
సాక్షి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే హిందుపురంలో నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. అనంతపురం జిల్లా లేపాక్షి మండల కీలక టీడీపీ నేత మాజీ ఎంపీపీ కొండూరు మల్లికార్జున తన సహచరులతో కలసి హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇక్బాల్ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.
వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు
సాక్షి, మడకశిర : ఎన్నికల సమయం దగ్గర పడటంతో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లా మడకశిర పట్టణానికి టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. రాయదుర్గం మండలం రాయంపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో టీడీపీ ఎంపీటీసీ రామాంజనేయలు తోపాటు 100 మంది వైఎస్సాఆర్‌సీపీలో చేరారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment