సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నాడని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో లెజిస్లేటివ్, కర్నూలులో జూడిషియల్‌ను ఏర్పాటు చేసేందుకు అందరూ అంగీకరిస్తున్నారని అన్నారు. దీనివల్ల మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పరిచేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎన్నికల ముందే తాము అధికారంలోకి వస్తే రాజధాని రైతులకు భూములు వెనక్కి ఇస్తామని అప్పట్లో వైఎస్ జగన్ ప్రకటించారని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతాన్ని ప్రకటించక ముందే ఆ పార్టీ బడా నాయకులు ఆ ప్రాంతంలో దాదాపు 5 వేల ఎకరాల భుములను కొనుగోలు చేశారని విమర్శించారు. వారు కొనుగోలు చేసిన భుములకు ఎక్కడ విలువ తగ్గిపోతుందోనన్నా భయంతోనే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు వారి ఆస్తులను కాపాడుకునేందుకే ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారని రామచంద్రరెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment