join YSR Congress party
-
హిందుపురంలో టీడీపీకి భారీ షాక్
సాక్షి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే హిందుపురంలో నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. అనంతపురం జిల్లా లేపాక్షి మండల కీలక టీడీపీ నేత మాజీ ఎంపీపీ కొండూరు మల్లికార్జున తన సహచరులతో కలసి హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇక్బాల్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు సాక్షి, మడకశిర : ఎన్నికల సమయం దగ్గర పడటంతో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లా మడకశిర పట్టణానికి టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. రాయదుర్గం మండలం రాయంపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో టీడీపీ ఎంపీటీసీ రామాంజనేయలు తోపాటు 100 మంది వైఎస్సాఆర్సీపీలో చేరారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘జన్మభూమి కమిటీల పేరిట దోపిడి’
సాక్షి, గజపతినగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ఉందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్న నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత పెంటయ్యతో పాటు వందలాది మంది అనుచరులతో కలిసి మంగళవారం గజపతినగరం మండలం ముచ్చర్లలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెంటయ్య మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తున్నానని, అయినా పార్టీలో ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో విపరీతమైన దోపిడీ చేస్తున్నారని ఆగ్రహించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే నమ్మకంతోనే తామంతా పార్టీలో చేరినట్లు తెలిపారు. వైఎస్సార్ విగ్రహావిష్కరణ అంతకముందు ముచ్చర్లలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనర్సయ్యతో కలిసి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాపు, బలిజ, ముస్లిం మైనార్టీలు జననేతను హృదయపూర్వకంగా కలిశారు. తమ సంక్షేమం కోసం ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేశారు. జననేత పాదయాత్రకు కాపు, మైనార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. చిత్రీ పట్టిన జననేత ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గజపతినగరం మండలంలోని ముచ్చర్లలోని వడ్రంగి కులస్థులను జననేత కలిశారు. వడ్రండి చిత్రీ పట్టిన రాజన్న తనయుడు వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కలప లభ్యత ఎక్కువగా ఉందని, ఆధునిక పనిముట్లు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేక జీవనోపాధి కోల్పోతున్నామని జననేత ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు తెలుసుకున్న జననేత వరాకి కొండంత భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. -
చంద్రబాబు పాలనను అంతమొందిద్దాం
కావలి (నెల్లూరు): అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ, గ్రాఫిక్స్‌తో కూడిన ఫొటోలతో ఉత్తుత్తి సినిమా చూపించి దోపిడీకి పాల్పడుతున్న చంద్రబాబు పరిపాలనను అంతమొందించేందుకు అందరం పోరా టం చేద్దామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కావలి పట్టణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు, తెలుగు యువత పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి వల్లెపు కిషోర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీకి చెందిన పలువురు పెద్దఎత్తున ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. స్థానిక మానస సెంటర్లోని కళుగోళమ్మ దేవాల యం నుంచి భారీ ఎత్తున మహిళలు, యువకులు ర్యాలీగా బయలుదేరారు. బాణసంచా పేలుళ్లు, జై జగన్ నినా దాల మధ్య వడ్డిపాలెంలోని రామాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రామిరెడ్డి మాట్లాడుతూ పేదల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. అయి తే చంద్రబాబు పార్టీని అక్రమార్కులు, నేరస్తులు, దోపిడీదారులతో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బీసీలు, దళితులను అన్ని రకా లుగా అణచివేస్తున్నారని చెప్పారు. కిషోర్‌తో పాటు పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీ ఆర్ అభిమానులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. జగన్ సీఎం అయ్యే వరకు విశ్రమించం అధికారం చేతిలో ఉందని టీడీపీ కార్యకర్త నుంచి, నియోజకవర్గంలో పెత్తనం చేసే నాయకుడిగా చెలామణి అవుతున్న వారి ఆగడాలను అరికట్టేందుకు జగన్ ముఖ్య మంత్రి కావాలని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన సీఎం అయ్యేవరకు తాము విశ్రమించమన్నారు. ప్రజల్లో జగన్ నాయకత్వం పట్ల నమ్మకం పెరుగుతండటంతో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీని ఇబ్బందులు పెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అయినా తాము భయపడమని చెప్పారు. కేవలం ఎనిమిది నెలలు ఆగితే వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇబ్బందులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు, నిధులు, స్వాహా చేసిన వారిని చట్టం బోనులో నిలబెడతామన్నారు. -
బీద సోదరుల గ్రామంలో టీడీపీకి భారీ షాక్
సాక్షి, కావలి (నెల్లూరు): రాష్ట్ర రాజధాని నిర్మాణ కమిటీలో సభ్యుడంటూ పోలీసుల పైలెట్ వాహనాన్ని తన వెంట తిప్పుకునే బీద మస్తాన్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర స్వగ్రామమైన అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పంచాయతీలోని చంద్రబాబునగర్‌కు చెందిన 50 మత్స్యకార కుటుంబాలు టీడీపీను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఇస్కపల్లిలో పార్టీ సీనియర్ నాయకుడు బీద రమేష్ బాబు యాదవ్ నివాసం వద్ద శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రతి ఒక్కరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మత్స్యకారులు మాట్లాడుతూ మత్స్యకారులకు టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదన్నారు. కేవలం మాటలతోనే మభ్యపెట్టి కాలం గడిపారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల కోసం మంచి పథకాలను ప్రకటించారని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని తమ గ్రామానికి రానీయకుండా అడ్డుకోవడం తమల్ని సమాజంలో వేలెత్తి చూపించేలా చేసిందన్నారు. మా గ్రామంలో ఎమ్మెల్యేనే రానీయమంటే, అందుకు ప్రతికారంగా ఇతర గ్రామాల ప్రజలు, ఇతర పట్టణాల ప్రజలు మా గ్రామానికి చెందిన వారిని రానీయమంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచిస్తేనే బాధగా ఉందన్నారు. కొందరిని టీడీపీ నాయకులు పక్కదోవ పట్టించి మా గ్రామానికి ఇలాంటి చెడ్డ పేరు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తు తరాలకు, గ్రామానికి మంచిది కాదని తామే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము కూడా కృషి చేస్తామన్నారు. వెనుకబడి ఉన్న మత్స్యకారులను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దండా కృష్ణారెడ్డి, మన్నెమాల సుకుమార్‌రెడ్డి, నీలం సాయి కుమార్ పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీలోకి..నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దవటం యానాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులకొల్లు మల్లేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కడప మేయర్, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు ఆధ్వర్యంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణ సమస్యలపై అనేకసార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని, పైగా చర్చలకని సచివాలయానికి పిలిచి తీరని అవమానం చేశారన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపి కనీ సంక్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే తమపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అదే సమస్యలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. దేవాలయాల్లో క్షురకులను పర్మినెం ట్ చేయడం, తిరుమలతో సహా అన్ని దేవాలయ పాలకవర్గాల్లో క్షురకులకు అవకా శం, బార్బర్ షాపుల్లో 250 యూనిట్ల వర కూ ఉచిత విద్యుత్, ఆపైన 500 యూనిట్ల వరకూ డొమెస్టిక్‌గా మార్పు, శాసనమండలిలో అవకాశం, ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ ఏర్పాటు, బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహకారం, ప్రతి జిల్లాలో సంగీత కళాశాల, బ్యూటీపార్లర్ శిక్షణా కేం ద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే తమ సమస్యలు పరి ష్కారం అవుతాయని నమ్మి పార్టీలో చేరామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
అగనంపూడి (గాజువాక): టీడీపీ పాలనకు చరమ గీతంపాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. పరవాడ మండలం సాలాపువానిపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబా బు పాలనతో విసిగిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోకవర్గ ఇన్చార్జ్ వరుదు కల్యాణి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, సామాన్యులు దగా పడ్డారన్నారు. పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ అన్నంరెడ్డి అదీప్‌రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు టీడీపీతో విసిగిపోయి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు సాలాపు నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, జన్మభూమికమిటీ సభ్యుడు సాలాపు అప్పారావు, మాజీ ఉప సర్పంచ్ సాలాపు కనకరాజు, వార్డు సభ్యుడు సాలాపు నూకరాజు, లారీ ఓనర్లు సాలాపు శ్రీనివాసరావు, నానాజీ, రామకృష్ణ, అప్పలనాయుడు, బాబూరావుతో పాటు 50 కుటుంబాలకు చెందిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఇల్లపు ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గం నాయకులు పైలా శ్రీనివాసరావు, 56వ వార్డు పార్టీ అధ్యక్షుడు జి.పూర్ణానందశర్మ (పూర్ణ), పరవాడ మండల అధ్యక్షుడు సిరపురపు అప్పలనాయుడు, పరవాడ సర్పంచ్ చుర్కా రామునాయుడు, నాయకులు సుందరపు అప్పారావు, పచ్చికోరు రమణమూర్తి, సేనాపతి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. జన్‌తోనే సుపరిపాలన పీఎంపాలెం(భీమిలి): మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించిన ఆదర్శపాలన ప్రజలకు అందించడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంసిద్ధంగా ఉన్నారన్నారని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ అన్నారు. ఆదివారం శిల్పారామంలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని 4,5,6 వార్డుల బూత్ కమిటీల కన్వీనర్ల, సభ్యుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తైనాల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు అమలు పరచడంలో విఫలమైన బాబు ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. నాలుగేళ్ల పాలనలో పట్టించుకోకుండా... మరోమారు రాష్ట్ర ప్రజలను మోసగించడానికి చంద్రబాబు వేస్తున్న నక్కజిత్తులను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ టీడీపీ నాయకుల భూ కబ్జాలతో భీమిలి ప్రతిష్టను మసకబర్చారని మండిపడ్డారు. మాజీ ఉపసర్పంచ్ చేరిక వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం మీద విశ్వాసంతో బక్కన్నపాలెం మాజీ ఉపసర్పంచ్ ఆర్. స్వామినాయుడు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు తైనాల విజయకుమార్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఆయనతో పాటు 150 మంది అనుచరులు చేరారు. ఈ సందర్భంగా స్వామినాయుడు మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. -
వైఎస్సార్సీపీలోకి బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గార్గేయపురం సింగిల్ విండో మాజీ చైర్మన్ బైరెడ్డి కరుణాకరరెడ్డి వైఎస్సార్సీపీలో చేరినట్లు పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురం సమీపంలో పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు వివరించారు. పార్టీలో చేరిన వారిలో ఆయనతోపాటు పల్లె రమణారెడ్డి, పోతుల సీతారామిరెడ్డి, బైరెడ్డి నాగేశ్వరరెడ్డి ఉన్నారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వంచనపై గర్జన దీక్ష శిబిరంలో పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎల్లుట్ల మారుతీ నాయుడు, మహేష్, నాగార్జున ఫ్యాన్స్ వెంకట్, నాని, యాసిన్, బాబ్జాన్, శర్మాస్‌వలి తదితరులకు తాజా మాజీ ఎంపీ, పార్టీ జిల్లా ఇన్చార్జి మిథున్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీరు గతంలో వైఎస్సార్సీపీలో ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీకి వెళ్లారు. అయితే హృదయం నిండా వైఎస్సార్సీపీపై అభిమానం ఉంచుకుని ఇతర పార్టీలో కొనసాగలేక తిరిగి వచ్చామన్నారు. పార్టీ అవిర్భావం నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నానని అనివార్య కారణాల వల్ల టీడీపీలో చేరినా అక్కడ ఉండలేక తిరిగి పార్టీలో చేరానని మారుతీనాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తామని వారు ప్రకటించారు. -
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
పాతపట్నం : మండలంలోని సరాలి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్ సీపీలో ఆదివారం చేరారు. పాతపట్నంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో 60 కుటుంబాలకు చెందిన పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ యజ్జల రాజారావు, అనప బాబురావు, వున్న కేశకరావు, లండ ఆనందరావు, జలమాన లక్ష్మణరావు, జన్నం ప్రసాదరావు, పి.చిట్టిబాబు, కె.నారాయణరావు, కె.మొఖలింగం, జె.నారాయణరావు, పోలాకి తిరుపతి, పండా సింహాచలం, పడాల భాస్కరరావు, కె.సింహాచలం, పప్పు భాస్కరరావు, ఎల్.లక్ష్మణరావు, జి.దండాసీ, పి.వెంకటరావు, మెళియపుట్టి మండలం వసందర గ్రామానికి చెందిన సలాన జనార్దనరావుతో పాటు పలువురు ఉన్నారు. అధికార పార్టీ నాయకులు వారి అభివృద్ధి చూసుకుంటున్నారే తప్ప గ్రామాభివృద్ధి పట్టించుకోవడం లేదని వీరు వాపోయారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తురు మండల పార్టీ అధ్యక్షులు ఆర్.షణ్ముఖరావు, పాడి అప్పారావు, ఎస్.ప్రసాదరావు, అల్లు శకంరరావు, జిల్లా ప్రధానకార్యదర్శి రెగేటి కన్నయ్య స్వామి, పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్ సెక్రటరీ కొండాల అర్జునుడు, రెడ్డి రాజు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు
దామరచర్ల (మిర్యాలగూడ) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలనుంచి మద్దతు పెరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి పేర్కొన్నారు. దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు విస్మరించి ప్రచారాలకే పరిమితమవుతున్నాయన్నారు. ప్రజలకు అవసరమైన ఒక్క పనీ చేయడం లేదని విమర్శించారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు భూ పంపిణీ వాగ్దానాలకే పరిమితమయ్యాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కాంట్రాక్టర్లకు కాసుల వర్షాన్ని కురిపించాయన్నారు. ఈ ప్రభుత్వాలకు ప్రత్యామ్నయంగా వైఎస్సార్ పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీకి అధిక సీట్లు వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా నాయకులు అన్నెం కరుణాకర్‌రెడ్డి, కందుల బాల కృష్ణారెడ్డి ,బాజాన్, ఆర్,శ్రీనివాస్, ఎస్.సతీష్, ఆర్.మాణికంఠ, ఎన్.సురేష్, ఎన్. శ్రీను, ఆర్.కోటయ్య, కె.గోపయ్య, టి.దేవిరెడ్డి, ఎస్.నాగరాజు, రామకృష్ణ, వెంకటే, శ్వర్లు, సైదయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బుధవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 'సమైక్య దీక్ష' శిబిరం వద్దకు వెళ్లి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఆదినారాయణ రెడ్డి తన మద్దతుదారులతో కలసి భారీ సంఖ్యలో తరలివెళ్లి జగన్‌ను కలిశారు. సమైక్యాంధ్ర కోసం జగన్ చేపడుతున్న దీక్షకు సంఘీభావం తెలుపుతూ వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయన వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.