కిషోర్‌కు పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి
కావలి (నెల్లూరు): అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ, గ్రాఫిక్స్‌తో కూడిన ఫొటోలతో ఉత్తుత్తి సినిమా చూపించి దోపిడీకి పాల్పడుతున్న చంద్రబాబు పరిపాలనను అంతమొందించేందుకు అందరం పోరా టం చేద్దామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కావలి పట్టణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు, తెలుగు యువత పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి వల్లెపు కిషోర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీకి చెందిన పలువురు పెద్దఎత్తున ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. స్థానిక మానస సెంటర్‌లోని కళుగోళమ్మ దేవాల యం నుంచి భారీ ఎత్తున మహిళలు, యువకులు ర్యాలీగా బయలుదేరారు. బాణసంచా పేలుళ్లు, జై జగన్ నినా దాల మధ్య వడ్డిపాలెంలోని రామాలయం వరకు ర్యాలీ కొనసాగింది.
అక్కడ జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రామిరెడ్డి మాట్లాడుతూ పేదల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. అయి తే చంద్రబాబు పార్టీని అక్రమార్కులు, నేరస్తులు, దోపిడీదారులతో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బీసీలు, దళితులను అన్ని రకా లుగా అణచివేస్తున్నారని చెప్పారు. కిషోర్‌తో పాటు పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీ ఆర్ అభిమానులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు.
జగన్ సీఎం అయ్యే వరకు విశ్రమించం
అధికారం చేతిలో ఉందని టీడీపీ కార్యకర్త నుంచి, నియోజకవర్గంలో పెత్తనం చేసే నాయకుడిగా చెలామణి అవుతున్న వారి ఆగడాలను అరికట్టేందుకు జగన్ ముఖ్య మంత్రి కావాలని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన సీఎం అయ్యేవరకు తాము విశ్రమించమన్నారు. ప్రజల్లో జగన్ నాయకత్వం పట్ల నమ్మకం పెరుగుతండటంతో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీని ఇబ్బందులు పెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అయినా తాము భయపడమని చెప్పారు. కేవలం ఎనిమిది నెలలు ఆగితే వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇబ్బందులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు, నిధులు, స్వాహా చేసిన వారిని చట్టం బోనులో నిలబెడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment