేదని తెలిపారు. వైఎస్ జగన్‌తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అన్నారు.