
బైరెడ్డి కరుణాకర్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. చిత్రంలో పార్టీ కోడుమూరు సమన్వయకర్త మురళీకృష్ణ, పత్తికొండ నియోజకవర్గ నేత ప్రదీప్‌రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గార్గేయపురం సింగిల్ విండో మాజీ చైర్మన్ బైరెడ్డి కరుణాకరరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురం సమీపంలో పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు వివరించారు. పార్టీలో చేరిన వారిలో ఆయనతోపాటు పల్లె రమణారెడ్డి, పోతుల సీతారామిరెడ్డి, బైరెడ్డి నాగేశ్వరరెడ్డి ఉన్నారు.