
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఇంజం నర్సిరెడ్డి
దామరచర్ల (మిర్యాలగూడ) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలనుంచి మద్దతు పెరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి పేర్కొన్నారు. దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు విస్మరించి ప్రచారాలకే పరిమితమవుతున్నాయన్నారు. ప్రజలకు అవసరమైన ఒక్క పనీ చేయడం లేదని విమర్శించారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు భూ పంపిణీ వాగ్దానాలకే పరిమితమయ్యాయన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కాంట్రాక్టర్లకు కాసుల వర్షాన్ని కురిపించాయన్నారు. ఈ ప్రభుత్వాలకు ప్రత్యామ్నయంగా వైఎస్సార్ పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీకి అధిక సీట్లు వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా నాయకులు అన్నెం కరుణాకర్‌రెడ్డి, కందుల బాల కృష్ణారెడ్డి ,బాజాన్, ఆర్,శ్రీనివాస్, ఎస్.సతీష్, ఆర్.మాణికంఠ, ఎన్.సురేష్, ఎన్. శ్రీను, ఆర్.కోటయ్య, కె.గోపయ్య, టి.దేవిరెడ్డి, ఎస్.నాగరాజు, రామకృష్ణ, వెంకటే, శ్వర్లు, సైదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment