
అనంతపురం జిల్లా: అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో వంచనపై గర్జన దీక్ష ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా ప్రత్యేక హోదా కోసం పదవీత్యాగం చేసిన తాజా మాజీ ఎంపీలు హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి రూపొందించిన వైఎస్ జగన్ నవరత్నాల ఫ్లెక్సీని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
దీక్ష ప్రారంభానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తాజా మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్ రావు, మిథున్ రెడ్డితో పాటు పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్యకర్తలు పెద్ద ఎత్తులో హాజరయ్యారు.