పార్టీలోకి ఆహ్వానిస్తున్న మిథున్‌రెడ్డి, చిత్రంలో ఆలూరి సాంబశివారెడ్డి
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వంచనపై గర్జన దీక్ష శిబిరంలో పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎల్లుట్ల మారుతీ నాయుడు, మహేష్, నాగార్జున ఫ్యాన్స్ వెంకట్, నాని, యాసిన్, బాబ్జాన్, శర్మాస్‌వలి తదితరులకు తాజా మాజీ ఎంపీ, పార్టీ జిల్లా ఇన్‌చార్జి మిథున్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీరు గతంలో వైఎస్సార్‌సీపీలో ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీకి వెళ్లారు.
అయితే హృదయం నిండా వైఎస్సార్‌సీపీపై అభిమానం ఉంచుకుని ఇతర పార్టీలో కొనసాగలేక తిరిగి వచ్చామన్నారు. పార్టీ అవిర్భావం నుంచి వైఎస్సార్‌సీపీలో ఉన్నానని అనివార్య కారణాల వల్ల టీడీపీలో చేరినా అక్కడ ఉండలేక తిరిగి పార్టీలో చేరానని మారుతీనాయుడు అన్నారు. వైఎస్సార్‌సీపీ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తామని వారు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment