Kapu Ramachandra Reddy
-
కాపు VS కాల్వ వాడుకుని ఇరికించారు..!
-
కాపు రామచంద్రారెడ్డి రాజీనామాపై పేర్ని నాని రియాక్షన్
-
టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ: కాపు రామచంద్రారెడ్డి
సాక్షి, అనంతపురం జిల్లా: టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ అని, రాయదుర్గంను అభివృద్ధి చేయలేకపోయారంటూ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ పాలనలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని.. రామోజీరావు వద్ద కాల్వ శ్రీనివాస్ బ్రోకర్ పని చేశారంటూ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను చేసిన అభివృద్ధి చూపిస్తూ రోజూ ఫొటోలు పెడతా. సాగు, తాగునీటిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ అబద్ధాలు చెబుతున్నారు. సీఎం జగన్ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేశా. 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించాను. 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: డబ్బు కుమ్మరిస్తేనే టీడీపీ ఎమ్మెల్యే టికెట్! -
చంద్రబాబుకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి
-
టీడీపీ నేతలపై ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఫైర్
-
‘బాలకృష్ణా.. అప్పుడేమైంది నీ పౌరుషం?’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై అసెంబ్లీలో ఇవాళ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నాడంటూ ఏపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు స్కిల్ స్కామ్ అవినీతిలో కూరుకుపోయారు. రాజమండ్రి జైల్లో కూర్చుని చంద్రబాబు నేను సత్యహరిశ్ఛంద్రుడినని బిల్డప్ ఇస్తున్నారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో యువతను చంద్రబాబు దోచుకున్నారు. అవినీతి చేయలేదని సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు అని అన్నారామె. ఇక ఇవాళ్టి సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యల పై చర్చించాడా?. కక్ష సాధింపుగానే చేయాలంటే.. ఈ నాలుగేళ్లలో ఎప్పుడో చంద్రబాబును అరెస్ట్ అయ్యేవాళ్లు కదా. మీ నాన్నను(దివంగత ఎన్టీఆర్) చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు నీ పౌరుషం ఏమైంది?.. మీ నాన్న పై చెప్పులు వేయించినపుడు ఎక్కడికి పోయింది పౌరుషం అంటూ బాలకృష్ణకు చురకలంటించారామె. టీడీపీ నేతలకు దమ్ముంటే.. టీడీపీ నేతలు రచ్చకోసమే అసెంబ్లీకి వస్తున్నారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి టీడీపీ నేతలు పారిపోతున్నారు. టీడీపీ నేతలు చర్చకు మాత్రమే సభకు రావాలి కానీ..రచ్చ కోసం మాత్రం వద్దు. టీడీపీ నేతలకు ఇదే నా సవాల్. రేపు సభలో స్కిల్ డెవలప్ మెంట్ పైన చర్చిస్తున్నాం. 26 న ఫైబర్ నెట్, 27 ఇన్నర్ రింగ్ రోడ్డు పై చర్చ ఉంది. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ నేతలు చర్చకు రావాలి. సభలో ఈరోజు బాలకృష్ణ నిజమైన సైకోలా కనిపించాడు :::ప్రభుత్వ విప్,కాపు రామచంద్రారెడ్డి కోటంరెడ్డి ఓవరాక్షన్ సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారు. స్పీకర్ ఛైర్ కు విలువ ఇవ్వకుండా సభాపతి పట్ల అమర్యాదగా నడుచుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పక్షాన చేరి ఓవరాక్షన్ చేశాడు. చంద్రబాబు ప్రజాధనం ఏవిధంగా లూటీ చేశారో కోర్టుకు అందించాం. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ వాదించినా కేసులో ఆధారాలున్నాయి కాబట్టే న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బాలకృష్ణ తొడలు కొడుతూ,మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించడం దురదృష్టకరం. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజాస్పందన వస్తుందని ఊహించి భంగపడ్డారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ను తెచ్చుకున్నారు. సభలో ప్రజల హక్కులను కాలరాసేలా టీడీపీ నేతలు వ్యవహరించారు. సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ నేతలు సభా మర్యాదలను పాటించలేదు. పయ్యావుల కేశవులు సెల్ ఫోన్ తో చిత్రీరించాలని చూశారు. సభ నుంచి బయటికి వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నం. టీడీపీ నేతలు మీసాలు తిప్పినా ..తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు. చర్చకు రమ్మని కోరితే వచ్చేందుకు టీడీపీ నేతలకు ధైర్యం లేదు. చర్చించేందుకు టీడీపీ నేతల దగ్గర విషయం లేదు. అందుకే సభలో అల్లరి చేస్ బయటికి పోవాలనే గందరగోళం సృష్టించారు. నేటి టీడీపీ నేతల తీరు శాసన సభ చరిత్రలోనే దురదృష్టకరం. :::మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ -
బాబూ.. ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు?
అనంతపురం క్రైం: టీడీపీ హయాంలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన చంద్రబాబునాయుడు ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారని ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నాయకులు బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ)ను పూర్తి చేస్తామని 2014లో చెప్పిన చంద్రబాబు మాట తప్పారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.950 కోట్లు మంజూరు చేశారంటూ నాడు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హడావుడి చేశారని అన్నారు. వైఎస్సార్ హయాంలో కేసీ కెనాల్ నుంచి హెచ్చెల్సీకి 10 టీఎంసీలు కేటాయిస్తే వాటిని రద్దు చేయించిన ఘనుడు కాలవ శ్రీనివాసులని మండిపడ్డారు. సీఎం జగన్ భైరవానితిప్ప ప్రాజెక్టు తొలివిడతలో రూ.240 కోట్లు విడుదల చేశారని, ఇప్పటికే రైతుల అకౌంట్లలో పరిహారం సొమ్ము జమ చేశారని తెలిపారు. ఎన్నికలప్పుడే బాబుకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా ష్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే రైతులు, ప్రాజెక్టులు గుర్తుకొస్తాయని విమర్శించారు. 1998లో హంద్రీ–నీవాకు, 2018లో జీడిపల్లి – పేరూరు డ్రిప్ ఇరిగేషన్ స్కీంకు శిలాఫలకాలేసి వదిలేశారని చెప్పారు. 560 కిలోమీటర్ల హంద్రీ–నీవా కాలువలో 125 కిలోమీటర్లకే పరిపాలన అనుమతులిచ్చి రైతులను మోసం చేశారన్నారు. వైఎస్సార్ హయాంలో రూ.60వేల కోట్లతో 63 ప్రాజెక్టులు చేపట్టి, వాటిలో 23 పూర్తి చేశారన్నారు. మిగతా ప్రాజెక్టుల్లోనూ 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన 30 శాతం పనులకు చంద్రబాబు హయాంలో వంద నుంచి వెయ్యి రెట్లు అంచనాలు పెంచి, 15 శాతం పనులే చేసి రూ.60 వేల కోట్లు దోపిడీ చేశారని తెలిపారు. ఆ దోపిడీ సొమ్ముతో బాబుకు అత్యంత సన్నిహితులైన సీఎం రమే ష్, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు చార్టర్డ్ విమానాలు కొన్నారని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి పేరూరు డ్యాంకు 2.7 టీఎంసీల నీరందించారని, పెన్నానదికి జీవం పోశారని తెలిపారు. మభ్య పెట్టేందుకే: శంకరనారాయణ రైతులను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ విమర్శించారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసే హంద్రీ–నీవా ప్రాజెక్టును చంద్రబాబు తాగునీటి ప్రాజెక్టుగా మార్చి తూట్లు పొడిచారని చెప్పారు. రైతుల కష్టాలు తీర్చడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవాను తిరిగి సాగునీటి ప్రాజెక్టుగా మార్చారని, ఆయన హయాంలోనే 80 శాతం పూర్తి చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక మిగిలిన అరకొర పనులకు అంచనా వ్యయం భారీగా పెంచుకుని, ప్రజాధనాన్ని దోచేశారని విమర్శించారు. ప్రాజెక్టులకు బాబే అడ్డంకి రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబే అడ్డంకులు సృష్టిస్తున్నారని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ధ్వజమెత్తారు. మడకశిర బ్రాంచ్ కెనాల్‌ను నిర్విర్యం చేశారన్నారు. 2019లో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు నీరు వచ్చినా కదిరి ప్రాంత రైతులకు నీరివ్వకుండా కుప్పంకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు ఏకంగా రైతులపై కేసులు పెట్టారని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డి మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా 150 చెరువులకు నీరందించారని తెలిపారు. చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తే వర్షాలు పడవని, రైతులు తీవ్రంగా నష్టపోతారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు చైర్పర్సన్ లిఖిత తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విప్‌పై దాడికి టీడీపీ కార్యకర్త యత్నం
గుమ్మఘట్ట: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) గ్రామంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై టీడీపీ కార్యకర్త బెస్త మూర్తి దాడికి యత్నించారు. కాపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్లారు. ఈ మూడేళ్లలో ఏయే పథకాల ద్వారా ఎంతెంత లబ్ధిచేకూరిందన్న వివరాలతో బ్రోచర్లను లబ్ధిదారులకు అందించారు. బెస్త మూర్తి కుటుంబానికి అమ్మఒడి పథకం ద్వారా రూ.29 వేలు, రైతుభరోసా రూ.27 వేలు, సున్నావడ్డీ పథకం ద్వారా రూ.4,619, వైఎస్సార్ ఆసరా కింద రూ.20,562 లబ్ధిచేకూరిందనే విషయాన్ని వివరిస్తుండగా మూర్తి దురుసుగా మాట్లాడాడు. అక్కడే ఉన్న ఎస్ఐ సునీత జోక్యం చేసుకుని వారిస్తున్నా రెచ్చిపోయాడు. ప్రభుత్వ విప్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు చేతిని నలిపి, గోరు గుచ్చడంతో రక్త గాయమైంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే మూర్తి ఈ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పై టీడీపీ నేత దాడి
-
ఆర్బీకేలు ఆధునిక దేవాలయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఆధునిక దేవాలయాలుగా మారాయని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. చంద్రబాబు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రైతులకు భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు బుధవారం ‘వ్యవసాయం–అనుబంధ రంగాలు’ పై స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. వ్యవసాయాన్ని పండుగ చేస్తాం జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను వ్యవసాయాన్ని పండుగ చేసేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. డ్యాములు కళకళలాడుతున్నాయి. కరువు లేదు. చంద్రబాబు హయాంలో కరువు తప్ప ఇంకోటి లేదు. విత్తు దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు సీఎం జగన్ రైతుకు భరోసా ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువుల్లో కల్తీని అరికట్టేందుకు అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మా ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపి మార్కెట్‌కంటే ఎక్కువ రేటుకే కల్లాల వద్దే ధాన్యం కొంటోంది. కోళ్ల పరిశ్రమ, ఆక్వా, సెరీకల్చర్ ఇలా అన్ని వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదుకుంటోంది. వ్యవసాయం అంటే బాబుకు నిర్లక్ష్యం రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. నాడు వైఎస్సార్ వ్యవసాయానికి ఊపిరి పోస్తే.. ఆయన తనయుడిగా సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేశారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ బకాయిలు కట్టలేదని రైతులపై కేసులు పెట్టారు. ఎంతో మంది పల్లెలను వదిలి వలస వెళ్లిపోయారు. వారిని వైఎస్సార్ వెనక్కి తీసుకొచ్చి వ్యవసాయం చేయించారు. ఆయన ఆశయ సాధనకు సీఎం జగన్ రైతులపై రూపాయి భారం పడకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారు. 30 ఏళ్ల పాటు ఆటంకం లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాగును పెంచాలి. ప్రకృతి వ్యవసాయంపైనా దృష్టి సారించాం. బాబు ఐదేళ్లలో ఒక్క గింజ కూడా కొనలేదు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రైతును మోసం చేసే వాడు భూమిపై బతికి బట్టకట్టలేడు. ఆనాడు చంద్రబాబు రైతులను బషీర్‌బాగ్‌లో కాల్చి చంపారు. వ్యవసాయం దండగ అన్నారు. రుణమాఫీ పేరుతో మోసం చేశారు. అందువల్లే ఆయనకు ఈ దుర్గతి పట్టింది. సీఎం జగన్ మంచి చేస్తున్నారు కాబట్టే రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మా దగ్గర ఒక్క ధాన్యం గింజ కూడా కొనలేదు. ఇప్పుడు మా ప్రాంతంలో రైసు మిల్లులు లేకపోయినా ధాన్యం కొని, రాయదుర్గం నుంచి చిత్తూరుకు ప్రభుత్వమే తరలిస్తోంది. మా దగ్గర ఆదర్శ భారత కోఆపరేటివ్ సొసైటీలో ఎక్కువ లోన్లు ఇస్తున్నారు. వాటికి వడ్డీ రాయితీ రావట్లేదు. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని కోఆపరేటివ్ సొసైటీలకు కూడా వడ్డీ రాయితీ వర్తింపజేయాలి. రైతుల సంక్షేమం ఆగదు మాజీ ఉప సభాపతి కోన రఘుపతి కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో రైతులకు సంక్షేమ పథకాలు ఆగలేదు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఒక చరిత్ర. ఒక్క రూపాయికే పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ. 3 వేల కోట్లు ఇవ్వడం వంటివి రైతుల గురించి ఆలోచించే వారే చేస్తారు. కోవిడ్ సమయంలోనూ ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాం. చంద్రబాబు రూ.88 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి దగా చేశారు. మా సీఎం జగన్ రైతు భరోసాతో వ్యవసాయానికి ఊపిరి పోశారు. ఆర్బీకేల ద్వారా 98 శాతం పంట నమోదు, విక్రయం జరుగుతోంది. పక్క రాష్ట్రాల వారు వచ్చి మన ఆర్బీకేల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆర్బీకేలను బ్యాంకులతో అనుసంధానం చేసి రైతులకు ఆర్థిక సపోర్టును మరింత పెంచాలి. ఉచిత విద్యుత్ రైతులకు వరం చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైఎస్సార్ హయాంలోనే రైతుల స్వర్ణ యుగం ప్రారంభమైంది. వైఎస్సార్ తర్వాత రైతులను పట్టించుకున్న నాయకుడు సీఎం జగన్. రైతుల కోసం ఈ మూడేళ్లలో చరిత్రలో లేనన్ని పథకాలు తెచ్చారు. ఆర్బీకేలు ప్రతి గ్రామంలో ఆధునిక దేవాలయాలుగా మారాయి. పశువులకు అంబులెన్సులు వచ్చాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ సలహా మండళ్లు ఏరా>్పటు చేసి సాగులో మెళకువలు నేర్పుతున్నారు. గతంలో కంటే ఎక్కువ వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు. -
అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ ఆదర్శం
డీ హీరేహాళ్ (రాయదుర్గం): ‘కళ్లెదుటే సచివాలయం.. పక్కనే రైతు భరోసా కేంద్రం.. చెంతనే నూతన హంగులతో రూపుదిద్దుకున్న సర్కార్ బడులు.. మరోవైపు హెల్త్ క్లినిక్.. నాలుగడుగులు ముందుకేస్తే డిజిటల్ లైబ్రరీ.. సమీపంలోనే పాల సేకరణ కేంద్రం.. ఇది సీఎం వైఎస్ జగన్ మూడేళ్ల క్రితం కన్న కల. దీన్ని సాకారం చేసేందుకు ఆయన వేసిన విత్తు మొక్కగా మొలిచి రాష్ట్ర వ్యాప్తంగా మహా వృక్షంలా ఎదిగింది. రూ.కోట్లు విలువ చేసే స్థిరాస్తులను ప్రజలకే అంకితం చేసిన గొప్ప పాలనాదక్షుడు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ మండలం సోమలాపురంలో మోడల్‌గా ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సచివాలయం, ఆర్బీకే, హెల్త్‌క్లినిక్ ఇతర కార్యాలయాలను ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి ప్రభుత్వ విప్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుదర్శనరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విప్ కాపు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఒక్క సోమలాపురంలోనే వివిధ పథకాల కింద రూ.8.62 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారన్నారు. అర్హతే ప్రామాణికంగా నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికీ రూ.1.50 లక్షలకు తక్కువ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రూ.1.65 లక్షల కోట్లను జమచేసిన ఏకైక ప్రభుత్వంగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించిందన్నారు. మూడేళ్ల వ్యవధిలోనే 30 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించామన్నారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా రూ.41 కోట్లతో 39 గ్రామాలకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా తాగునీరందించబోతున్నామన్నారు. ఇందులో ఒక్క డీ హీరేహాళ్ మండలంలోనే 22 గ్రామాలు ఉన్నాయని ప్రకటించారు. దోపిడీపైనే కాలవ దృష్టి మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజా ధనం దోపిడీ చేయడం తప్ప ప్రజల సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని విప్ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. నాడు ‘నీరు– చెట్టు’ పనుల్లో రూ.కోట్లు దోచుకున్నారని, ఇసుక, మట్టిని కొల్లగొట్టారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడేదో ప్రజల కోసం ఉద్ధరిస్తున్నట్లు రాయదుర్గంలో నాటకాలకు తెరలేపారన్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో ప్రజలను మరోమారు మోసం చేస్తున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో కాలవ శ్రీనివాసులు అనంతపురానికి, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయి తలదాచుకున్నారని ధ్వజమెత్తారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలూ సమగ్రాభివృద్ధి చెందుతాయని ఎంపీ రంగయ్య స్పష్టం చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసేందుకే కుట్ర పన్నుతున్నారని టీడీపీ అధినేతపై ధ్వజమెత్తారు. గతంలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయడంతో ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇది రుచించడం లేదని, అందుకే సంక్షేమ పథకాల తమాషా అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పథకం ఆపాలో ప్రజల్లోకొచ్చి చెప్పే దమ్ముందా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్, ఏడీఏ లక్ష్మానాయక్, ఎంపీపీ పవిత్ర, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాబాను, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్‌నాయక్, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ వన్నూర్‌స్వామి, మైనార్టీ నాయకుడు రహంతుల్లా, పార్టీ నాయకులు అంజిరెడ్డి పాల్గొన్నారు. -
రాయదుర్గం ఎమ్మెల్యే అల్లుడు ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆత్మహత్య చేసుకున్నారు. కాపు రామచంద్రారెడ్డి కుమార్తె భర్త అయిన మంజునాథరెడ్డి తాడేపల్లిలోని అవంతి అపార్టుమెంటులోని ఫ్లాట్‌లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కార్పొరేట్ ఆస్పత్రిలో భద్రపర్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. (క్లిక్: ఆర్జీఎఫ్.. ఇది మన కేజీఎఫ్) -
బలంగా ‘బాదినా’ బుద్ధి రాలేదా?
రాయదుర్గం: ‘ప్రజల సంక్షేమాన్ని విస్మరించినందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేసినా మీకు బుద్ధి రాలేదా..? ‘బాదుడే.. బాదుడు’ కార్యక్రమం పేరుతో వీధినాటకాలకు తెర తీస్తారా? పేదలపై వివక్ష, విద్వేషాలను రెచ్చగొట్టే ‘పచ్చ’ కుట్రలకు స్వస్తి పలకకపోతే 2024 ఎన్నికల్లో మూడు సీట్లు కూడా దక్కవు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుపై రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రాయదుర్గంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘పచ్చ బ్యాచ్’ ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తుండడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క మంచి పనైనా చేశావా అంటూ కాలవను ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకునే నీకు ధరల పట్ల కనీస జ్ఞానం లేకపోవడం విచారకరమన్నారు. ‘పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలోని మొలకాల్మూరు, చిత్రదుర్గం, బళ్లారికి నాతో కలిసి నీవు, నీ పచ్చ బ్యాచ్, మీడియాతో వస్తే అక్కడ మీరు చెప్పిన దుకాణాల్లో నిత్యావసర ధరలు విచారిద్దాం.. ఆ తర్వాత రాయదుర్గం, అనంతపురం వచ్చి ఇక్కడెలా ఉన్నాయో బేరీజు వేద్దాం. ధరల్లో వ్యత్యాసం కనిపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అంటూ సవాల్ విసిరారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలను మోసం చేయాలని చూడొద్దని హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ అభిమతమని, పేదలందరికీ కడుపునిండా అన్నం పెట్టాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని గుర్తుచేశారు. అసత్య ఆరోపణలు మానుకోకపోతే ‘చీపుర్లతో బాదుడు’ తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియా తోకలు కత్తిరిస్తాం.. ‘సొంత డబ్బుతో నిస్వార్థంగా సామాజిక సేవ చేస్తున్న నాపై విమర్శలు చేసినా సహించా. దీన్ని అలుసుగా తీసుకుని నా కుటుంబంపై అక్కసు వెళ్లగక్కుతూ అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టించేలా కుట్రలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖబడ్దార్’ అంటూ కాలవకు విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ‘రెడ్‌క్రాస్ సంస్థకే వన్నె తెచ్చేలా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి.. ఆపద సమయంలో ప్రజలకు రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే బాధ్యత సంస్థ చైర్‌పర్సన్‌గా కాపు భారతి తీసుకుంటే ప్రశంసించాల్సిందిపోయి.. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టిస్తావా..? ఇదా రాజకీయంలో నీవు నేర్చుకున్న నీతి’ అంటూ విరుచుకుపడ్డారు. అసభ్యకర పోస్టింగ్‌లపై ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అయినా పద్ధతి మార్చుకోకపోతే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కాలవ శ్రీనివాసులు చీకటి బతుకు గురించి తెలిస్తే ప్రజలే ముఖాన ఉమ్మేస్తారని, పరిస్థితి అంతదాకా తెచ్చుకోవద్దని అన్నారు. నీతిమాలిన రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచావని దుమ్మెత్తి పోశారు. కరోనా లాంటి కష్టకాలంలో రోడ్డు మీదకొచ్చి తాము ప్రజలకు సేవ చేస్తే ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. కులాలు, మతాల మధ్య కుంపట్లు పెట్టి ప్రశాంతంగా ఉండే రాయదుర్గాన్ని రావణకాష్టగా మార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. మార్ఫింగ్ వీడియో పోస్టు చేయించి డ్రామాలా? బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో టీడీపీ ఆడిన డ్రామాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయని విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ‘ఐ– టీడీపీ’ అనే ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా అర్ధరాత్రి మారి్ఫంగ్ వీడియో పోస్ట్ చేసి నీచమైన కుట్రకు ఒడిగట్టి.. ఏదో జరిగిపోయిదంటూ డ్రామాలు ఆడతారా అంటూ నిలదీశారు. వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ చెబుతున్నా.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. 2024 ఎన్నికలే టీడీపీకి ఆఖరివి కానున్నాయన్నారు. ఇందుకు చాలామంది టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరడమే నిదర్శనమన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రీనివాస్‌యాదవ్, వలిబాషా, వైఎస్సార్సీపీ పట్టణ కనీ్వనర్ ముస్తాక్, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్ మహే‹Ù, మండల కనీ్వనర్ బోయ మంజునాథ, సీనియర్ నాయకుడు గొల్లపల్లి కాంతారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్) -
Anantapur: కాలవా.. కంత్రీ వ్యవహారాలు మానుకో
సాక్షి, అనంతపురం: ‘రాయదుర్గం ప్రజల దీవెనలతో రాష్ట్రానికి మంత్రిగా చేశావ్. నీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదు. అదే మేము ప్రజలకు మంచి చేస్తుంటే సంతోషించాల్సింది పోయి కంత్రీలా వ్యవహరిస్తావా’ అంటూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీరుపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన రాయదుర్గంలోని తన కార్యాలయంలో మునిసిపల్ చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప, వైస్ చైర్మన్ వలీబాషా, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ ముస్తాక్, జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్ మహేష్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, పలు వార్డుల కౌన్సిలర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాలవ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో కూర్చొని చెంచాగాళ్లయిన కొందరికి డైరెక్షన్ ఇస్తూ తమను అడ్డుకోవాలని కుట్ర పన్నడం, దాన్ని ఏదో జరిగిపోయినట్టు ఎల్లోమీడియా చిత్రీకరించడం, ప్రజల్లో తమకు వ్యతిరేకత ఉన్నట్టు దుష్ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. డి.కొండాపురంలో ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో మూడు రేషన్‌కార్డులుంటే రూ.2.40 లక్షలు, వడ్రవన్నూరులోనూ టీడీపీ నాయకుడి కుటుంబానికి రూ.2.50 లక్షల ప్రభుత్వ సహాయం అందిందని, అందుకు సంబంధించిన బ్రోచర్లను తాము అందించామని తెలిపారు. ఇలా లబ్ధి పొది కూడా పచ్చ నాయకులు విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చదవండి: (పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్) ఐటీ కట్టినోడికి అమ్మఒడి ఎలా ఇవ్వాలి? ‘రాయదుర్గం 8వ వార్డులో టీడీపీ సోషల్‌మీడియా కార్యకర్తకు గత రెండేళ్లు అమ్మఒడి వచ్చింది. ఈ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినందున జాబితాలో పేరు రాలేదు. అంతమాత్రాన ఉద్యోగులు, వలంటీర్ పట్ల రౌడీలా ప్రవర్తిస్తాడా? ఇంటి వద్దకెళ్లిన నా పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడమని డైరెక్షన్ ఇస్తావా కాలవా? అతనిపై వలంటీర్ ఫిర్యాదిస్తే నీవు గుంపును వెంటేసుకుని రచ్చ చేస్తావా? కర్ణాటక రాష్ట్రం రాంపురంలో బిందెల కంపెనీ పెట్టి ఆ ప్రాంత ప్రజలతో చీపుర్లతో కొట్టించుకున్న వ్యక్తికి నీలాంటి ద్రోహులు అండగా నిలవడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నార’ని విప్ కాపు అన్నారు. ఇటీవల కణేకల్లులోనూ అప్పులు ఎగ్గొట్టిన టీడీపీ నాయకుడికి కాలవ అండగా నిలవడం శోచనీయమన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన కాలవ.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. రాజకీయ వ్యభిచారిగా మారిన అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం దురదృష్టకరమన్నారు. అప్పుడేం పీకావ్? ‘రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం పీకావ్? పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఎందుకివ్వలేదు? మీ అసమర్థత వల్లే ఈ రోజు మా ప్రభుత్వం రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాల్సి వచ్చింది. నీ హయాంలో టెంకాయ కొట్టిన రోడ్లను సైతం మేమే బాగుచేశాం. దమ్మూ ధైర్యముంటే మాతో పాటు గడప గడపకూ రా! నీవేం చేశావో.. మేమేం చేస్తున్నామో ప్రజలనే నేరుగా అడుగుదాం’ అని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. నీవొక అడుగు ముందుకేస్తే..తాను పదడుగులు ముందుకేస్తానని, తగ్గేదేలేదని అన్నారు. సమావేశంలో మునిసిపల్ కౌన్సిలర్లు దేవరాజు, పద్మ, శారద, గోవిందరాజులు, ఫకృద్దీన్, కృష్ణమూర్తి, పొరాళ్ల శివ, వైజాక్ రిబ్కా, గుమ్మఘట్ట మండల కన్వీనర్ బోయ మంజునాథ, ఎస్సీసెల్ రాష్ట్రకార్యదర్శి గోవిందు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మార్కెట్‌యార్డు డైరెక్టర్ నారాయణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఊపిరి ఉన్నంత వరకు జగన్ వెంటే: కాపు రామచంద్రారెడ్డి
డి.హీరేహాళ్ (గుమ్మఘట్ట)అనంతపురం జిల్లా: తన ఊపిరి ఉన్నంత వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సామాజిక సమీకరణల్లో భాగంగా సీనియర్లలో కొందరికి మంత్రి పదవులు దక్కలేదని, అంతమాత్రాన ఎవ్వరూ బాధ పడాల్సిన అవసరం లేదని, అందరికీ సముచిత ప్రాధాన్యత ఉంటుందని సీఎం తెలిపారన్నారు. అన్నీ ఆలోచించి సీఎం తీసుకున్న నిర్ణయం తమకు శిరోధార్యమన్నారు. బుధవారం విప్ కాపుతో పాటు ఆయన భార్య కాపు భారతి, కుమారుడు ప్రవీణ్‌రెడ్డి, వియ్యంకుడు భీమవరం శ్రీరామిరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. చదవండి: పవన్.. వరి ఎలా పండిస్తారో తెలుసా? అనంతరం కాపు కుటుంబ సభ్యులు అక్కడి విశేషాలను ‘సాక్షి’కి తెలిపారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి రావడం తనకు, కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తన స్వస్థలం బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి అని, అక్కడ కురుబ సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, వారితో తనకు సోదర భావం ఉందని గుర్తు చేశారు. ఆ సామాజికవర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్‌కు కేబినెట్లో చోటు దక్కడం వల్ల కళ్యాణదుర్గం,రాయదుర్గం నియోజకవర్గాలకు మేలు చేకూరే రోజులు వచ్చాయనే సంతోషం తనకు కలుగుతోందన్నారు. 2009 నుంచి వైఎస్ జగన్ వెంట నడిచానని, తన భవిష్యత్‌ను చక్కదిద్దుతానని ఆయన హామీ ఇవ్వడం ఆనందాన్నిస్తోందని అన్నారు. అభివృద్ధి కోసం కలసి పనిచేస్తాం సీఎంఓ కార్యాలయానికి తాము వెళ్లినపుడు రాయదుర్గం ప్రజలు ఎలా ఉన్నారని అక్కడి వారు అడగడం తనకు కొండంత ధైర్యాన్నిచ్చిందని విప్ కాపు అన్నారు. బీటీపీకి నీరిచ్చే అంశంతో పాటు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు. తనకు మంత్రి పదవి రాలేదని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. సోదరి సమానురాలైన ఉషశ్రీచరణ్ మంత్రి అయిన నేపథ్యంలో రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల అభివృద్ధికి కలిసి పని చేస్తామని తెలిపారు. మంత్రి ఉషశ్రీచరణ్‌కు తమ కుటుంబ సభ్యులందరూ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపామన్నారు. త్వరలో ఆమెను కలిసి ఘనంగా సన్మానిస్తామని చెప్పారు. -
రూ.వెయ్యి కోట్లు ఏ ఖాతాలో ఉన్నాయి?
కణేకల్లు(అనంతపురం): భైరవానితిప్ప ప్రాజెక్ట్ (బీటీపీ)కు హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చేందుకు టీడీపీ హయాంలో మంజూరైన రూ.వెయ్యి కోట్లు ఏ ఖాతాలో ఉన్నాయో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రజలకు తెలపాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాయదుర్గం మార్కెట్‌యార్డు చైర్పర్సన్ ఉషారాణి, జెడ్పీటీసీ సభ్యులు డి.పద్మావతి, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ లీలావతి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చిక్కణ్ణ, మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డితో కలిసి కణేకల్లులోని హెచ్చెల్సీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. బీటీపీ కోసం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు కాలవ తెచ్చిన జీఓ అంతా ఉత్తిదేనన్నారు. జగన్‌తోనే బీటీపీకి కృష్ణా జలాలు సాధ్యమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయదుర్గానికి వచ్చిన సమయంలో బీటీపీకి కృష్ణా జలాలు తీసుకొస్తామని మాట ఇచ్చారని, త్వరలోనే పనులు ప్రారంభించి కృష్ణా జలాలు తెచ్చితీరుతామన్నారు. కాలవా.. ఇవి నిజం కాదా..? బీటీపీపై మట్టి రోడ్డు వేసి రూ.50 లక్షలు, పైలాన్ కట్టి రూ.80 లక్షలు మీరు దోచేయడం నిజం కాదా..? నాగేపల్లి గ్రామంలో మారుతి వనం పేరుతో అనుచరులతో కలిసి రూ.కోట్లు పందికొక్కుల్లా మెక్కడం వాస్తవం కాదా..? కులానికో కల్యాణ మంటపమంటూ స్థలం కేటాయింపులపై ఉత్తుత్తి కాగితాలిచ్చి కుల రాజకీయాలు చేసింది నువ్వు కాదా...? 2019లో ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో ఓబుళాపురం గ్రామంలో తాగునీటి పథకం పనికి భూమి పూజ చేసి ప్రజలను వంచించిన ఘనత నీది కాదా..? రూ.3,500 కోట్లతో రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్న కాలవ ఆ నిధులతో ఏయే పనులు చేశారో చెప్పాలని కాపు నిలదీశారు. మీ జాతకాలు బయటపెడతా అసెంబ్లీ సమావేశాల తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలో ‘నీరు–చెట్టు’ పథకం పేరుతో కాలవ, అతని అనుచరులు ఎవరెవరు ఎంత దోచేశారో.. వారి జాతకాలను బయట పెడతానని కాపు పేర్కొన్నారు. కణేకల్లు చెరువు పేరుతో రూ.2 కోట్లు, కళేకుర్తి చెరువు పూడికతీత పేరుతో భారీగా నిధులు దోచేశారన్నారు. సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు పైనేటి తిమ్మప్పచౌదరి, మాజీ అధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, కణేకల్లు పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ టీ.కేశవరెడ్డి, మాజీ సర్పంచు పాటిల్ చెన్నకేశవరెడ్డి, కెనిగుంట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు కడుపు మంట అనే వ్యాధితో బాధపడుతున్నారు
-
నారా లోకేశ్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్‌పై డి.హీరేహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విటర్లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు. వివరాలు... టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వేస్తూ.. లోకేశ్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ భోజరాజు నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని మండిపడ్డారు. చదవండి: చంద్రబాబుపై క్రిమినల్ కేసు -
టీడీపీ ప్రతి విషయంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది
-
సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం
సాక్షి, అనంతపురం : సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకమని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామిలతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఒకేసారి 1088 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచడం ఎక్కడా జరగలేదని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. సీఎం జగన్ గొప్ప మానవతావాది.. ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు సీఎం జగన్ చర్యలు అభినందనీయమని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రతీదీ రాజకీయం చేయడం చంద్రబాబుకు బాగా అలవాటైపోయిందన్నారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్రల వల్లే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందలేదంటూ విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే ఆర్థిక బిల్లును చంద్రబాబు అడ్డుకున్నారని, నీచ రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు అనైతిక రాజకీయాల వల్లే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయని ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. మండలిలో ఆర్థిక బిల్లును టీడీపీ ఎమ్మెల్సీలు కావాలనే అడ్డుకున్నారన్నారు ప్రభుత్వ ఉద్యోగుల ఉసురు చంద్రబాబుకు తప్పదని, ఏపీ అభివృద్ధికి చంద్రబాబే అడ్డుగా ఉన్నారని ఆయన విమర్శించారు. -
లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలి
-
టీడీపీ నేతలు ఇకనైనా నాటకాలు ఆపాలి
-
‘బాబుకు దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలి’
సాక్షి, అనంతపురం: చంద్రబాబు అవినీతికి చిరునామా అని.. రూ.2వేల కోట్ల అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఐటీశాఖ నిర్ధారించిందని ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నలభై చోట్ల ఐటీ దాడులు చేస్తే ఒక చోట జరిగిన దానిపై టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఒకే కంప్యూటర్ నుంచి చంద్రబాబు బినామీ కంపెనీల్లో లావాదేవీలు జరిగాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని కాపు రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం, హైకోర్టులో పిటిషన్ వేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై ఆరు రోజులు ఐటీ సోదాలు జరిగాయని.. ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు. సీబీఐ, ఈడీ విచారణ కోరే దమ్ము యనమల రామకృష్ణుడికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుపై 22 కేసుల్లో స్టే ఉందని రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ కేసుల్లో విచారణ ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని రామచంద్రారెడ్డి దుయ్యబాట్టారు. -
చాలీచాలని అన్నంతో సరిపెడితే సహించేదిలేదు
అనంతపురం, కణేకల్లు: చాలీచాలని అన్నం, పల్చటి మజ్జిగతో విద్యార్థులను పస్తులు ఉంచితే సహించేదిలేదని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రసన్నకుమారి, సిబ్బందిని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. మంగళవారం రాత్రి కణేకల్లుక్రాస్‌లోని గురుకుల పాఠశాలను ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నం, సాంబారు, వంకాయకూరలను విప్ కాపు పరిశీలించారు.అన్నం, మజ్జిగ తక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కూరగాయలను సంబంధిత కాంట్రాక్టర్ ఎన్ని రోజులకోసారి సరఫరా చేస్తున్నారని ప్రిన్సిపాల్‌ను విప్ ప్రశ్నించగా రోజూ కూరగాయలు సరఫరా చేస్తారని ఆమె సమాధానమిచ్చారు. అదే సమయంలో మెస్ కేర్‌టేకర్ వేణుగోపాల్‌రావు అక్కడికి రాగా.. విప్ కాపు మెనూ, కూరగాయల సరఫరా గురించి అడిగారు. ప్రిన్సిపాల్, మెస్ కేర్‌టేకర్ పొంతనలేని సమాధానం చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇకపై రోజూ తాజాకూరగాయలు కాంట్రాక్టర్‌తో తెప్పించుకోవాలని కాపు సూచించారు. స్టోర్ రూం పరిశీలన .. అనంతరం స్టోర్‌రూమ్‌కెళ్లి కూరగాయలు, పప్పుదినుసులను విప్ కాపు పరిశీలించారు. క్యారెట్, కూరగాయలు వాడిపోయి ఉండడంతో ఇలాంటివి విద్యార్థులకు వండిపెడితే అనారోగ్యానికి గురికారా? అని ప్రశ్నించారు. ఇలాంటివి మన ఇళ్లలో తింటామా? అని మెస్ కేర్‌టేకర్‌కు చురకలంటించారు. సిబ్బంది క్వార్టర్స్‌పై ఆరా.. గురుకులంలో పని చేసే ఉపాధ్యాయుల నివాసంపై విప్ ఆరా తీశారు. ఇక్కడెన్ని క్వార్టర్స్ ఉన్నాయి..ఎవరెవరు ఉంటున్నారని ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆలూరు చిక్కన్న, మాజీ జెడ్పీటీసీ పాటిల్ నాగిరెడ్డి, కణేకల్లు పట్టణ కన్వీనర్ టి.కేశవరెడ్డి, మాజీ సర్పంచ్ పాటిల్ చెన్నకేశవరెడ్డి, నాయకులు గంగలాపురం ముత్తు, గోవిందరాజులు, ప్రతాప్, పెద్దదేవర ఖలందర్ పాల్గొన్నారు. -
అందుకే టీడీపీ అల్లరి చేస్తోంది: రాపాక
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగుతున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగని ప్రకటించిన తర్వాత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా అదే బాటలో నడుస్తూ రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. వారి సంక్షేమం కోసం సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అయితే టీడీపీ మాత్రం రైతులకు మేలు చేకూర్చే రైతు భరోసా కేంద్రాలు తదితర కీలక అంశాలపై చర్చ జరుగుతుంటే అల్లరి చేస్తోందని విమర్శించారు. స్పీకర్ పట్ల టీడీపీ సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉందని... చేతులు ఊపుకుంటూ స్పీకర్‌ను కొడతామన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాపాక మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచి.. సభను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతుల రక్తం పీల్చిన జలగ చంద్రబాబు... రైతులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చిన చరిత్ర చంద్రబాబుదని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. రైతుల రక్తం పీల్చిన జలగ చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘చంద్రబాబు కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చన్నారు. ఉచిత విద్యుత్ అమలు చేసి చూపించిన ఘనత వైఎస్సార్‌ది. ప్రస్తుతం సీఎం జగన్ అడగకుండానే అన్నీ ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. నాలుగు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు మేలు చేస్తున్నారు. ఈ కేంద్రాలు రైతుల పాలిట వరాలు’ అని పేర్కొన్నారు. ‘అధికారం, అవినీతి లేకపోతే బాబుకు నిద్రపట్టదు’ బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు: కొడాలి నాని ‘బాబు ఉన్నంతసేపు సీమలో కరువు తాండవించింది’ -
‘టీడీపీ విన్యాసాలు సర్కస్‌లా ఉన్నాయి’
సాక్షి, అమరావతి: టీడీపీకి పబ్లిసిటీ కావాలి కానీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. శాసన మండలిలో టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు టీడీపీ సభ్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. టీడీపీకి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్రంపై ప్రేమ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు తీరు ఇలానే ఉంటే టీడీపీలో ఎవరూ మిగలరని హెచ్చరించారు. బినామీల కోసం బాబు ఆరాటం కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. టీడీపీ విన్యాసాలు సర్కస్‌ను తలపిస్తున్నాయన్నారు. బినామీల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నాడని విమర్శించారు. ఎల్లో మీడియాతో చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకరించవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని కమిటీలు కూడా వికేంద్రీకరణనే సూచించాయన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలా న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబాటు ప్రాంతాలపై సీఎం జగన్ దృష్టి సారించారన్నారు. చదవండి: స్పీకర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దాడికి యత్నం -
ఆగని టీడీపీ ఆగడాలు
తెలుగుదేశం పాలనలో ప్రజా సంక్షేమం విస్మరించి అక్రమార్జనపైనే దృష్టిసారించిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డికి పట్టం కట్టారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన కాలవ తన అనుచరులను, టీడీపీ నాయకులను వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి ఉసిగొల్పుతూ గొడవలు సృష్టిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను రెండు వర్గాలుగా విడగొట్టి దాడులకు ఎగదోసి పైశాచికానందం పొందుతున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. సాక్షి, రాయదుర్గం: ప్రశాంతతకు నిలయమైన రాయదుర్గం ప్రాంతంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అలజడి రేపుతున్నారు. పల్లెల్లో ఏదో ఒక గొడవ సృష్టించి తర్వాత తాను నియోజకవర్గంలో అడుగుపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచింది. ప్రజా సంక్షేమ పథకాలతో సాఫీగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే కాలవ శ్రీనివాసులు పల్లెల్లో అల్లర్లు, గొడవలు సృష్టించి వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేసేందుకు పడుతున్న కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తూ వస్తున్నారు. చదవండి: విజయనగరం జిల్లాకు రాజావారి రాజద్రోహం ►గత ఏడాది జూలై 15న రాయదుర్గం మండలం జుంజురాంపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త హనుమంతరాయుడుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జాఫర్ దాడి చేసి గాయపరిచాడు. ►గుమ్మగట్ట మండలం బేలోడులో మొహర్రం పండుగ రోజున చోటుచేసుకున్న చిన్నపాటి గొడవను పెద్దది కాకుండా సర్దిచెప్పి సద్దుమణిగించాల్సిన ప్రతిపక్ష పారీ్టకి చెందిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పచ్చని గ్రామంలో కుల చిచ్చు రగిల్చారు. గ్రామంలో జరిగిన సంఘటనను రాజకీ యం చేసి రాయదుర్గం ఆస్పత్రి వద్ద సెపె్టంబర్ 12న ధర్నా చేసి, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో అటుగా వస్తున్న దళితులతో వారు వాగ్వాదానికి దిగి రాళ్ల దాడికి తెగబడ్డారు. ►కణేకల్లు మండలం కళేకుర్తిలో నవంబర్ 27న గ్రామ వలంటీర్ హరిజన మహేంద్రపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కులం పేరుతో దూషించి వలంటీర్పైన, అడ్డు వచ్చిన అతడి తల్లి మరియమ్మపైనా దాడి చేసి గాయపరిచారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన గ్రామ వలంటీర్ హరిజన మహేంద్ర, తల్లి మరియమ్మ (ఫైల్) ►గుమ్మఘట్ట మండలం బీటీ ప్రాజెక్టు గ్రామానికి చెందిన జయరామిరెడ్డి అనే టీడీపీ కార్యకర్త నవంబర్ 11న తహసీల్దార్ కార్యాలయం వద్ద డ్రామాకు తెరలేపాడు. తనకిచ్చిన నివేశన స్థల పట్టాకు అధికారులు స్థలం ఎక్కడుందో చూపడం లేదని ఖాళీ పురుగుమందు బాటిల్లోకి నీరు నింపి దాన్ని తాగగా, అతని భార్య పల్లవి వీడియో తీసి డ్రామా రక్తి కట్టించింది. రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ఘటన జరగడానికి గంట ముందే మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తనకు కావాల్సిన మీడియా వారికి ఫోన్ చేసి ‘తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లండి.. జయరామిరెడ్డి అనే వ్యక్తి హత్యాయత్నం చేస్తున్నాడం’టూ చెప్పడం వారి కుట్ర రాజకీయాలను బయటపెట్టింది. ►గుమ్మగట్ట మండలం భూపసముద్రం ఉన్నతపాఠశాల కమిటీ చైర్మన్ శ్రీధర్‌పై ఇదే గ్రామానికి చెందిన తమ్మణ్ణ కుమారుడు రాజ అనే టీడీపీ నాయకుడు ఈ నెల నాలుగో తేదీన దాడి చేసి గాయపరిచాడు. టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుని ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎలా మద్దతు పలుకుతావంటూ రాయితో దాడి చేశాడు. ►అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దని వివిధ పారీ్టల నాయకులతో తమకు అనుకూలంగా మలచుకోవడానికి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గంలో ఈ నెల నాలుగో తేదీన వాసవీ కల్యాణమంటపంలో అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు అడ్డుకోవడంతో కాలవ శ్రీనివాసులు రహదారిపైనే సమావేశం నిర్వహించారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో పాటు నన్ను రెచ్చగొట్టవద్దంటూ పోలీసులనే భయపెట్టడానికి ప్రయత్నించాడు. -
‘ఆ భయంతోనే టీడీపీ రాద్దాంతం చేస్తుంది’
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నాడని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో లెజిస్లేటివ్, కర్నూలులో జూడిషియల్‌ను ఏర్పాటు చేసేందుకు అందరూ అంగీకరిస్తున్నారని అన్నారు. దీనివల్ల మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పరిచేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎన్నికల ముందే తాము అధికారంలోకి వస్తే రాజధాని రైతులకు భూములు వెనక్కి ఇస్తామని అప్పట్లో వైఎస్ జగన్ ప్రకటించారని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతాన్ని ప్రకటించక ముందే ఆ పార్టీ బడా నాయకులు ఆ ప్రాంతంలో దాదాపు 5 వేల ఎకరాల భుములను కొనుగోలు చేశారని విమర్శించారు. వారు కొనుగోలు చేసిన భుములకు ఎక్కడ విలువ తగ్గిపోతుందోనన్నా భయంతోనే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు వారి ఆస్తులను కాపాడుకునేందుకే ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారని రామచంద్రరెడ్డి విమర్శించారు. -
వైఎస్ఆర్ లేకపోవడం వల్ల భైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తి కాలేదు
-
‘40 ఇయర్స్ ఇండ్రస్టీ’ ప్రవర్తన ఇలాగేనా..
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో 2,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఏనాడు చంద్రబాబు రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని ధ్వజమెత్తారు. ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో మరణాలను కూడా నమోదు చేయించలేదని మండిపడ్డారు. సిగ్గు పడ్డాలి.. 40 ఇయర్స్ ఇండ్రస్టీ అని చెప్పుకునే ప్రతిపక్ష నేత చంద్రబాబు.. మార్షల్‌తో ప్రవర్తించిన తీరుతో సిగ్గు పడాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు తీరుపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారన్నారు. దిశ చట్టంపై మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దిశ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభినందిస్తూ కేజ్రివాల్ లేఖ కూడా రాశారని తెలిపారు. -
చంద్రబాబు సిగ్గు పడ్డాలి..
-
‘దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు’
సాక్షి, అమరావతి: లోకేష్ అర్థం పర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. లోకేష్ అంటే మాకు భయం ఎందుకని.. మండలిలో ప్రశ్నలు రాకుంటే మేం ఎలా వెళ్తామని ప్రశ్నించారు. ఇవాళ మండలిలో ప్రశ్న ఉంది కాబట్టే వెళ్ళానన్నారు. చర్చ జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రజలే బుద్ధి చెబుతారు.. ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడే సాంబిరెడ్డి మృతి చెందారంటూ చంద్రబాబు ఇంకా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉల్లిపాయలు కోసం సాంబిరెడ్డి క్యూలో నిలబడి తొక్కిసలాటలో మరణించలేదని..గుండెపోటుతోనే మృతి చెందారని స్వయంగా ఆయన కుటుంబసభ్యులే చెప్పిన కూడా చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.నీచ రాజకీయాలు మానుకోపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు డ్రామాలాడుతున్నారు.. దేశం గర్వించే విధంగా మహిళల భద్రత కోసం బిల్లులు ప్రవేశ పెడుతున్నామని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. కీలక బిల్లులు పెట్టే సమయంలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశం అంతా ఏపీ వైపు చూసేలా మహిళల రక్షణకు చట్టం చేసామని చెప్పారు. సభలో కావాలనే టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు సలహాలు,సూచనలు ఇచ్చి సహకరించాలని కోరారు. -
ఆ ఎన్నికల తర్వాత టీడీపీ తుడిచి పెట్టుకుని పోతుంది
సాక్షి, అమరావతి: త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ తుడిచి పెట్టుకుని పోతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఆ పార్టీ ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదని దుయ్యబట్టారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం 2వేల క్యూసెక్ నీటి సామర్థ్యం ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టును 6వేల క్యూసెక్కుల పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అవుకు రిజర్వాయర్‌కు లైనింగ్ చేయని కారణంగా.. నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేయలేక పోతున్నామని ఎమ్మెల్యే తోపుదుర్తి అభిప్రాయపడ్డారు. తెలుగుగంగ కాలువకు ఇప్పటికే సీఎం జగన్ టెండర్లను ఆహ్వానించారని అన్నారు. అలానే గండికోట పునరావాసం ప్యాకేజీని కూడా సీఎం సిద్ధం చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ పూర్తిస్థాయిలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. గత ప్రభుత్వం అందుకు భిన్నంగా రాయలసీమ ప్రాజెక్టులపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. సాగునీటి(ఇరిగేషన్) ప్రాజెక్టులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ నివేదికతో టీడీపీ బాగోతాలు బయట పడతాయని అభిప్రాయపడ్డారు. -
‘త్వరలోనే రాష్ట్రానికి 2100 మెట్రిక్ టన్నుల ఉల్లి’
సాక్షి, అమరావతి: ఉల్లి సమస్య ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లేదు దేశ వ్యాప్తంగా ఉందని, కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉల్లి మీద లొల్లి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను తీర్చడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కిలో ఉల్లిని రూ. 25 సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఉల్లి ధర నిర్ణయించాల్సింది కేంద్రమేనని, ఆ మాత్రం విషయం కూడా చంద్రబాబుకు తెలియదా అని విమర్శించారు. ఉల్లి అక్రమ నిల్వలు చేస్తున్న వారిపై విజలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విప్ కోరుముట్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. డిసెంబర్12న 2100 మెట్రిక్ టన్నుల ఉల్లిని దిగుబమతి చేస్తున్నామని, రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. టీడీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుందని, గుడివాడలో సాంబిరెడ్డి మరణాన్ని రాజకీయం చేయటం తగదని అన్నారు. ఇక మరో విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై చట్టం చేస్తుంటే టీడీపీ నేతలు గోల గోల చేస్తూ అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో ఏమి మాట్లాడతరోనని భయపడిన టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారని విమర్శించారు. ఇకనైన చంద్రబాబు వైఖరి మారాలని, టీడీపీ పార్టీలో ఉంటే అవమానాలు పడాల్సీ వస్తుందేమోనని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. -
టీచర్‌గా మారిన ప్రభుత్వ విప్ కాపు
అనంతపురం ,కణేకల్లు: ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి టీచర్‌గా మారారు. విద్యార్థులకు అనేక ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. వివరాల్లో కెళితే.. గురువారం మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్లో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఉభయచర జీవి ఏది అంటూ విద్యార్థులకు ప్రశ్నించగా కొందరు విద్యార్థులు తప్పుగా సమాధానం చెప్పారు. ఉభయచర జీవి నీరు, భూమిపై జీవిస్తుందని, ఇందుకు ఉదాహరణ కప్ప అంటూ వివరించారు. అనంతరం హిందూ, అరబిక్ అంకెలెన్నీ అని ప్రశ్నించి... సమాధానం రాబట్టారు. రోమన్ అంకెల గుర్తులేవీ అని అడిగారు. ఓవెల్స్ ఎన్ని? అవేవి? అని ప్రశ్నించారు. అనంతరం పలు జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ప్రశ్నలను అడిగారు. విద్యార్థుల్లో బోలెడు విజ్ఞానం ఉందని, బాగా మెరుగుపెడితే రాణిస్తారని హెచ్ఎం సుధాకర్, ఉపాధ్యాయులకు సూచించారు. సార్.. మా సమస్యలు పరిష్కరించండి ‘సార్.. మా స్కూల్లో మరుగుదొడ్లు లేవు.. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం... ప్రహరీ కూడా లేదు. సమస్యలను పరిష్కరించండి’ అంటూ విద్యార్థులు ప్రభుత్వ విప్‌కు విజ్ఞప్తి చేశారు. స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకొంటానని ఆయన హామీ ఇచ్చారు. తహసీల్దార్ ఉషారాణీ, ఎంపీడీఓ విజయభాస్కర్, మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాటిల్ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, పట్టణ కన్వీనర్ టీ.కేశవరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పి.కేశవరెడ్డి, గౌని రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘మాది చేతల ప్రభుత్వం’
సాక్షి, గుంతకల్లు(అనంతపురం) : గుంతకల్లులోని జగ్జీవన్‌రామ్ కాలనీలో నిర్మించిన మారెమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ పీడీ రంగయ్య, ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి పాత గుంతకల్లు వాల్మీకి సర్కిల్లోని వాల్మీకి విగ్రహానికి పూజ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని వారు చెప్పారు. అనంతరం వాల్మీకులు వివిధ సమస్యలపై ఎంపీ, ఎమ్మెల్యేకి వినతిపత్రం అందించారు. డీ.హీరేహాళ్: మండల కేంద్రంలోని నీలకంఠేశ్వ కళ్యాణ మంటపంలో సోమవారం వెలుగు ఏసీ గంగాధర్ ఆధ్వర్యంలో రూ.4 కోట్ల వడ్డీలేని రుణాలను మహిళలకు ప్రభుత్వవిప్ కాపు రామచంద్రారెడ్డి చెక్కుల రూపంలో అందించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన హామీల్లో 80 శాతం వరకు నాలుగు నెలల్లోనే పూర్తి చేశారని, మిగతావి కూడా పూర్తి చేస్తారన్నారు. కళ్యాణదుర్గం: పట్టణంలోని ఆర్డీటీ ఏఎఫ్ ఫీల్ట్ కార్యాలయంలో సోమవారం వెలుగుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 252 మహిళా సంఘాలకు రూ.13 కోట్ల వడ్డీలేని రుణాలు చెక్కులను ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల పక్షపాతి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమది మాటల ప్రభుత్వం మాదని చేతల ప్రభుత్వమన్నారు. -
‘టీడీపీ నాయకులకు మతి భ్రమించింది’
సాక్షి, అనంతపురం: రాజకీయ లబ్ధి కోసమే మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు గ్రామాల్లో కక్షలకు ఆజ్యం పోస్తున్నారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటమి అనంతరం టీడీపీ నాయకులకు మతి భ్రమించిందన్నారు. ప్రభుత్వ పాలనను విమర్శించడమే ధ్యేయంగా పని పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల రౌడీయిజం రోజురోజుకు పెరుగుతుందని.. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పేరు వింటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ శ్రీనివాసులు మాటలు నమ్మి.. ప్రజలు తమ జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. టీడీపీ కార్యకర్తలతో మాకు ఎలాంటి విబేధాలు లేవని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
హెచ్చెల్సీ ఆయకట్టు రైతులను ఆదుకుంటాం
సాక్షి, కణేకల్లు: హెచ్చెల్సీ ఆయకట్టుకు సకాలంలో సాగు నీరు అందించి, రైతులను ఆదుకోవడమే మా కర్తవ్యమని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి హెచ్చెల్సీకి రావాల్సిన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకొని ఆయకట్టుకు నీరిస్తామన్నారు. కర్ణాటకలో ఉన్న అంతరాష్ట్ర భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ తుంగభద్ర డ్యాంను ప్రభుత్వ విప్ కాపు మంగళవారం సందర్శించారు. అనంతరం తుంగభద్రడ్యాం ఎస్డీఈ శ్రీనివాసనాయక్‌తో కలిసి విప్ విలేకరులతో మాట్లాడారు. తుంగభద్రడ్యాం పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల డ్యామ్‌కు భారీస్థాయిలో వరదనీరు వచ్చి చేరుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి భారీ స్థాయిలో నీరొస్తోందన్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 100 టీఎంసీలు ఉన్నాయని, ఆతర్వాత నీటి లభ్యత ఎంత ఉంటుందనేది టీబీ బోర్డు అధికారులతో చర్చించి, మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను తప్పకుండా తీసుకుంటామన్నారు. ఐఏబీ సమావేశంలో చర్చించి నిర్ణయం : డ్యాంలో నీటి లభ్యత, దామాషా ప్రకారం హెచ్చెల్సీకి నీటి కేటాయింపులు, సాగునీటి కేటాయింపులు, రోజువారి ఇండెంట్ వీటన్నిటినీ ఐఏబీ సమావేశంలో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటామని కాపు అన్నారు. హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి అవసరం ఉండటంతో ఐఏబీ సమావేశం కంటే ముందు ఆయకట్టుకు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రా సరిహద్దు 105 కిలోమీటరు వద్ద గరిష్ట స్థాయిలో నీళ్లను డ్రా చేసుకొని ఓ వైపు సాగుకు నీరిస్తూ మరో వైపు తాగునీటి అవసరాల కోసం పీఏబీఆర్‌కు తరలిస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు ఆలూరు చిక్కణ్ణ, ఈశ్వర్‌రెడ్డి, కాంతారెడ్డి, మల్లికార్జున, కణేకల్లు పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ టీ.కేశవరెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు మారెంపల్లి మారెన్న తదితరులు పాల్గొన్నారు. -
లోకాయుక్త సవరణ బిల్లుకు ఆమోదం
సాక్షి, అమరావతి: విపక్షం నిరసనలు, వాకౌట్ మధ్య ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు – 2019ను శాసనసభ శుక్రవారం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టి, పారదర్శక పాలనకు ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులే నిదర్శనమని అధికారపక్ష సభ్యులు ప్రశంసించారు. లోకాయుక్త, న్యాయ పరిశీలన బిల్లుల ద్వారా ముఖ్యమంత్రి దేశానికే ట్రెండ్ సెట్టర్‌లా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. లోకాయుక్త సవరణ బిల్లును ముఖ్యమంత్రి తరఫున డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బిల్లును ప్రతిపాదించగా సభ్యుల హర్షధ్వానాల మధ్య సభ ఆమోదించింది. బిల్లు గురించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సభ్యులకు వివరించారు. సుపరిపాలన దిశగా ఆదర్శవంతమైన బిల్లులు.. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అద్భుతమైన చట్టాలు తెస్తూ మరోవైపు అవినీతి నిర్మూలన, సుపరిపాలన కోసం ముఖ్యమంత్రి ఆదర్శవంతమైన బిల్లులు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. ‘గత ప్రభుత్వం కనీసం సమాచార ప్రధాన కమిషనర్‌ను కూడా నియమించలేదు. ఇటీవల వరకు కమీషనర్లను సైతం నియమించలేదు. గిరిజన సలహా మండలి లేదు. చివరివరకు మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల కొరత ఉన్నందున వీరి స్థానంలో హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను లోకాయుక్తగా నియమించుకోవడం కోసం చట్ట సవరణ అవసరమన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తులు అందుబాటులో ఉన్నందున లోకాయుక్త నియామకానికి ఇబ్బంది ఉండదనే సదుద్దేశంతో చట్ట సవరణ చేస్తున్నామని వివరించారు. ‘లోకాయుక్త కేవలం అవినీతి కేసులను విచారించడానికి మాత్రమే కాదు. పరిపాలనలో అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం లాంటివి కూడా విచారిస్తారు’ అని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏమీ చేయకుండా రహస్య జీవోలతో కాలం గడిపారని విమర్శించారు. ఐదేళ్లుగా జరిగిన లోటుపాట్లపై లోకాయుక్త విచారిస్తుందన్నారు. కర్ణాటకలో లోకాయుక్త పలు కుంభకోణాలను నిగ్గు తేల్చిందని గుర్తు చేశారు. -
ఈ బిల్లు సీఎం జగన్ దార్శనికతకు నిదర్శనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లుకు శాసనసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు వేతన సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకుముందు లోకాయుక్త సవరణ బిల్లుపై ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ సభ్యుడు కాపు రామచంద్రారెడ్డి చర్చను ప్రారంభిస్తూ.. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టాలు తీసుకొస్తూనే.. మరోవైపు అవినీతి నిరోధించడానికి, పరిపాలనను మరింత మెరుగ్గా అందించడానికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బిల్లులు తీసుకువస్తున్నారని, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు, జ్యుడీషియల్ కమిషన్ బిల్లులను తీసుకువస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లు సీఎం వైఎస్ జగన్ దార్శనికతకు ఒక నిదర్శనమని, అవినీతి రహిత మెరుగైన పరిపాలన విషయంలో సీఎం వైఎస్ జగన్ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోతారని కొనియాడారు. గత చంద్రబాబు ప్రభుత్వం కనీసం సమాచార కమిషనర్లను కూడా నియమించలేదని, ట్రైబల్ వెల్ఫేర్ కమిటీని కూడా వేయలేదని తప్పుబట్టారు. లోకాయుక్త కమిషన్‌ను ఏర్పాటు చేయలంటే ప్రస్తుతం హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా హైకోర్టు జస్టిస్‌ను నియమించాలని, అయితే, దేశంలో న్యాయమూర్తుల కొరత ఉండటంతో ఇది సమస్యగా మారిందన్నారు. దేశంలో మొత్తం 1079 మంది న్యాయమూర్తుల అవసరం ఉండగా.. ప్రస్తుతం 534 మంది న్యాయమూర్తులు, 132 మంది అదనపు న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు. 239 న్యాయమూర్తుల పోస్టులు, 174 అదనపు న్యాయమూర్తుల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్నారు. ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో 28 మంది న్యాయమూర్తులు, తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తులు అవసరముండగా.. 13మంది న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారని, 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను లోకాయుక్తగా నియమించడమంటే ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని, అందుకే హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లేదా, హైకోర్టు రిటైర్డ్ జస్టిస్‌ను లోకాయుక్తగా నియమించవచ్చునని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లోకాయక్త చట్టంలో సవరణ తీసుకొచ్చిందని, దేశంలో, రాష్ట్రంలో పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ మేరకు చట్టంలో సవరణ తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి సీఎం వైఎస్ జగన్ మార్గం సుగమం చేశారని అన్నారు. లోకాయుక్త కేవలం అవినీతి కేసులనే కాకుండా.. పరిపాలనలో అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం.. చేయాల్సిన పనులు చేయకపోవడం, చేయకూడని పనులు చేయడం వంటివి విచారిస్తుందని తెలిపారు. లోకాయుక్త వ్యవస్థను బలపరచడం ద్వారా పరిపాలనను మరింత మెరుగు చేయవచ్చునని, మరింత పారదర్శకత తీసుకురావచ్చునని కాపు రామచంద్రారెడ్డి వివరించారు. -
రేయిన్గన్ల పేరుతో రూ.600కోట్లు దోచేశారు
-
ప్రభుత్వ విప్‌గా.. కాపు రామచంద్రారెడ్డి
సాక్షి, రాయదుర్గం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని విప్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సొంత నియోజకవర్గం రాయదుర్గంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇక జిల్లాలోని వీరశైవులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జగన్మోహన్రెడ్డి విశ్వసనీయకు పట్టం కట్టారని కొనియాడారు. నిరుపేదకుటుంబం నుంచీ... కాపు రామచంద్రారెడ్డి స్వగ్రామం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డి పల్లి. నిరుపేద కుటుంబంలో జన్మించిన కాపు..కష్టపడి చదువుకున్నారు. రాయదుర్గం మండలం ఆర్బీ వంక గ్రామానికి చెందిన భారతిని వివాహమాడారు. కాపు రామచంద్రారెడ్డి తొలుత హాస్టల్ వార్డెన్, టీచర్, లైబ్రేరియన్‌గా పలు ఉద్యోగాలు చేశారు. అనంతరం బళ్లారిలోని ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. రాజకీయ అరంగేట్రం వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో ఇష్టపడే కాపు రామచంద్రారెడ్డి...ఆ మహానేత స్ఫూర్తితోనే 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై 14,091 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయిచే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈక్రమంలోనే 2012 జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డిపై 32,476 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాయదుర్గం నియోజకవర్గలోనే చరిత్ర సృష్టించారు. 2014లో స్వల్పఓట్ల తేడాతో పరాజయం చవిచూసినా...నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారు. ప్రస్తుత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులుపై 14,049 ఓట్ల మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. మూడు సార్లు రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన కాపు రామచంద్రారెడ్డి తాజాగా బుధవారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. సేవాతత్పరుడు కాపు రామచంద్రారెడ్డి సామాజిక బాధ్యతగా తన సొంత నిధులతో సుమారు 8 వేల జంటలకుపైగా ఉచిత వివాహాలు, 2 వేల మందికి పైగా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు. వందలాది మంది వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. దేవాలయాలకు విరాళాలు, డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, కంప్యూటర్ల వితరణ, కణేకల్లు జూనియర్ కళాశాలకు కార్పస్‌ఫండ్ ఇచ్చి తనవంతు తోడ్పాటు అందించారు. బయోడేటా పేరు : కాపు రామచంద్రారెడ్డి తండ్రి పేరు : కాపు చిన్న తిమ్మప్ప తల్లిపేరు : కాపు గంగమ్మ పుట్టిన తేదీ : 06.10.1963 అడ్రస్ : డోర్ నెం: 10–1–33, లక్ష్మీబజార్ , రాయదుర్గం , అనంతపురం జిల్లా విద్యార్హత : ఎంకాం (కర్ణాటక యూనివర్సిటీ) బీఎల్ఐఎస్సీ (గుల్బర్గా యూనివర్సిటీ), ఎల్ఐఎస్సీ (గుల్బర్గా యూనివర్సిటీ), ఎల్ఎల్బీ (స్పెషల్) ( గుల్బర్గా యూనివర్సిటీ), భాషా విశారద ఇన్ తెలుగు లిటరేచర్ వృత్తి : న్యాయవాది కుటుంబం : కాపు భారతి (భార్య), ప్రవీణ్‌కుమార్ రెడ్డి (కుమారుడు) అలేఖ్య రెడ్డి ( కోడలు), స్రవంతి రెడ్డి (కూతురు), మంజునాథరెడ్డి (అల్లుడు) -
వైఎస్సార్ సీపీ నేతలపై కక్ష సాధింపు
-
వైఎస్సార్ సీపీ నేతలపై కక్ష సాధింపు
సాక్షి, అనంతపురం: అధికార టీడీపీ రాయదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా కలేకుర్తి జయరామిరెడ్డిపై కణేకల్ పోలీసులు అక్రమ కేసు బనాయించారు. ఈ క్రమంలో కలేకుర్తి జయరామిరెడ్డిపై బంధువుల మాట్లాడుతూ.. మంత్రి కాలువ శ్రీనివాస్ ఒత్తిడితోనే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ నేత సంజీవరాయుడిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తనపై అక్రమ కేసు పెట్టారంటూ జయరామిరెడ్డి ఆందోళనకు గురవడంతో.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రాయదుర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఆయనను పరామర్శించారు. -
మా కుటుంబంపై అక్రమ కేసులు: కాపు
అనంతపురం: టీడీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని మా కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాయదుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. శనివారం కాపురామచంద్రారెడ్డి రాయదుర్గంలో విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ నాయకుల వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదన్నారు. అందుకే హైకోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు. ప్రచారానికి రాకుండా ప్రజలను కార్యకర్తలను పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రజల సొమ్ముతో పోలీసులకు జీతాలు ఇవ్వడం జరుగుతుందే కానీ టీడీపీ నాయకులు ఇచ్చే జీతాలతో కాదని వ్యాఖ్యానించారు. -
హిందుపురంలో టీడీపీకి భారీ షాక్
సాక్షి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే హిందుపురంలో నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. అనంతపురం జిల్లా లేపాక్షి మండల కీలక టీడీపీ నేత మాజీ ఎంపీపీ కొండూరు మల్లికార్జున తన సహచరులతో కలసి హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇక్బాల్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు సాక్షి, మడకశిర : ఎన్నికల సమయం దగ్గర పడటంతో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లా మడకశిర పట్టణానికి టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. రాయదుర్గం మండలం రాయంపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో టీడీపీ ఎంపీటీసీ రామాంజనేయలు తోపాటు 100 మంది వైఎస్సాఆర్సీపీలో చేరారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాయదుర్గంలో పోలీసులు అత్యుత్సాహం
-
పోలీసుల అత్యుత్సాహం.. రామచంద్రారెడ్డి ఇంట్లో సోదాలు
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమీపిస్తున్న వేళ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి నివాసంలో పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడంపై రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులు ఈ విధమైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది అధికారులు, పోలీసులు మంత్రి కాల్వ శ్రీనివాసులకు తొత్తులుగా మారారని ఆయన ఆరోపించారు. సోదాలు చేస్తున్న సమయంలో మీడియాను అనుమతించకపోవడంపైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కుట్రలకు పాల్పడటంపై ఆయన మండిపడ్డారు. -
రాయదుర్గంలో అభివృద్ధి పేరుతో దోచారు
-
వైఎస్సార్ సీపీ నేతలపై కాలవ కక్ష సాధింపు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాయదుర్గంకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మంత్రి కాలవ శ్రీనివాసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. డీ హీరేహాల్ మండలం మురిడిలో సర్వే పేరుతో టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. ఆ సర్వే బృందం గ్రామంలోని వైఎస్సార్ సీపీ ఓటర్ల వివరాలు సేకరించింది. ఈ విషయం తెలుసుకున్న కాపు రామచంద్రారెడ్డి ముగ్గురు అనుమానితులను పోలీసులకు అప్పగించారు. అయితే కాలవ శ్రీనివాసులు ఒత్తిడితో రాయదుర్గం సీఐ చలపతిరావు ఈ కేసును తారుమారు చేశారు. మంత్రి ఆదేశాలతో రామచంద్రారెడ్డితో పాటు 11 మందిపై సీఐ అక్రమ కేసులు నమోదు చేశారు. సీఐ తీరుపై రామచంద్రారెడ్డితో వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడ్డాయి. అనుమానితులను అప్పగిస్తే.. పోలీసులు తమపై కేసులు పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కాలవ శ్రీనివాసులు దొంగ సర్వేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అనుచరులు వైఎస్సార్సీపీ ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. రాయదుర్గం పోలీసులు కాల్వ శ్రీనివాసులుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
‘కాలవ’ అండతోనే తమ్ముళ్ల అరాచకాలు
రాయదుర్గం: ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు అధికమయ్యాయని, మంత్రి కాలవ శ్రీనివాసులు అండతోనే వారు పేట్రేగిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గూండాలు చేస్తున్న అరాచకాలకు అంతులేకుండా పోయిందన్నారు. ఇందుకు ఉదాహరణలు చింతమనేని, కేశినేని నాని లాంటివారు అహంకారంతో ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడమే అన్నారు. ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్న కాలవ రాష్ట్ర మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులుకు అధికారులపై చేసిన దాడులు కనబడలేదా అని కాపు ప్రశ్నించారు. జిల్లాలోని తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఏమి జరుగుతుందో కాలవకు కనబడకపోవడం సిగ్గుచేటన్నారు. పట్టపగలే తహసీల్దార్ కార్యాలయంతో తెలుగు తమ్ముళ్లు చేసిన హత్యలు, ఓ మహిళను విచక్షణారహితంగా అధికార పార్టీకి చెందిన ఓ ఉన్మాది చెప్పుకాలితో తన్నినా ఎందుకు స్పందించలేదని ఆగ్రహించారు. చీఫ్‌విప్‌గా, మంత్రిగా భిక్ష పెట్టిన రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్నో అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం చేస్తూ తెలుగుతమ్ముళ్లు రాక్షసుల్లా వ్యవహరించినా మంత్రి నోరుమెదపకపోవడం విచారకరమన్నారు. పల్లేపల్లిలో ఓ యువకుడిపై దాడి చేసి గాయపరిచింది టీడీపీ వారు కాదా? బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నది మీరు కాదా అని మంత్రిని ప్ర శ్నించారు. అధికార పార్టీకి చెందిన వాడైనా, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వర్గానికి చెందిన వారని మాజీ ఎంపీపీ పుష్పావతి భర్తను పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టినా మంత్రి పట్టనట్టు వ్యవహరించలేదా అని విరుచుకుపడ్డారు. = కాలవ ఎంపీగా ఉన్నపుడు రాయదుర్గం ప్రాంతానికి ఒరగబెటిందేమీ లేదని ఎద్దేవా చేశారు. స్థానికేతరుడైన నీ గెలుపునకు కారణమైన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి.. నీ రాక్షసత్వంపై పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. = నియోజకవర్గంలో నీవు మంత్రి అయిన తరువాతనే నీ ‘పచ్చ సైన్యం’ గూండాల ఆగడాలు, అకృత్యాలు పెచ్చరిల్లాయి. నీవు నియోజకవర్గానికి రాకమునుపు ఇలాంటి సంస్కృతే లేదు. దుర్గం రాజకీ యాల్లో అరాచకాలకు ఆజ్యం పోసిన ఘనుడవు నీవే’ అని విమర్శించారు. = మట్టి, ఇసుక దందాలకు పాల్పడుతూ ఇతరులపై విమర్శలు చేయడం చూస్తే ‘దొంగే .. దొంగ.. దొంగ’ అని అరిచినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. నీ అక్రమాలు, దౌర్జన్యాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కాలవకు హెచ్చరించారు. -
కాపు రామచంద్రారెడ్డి హౌస్ అరెస్ట్
-
అక్రమాలు బయటపడతాయని భయమా?
బెళుగుప్ప: అక్రమాలు బయటపడతాయనే భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకుని బహిరంగ చర్చను మంత్రి కాలవ శ్రీనివాసులు నీరుగార్చారంటూ రాయదుర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. అధికారం చేపట్టిన ఈ నాలుగున్నరేళ్లలో సాధించిన నియోజకవర్గ అభివృద్ధి అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. బెళుగుప్ప మండలం యలగలవంక గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత సుదర్శనరెడ్డి గృహంలో శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు ఆయనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. విషయం తెలుసుకున్న ఆయన సతీమణి భారతి, అనంతపురం పార్లమెంట్ సమన్వయక్త తలారి పీడీ రంగయ్య అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కాపు మాట్లాడుతూ.. కాలవ శ్రీనివాసులు గతంలో ఈ ప్రాంతా ఎంపీగా ఉన్న ఐదేళ్ల కాలంలో కనీసం ఐదు సార్లు కూడా రాయదుర్గంలో పర్యటించలేదని గుర్తు చేశారు. 2002లో కణేకల్లు, బొమ్మనహాళ్ ప్రాంతాలకు చెందిన 173 మంది రైతులపై అకారణంగా నాటి ప్రభుత్వం కేసులు పెడితే వారిని పరామర్శించిన దాఖలాలు కూడా లేవన్నారు. బహిరంగ చర్చ జరగకుండా పోలీసులను అడ్డు పెట్టుకుని కావాలనే తనను గృహ నిర్బంధం చేసారన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 50 మందితో ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్న మంత్రి బెల్టు షాపులు, మట్కా, పేకాట లాంటి వాటిని విచ్ఛలవిడిగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ బహిరంగ చర్చలో వెలుగు చూస్తాయని భయపడ్డారన్నారు. బెళుగుప్ప సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడగట్ట క్రిష్టప్ప, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి దుద్దుకుంట రామాంజినేయులు, మండల ప్రధాన కార్యదర్శి అశోక్, పార్టీ మండల మహిళా కన్వీనర్ యశోదమ్మ పాల్గొన్నారు. -
మరోసారి బయటిపడిన టీడీపీ డొల్లతనం
-
సాకులు చెప్పి తప్పించుకోకు
రాయదుర్గం : మంత్రి కాలవ శ్రీనివాసులు కుంటిసాకులు వీడి.. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సూచించారు. రాయదుర్గంలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు మాట్లాడారు. ‘పరిమిత సంఖ్యలో రావాలని నోటీసులతో పోలీసులను మంత్రి కాలవ గురువారం రాత్రి మా ఇంటికి పంపారు. పరిమిత సంఖ్య అయితే అది బహిరంగ చర్చ ఎలా అవుతుందని’ కాపు ప్రశ్నించారు. తేదీ ఖరారు చేసిన మంత్రి కాలవ.. డీఎస్పీకి అనుమతి కోరిన లేఖలో ఇరువైపులా పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వాలని, తన తరఫున శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చర్యలు తీసుకోవాలని రాయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బహిరంగ చర్చ అంటే అభివృద్ధిపైన గానీ అవినీతిపైన గానీ ఒక్కో అంశంపై ప్రజల సమక్షంలో చర్చించడమే బహిరంగ చర్చ అన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు ప్రజలను తరలించడానికి సామర్థ్యం లేదని మంత్రి చెప్పడం సరికాదని, ప్రజలను తరలించాల్సి న అవసరం లేదని, ప్రజలే ఆసక్తిగా తరలివస్తారని సూ చించారు. రాయదుర్గం ప్రజలు శాంతికాముకులు అనే విషయం నీకు తెలియదా? అని కాపు ప్రశ్నించారు. సమయం లేదు మిత్రమా.. మంత్రి కాలవ శ్రీనివాసులు గత ఎన్నికలకు 15 రోజుల ముందు దుస్తులు సర్దుకొని రాయదుర్గం వస్తే .. ఆయన అందం చూసి ప్రజలు ఓటువేసి గెలిపించలేదని కాపు అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను నమ్మారని, ఈయన కూడా ప్రచారం చేయడంతోనే గెలిపించారన్నారు. అవే అంశాలపై చర్చించడానికి ఒప్పుకోకపోవడం ఎంత వరకు సబబన్నారు. కాలవ ఎంపీగా వున్న సమయంలో దుర్గం అభివృద్ధికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. 2002లో హెచ్చెల్సీ నీటి కోసం జరిగిన ఉద్యమంలో రైతులపై కేసులు పెడితే, ఇటు వైపు తిరిగి చూడని నీవు రైతులకు ఏమిలబ్ధి చేకూర్చావని నిలదీశారు. సమయంలేదు మిత్ర మా... పోలీసులతో అనుమతి తీసుకో... చర్చించడానికి మేము వస్తున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి, బీసీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎన్టీ సిద్దప్ప, బీటీపీ గోవిందు, జిల్లా అధికార ప్రతి నిధి మాధవరెడ్డి, మండల కన్వీనర్లు మలి ్లకార్జున, కాంతారెడ్డి, ఆలూరు చిక్కణ్ణ, ఈశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ గోనబావి శర్మస్, పట్టణ ప్రచార కార్యదర్శులు పైతోట సంజీవ, హనుమంతు, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాసులు, సీతారం, బాబు, గిడ్డరాము, నాయకులు ముల్లంగి నారాయణ స్వామి, ఎంసీహెచ్ రాజ్‌కుమార్ , కొత్తపల్లి సత్యనారాయణ రెడ్డి, లక్ష్మిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బేలోడు రామాంజనేయులు, తిమ్మప్ప, సత్తి పాల్గొన్నారు. పోలీసుల అదుపులో కాపు డి.హీరేహాళ్ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రాయదుర్గం వస్తున్న కాపు రామచంద్రారెడ్డిని మల్లాపురం రోడ్డు సమీపాన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము శాంతియుతంగా ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోవడమేంటని కాపు ప్రశ్నించారు. అవసరమైతే గృహనిర్బంధం చేసుకోండి.. ఇలా నియోజకవర్గం దాటించాలని చూస్తే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారన్నారు. అయితే పోలీసులు అందుకు ససేమిరా అన్నారు. పరిమిత సభ్యుల మధ్య చర్చిద్దాం: మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం : 2014 నుంచి ఇప్పటి వరకు దుర్గం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి , అవినీతిపై బహిరంగంగా చర్చిద్దామని చెప్పిన మాట వాస్తవమే.. వేలాది మంది ప్రజల మధ్య చర్చ పెడితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్తున్నారని, పరిమిత సభ్యులతో చర్చించడానికి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రావాలని మంత్రి కాలవ శ్రీనివాసులు కోరారు. గురువారం తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధితో పాటు టీడీపీ మేనిఫెస్టోపై చర్చిద్దామని చెప్పడం భావ్యం కాదన్నారు. కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా వున్న 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి ఇప్పటి వరకు నా హయాంలో జరిగిన అబివృద్ధిపై మాత్రమే చర్చిద్దామన్నారు. ఇది రాజకీయ చర్చ కాదని ఇద్దరు వ్యక్తుల మధ్య చర్చ అన్నారు. మా మధ్యలో సంధానకర్తగా మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ఉంటారని తెలిపారు. పరిమిత సంఖ్యలో అర్థవంతమైన చర్చ చేయడానికి రామచంద్రారెడ్డి రావాలని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశులు, మురడి ఆనంద్‌రెడ్డి, మల్లికార్జున, నాగళ్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో కాపు రామచంద్రారెడ్డి
-
టీడీపీకి బుద్ధి చెప్పండి
రాయదుర్గం అర్బన్: ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి.. దోపిడీకి అలవాటుపడిన టీడీపీకి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, వైఎఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు బీహెచ్ ముస్తాక్ అహమ్మద్, బీహెచ్ ఇర్ఫాన్, నియాజ్, నియమతుల్లా, గపూర్సాబ్లతో పాటు మరో 50 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించిన కాపు రామచంద్రారెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మైనార్టీల కష్టాలను గుర్తించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారికోసం నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. ఆ మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడన్నారు. నాలుగేళ్లుగా మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేని చంద్రబాబు, మైనార్టీల గురించి మాట్లాడేందుకు అనర్హుడన్నారు. దోపిడీ మంత్రి కాలవ నైజం మంత్రి కాలవ శ్రీనివాసులు అక్రమ ఇసుక రవాణాతో దాదాపు రూ. 500 కోట్లు దోపిడీ చేశారని కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఇసుకను నిత్యం బెంగళూరుకు లారీల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న మంత్రి, మరోవైపు నదుల పునరుజ్జీవనం కోసం వాటర్‌మెన్ రాజేంద్రసింగ్‌ను పిలుచుకువచ్చి చూపించడం దారుణంగా ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణాతో కణేకల్లు మండలం మాల్యం వద్ద వేదావతి నదిలో ఇసుక లేక మట్టితేలిందనీ.. ఇప్పుడా భూమిలో టీడీపీ నాయకులు మాగాణి వేసుకుంటున్నారన్నారు. కుద్రేముఖ్ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పిన నేతలు నేటికీ దాని ఊసే ఎత్తడం లేదన్నారు. టీడీపీ మైనార్టీలకు పెద్ద శత్రువు మైనార్టీలకు బీజేపీ కంటే కూడా టీడీపీనే పెద్ద శత్రువని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త నదీం అహమ్మద్ అన్నారు. టీడీపీలో ఆత్మగౌరవం ఉన్న వారికి స్థానం లేదన్నారు. మైనా ర్టీలను బలిపశువులను చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేరన్నారు. ముస్లింలు ఆత్మగౌరవంతో బతకాలంటే వైఎస్సార్ సీపీకి మద్దతు తెలపాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి మాట్లాడుతూ, మైనార్టీలలో విషబీజం నాటేందుకు టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దన్నారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మున్నా మాట్లాడుతూ, జననేత జగనన్న నాయకత్వలో మాత్రమే మైనార్టీల అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగరాజరెడ్డి, కౌన్సిలర్లు పేర్మి బాలాజీ, అబ్దుల్ రహిమాన్, గోనబావి సర్మస్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, బీటీపీ గోవిందు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, డీ.హీరేహాళ్ కన్వీనర్ వన్నూరుస్వామి, కదలిక ఎడిటర్ ఇమామ్ తదితరులు పాల్గొన్నారు. -
రాయదుర్గంలో మంత్రి కాల్వకు గట్టి ఎదురుదెబ్బ
-
మంత్రి కాలువకు ఎదురుదెబ్బ
అనంతపురం: ఏపీ మంత్రి కాలువ శ్రీనివాస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి నియోజకవర్గం రాయదుర్గంలోని బొమ్మనహల్ మండల టీడీపీ నేత ముల్లంగి నారాయణ స్వామి చౌదరి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో నారాయణస్వామి వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతో పాటు వందలాది మంది అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి కాపు రామచంద్రారెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..ఏపీని విభజించిన కాంగ్రెస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్ధతివ్వడం దుర్మార్గమన్నారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. -
ప్రజావిశ్వాసం లేకే హత్యారాజకీయాలు
రాయదుర్గం అర్బన్: తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం రాయదుర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డితో కలిసి కాపు రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు అవినీతిపై దృష్టి సారించి, ప్రభుత్వంపై వ్యతిరేకత రాగానే హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీకి గుణపాఠం చెప్పేరోజులు దగ్గర పడ్డాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాప్తాడు నియోజకవర్గంలోని కందుకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త శివారెడ్డి హత్యను ఖండిస్తున్నామన్నారు. గతంలో టీడీపీ పాలనలో 600 హత్యలు జరిగాయని, నేడు ముఖ్యమంత్రే స్వయంగా ప్రతిపక్షం లేకుండా చేస్తామంటున్నారని, అంటే ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను చంపేస్తారా అని ప్రశ్నించారు. అధికారులు అధికార పార్టీ సేవకులుగా కాకుండా ప్రజాసేవకులుగా ఉండాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, పట్టణ కన్వీనర్ నబీష్, కౌన్సిలర్ గోనబావి సర్మస్, గుమ్మఘట్ట కన్వీనర్ కాంతారెడ్డి, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి హనుమంతు, రామన్న, బేలోడు రామాంజనేయులు, ఇస్మాయిల్, శ్రీనివాసులు, వార్డు కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌కు జన నీరాజనం
-
కాపు ఇంట మెహందీ సందడి
సాక్షి, బళ్లారి: అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో మెహందీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. కాపు రామచంద్రారెడ్డి కుమార్తె స్రవంతి వివాహం నేపథ్యంలో బళ్లారిలోని హవంబావి వద్ద ఉన్న కాపు నివాసంలో జరిగిన మెహందీ కార్యక్రమానికి ఆం ధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిలమ్మ హాజరయ్యారు. షర్మిలమ్మ రాగానే వైఎస్ కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. అనంతరం కాబోయే వధూవరులను షర్మిలమ్మ ఆశీర్వదించారు. అలాగే రెడ్డి అండ్ రెడ్డి శ్రీరామ్‌రెడ్డి, బొమ్మారెడ్డి సునీత తదితరులు వధూవరులను దీవించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానిక అల్లం భవన్లో పెళ్లి జరగనుంది. -
వీరశైవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నట్టు ప్రకటించిన కాపు రామచంద్రారెడ్డి అనంతపురం కల్చరల్: అఖిల భారత వీరశైవ మహాసభ ఆధ్వర్యంలో పది, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరచిన అన్ని జిల్లాల్లోని వీర శైవ విద్యార్థులకు పురస్కారాలు అందిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలోని టవర్‌క్లాక్ వద్దనున్న ప్రియదర్శిని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వీరశైవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎంజీ రాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కాపు రామచంద్రారెడ్డి మాట్లాడారు. 2016–17 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 9 పాయింట్లపైన, ఇంటర్లో 90 శాతం పైన మార్కులు తెచ్చుకున్న వీరశైవ విద్యార్థుల నుండి ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 25 లోపు ‘అఖిల భారత వీరశైవ మహాసభ, 10–1–33, లక్ష్మీ బజార్, రాయదుర్గం, అనంతపురం జిల్లా, 515865’ చిరునామాకు దరఖాస్తులు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు కాపు రామచంద్రారెడ్డి 9701698777, రాఘవేంద్ర 9880793739 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
శ్మశానాలనూ వదలరు
భూ కుంభకోణాల్లో మునిగిన టీడీపీ నేతలు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు ధ్వజం గుమ్మఘట్ట : భూ కుంభకోణాలతో టీడీపీ నేతలు నిండా మునిగారని, మరోసారి గనుక వారికి అవకాశమిస్తే శ్మశానాలను కూడా వదిలిపెట్టరని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గుమ్మఘట్ట మండలంలో పలు వివాహ, శుభకార్యాలకు సతీమణి కాపుభారతితో కలిసి కాపురామచంద్రారెడ్డి హాజరయ్యారు. బేలోడులో దళిత నేత రామాంజనేయులు కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పెట్టేసి ప్రజాధనం దోచుకుని.. దాచుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఇటీవల వెలుగు చూసిన భూకుంభకోణాలే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలు విస్మరించి, వంచించిన వైనంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి చైతన్యం చేస్తామన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నా పాలకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. మొక్కల పెంపకం, వంకల్లో మట్టి తవ్వకం తదితర పనుల్లో అవినీతి భారీగా జరిగిందన్నారు. రాయదుర్గానికి వచ్చిపోయే (స్థానికేతర) నాయకులను నమ్మితే అభివృద్ధి సంగతి మరిచిపోవాల్సిందేనన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా నెలలో 26 రోజులపాటు ప్రజల మధ్యనే ఉంటూ వారి పక్షాన నిలిచి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ తరఫున పోరాడుతున్నానని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గౌని కాంతారెడ్డి, బీసీ, ఎస్సీసెల్ రాష్ట్ర్ర కార్యదర్శులు ఎన్టీ సిద్దప్ప, గోవిందు, పార్టీ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణరెడ్డి, అడ్వకేట్ ఆర్టీ జగన్మోహన్రెడ్డి, రాయదుర్గం మండల కన్వీనర్ మల్లికార్జున పాల్గొన్నారు. -
బడుగులంటే బాబుకు చులకన
- రెయిన్గన్ల పేరుతో రైతులను దగా చేశారు - మహిళల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది - ‘మంత్రి’ పదవితో వాల్మీకుల నోరు నొక్కేశారు - రాయదుర్గం వైఎస్సార్సీపీ ప్లీనరీలో సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం : ముఖ్యమంత్రి చంద్రబాబుకు బడుగు, బలహీనవర్గాల ప్రజలంటే చులకన అని వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలు విస్మరించి ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఇకపై చంద్రబాబు చేసే గిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీ శుక్రవారం పట్టణ సమీపంలోని మద్దానేశ్వరస్వామి నూతన కళ్యాణమంటపంలో కాపు రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాల గుండ్ల శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, ప్లీనరీ పరిశీలకుడు రాగే పరుశురాం హాజరయ్యారు. తొలుత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి నేతలంతా పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. అనంతరం కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ పాలనలో పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం టీడీపీ వారిమే పరిమితమైందన్నారు. అర్హత లేకున్నా అధికార పార్టీ వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అరకొర రుణమాఫీ చేసి రైతులను దగాకు గురిచేసిందన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు పెరిగిపోయి, వాటిని కట్టలేని స్థితిలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళల ఉసురు ఈ ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందన్నారు. 2014లో వెయ్యి అబద్దాలతో గద్దెనెక్కిన బాబు వచ్చే ఎన్నికల్లో రేషన్‌కార్డులు ఉన్న వారికి కార్లు, ఏసీలు, అరకిలో బంగారం ఇస్తామని కూడా చెప్పేందుకు వెనుకాడబోరని ఎద్దేవా చేశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో ఎక్కడ చేర్చాల్సి వస్తుందోననే భయంతోనే కాలవ శ్రీనివాసులుకు మంత్రి పదవి విదిల్చి ఆ సామాజికవర్గం నోరు నొక్కేశారని విమర్శించారు. వాల్మీకులను దగా చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన టీడీపీ శనిని త్వరగా వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మీసాల రంగన్న, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాక్షన్‌ను పోషిస్తున్న బాబు
నారాయణరెడ్డి హత్యను సీబీఐతో విచారణ జరిపించాలి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుమ్మఘట్ట : రాష్ట్రంలో ఆటవిక, నియంతృత్వ పాలన సాగుతోందని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రోజురోజుకూ ప్రజాదరణ చూరగొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు ఫ్యాక్షన్‌ను పెంచిపోషిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఆదివారం ఆయన గుమ్మఘట్టలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి 500ల మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని, ఈ రాక్షస రాజ్యానికి ప్రజలే బుద్ధిచెప్పాలన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నారాయణరెడ్డి హత్య కేసును సీబీఐతో విచారణ జరిపిస్తే అసలు నిందితులు బయటకొస్తారని, ఈ విషయంలో గవర్నర్, కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అక్రమ కేసులతో తమ నాయకులు, కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాయదుర్గం నియోజక వర్గ వ్యాప్తంగా ఇసుక మాఫీయా పెట్రేగిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీరు–చెట్టులో జరిగిన దోపిడీ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
నారాయణరెడ్డి హత్య దారుణం
రాయదుర్గం : కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయడం దారుణమని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాయదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ పాలనలో ఆకృత్యాలు, హత్యలు, దౌర్జన్యాలు పెచ్చరిల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణరెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని, లైసెన్స్డ్ ఆయుధం కొనసాగించాలని నారాయణరెడ్డి అనుమతి కోరినా ఇవ్వకపోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో హత్యలకు తెగబడడం సిగ్గుచేటన్నారు. హత్యకు గురైన నారాయణరెడ్డి, ఆయన అనుచరులు సాంబశివారెడ్డి కుటుంబ సభ్యులకు కాపు ప్రగాఢసానుభూతిని ప్రకటించారు. -
ప్రధానిని కలిస్తే ఉలుకెందుకో?
మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజం గుమ్మఘట్ట/ డి.హీరేహాళ్ (రాయదుర్గం) : ఏపీ ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిస్తే అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు ఉలుకెందుకని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన గుమ్మఘట్ట మండలం భూపసముద్రం, డి.హీరేహాళ్ మండలం మలపనగుడి గ్రామాల్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సమస్యలను వైఎస్ జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళితే టీడీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అవగాహన లేకుండా మాట్లాడటం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుకున్న చంద్రబాబు అండ్ కో ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘ఉచితం’ ముసుగులో ఇసుకను కొల్లగొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు నీటి వ్యాపారానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. డి.హీరేహాళ్ మండలంలోని గ్రామాల్లో తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతుంటే టీడీపీ నాయకులు నీటిని కర్ణాటకలోని ఫ్యాక్టరీలకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర గిట్టుబాటు కాక.. పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పుల బాధతో మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసులు మరో రకంగా నమోదు చేస్తున్నారన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రజలు, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. -
మిర్చి పంటను ప్రభుత్వమే కొనాలి
కణేకల్లు : మిర్చి పంటను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.1500 ప్రకారం పరిహారం కింద కంటితుడుపుగా భిక్షమేసి రైతులను మభ్యపెట్టడం శోచనీయమన్నారు. కణేకల్లులో శనివారం గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక మంది రైతులు మిర్చి పంట సాగు చేసి గిట్టుబాటు ధరలేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉన్నకాటికి అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో మంచి ధర వస్తోందనే ఆశతో ఇంకా చాలా మంది రైతులు గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నారని ప్రభుత్వమే మిర్చి ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోÆýరారు. తక్కువ ధరలకు పంట ఉత్పత్తులను అమ్మేసుకుని నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు ఉషారాణి, వైఎస్సార్సీపీ నాయకులు కళేకుర్తి జయరామిరెడ్డి, కె.విక్రంసింహారెడ్డి, టీ.కేశవరెడ్డి, మక్బూల్, అజ్ముతుల్లా గంగలాపురం మృత్యుంజయ్య తదితరులు పాల్గొన్నారు. గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయండి రాయదుర్గం రూరల్ : కరువు కాటకాలతో రైతులు సతమతమవుతూ పశువుల్ని పోషించలేక కబేళాలకు విక్రయిస్తున్నారని, పశు సంపదను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని ఆయతపల్లిలో తిప్పేస్వామి గృహంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నా గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉచితంగా రైతులకు గడ్డి కొనుగోలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పశుసంపద కబేళాలకు తరలిపోకుండా కాపాడాలన్నారు. కర్ణాటకలో రైతుల్ని ఆదుకోవాలనే ఉద్ధేశంతో అక్కడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో దొరికే గడ్డిని కొనుగోలు చేసి పశువులను కాపాడుతోందని గుర్తు చేశారు. మరి టీడీపీ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవడంలో చిత్తశుద్ధి కరువైందన్నారు. కార్యక్రమంలో కణేకల్లు మాజీ ఎంపీపీ ఆలేరు రాజగోపాల్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, యువజన నాయకులు నాగిరెడ్డి, కాంతారెడ్డి, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడి దుర్మరణం
- బళ్లారి నుంచి బైక్‌లో వస్తుండగా ఢీకొన్న ట్రాక్టర్ - కాళ్లు, చేతులు విరిగి.. తీవ్ర రక్తస్రావం - నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కాపు డి.హీరేహాళ్(రాయదుర్గం) : వైఎస్సార్సీపీ డి.హీరేహాళ్ మండల ప్రధాన కార్యదర్శి ఫాస్ట్రూనాయక్(48) రోడ్డు ప్రమాదంలో మరణించారని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి సోమవారం రాత్రి తన స్వగ్రామమైన డి.హీరేహాళ్ మండలం హెచ్ఎస్ తండాకు బయలుదేరగా.. మార్గమధ్యంలోని శిద్దాపురం వద్ద ట్రాక్టర్ ఢీకొంది. ఘటనలో అతని కాళ్లు, చేతులు విరిగాయి. తలకూ బలమైన గాయాలు తగిలాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను కోమాలోకి వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే గమనించి డి.హీరేహాళ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఆటలో బళ్లారి విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మరణించారు. అంతకు ముందే రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆస్పత్రికి చేరుకుని డాక్టర్లతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అయినా ఫలితం లేకుండాపోయింది. నాయక్ మృతదేహానికి కాపు నివాళులర్పించారు. మృతుని భార్య హేమాబాయి, కుమారులను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట డీసీఎంఎస్ చైర్మన్ బోయ మల్లికార్జున, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్ నాయక్, మండల కన్వీనర్ వన్నూరుస్వామి, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, జగదీశ్, రహంతుల్లా, ఓబుళాపురం ఎంపీటీసీ సభ్యుడు గాదిలింగా ఉన్నారు. -
బాబు డొల్లతనం బట్టబయలు
నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లించకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం గుమ్మఘట్ట (రాయదుర్గం) : ప్రభుత్వ పనితీరు, నిధుల వ్యయంపై కాగ్ విడుదల చేసిన నివేదికతో ముఖ్యమంత్రి చంద్రబాబు డొల్లతనం బట్టబయలైపోయిందని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గుమ్మఘట్ట మండలం పూలకుంటలో సర్పంచ్ ముసలిరెడ్డి స్వగృహంలో శనివారం వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదవరెడ్డి, యువజన విభాగం స్టీరింగ్ జిల్లా కమిటీ సభ్యులు బోర్వెల్ నాగిరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందుతో కలసి కాపు రామచంద్రారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీ పేరుతో రైతులను వచించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 2015–16 బడ్జెట్లో రూ.4,300 కోట్లు కేటాయిస్తే, రూ.743.52 కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్టు కాగ్ నివేదిక వెల్లడించిందన్నారు. ఇందులోనూ రూ.375 కోట్లు మాత్రమే సర్ధుబాటు చేసి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. కరువు కరాళనృత్యం చేస్తుంటే ఆదుకోవాల్సింది పోయి విద్యుత్ చార్జీలు పెంచి పేదల నడ్డి విరవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాకుండా అవినీతిలో నంబర్–1గా నిలిపారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల వ్యయం పెంపులోనూ ప్రభుత్వం అనుసరించిన అక్రమ పద్ధతులను కాగ్ తప్పుపట్టిందన్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కాగ్ నివేదిక ఆధారంగా సీబీఐ లేదా సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మరెక్కడా లేనంతగా రాయదుర్గం నియోజకవర్గంలో నీరు–చెట్టు పనుల్లో అవినీతి చోటుచేసుకుందని, విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటివి సకాలంలో చెల్లించకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రూ.కోట్లు గుమ్మరించిన వారికే మంత్రివర్గ విస్తరణలో పదవులు కేటాయిస్తున్నారని, సొంత పార్టీలోనే ఈ విమర్శ వ్యక్తమవుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు పూలకుంట సుధాకర్‌రెడ్డి, బడిగే గంగప్ప, నాగప్ప, పైతోట రఘు, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి సామ్రాట్ చంద్రబాబు
= మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజం గుమ్మఘట్ట (రాయదుర్గం) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలన కోసం పరితపిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి కోసం పాకులాడుతున్నారని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. 18 కేసుల్లో కోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్న అతిపెద్ద అవినీతి సామ్రాట్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డిలో సోమవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ గౌని కాంతారెడ్డి, బీసీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎన్ టీ సిద్దప్ప, బీటీపీ గోవిందులతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు–డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి వంటి అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. -
ప్రత్యేక హోదా కోసం పోరాడండి
రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డీ.హీరేహాళ్ : రాజధాని జపం మాని ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఎం మోహన్ రెడ్డి సూచించారు. డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురంలో రైతువిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌని ఉపేంద్రరెడ్డితో కలిసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో అన్ని పక్షాలూ ఏకమై జల్లికట్టును సాధించుకున్నాయని, ఇదే స్ఫూర్తిలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిసి అప్పట్లో 15 ఏళ్లు హోదా కావాలని చంద్రబాబు అడిగారన్నారు. నేడు ‘ఓటుకు నోటు’ కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలు వీడి భవిష్యత్ తరాల కోసమైనా హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులను ‘చంద్రన్న బాట’ పేరుతో మళ్ళించి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. -
ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
మడకశిర రూరల్ : అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలారని రాయదుర్గం నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. మడకశిరలో బుధవారం ఆయన స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అమలుకాని హామీలు, పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు కానివారు జనవరి నుంచి టీడీపీ నిర్వహించబోయే జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను నిలదీయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నిర్వహిస్తున్న గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారన్నారు. రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, సంయుక్త కార్యదర్శి వాగేష్, మండల కన్వీనర్ ఈచలడ్డి హనుమంతరాయప్ప, కౌన్సిలర్ పార్వతమ్మదాసప్ప, తదితర నాయకులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ అక్రమాలపై విచారణకు ఆదేశం
కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం : నియోజకవర్గంలో ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కేంద్ర ప్రభు త్వం ఆదేశించినట్లు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలంయలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధి హామీ నిధులతో నీరు–చెట్టు కార్యక్రమం కింద యంత్రాలతో పనులు చేపట్టారన్నారు. కూలీల కడుపు కొడుతున్న నీరు–చెట్టు పనులు, పక్క దారి పడుతున్న ఉపాధి హామీ బిల్లులపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాను గత నెలలో ప్రధానమంత్రికి లేఖ రాశానన్నారు. స్పందించిన ప్రధానమంత్రి కార్యాల యం ఈ అక్రమాలపై సమగ్ర విచార ణకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాసిందన్నారు. ఆ ప్రతిని తనకు కూడా పంపిందని చెప్పారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు నభీష్, ప్రధానకార్యదర్శి అబ్బాస్, మండల కన్వీనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
బాబును ఎవరూ కాపాడలేరు
డీ.హీరేహాళ్ : ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో నిండా మునిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎవ్వరూ కాపాడలేరని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం హిర్దెహాళ్ వద్ద ఆయన వ్యవసాయ క్షేత్రంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన వ్యవహారమంతా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే జరిగిందని ఏసీబీ చార్జ్‌షీట్‌లో పేర్కొందన్నారు. ఈ కేసు భయంతోనే ఆయన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారని, జీవనదులైన కష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కడుతున్నా మౌనంగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో కడుతున్నది సింగపూర్ కాదని.. దొంగపూర్ అంటూ అభివర్ణించారు. సింగపూర్ కంపెనీ కోసం రాజధాని కడుతున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదన్నారు. స్విస్ చాలెంజ్ విధానం దుర్మార్గమైనదని అన్నారు. రైతులకు న్యాయం చేసే విధానం కావాలి తప్ప సింగపూర్‌కు దోచిపెట్టే ప్రభుత్వం అక్కరలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్ నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ బోయ మల్లికార్జున, ఎస్సీ సెల్ కార్యదర్శి బీటీపీ గోవిందు, మండల కన్వీనర్ వన్నూరుస్వామి, సీనియర్ నాయకులు జగదీష్, రహమతుల్లా, ఎన్.టి.సిద్దప్ప, బేలోడు రామాంజినేయులు, సోమలాపురం సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, మురళిమోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ రవీంద్రనాథ్‌రెడ్డి, హనుమంతు, రాజు, కరిడిమల్లి, కాదలూరు హనుమంతరెడ్డి, సింగాడి మంజు, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌ను కలిసిన కాపు కుటుంబ సభ్యులు
రాయదుర్గం అర్బన్ : మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్సీపీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తన సోదరుడు వరికూటి హంపారెడ్డి, మంజుల దంపతుల తనయుడు నవీన్‌కుమార్‌రెడ్డికి, విశాఖకు చెందిన వెంకట మహేశ్వర్‌రెడ్డి, జయలక్ష్మి పద్మజ దంపతుల తనయ రిషితరెడ్డికి ఆగస్టు ఏడో తేదీన వివాహం జరగనుంది. ఈ వివాహానికి హాజరుకావల్సినదిగా కాపు రామచంద్రారెడ్డి తన సతీమణి కాపు భారతితోపాటు హంపారెడ్డి దంపతులు, మహేశ్వరరెడ్డి దంపతులు ఆహ్వానపత్రికను జగన్‌కు అందజేశారు. -
చంద్రబాబు నియంత
నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు ధ్వజం రాయదుర్గం : ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై శాసన సభ స్పీకర్ సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. శాసన సభకు హాజరు కావడానికి వచ్చిన ఆమెను చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మాజీఎమ్మెల్యే ఆధ్వరంలో శనివారం రాయదుర్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని పాలతో అభిషేకించి, పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని అవమానించిన చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. గఢాఫీ, సద్దాం హుస్సేన్, హిట్లర్ లాంటి ఎంతోమంది నియంతలు ప్రజల ఆగ్రహానికి గురై కాలగర్భంలో కలిసిపోయారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి, ఎస్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి భోజరాజునాయక్, పట్టణ అధ్యక్షులు నబీష్, హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల కన్వీనర్లు వన్నూరుస్వామి, ఈశ్వర్ రెడ్డి, ఆలూరు చిక్కణ్ణ, జెడ్పీటీసీ విజయకుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దిలావర్ బాషా, కౌన్సిలర్లు పేర్మి బాలాజి, రహిమాన్, గోనబావి షర్మాస్, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ ఎన్టీ సిద్ధప్ప, మాజీ కౌన్సిలర్లు వసంతరాజు, సీతారాం, నాయకులు కణేకల్లు మరియప్ప, రాజేంద్రరెడ్డి, పై తోట సంజీవ తదితరులు పాల్గొన్నారు. -
'గవర్నర్ తోనూ బాబు అబద్ధాలు చెప్పించారు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలకోరు అని వైఎస్ఆర్ సీపీ నేత, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అనంతపురం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని పేర్కొన్నారు. గవర్నర్ తోనూ చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని వ్యాఖ్యానించారు. సిగ్గు, లజ్జా లేని ప్రభుత్వం చంద్రబాబుది.. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయమేనని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. -
చంద్రబాబుకు విలువలు లేవు
మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజం రాయదుర్గం : ముఖ్యమంత్రి చంద్రబాబుకు విలువలు లేవని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఇతరులకు శ్రీరంగనీతులు చెప్పడం, తాను మాత్రం వాటిని మరచి ప్రవర్తించడం బాబుకు అలవాటేనన్నారు.‘టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రభుత్వం సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తోందని హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బాబు వాపోయారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వారిని రాజ్యాంగానికి విరుద్ధంగా కొనుగోలు చేయడం ధర్మమా అంటూ ప్రశ్నించారు. మరి అలాంటి వ్యక్తి ఏపీలో చేస్తున్నదేంట’ని నిలదీశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకోవడాన్ని ఏమనాలన్నారు. రీచ్‌ల్లో దోచుకోవడం, దాచుకోవడం ముగిసిన తర్వాత ఇసుక విధానాన్ని మార్చడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల అంచనాలు పెంచి రూ.6వేల కోట్ల నిధులను ప్రభుత్వ కార్యదర్శుల సంతకాలు లేకుండా విడుదల చేయడం దోచుకోవడానికి కాదా అని ప్రశ్నించారు. అవినీతి బురదలో దొర్లుతూ మచ్చలేని నాయకుడిగా తనకు తాను కితాబిచ్చుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. కార్యక్రమంలో కణేకల్లు మాజీ ఎంపీపీ రాజగోపాల్ రెడ్డి, స్విస్ అధినేత గుంతకల్లు ఓంకారప్ప తదితరులు పాల్గొన్నారు. -
అధికారం మాదే.. చంపి పాతేస్తాం
♦ సీఎం మావాడే.. క్వారీ వదిలిపెట్టి వెళ్లండి ♦ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన క్వారీ సిబ్బందిపై ‘తమ్ముళ్ల’ దౌర్జన్యం ♦ రాయి లోడుతో వెళ్తున్న లారీల అడ్డగింపు రాయదుర్గం: ‘‘ముఖ్యమంత్రి మావాడే. అధికారం మాదే. క్వారీల్లో అంతా మావర్గం వారే ఉన్నారు. మధ్యలో మీరెందుకు? క్వారీ ఖాళీ చేస్తారా? లేకపోతే ఒక్కొక్కరిని చంపి ఇక్కడే పాతిపెట్టమంటారా? పాతి పెట్టినా అడిగేవాడు లేడు. అధికారులు కూడా ఏమీ చేయలేరు’’ అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన క్వారీ యజమానులు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి చెందిన క్వారీ సిబ్బందిని బెదిరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు వద్ద 18 క్వారీలున్నాయి. ఇందులో ఒకటి కాపు రామచంద్రారెడ్డికి చెందినది. ఆయన 24 హెక్టార్లలో లీజు పొందారు. దానికి ఒక వైపు సతీష్ క్వారీ, రెండో వైపు టీవీఎస్ కాంతారావుకు చెందిన క్వారీ ఉన్నాయి. రామచంద్రారెడ్డి క్రమం తప్పకుండా రాయల్టీలు చెల్లిస్తున్నారు. ప్రతి ట్రిప్పర్లోనూ వే బిల్లులతో నాణ్యమైన రాయిని సరఫరా చేస్తున్నారు. క్రషర్ యజమానులు ఈ క్వారీ నుంచే ఎక్కువగా రాళ్లను తీసుకెళ్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని మిగిలిన క్వారీల యజమానులు కూడబలుక్కొని రామచంద్రారెడ్డి క్వారీని నిలిపివేయించాలని కుట్రపన్నారు. శనివారం రాత్రి రాయి లోడు కోసం జిందాల్ కంపెనీకి చెందిన నాలుగు లారీలు క్వారీలోకి వెళ్లాయి. అవి తిరిగి వస్తున్నప్పుడు అడ్డగించారు. సతీష్ క్వారీ వైపు హిటాచీని, కాంతారావు క్వారీలో లారీలను అడ్డంగా పెట్టారు. ఆదివారం ఉదయం విలేకరులు వెళ్లి ఫొటోలు తీయడంతో కాంతారావు క్వారీలోని లారీలను తొలగించారు. సతీష్ క్వారీలో మాత్రం హిటాచీని తొలగించలేదు. క్వారీ యజమానులపై కేసు: మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీ నుంచి రాళ్లతో వెళ్తున్న లారీలను అడ్డగించిన పొరుగు క్వారీల యజమానులపై కేసు నమోదు చేసినట్లు బొమ్మనహాళ్ ఎస్సై శ్రీరాం శ్రీనివాస్ తెలిపారు. రామచంద్రారెడ్డి క్వారీ మేనేజర్ తిమ్మనగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సతీష్, కాంతారావులపై కేసు నమోదు చేశామన్నారు. దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి ‘‘టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను న్యాయంగా వ్యాపారం చేస్తున్నా బెదిరించడం శోచనీయం. వారిని చట్టపరంగా ఎదుర్కొంటాం. దౌర్జన్యం చేసేవారికి ప్రజలే గుణపాఠం చెబుతారు’’ - కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం -
'హోదాపై నీళ్లు చల్లారు'
అనంతపురం: ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీ నీళ్లు చల్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా ఊసెత్తకపోవడానికి గల కారణాలేమిటని, అసలు ఆ అంశాన్ని ప్రధాని వద్ద ఎందుకు ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని చెప్పారు. -
ప్రత్యేక హోదా కోసం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా
అంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ప్రకటన అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయదుర్గం బస్ డిపో ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదాపై నినదించారు. -
వైఎస్ఆర్సీపీ నేత దాతృత్వం..
రాయదుర్గం: ఒక్కరు.. ఇద్దరికి కాదు ఏకంగా 200 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించడానికి ఓ నేత ముందుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాపు రాంచంద్రారెడ్డి బెంగళూరుకు చెందిన శంకర్ కంటి ఆస్పత్రి వారి సహకారంతో ఆదివారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 440 మందికి పైగా వచ్చారు. వీరందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 200 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చారు. వీరందరికీ శంకర్ కంటి ఆస్పత్రిలో కాపు రాంచంద్రారెడ్డి సొంత ఖర్చుతో శస్త్రచికిత్సలు చేయించనున్నారు. -
అధికార ‘కాలవ’లో ఇసుక దందా!
డ్వాక్రా మహిళల ముసుగులో దోచుకుంటున్న టీడీపీ నేతలు సాక్షి, హైదరాబాద్, అనంతపురం టౌన్: తివిరి ఇసుమన (ఇసుక నుంచి) తైలంబు తీయవచ్చునో లేదో గానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం రూ.వేల కోట్లు పిండుకుంటున్నారు. డ్వాక్రా మహిళల ముసుగులో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నా అధికార యంత్రాంగం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు తన అనుచరగణంతో సాగిస్తున్న ఇసుకదందా శనివారం రాత్రి బట్టబయలైంది. నియోజకవర్గంలో వేదవతి నది, వాగులు, వంకలను గుప్పిట్లోకి తెచ్చుకున్న శ్రీనివాసులు.. తన అనుచరులతో అక్రమంగా ఇసుకను తవ్వేస్తూ కర్ణాటకకు తరలిస్తూ రూ.కోట్లను వెనకేసుకుంటున్నారు. ఈ ఇసుక దందాపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనేకల్లు మండలం రచ్చుమర్రి శివారులోని వేదవతి నదిలో ఇసుకను తవ్వేస్తున్న ఒక జేసీబీ, ఐదు టిప్పర్లు, రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. 15 మంది కాలవ అనుచరులను అరెస్టు చేశారు. ఈ సమాచారం అందుకున్న కాలవ.. పోలీసులపై కస్సుబుస్సులాడారు. తన అనుచరులను వదిలేసి.. వాహనాలను అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం వారి దోపిడీకి, వంతపాడటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ‘పచ్చదండు’ రెచ్చిపోయి ఇసుక లూటీ కొనసాగిస్తోంది. సీసీ కెమెరాలేవీ? : అక్రమాలను నిరోధించడం, పారదర్శకంగా ఇసుక రవాణా సాగేందుకు వీలుగా ప్రతి క్వారీలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడా వాటిని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తమ పార్టీ నేతల దోపిడీకి దన్నుగా ఉండేందుకే వీటిని ఏర్పాటు చేయడంలేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ ఆదాయానికంటే 20 రెట్లు అధికం.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం (ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో) ఇప్పటి వరకూ 1.07 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయం ద్వారా రూ.653.25 కోట్ల ఆదాయం వచ్చింది. అధికార పార్టీ నేతలు అక్రమ మార్గాల్లో ఇసుకను తరలించి విక్రయించడం ద్వారా హీనపక్షం రూ.12 వేల కోట్లు కొల్లగొట్టారని అధికార వర్గాలు బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అంటే.. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే కనీసం 20 రెట్లు అధికంగా టీడీపీ నేతలు దండుకున్నట్లు తెలుస్తోంది. అడ్డొస్తే దాడులే... * పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి యత్నించిన తహశీల్దారు వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఆయననే వెనుకేసుకొస్తూ తహశీల్దారు చర్యలను తప్పుబట్టడం, కేబినెట్ వంతపాడటం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. * తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు నేతృత్వంలో సాగుతున్న ఇసుక దందాను అడ్డుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై టీడీపీ కార్యకర్తలు ఏకంగా దాడికి పాల్పడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉన్నతస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుండిపోయారు. * తాజాగా.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం రచ్చుమర్రిలో వేదవతి నదిలో ఇసుకను తవ్వుతున్నారని వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కణేకల్లు ఇన్‌ఛార్జి ఎస్.ఐ. శేఖర్ తన సిబ్బందితో ఇసుక క్వారీలో దాడులు నిర్వహించి అయిదు టిప్పర్లు, రెండు లారీలు, ఒక జేసీబీని సీజ్ చేసి 15 మందిని అరెస్టు చేశారు. ఇది తెలిసిన చీఫ్ విప్ కాలువ ఆగ్రహోదగ్రుడయ్యారు. వాహనాలను, అరెస్టు చేసిన వారిని వదిలేయాలంటూ పోలీసు అధికారులకు హుకుం జారీ చేశారు. దోపిడీకి సాక్ష్యాలివీ... * శ్రీకాకుళంజిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధి సోదరుడు నాగావళి నదిలో అనధికారికంగా ఇసుక రీచ్‌లను నిర్వహిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రేయింబవళ్లు లారీలు, టిప్పర్లతో ఇసుకను విశాఖపట్నానికి తరలిస్తున్నారు. రోజుకు హీనపక్షం రూ.20 లక్షలకు ఆర్జిస్తున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించిన ఓ తహశీల్దారును కీలక ప్రజాప్రతినిధి తీవ్రస్థాయిలో బెదిరించారు. * తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో యనమల కృష్ణుడు నేతృత్వంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇసుకను కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్‌లకు తరలిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. * పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక మాఫియాకు నేతృత్వం వహిస్తున్నారు. జిల్లాలో మెజారిటీ ఇసుక క్వారీలను బినామీ పేర్లతో నిర్వహిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. * కృష్ణా జిల్లాలో చంద్రబాబుకు సన్నిహితుడైన ఒక మంత్రి ఇసుక మాఫియాకు దిశానిర్దేశం చేస్తూ పర్సంటేజిలు తీసుకుంటున్నారు. ఆయన మాట వేదంగా సాగుతోంది. * గుంటూరు జిల్లాలో స్వయంగా ఒక మంత్రి ఇసుకాసురుడిగా మారిపోయారు. పేరు డ్వాక్రా సంఘాలదైనా పెత్తనం, నిర్వహణ మొత్తం మంత్రి, ఆయన భార్యదే. * కర్నూలు జిల్లాలో కీలక ప్రజాప్రతినిధి సోదరులు నిత్యం వందలాది లారీల ఇసుకను బెంగళూరు, హైదరాబాద్‌లకు తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. * అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని వేదవతి నదిని ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు చెరబట్టారు. తన అనుచరగణంతో అడ్డగోలుగా రేయింబవుళ్లు ఇసుకను తవ్వించి బళ్లారికి తరలించి సూట్ కేసులు నింపుకుంటున్నారు. ఇదే జిల్లాలో ‘బ్రదర్స్’గా ప్రసిద్ధికెక్కిన ప్రజాప్రతినిధులు పెన్నానదిని గుండుగుత్తగా కబ్జా చేసేశారు. పొక్లెయిన్లతో తవ్వి రాత్రింబవుళ్లు క్వారీల వద్దే క్యూబిక్ మీటరు రూ.3,500 నుంచి రూ.4,000 ధరతో విక్రయిస్తున్నారు. * చిత్తూరు జిల్లా సీఎం నియోజకవర్గం కుప్పంలో పాలారు నదిని టీడీపీ నేతలు ఆక్రమించి అడ్డగోలుగా ఇసుక తవ్వి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మహిళా సాధికారత పేరుతో.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత పేరుతో ఇసుక క్వారీలను డ్వాక్రా మహిళా సంఘాలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. 356 ఇసుక క్వారీలను అధికారికంగా లీజుకిచ్చినట్లు ప్రకటించింది. అనధికారింగా వెయ్యికిపైగా క్వారీల్లో టీడీపీ నేతలు తవ్వకాలు సాగిస్తూ లూటీ చేస్తున్నారు. పర్మిట్లు లేకుండా, రాయల్టీ చెల్లించకుండా ఇసుక తరలించి విక్రయించడం ద్వారా రూ.వేలకోట్లు కొల్లగొడుతున్నారు. డ్వాక్రా మహిళల పేరిట లీజుకిచ్చిన 356 ఇసుక క్వారీల్లోనూ 90 శాతం టీడీపీ ప్రజాప్రతినిధుల చేతిలోనే ఉన్నాయి. ఒకే పర్మిట్‌పై 30కిపైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించి క్యూబిక్ మీటరు రూ.3,500 నుంచి రూ.4,000 వరకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
'కాల్వ శ్రీనివాసులుపై కేసు నమోదు చేయాలి'
అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాల్వ శ్రీనివాసులు తీరును తప్పుబట్టారు. ఇసుక అక్రమ రవాణాకు వత్తాసు పలుకుతూ కాల్వ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని కాపు ధ్వజమెత్తారు. ఏపీలో రెవెన్యూ అధికారులకు రక్షణ లేదని చెప్పారు. కణేకల్ ఇసుక అక్రమ రవాణా కేసులో కాల్వ శ్రీనివాసులపై కేసు నమోదు చేయాలని కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. -
రాయదుర్గంలో టీడీపీ నేతల బరితెగింపు
-
'గోదావరి నీరు, ఇసుక అమ్ముకున్నారు'
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలో సోమవారం ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. గోదావరి నీరు, ఇసుకను అమ్ముకున్న ఘనత బాబుకే దక్కుతుందన్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంచాలని, పభుత్వ అధికారులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. -
'ఇప్పటివరకు నోరు ఎందుకు విప్పలేదు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి బుధవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి చంద్రబాబు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి కేసుకు, సెక్షన్ -8కు సంబంధం లేదన్నారు. నోరు విప్పితే తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని చంద్రబాబు చెబుతున్నారని కాపు రామచంద్రరెడ్డి గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు నోరు ఎందుకు విప్పలేదని చంద్రబాబును ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలని కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. -
పెట్రోల్ ధరలు తగ్గించకుంటే పోరాటమే: మాజీ ఎమ్మెల్యే కాపు
అనంతపురం: విద్యుత్, పెట్రోల్ ధరలు తగ్గించకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలులో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్ పై వ్యాట్ విధించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్యుల పాలిట శాపమైందని కాపు ఎద్దేవా చేశారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. వైఎస్ జగన్ నేతృత్వంలో సమస్యలు పరిష్కిరంచుకుందామని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. -
మా ప్రభుత్వాన్నే విమర్శిస్తారా?
గుమ్మఘట్ట : ‘టీడీపీ అధికారంలోకి వచ్చీరాగానే నిరుపేదల పింఛన్లకు కత్తెరేశారు. గిట్టనివారి ఫిర్యాదుల ఆధారంగా ఇష్టానుసారంగా చౌక దుకాణపు డీలర్లను తొలగిస్తున్నారు. నాణ్యతగా తయారు చేస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలను తొలగించి వారికి ఇష్టమున్న వారికి కట్టబెడుతున్నారు. నేను ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క పింఛను కాని, కార్డుకాని, ఇతర సంక్షేమ పథకాలేవైనా తొలగించామేమో ఒక్కటి చూపండ’ని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. తహశీల్దార్ అబ్జల్‌ఖాన్, ఎంపీడీఓ జీ మునయ్య వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మఘట్ట తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మాదవరెడ్డి, స్థానిక నాయకులతో కలసి సోమవారం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు తోడు రుణమాఫీ విధి విధానాల వల్ల రైతులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి ముఖ్యమంత్రి ఆంక్షలు లేని రుణమాఫీ చేసి ఉంటే రైతులకు ఇబ్బందే ఉండేది కాదని మాజీ ఎమ్మెల్యే కాపు.. అధికారులతో చర్చిస్తుండగా, ఎంపీపీ గిరిమల్లప్ప, టీడీపీ కార్యదర్శి మారెంపల్లి ఉస్మాన్, కలుగోడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోవిందుతో పాటు వారి వెంట వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుతగిలారు. తానేమీ తప్పు మాట్లాడలేదని కాపు ఓ వైపు చెబుతుండగానే టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. గంటకు పైబడి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాపు.. విలేకరులతో మాట్లాడుతూ.. కార్యాలయాలన్నీ టీడీపీ నాయకుల చాంబర్లలా మార్చుకున్నారని, గంటల తరబడి తిష్టవేయడం వల్ల సామాన్యులు అధికారులను కలవడానికి ఇబ్బందిగా మారిందన్నారు. ఈ పద్ధతిలో మార్పు తేవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఉందని, దాన్ని కూడా గొంతు నొక్కాలని చూస్తే ప్రజలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా ప్రభుత్వ పాలన నడుస్తోందని, ఎలాంటి ఆంక్షలు లేకుండా డ్వాక్రా, రైతు రుణ మాఫీని అమలు చేయూలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై అధికారులతో మాట్లాడుతుంటే టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం తగదన్నారు. పింఛను, రేషన్ కార్డు, డీలర్షిప్, మధ్యాహ్న భోజన ఏజె న్సీ కోల్పోరుున వారి తరుఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. డీలర్లతో ఇష్టానుసారంగా వ్యవహరించిన ఆర్ఐపై చర్యలు చేపట్టాలని తహశీల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే కాపు వెంట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి, పైతోట సంజీవ, బీటీపీ గోవిందు, గుమ్మఘట్ట రాజు, గోనబావి కురుబ రామాంజినేయులు, రంగచేడు లక్ష్మణ్ణ, భూ పసముద్రం పగాకుల గోవిందప్ప, కలుగోడు గోవిందు, గొల్లపల్లి సర్పంచులు ముసలిరెడ్డి, విజేంద్రతో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
కాపుపై కక్ష సాధిస్తున్నారు
వాసిరెడ్డి పద్మ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనానికి తట్టుకోలేక కాంగ్రెస్, టీడీపీలు రెండూ పోలీసులను ఉపయోగించుకుని తమ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కక్ష సాధింపులకు దిగుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఇటీవల రాయదుర్గంలోని వందలాది మంది పార్టీ సర్పంచ్‌లపై బైండోవర్ కేసులు పెట్టి వారిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తుంటే అందుకు నిరసనగా రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఆయనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ జేబులోనూ, జేసీ దివాకర్‌రెడ్డి జేబులోనూ ఉంటూ వారి చేతిలో పావులాగా మారిపోయారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఆయన ఇంటిపై సోదాలు చేసి ఏవో వస్తువులు దొరికాయని కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రామచంద్రారెడ్డి కుటుంబం రాజకీయాల్లోకి రాక ముందునుంచీ వందలాది మంది నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించే దాతృత్వం ఉందని, అందుకు సంబంధించిన వస్తువులు వారింట్లో ఉంటే దానిని సాకుగా చేసుకుని అరెస్టు చేశారని చెప్పారు. పోలీసులను అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలు ఉపయోగించుకుంటున్న తీరును తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆమె చెప్పారు. డీజీపీకి ఫిర్యాదు: అనంతపురం జిల్లా రాయదుర్గం ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి అక్కడి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కక్షకట్టి తప్పుడు కేసు నమోదు చేశారని వైఎస్సార్ సీపీ నేతలు రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. పార్టీ జన రల్ సెక్రటరీ కె.శివకుమార్ నేతత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవా రం డీజీపీని కలిసి వినతిపత్రం అందించింది. గతంలో ఆ ఇన్స్పెక్టర్ కొందరు అమాయకుల్ని పోలీసుస్టేషన్‌కు పిలిపించి దౌర్జన్యం చేశారని, ఆ సందర్భంలో రామచంద్రారెడ్డి పోలీసు దౌర్జన్యాన్ని ప్రశ్నించడంతోపాటు దానికి నిరసనగా పోలీసుస్టేషన్ వద్దే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో కక్షకట్టిన ఇన్స్పెక్టర్ ఎన్నికల సందర్భంలో రామచంద్రారెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఆయనపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన ఇప్పటికీ ఎలాంటి నామినేషన్ దాఖలు చేయని నేపథ్యంలో ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన సెక్షన్లు వర్తించవని తెలి పారు. వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డీజీపీ పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అనంతపురం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అరెస్ట్
రాయదుర్గం, న్యూస్‌లైన్: నాటకీయ పరిణామాల మధ్య అనంతపురం జిల్లా రాయదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఉచిత వివాహాల కోసం ఉంచిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడు ఫారిన్ లిక్కర్ బాటిళ్లు కలిగి ఉన్నారంటూ నాన్‌బెయిలబుల్ కేసు అక్రమంగా బనాయించి శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. అంతకుముందు గురువారం రాత్రి బళ్లారిలో ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులు జరిపిన సోదాలో ఆయన ఉచిత వివాహాలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన సామగ్రి లభించింది. అర్ధరాత్రి 12 గంటలకు ఎమ్మెల్యే ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న రాజేశ్వరి ఇంట్లో కూడా గోడ గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. ఒంటి గంటకు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ భాస్కర్‌రెడ్డి, ఐదు మండలాల ఎస్ఐలతో పాటు కళ్యాణదుర్గం ఎస్ఐ, సుమారు 50 మంది ప్రత్యేక పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను నిద్రలేపి సోదాలు చేశారు. ఈ సందర్భంగా గత ఏడాది ఎమ్మెల్యే కాపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వివాహాల్లో పంచగా మిగిలిపోయిన పెళ్లి దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 129 చీరలు, 127 జుబ్బాలు, టవళ్లు, జాకెట్ పీసులు ఉన్నాయి. ప్రతి ఏటా గౌరీ పండుగ సందర్భంగా మహిళలకు సంప్రదాయంగా ఇచ్చే పసుపు, కుంకుమ, మట్టిగాజులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెడ్రూంలో ఉన్నట్లు చెబుతున్న ఏడు లిక్కర్ బాటిళ్లను తీసుకున్నారు. ఆర్డీఓ మాలోల, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్నికల అధికారి భూలక్ష్మి, త్రిమూర్తులు పంచనామా నిర్వహించారు. ఆ తర్వాత పోలీ సులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడానికి యత్నిం చారు. ఈ సందర్భంగా తనను ఏ విషయమై అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఎమ్మెల్యేతో పాటు ఆయన న్యాయవాది వెంకటరెడ్డి పోలీసులను ప్రశ్నించగా వారు సరైన సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు హడావుడి చేసి విదేశీ లిక్కర్ బాటిళ్లు ఉన్నాయని, ఎక్సైజ్ యాక్ట్ కింద అది నేరమని చెబుతూ అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆరోగ్య పరీక్షలు చేయించి రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ఎమ్మెల్యేను హాజరుపరిచారు. వాదనలు విన్న జడ్జి సాయంత్రం 6 గంటలకు బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా బళ్లారిలో సోదాలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు బెయిల్‌పై వచ్చిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు సమాయత్తమయ్యారు. అయితే స్థానిక పోలీసుల వైఖరితో అప్పటికే అనారోగ్యంగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి.. అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రెస్ట్ అవసరమని భావించి అడ్మిట్ చేసుకున్నారు. అయితే కర్ణాటక పోలీసులు మాత్రం కాపును అరెస్ట్ చేస్తామని చెప్పి అక్కడే వేచి ఉన్నారు. -
'కాపు రామచంద్రారెడ్డిపై కక్ష గట్టారు'
-
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అరెస్ట్
-
నేడు రాయదుర్గంలో వైఎస్సార్ సీపీ రోడ్ షో
రాయదుర్గం, న్యూస్‌లైన్ :వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాయదుర్గం పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటున్నారని, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, అశేషంగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో వైఎస్ విజయమ్మ చేపట్టిన రోడ్ షో కార్యక్రమానికి ప్రజలు ఉప్పెనలా తరలి వస్తున్నారన్నారు. యువతి, యువకులు, మహిళలు, వృద్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. కాగా పట్టణంలో మధ్యాహ్నం 2 గంటలకు కోతిగుట్ట నుంచి రోడ్‌షో ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి లక్ష్మి బజార్, పాత బస్టాండ్ మీదుగా వినాయక సర్కిల్ వరకు కొనసాగుతుందని ఆయన వివరించారు. వినాయక సర్కిల్లో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారన్నారు. అనంతరం బళ్ళారి రోడ్డు, శాంతినగర్ వైఎస్సార్ విగ్రహం వరకు రోడ్ షో సాగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ తరలి వచ్చి వైఎస్ విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. -
వైఎస్సార్సీపీని వీడను: వై గురునాథరెడ్డి
అనంతపురం, న్యూస్‌లైన్: తాను వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం బూటకమని ఆ పార్టీ అనంతపురం ఎమ్మెల్యే వై గురునాథరెడ్డి తెలిపారు. మీడియా అత్యుత్సాహం వల్లే ఈ దుష్ర్పచారం జరిగిందని చెప్పారు. అనంతపురం లోక్‌సభ ఎన్నికల ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంతరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో 40 ఏళ్లుగా తమ కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. కష్టనష్టాల్లో పరస్పరం పాలుపంచుకుంటామనే విష యం అందరికీ తెలిసిందేనని చెప్పారు. రాజీనామా అంటూ కొందరు పనిగట్టుకుని దుష్ర్పచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్పటికీ వైఎస్సార్సీపీని వీడేదిలేదని స్పష్టం చేశారు. గురునాథరెడ్డి రాజీనామా వదంతులు కేవలం మీడియా సృష్టే పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. -
'ఎమ్మెల్యే కాపుపై కేసు నమోదు చేశాం'
అనంతపురం : వైఎస్ఆర్ సీపీ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశామని అనంతపురం ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. కౌన్సిలింగ్ పేరుతో తాము ఎవరినీ వేధించలేదని ఆయన శనివారమిక్కడ అన్నారు. వాహనాలు తనిఖీలు, సోదాలలో భాగంగా ఇప్పటివరకూ రూ.2.78కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎన్నికల భద్రత కోసం జిల్లాకు 5000మంది పోలీసులు కావాలని కోరినట్లు ఆయన తెలిపారు. కాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి క్రమంగా కుదుటపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాయదుర్గం పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ మంగళవారం ఆయన పోలీసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స కోసం ముందు బళ్లారికి, అక్కడనుంచి బెంగళూరుకు తరలించిన విషయం విదితమే. -
కోలుకుంటున్న ఎమ్మెల్యే కాపు
* ఎమ్మెల్యేను పరామర్శించిన షర్మిల, బ్రదర్ అనిల్ * వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శ సాక్షి ప్రతినిధి, బెంగళూరు: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి క్రమంగా కుదుట పడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాయదుర్గం పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ మంగళవారం ఆయన పోలీసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స కోసం ముందు బళ్లారికి, అక్కడనుంచి బెంగళూరుకు తరలించిన విషయం విధితమే. రామచంద్రారెడ్డికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బెంగళూరులోని కొలంబియా ఏషియా ఆస్పత్రి వైద్యులు బుధవారం తెలి పారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఎమ్మెల్యే కాపును ఫోన్లో పరామర్శించారు. కాపును జగన్ సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ ఆస్పత్రిలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన భర్త ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు ఎమ్మెల్యే సతీమణి భారతి తెలిపారు. పోలీసుల వలయంలో రాయదుర్గం రాయదుర్గం: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యకు యత్నించిన నేపథ్యం లో వైఎస్సార్సీపీ శ్రేణులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రాయదుర్గం పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది ఆర్మీ, ప్రత్యేక దళాలు బందోబస్తు నిర్వహించాయి. పట్టణం పోలీసుల వలయంగా మారడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరూ పట్టణంలోకి రాకుండా పల్లెల్లో హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కార్యాలయం ముందు ఒక ఎస్ఐతో పాటు ప్రత్యేక దళాలు మోహరించాయి. ప్రధాన కూడళ్లలో పోలీ సులు, ఆర్మీ పెద్ద సంఖ్యలో ఉండడంతో ప్రజలు పనులు చేసుకునేందుకు సైతం భయపడ్డారు. కౌన్సిలింగ్ పేరుతో సంఘ విద్రోహక శక్తులపై చర్యలు తీసుకోవాలని, కానీ సమాజంలో పేరు, ప్రతిష్టలు ఉన్న నాయకులను కొట్టడం అప్రజాస్వామికమని ప్రజలు చర్చించుకున్నారు. శాంతి ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి కోరినా డీఎస్పీ తిరస్కరించినట్లు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి తెలిపారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి కార్యకర్తలు నగరంలోకి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. -
రామచంద్రారెడ్డిపై పోలీసు కేసు
అనంతపురం జిల్లా రాయదుర్గంలో పోలీసుల అత్యుత్సాహం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీలోని 309, 108, 30 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం నాడు రాయదుర్గం బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. కానీ రాష్ట్రపతి పాలన అములో ఉన్నందున బంద్ చేయకూడదని పోలీసులు చెప్పారు. రాయదుర్గం సీఐ భాస్కర్‌రెడ్డిని డిస్మిస్ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గుర్నాథ్రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. -
పోలీసుల వేధింపులపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురిచేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్‌లు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంతరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం సీఐ భాస్కర్‌రెడ్డి కౌన్సెలింగ్ పేరిట వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది మద్దతుదారులను వేధించడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి కారణం లేకుండా సీఐ ప్రవర్తించిన తీరుతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని వివరించారు. సీఐ వ్యవహరించిన తీరు వల్ల ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే, ఎన్నికల ప్రక్రియ ముగిసే నాటికి ఇలాంటి చర్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు లక్ష్యంగా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని వివరించారు. ఎన్నికల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనకుండా భయాందోళనలు సృష్టించేవిధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, వీటిపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. కాపు కుటుంబానికి జగన్ పరామర్శ వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురిచేయడంపై కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబీకులను పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో జనభేరి పర్యటనలో ఉన్న జగన్ కాపు ఆత్మహత్యాయత్నం ఉదంతం తెలుసుకుని ఆవేదన చెందారు. కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీసుల దమన నీతిని ఖండించిన జగన్... రామచంద్రారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
బెంగళూరుకు కాపు తరలింపు
బళ్లారి : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని మంగళవారం రాత్రి విమ్స్ వైద్యుల సూచన మేరకు బెంగళూరు కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం ప్రత్యేక చికిత్సలు చేపట్టారు. విమ్స్‌లో రైల్స్ ట్యూబ్ ద్వారా పురుగులు మందును బయటకు తీశారు. పామ్స్, ఆట్రోపిన్ యాంటిబయాటిక్ మందులు ఇస్తూ చికిత్సలు చేపట్టారు. ఐసీయూలోకి తరలించినా జన సందోహాన్ని పోలీసులు నియంత్రించడానికి వీలుకాలేదు. దీంతో మెరుగైన చికిత్స అందించాలంటే ప్రత్యేక వాతావరణం ఉండాలని వైద్యులు నిర్దారణకు వచ్చారు. అంతేకాకుండా 48 గంటల వరకు ఎలాంటి హామీ ఇవ్వలేమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటల సమయంలో ప్రైవేటు అంబులెన్స్‌లో బెంగళూరులోని కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో విమ్స్ వైద్యులు, కాపు సతీమణి భారతి, తనయుడు ప్రవీణ్ ఇతర ప్రముఖులు బయలుదేరి వెళ్లారు. నా భర్తకు ఏమైనా జరిగితే పోలీసు స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటాం : భారతి కాపు రామచంద్రారెడ్డి భార్య భారతి సాక్షితో మాట్లాడుతూ తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులే కారణమన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే తమ కుటుంబసభ్యులంతా పోలీసు స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాపును పరామర్శించిన ప్రముఖులు బళ్లారి విమ్స్‌లో చికిత్స పొందుతున్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. బళ్లారి ఎంపీ శాంత, రాయచూరు ఎంపీ సన్నపక్కీరప్ప, అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి, ఆలమూరు సాంబశివారెడ్డి, చవ్వా రాజశేఖర రెడ్డి, బళ్లారి టచ్ఫర్ లైఫ్ ఫౌండేషన్ అధినేత నారా భరత్‌రెడ్డి, మాజీ ఉపమేయర్ శశికళ, మాజీ కార్పొరేటర్ కేఎస్. దివాకర్ వీరశంకర్రెడ్డి, మానవహక్కుల సంఘం నాయకులు ప్రవీణ్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, భోజరాజు నాయక్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నం
* వైఎస్ఆర్ సీపీ నాయకులపై ఖాకీల దౌర్జన్యానికి నిరసన * పురుగు మందు తాగిన రామచంద్రారెడ్డి * ఆరోగ్య పరిస్థితి విషమం * బళ్లారిలో చికిత్స.. బెంగళూరుకు తరలింపు * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిచిన పోలీసులు * ఆపై బూట్లు, లాఠీలతో చితకబాదిన ఖాకీలు * నిరసనగా స్టేషన్ ఎదుట కాపు బైఠాయింపు, ఆత్మహత్యాయత్నం * ఇది జీర్ణించుకోలేక అదే స్టేషన్ వద్ద కిరోసిన్ పోసుకున్న కార్యకర్త రాయదుర్గం/బళ్లారి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులను బైండోవర్ల పేరుతో పోలీసులు చితకబాదడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం రాయదుర్గం పోలీస్‌స్టేషన్ వద్దే ఆయన పురుగుల మందు తాగారు. అనంతరం ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో వెంటనే బళ్లారి విమ్స్ ఆస్పత్రికి, ఆపై రాత్రి బెంగళూరుకు తరలించారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నాన్ని జీర్ణించుకోలేక ఓ కార్యకర్త పోలీస్ స్టేషన్ వద్ద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించడంతో పోలీసులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో రాయదుర్గం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అసలేం జరిగింది? మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసులున్నాయన్న నెపంతో మంగళవారం పోలీసులు దాదాపు వంద మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను స్టేషన్‌కు పిలిపించి లాఠీలు ఝుళిపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు విషయాన్ని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని, బూట్లు, లాఠీలతో కుళ్లబొడిచారని సర్పంచులు, వార్డు సభ్యులు ఆరోపించారు. వెంటనే ఆయన పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చారు. స్టేషన్ లోపలికి ఎమ్మెల్యేను రాకుండా అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏ కారణంతో కొడుతున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. తాము ఎవ్వరినీ కొట్టలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ సమయంలో దెబ్బలు తిన్నవారు ‘మమ్మల్ని కొట్టలేదా?’ అంటూ లేవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రపతి పాలనను ఆసరాగా చేసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని కాపు మండిపడ్డారు. సర్పంచులు, నాయకులను పశువులను కొట్టినట్లు చితకబాదడం ఏంటని ప్రశ్నించారు. చట్ట ప్రకారం బైండోవర్లు చేయాల్సిన పోలీసులు గూండాలు, రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పురుగుల మందు డబ్బా లాక్కున్నా.. ఇంతలో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలను పోలీసులు తోసివేసేందుకు యత్నించారు. దీంతో ఎమ్మెల్యే సమీపంలో ని ఓ రైతు చేతిలో ఉన్న పురుగుమందు డబ్బాను లాక్కుని ‘నా వద్దకు రావద్దు.. మీరు ప్రవర్తించిన తీరుతో కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. మీ వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకుంటాను’ అని హెచ్చరిస్తూ మూత తీసి తాగబోయారు. పోలీసులు ఆ డబ్బాను స్వాధీనం చేసుకోవటంతో ఒక్క ఉదుటున పక్కకు వచ్చిన ఎమ్మెల్యే.. రైతు వద్ద నున్న మరో బాటిల్‌ను లాక్కుని మూత తీసి పురుగుమందు తాగారు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ పోలీసుల్ని తోసేశారు. దీంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. అనంతరం కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. 50 మిల్లీలీటర్ల వరకు పురుగుల మందు తాగారని, పరిస్థితి కొంత వరకు విషమంగా ఉందని చెబుతూ బళ్లారికి తీసుకెళ్లాలని సూచించారు. ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే సతీమణి కాపు భారతి కన్నీరు పెడుతూ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. బళ్లారిలో చికిత్స.. బెంగళూరుకు తరలింపు రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం రామచంద్రారెడ్డిని బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించాక సాయంత్రం విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా 24 గంటలు గడిచాకే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందన్నారు. అయితే రాత్రి ఏడు గంటలైనా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఎమ్మెల్యేను బెంగళూరులోని కొలంబియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతకు ముందు ఎమ్మెల్యేను చూసేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బళ్లారి విమ్స్‌కు తరలి వచ్చారు. కాపు రామచంద్రారెడ్డిని బళ్లారి ఎంపీ శాంత, రాయచూరు ఎంపీ సన్నపక్కీరప్ప తదితరులు పరామర్శించారు. పోలీసుల తీరు అమానుషం: గురునాథరెడ్డి, కేతిరెడ్డి అనంతపురం టౌన్, న్యూస్‌లైన్: పోలీసుల వ్యవహార శైలి వల్ల ఒక ప్రజాప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే ఇంతకన్నా దౌర్భాగ్యముంటుందా? అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నామా? లేక పోలీసుల పాలనలో ఉన్నామా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో గురునాథరెడ్డి నివాసం దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. వారిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా తెలుగుతల్లి సర్కిల్ వద్దపోలీసులు అడ్డుకున్నారు. ఒకరిద్దరు మాత్రమే వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు రోడ్డుపైనే అరగంట పాటు బైఠాయించారు. దీంతో వెనక్కు తగ్గిన పోలీసులు కొందరిని మాత్రమే లోనికి పంపిస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన సీఐ భాస్కర్‌రెడ్డిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కిరోసిన్ పోసుకున్న వికలాంగుడు.. ఎమ్మెల్యే ఆత్మహత్యకు యత్నించడాన్ని జీర్ణించుకోలేక గుమ్మఘట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన వికలాంగుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాజశేఖరరెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. పోలీసులు అప్రమత్తమై అతడిపై నీళ్లు పోసి కిరోసిన్ బాటిల్‌ను లాక్కుకున్నారు. ఈ సమయంలో అతడి కళ్లలో కిరోసిన్ పడడంతో పోలీసులు ఆస్ప్రతికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అందుకు నిరాకరించిన అతడు.. స్టేషన్ వద్దే బైఠాయించాడు. ఎమ్మెల్యేకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని, దేవుడి లాంటి మనిషి కోసం ఎంత మంది ప్రాణాలు తీసుకునేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నాడు. చివరకు కళ్యాణదుర్గం డీఎస్పీ వేణుగోపాల్ జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో శాంతించాడు. నా భర్తకు ఏమైనా జరిగితే ఆత్మహత్య చేసుకుంటాం ‘‘నా భర్త ఆత్మహత్యాయత్నానికి పోలీసులే కారణం. ఆయనకు ఏమైనా జరిగితే మా కుటుంబసభ్యులమంతా పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటాం.’’ - కాపు భారతి, రామచంద్రారెడ్డి సతీమణి -
'కాపు' కుటుంబ సభ్యులకు జగన్ ఫోన్
నిడదవోలు(పశ్చిమగోదావరి జిల్లా): ఆత్మహత్యాయత్నం చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కాపు రామచంద్రారెడ్డి భార్యతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రామచంద్రారెడ్డి ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన భర్తను పోలీసులు వేధించిన తీరును జగన్‌కు రామచంద్రారెడ్డి సతీమణి వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై అనంతపురం పోలీసుల చర్యలను జగన్ ఖండించారు. కాపు రామచంద్రారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో రామచంద్రారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన ప్రస్తుతం బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కాపు రామచంద్రారెడ్డి బళ్లారి ఆస్పత్రికి తరలింపు
-
కాపు రామచంద్రారెడ్డి బళ్లారి ఆస్పత్రికి తరలింపు
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రాయదుర్గంలో ఆత్మహత్యయత్నం చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని బళ్లారి ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల చర్యకు నిరసనగా రాజశేఖర రెడ్డి అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, కార్యకర్తలు అతనిని అడ్డుకున్నారు. రాయదుర్గంలోనూ, నియోజకవర్గం అంతటా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసులున్నాయన్న నెపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు వందమంది కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని, లాఠీలతో, బూట్లతో కుళ్లబొడిచారని సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు చెప్పారు. బళ్లారిలో ఉన్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి కార్యకర్తలు ఈ విషయం ఫోన్ చేసి చెప్పారు. ఆయన వెంటనే బయలుదేరి రాయదుర్గం వచ్చారు. ఏ కారణం లేకుండా తమ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. తమ కార్యకర్తలను ఎందుకు కొట్టారని అడిగారు. వారు ఏమైనా దొంగతనం చేశారా? అని ప్రశ్నించారు. పోలీసుల చర్యకు నిరసనగా పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించారు. తన కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తాను చూడలేనన్నారు. కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికి సిద్దపడ్డారు. పోలీసుల తీరుకు ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన కార్యకర్తలు వెంటనే తాగిన పురుగుల మందును కక్కించడానికి ప్రయత్నించారు. ఆ తరువాత స్పృహ కోల్పోవడంతో కార్యకర్తలు వెంటనే ఆయనను బళ్లారి ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరో పక్క పోలీసుల దౌర్జన్యాన్ని నిరసనగా రాజశేఖర రెడ్డి అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. అతను నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘటనలతో రాయదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాయదుర్గం బంద్‌కు పిలుపు ఇచ్చింది. -
ఎమ్మెల్యే కాపు ఆత్మహత్యాయత్నం
-
పురుగుల మందు తాగిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
-
పురుగుల మందు తాగిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
అనంతపురం : అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధింపులను నిరసిస్తూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసులున్నాయనే నెపంతో వందమందిని కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏ కారణం లేకుండా కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారన్నారు. పోలీసుల తీరును తప్పుబడుతూ ఆయన పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని గమనించిన పార్టీ కార్యకర్తలు కాపు రామచంద్రారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాయదుర్గం బంద్‌కు పిలుపునిచ్చింది. -
పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్ సీపీ కార్యకర్తల అరెస్ట్
అనంతపురం: జిల్లాలోని రాయదుర్గంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసులున్నాయనే నెపంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 100 మందికి పైగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలున్నారు. ప్రధానంగా పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలనే అరెస్టు చేయడంతో వైఎస్సార్ సీపీ మండిపడింది. పోలీసులు ఈ రకమైన చర్యలకు దిగడం సరికాదని వైఎస్సార్ సీపీ నేత కాపు రామచంద్రా రెడ్డి తెలిపారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
'టిడిపిలో ఎప్పుడు చేరదామా అన్న తొందరలో ఆనం'
-
'టిడిపిలో ఎప్పుడు చేరదామా అన్న తొందరలో ఆనం'
హైదరాబాద్: టీడీపీలో ఎప్పుడు చేరదామా అనే తొందరే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలో కనిపించిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభలో ఆనం రాజ్యంగ సాంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించారని అన్నారు. బడ్జెట్లో వాస్తవాలు లేవని ఆయన తెలిపారు. గత ఏడాది ఏం సాధించారో చెప్పలేదన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించలేదని చెప్పారు. ప్రభుత్వ అసమర్ధత వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకురాలేదన్నారు. ఈ ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గేస్తుందన్నారు. ప్రభుత్వ చేతగాని తనం కళ్లకు కట్టినట్లుందని పేర్కొన్నారు. టీడీపీకి పీఆర్పీకి పట్టినగతే పడుతుందన్నారు. చంద్రబాబు టీడీపీని త్వరలోనే బీజేపీలో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవికి పరిమితం అవుతారని జోస్యం చెప్పారు. -
'విభజనపై చర్చ వెనుక పెద్ద కుట్ర ఉంది'
-
'విభజనపై చర్చ వెనుక పెద్ద కుట్ర ఉంది'
అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై ముందుగా ఓటింగ్ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే సమైక్య తీర్మానం చేసేంత వరకు సభా కార్యక్రమాలను అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదని వారు పేర్కొన్నారు. తమ నాయకుడిని విమర్శించడమే పనిగా పెట్టుకుని సభ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. అలా కాకుండా టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అవినీతిపై కేసులు నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని చంద్రబాబు కాదా అని శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. విభజనపై అసెంబ్లీలో చర్చ వెనుక పెద్ద కుట్ర ఉందని వారు అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఆ కుట్రలో కాంగ్రెస్, టీడీపీలకు భాగస్వామ్యం ఉందని శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. -
వైఎస్సార్ సీపీ సమైక్య ఆందోళన
అనంతపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాయదుర్గం, గుంతకల్లు, కదిరిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆందోళనలు నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి అధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత సర్కిల్లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుటిలయత్నం చేస్తోందని, పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడితే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని పేర్కొన్నారు. కదిరి, గుంతకల్లులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ పార్టీ నేతలు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. -
'సమైక్య తీర్మానం చేసేంతవరకూ అడ్డుకుంటాం'
హైదరాబాద్ : అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి తీరాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మన రాష్ట్రంలో మాత్రమే అసెంబ్లీలో తీర్మానం చేయకుండా విభజించాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వీలుగా సమైక్య తీర్మానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అంశాన్ని రిఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళదామని వైఎస్ఆర్సీపీ మిగిలిన పార్టీలకు సవాల్ విసిరింది. ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే మిగిలిన పార్టీలు తమ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సమైక్యమే తమ అజెండా అని మిగిలిన పార్టీలు వారి వైఖరి వెల్లడించాలని డిమాండ్‌చేశారు. సమైక్య తీర్మానం చేసేంతవరకూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ స్పష్టంచేసింది. టీడీపీ నేతలు కొందరు సమైక్యమంటూ... మరికొందరు విభజనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు విమర్శించారు. టీడీపీ వైఖరి ఏమిటనేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలకు స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. -
విభజనను అడ్డుకోండి
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు ప్రజలను ఓట్లు, సీట్ల కోసం కొందరు చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కుటిల యత్నాలను అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు వారు సోమవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు అనంతపురం వచ్చిన రాష్ట్రపతికి హెలిప్యాడ్ వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛం, వినతిపత్రం అందజేశారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలన్న ఆశయంతో 1956లో బళ్లారి జిల్లాను, తుంగభద్ర నీటి వనరులను కోల్పోయామన్నారు. అప్పటి నుంచి ‘అనంత’ ఎడారి ప్రాంతంగా రూపాంతరం చెందుతున్నా తెలుగుజాతి కోసం త్యాగాలు చేశామన్నారు. అమరజీవి పొట్టిశ్రీరాములు వంటి ఎందరో త్యాగధనుల ప్రాణాలే పునాదులుగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడానికి పూనుకోవడం మంచిది కాదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేర్పాటువాదాన్ని మొగ్గలోనే తుంచేసి, రాష్ట్ర ప్రజలంతా బాగుపడేలా సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. ఫలితంగా దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ప్రజలు, ప్రాంతాల మధ్య రాగద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని, ఫలితంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. దేశంలో జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా కరువుకు నిలయమన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చీల్చడం వల్ల ‘అనంత’ లాంటి వెనుకబడిన ప్రాంతాలు మరిన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజానీకం తరఫున తాము చేస్తున్న ఈ విన్నపాన్ని మన్నించి విభజనకు అడ్డుకట్ట వేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. -
శతాబ్దంలోనే అతి పెద్ద జోక్
పయ్యావుల విమర్శపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ధ్వజం విభజన విషయం లో చంద్రబాబు నాయుడు వైఖరితో రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి అన్నారు. అలాంటి పార్టీ ఆలోచనలను వైఎస్సార్ సీపీ కాపీ కొడుతోందంటూ పయ్యావుల కేశవ్ విమర్శించడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌గా వారు శని వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అభివర్ణించారు. టీడీపీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో, అందుకు పూర్తి విరుద్ధంగా ఆ పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని వారన్నారు. తెలంగాణ ప్రకటన తరువాత సీమాంధ్రకు ప్యాకేజీ కోరిన బాబు, వైఎస్సార్ సీపీ సమైక్యవాదాన్ని చూసి ఇపుడు సమన్యాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీ ఓవైపు తెలంగాణ వాదం, మరోవైపు సమైక్యవాదంతో రెండు కాపురాలు చేస్తోందని, దీనిని సీత, సావిత్రి కాపురం అనాలో, లేక చింతామణి కాపురం అనాలో పయ్యావుల వివరించాలన్నారు. బాబును మించిన రాజకీయ చింతామణి ఎవరు?ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఎన్టీఆర్ పంచన చేరి, గుంట నక్కలా కాచుకుని అదను చూసి ఆయనను దెబ్బకొట్టి పార్టీనే లాగేసుకున్న వైనాన్ని ఎవరు మర్చిపోగలరు? అని ప్రశ్నించారు. బాబు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు భరించలేక ఒక దశలో వైఎస్సార్సీపీలో చేరాలని రాయబారాలు నడపడం అబద్ధమా? ఈ విషయం బయటకు పొక్కేసరికి, మీడియా ముందు వలవలా ఏడ్చేసిన పయ్యావుల ఇపుడు తమ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారని చెప్పారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేపై ఎస్ఐ వీరంగం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వైఎస్ఆర్ సీపీ పిలుపు మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు. రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాగా కణేకల్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. ఈ విషయం తెలుసుకుని ఎమ్మెల్యే నిరసన తెలుపుతూ పోలీస్ స్టేషన్ బయట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఎస్ఐ శేఖర్ కాపు రామచంద్రారెడ్డిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మీ అంతు చూస్తామంటూ బెదిరించారు. -
'సమైక్య ఉద్యమం ఢిల్లీ గాంధీలకు సరిపడటం లేదు'
అనంతపురం: ప్రస్తుతం చేస్తున్న సమైక్య ఉద్యమం ఢిల్లీ గాంధీలకు సరిపడలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. రెండు నెలలకు పైగా సీమాంధ్రలో చేస్తున్న తీవ్ర రూపం దాల్చినా ఢిల్లీ అధిష్టానానికి కన్పించకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీ పెద్దలపై విరుచుకుపడ్డారు. గాంధీ మార్గంలో చేస్తున్న సమైక్య ఉద్యమం ఢిల్లీ గాంధీలకు సరిపడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ గాంధీలు దిగివచ్చే వరకూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఇందులో సరికొత్త వ్యూహాలతో ముందుకుపోతూ ఉద్యమ రూపు రేఖల్ని మార్చాల్సిన అవసరం ఉందని కాపు రామచంద్రారెడ్డి సూచించారు. -
'జగన్ బయటకొస్తే చంద్రబాబు పారిపోతారు'
జగన్‌ను చూస్తే టీడీపీ నేతలకు ఎందుకంత భయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. అవినీతికి మూల పురుషుడు చంద్రబాబు అన్నారు. జగన్ ఎప్పుడు బయటకొస్తే ఏ దేశం పారిపోవాలని బాబు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి ఒళ్లంతా విషముందని అందుకే వైఎస్ కుటుంబంపై ఎప్పుడూ చంద్రబాబు విషం కక్కుతుంటారని అన్నారు. చంద్రబాబును తెలుగు తమ్ముళ్లు వదిలేసే రోజు అతిత్వరలో ఉందని చెప్పారు. జగన్‌పై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, తామే సీబీఐ డైరెక్టర్లు అన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
'చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉంది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆదివారం అనంతపురంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విభజనకు అనుకూలం అంటూ కేంద్రానికి లేఖ ఇచ్చిన బాబు సిగ్గు లేకుండా సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు వ్యవహారిస్తున్న వైఖరి చుస్తుంటూ మహాభారతంలోని కురుక్షేత్రంలో శకుని పాత్ర గుర్తుకు వస్తుందని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉందని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
షర్మిల బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం అనంతపురంలో వెల్లడించారు. ఆ మహానేత కుటుంబంపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్రను సెప్టెంబర్ 2న తిరుపతిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
'నీచ రాజకీయాలకు చంద్రబాబు కేంద్రబిందువు'
అనంతపురం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు కేంద్ర బిందువని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేపట్టబోయే బస్సు యాత్రను ఉద్దేశించి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన చేయనున్న యాత్రను ప్రజలే ప్రతిఘటిస్తారన్నారు. చంద్రబాబు చేసే యాత్రలో జరిగే గొడవలను వైఎస్సార్ సీపీపై నెట్టాలని టీడీపీ భావిస్తోందని రామచంద్ర రెడ్డి అన్నారు. వచ్చే నెల 1 నుంచి దాచేపల్లి మండలం పొందుగల గ్రామం నుంచి బస్సుయాత్ర చేపడతారని టీడీపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు ప్రకటించిన యాత్ర కాస్తా వెనక్కి పోవడంతో ..తాజాగా ప్రకటించిన యాత్ర ఎంతవరకూ ముందుకు వెళుతుందన్న విషయం చర్చనీయాంశమైంది. సీమాంధ్రలో ఆగస్టు 25వ తేదీ నుంచి బస్సుయాత్రను చేపడుతున్నట్లు ముందుగా చంద్రబాబు ప్రకటించినా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఓ దశలో ఎలాగైనా యాత్రను చేపట్టేద్దామని నిర్ణయించుకున్న బాబుకు సీమాంధ్ర నేతలు అసలు సంగతి చెప్పి రెండు కళ్ల సిద్ధాంతం వికటించిందని కళ్లు తెరిపించారు. దీంతో బాబు బస్సు యాత్రకు బ్రేక్ పడింది. తొలుత ప్రకటించిన షెడ్యల్ ప్రకారం విజయనగరం జిల్లా కొత్త వలస నియోజకవర్గం నుంచి రోడ్ షోను ఆరంభించాల్సి ఉంది. -
వెల్లువెత్తిన సంఘీభావం
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: ‘ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయండి లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు గుంటూరులో చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాలో చేపట్టిన దీక్షలకు ఆ పార్టీ శ్రేణులు, సమైక్యవాదుల నుంచి ఐదు రోజులుగా సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, తాడిపత్రిలో పైలా నర్శింహయ్య ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంతకు ముందు పైలా మాట్లాడుతూ.. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా కుమ్మక్కైన కాంగ్రెస్, టీడీపీ నేతలు సీమాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. విభజించే సమయంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు, హైదరాబాద్ అంశం, ఇక్కడ తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా ఏకపక్షంగా విభజన చేస్తామనడం దారుణమని విమర్శించారు. కీలకమైన రాష్ట్ర విభజన అంశంపై పార్టీ గౌరవాధ్యక్షురాలు చేపట్టిన సమరదీక్షకు సీమాంధ్ర ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో మద్దతు పలకడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడానికి అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతాయని హెచ్చరించారు. పుట్టపర్తిలో డాక్టర్ హరికృష్ణ ఆమరణ దీక్ష శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. కదిరిలో ఎన్ఎండీ ఇస్మాయిల్ ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఆయనతో పాటు మరో పది మంది సమైక్యవాదులు దీక్షకు కూర్చుకున్నారు. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తమైంది. ఉరవకొండలో 48 గంటల రిలేదీక్షలు ప్రారంభమయ్యాయి. కళ్యాణదుర్గం, ధర్మవరం, తనకల్లు, యాడికి, పెద్దపప్పూరు, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్ విజయమ్మ ఆరోగ్యం బాగుండాలని చిలమత్తూరులో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఆమరణ దీక్షలు భగ్నం
రాయదుర్గం, తాడిపత్రి, న్యూస్‌లైన్ : వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, తాడిపత్రిలో పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నరసింహయ్య చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. ఐదు రోజులుగా దీక్ష చేపట్టడం వల్ల వారి బీపీ, షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాయి. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వైద్యులు పేర్కొనడంతో రాయదుర్గంలో ఎస్ఐ రాఘవరెడ్డి మహిళా, పోలీసు సిబ్బందితో శిబిరానికి చేరుకున్నారు. దీక్షను భగ్నం చేయకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. అయినా పోలీసులు దీక్షను భగ్నం చేసి.. కాపు భారతిని బలవంతంగా అరెస్ట్ చేసి జీపులో ఎక్కించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్యకర్తలు, నాయకులను పక్కకు తోసేసి, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తాను వైద్యం చే యించుకోనని మూడు గంటలపాటు ఆమె మొండికేశారు. వైఎస్ విజయమ్మ దీక్ష కొనసాగే వరకూ తాను కూడా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు, ఎస్ఐ చెప్పినా ససేమిరా అన్నారు. చివరకు ఎమ్మెల్యే ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో బంధువులు కంటనీరు పెట్టుకుంటూ ఆమె వద్దే ఉండిపోయారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అందరూ ఒత్తిడి చేసి ఆమెకు కొబ్బరి నీళ్లు తాగించి.. చికిత్స ప్రారంభించారు. తాడిపత్రిలో పైలా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు డీఎస్పీ నాగరాజుకు సమాచారమిచ్చారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో పట్టణ, రూరల్ సీఐలు లక్ష్మినారాయణ, మోహన్.. సిబ్బందితో రాత్రి 9.30 గంటలకు దీక్షా స్థలికి చేరుకుని పైలాను బలవంతంగా 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. తాను దీక్ష విరమించేది లేదని ఆయన అక్కడ చాలా సేపు మొండికేశారు. ఎట్టకేలకు వైద్యులు, పోలీసులు నచ్చజెప్పి ఆయనకు వైద్యం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి నియోజక వర్గ సమన్వకర్త వి.ఆర్.రామిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని పైలాను పరామర్శించారు. -
కాపు భారతి ఆమరణ దీక్ష..
-
చంద్రబాబు వ్యాఖ్యలు దురదృష్టకరం: కాపు
రాష్ట్ర విభజనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు తెగేసి చెప్పడం బాధాకరమని తెలిపారు. తెలుగుమాతని నిలువుగా చీల్చడానికి టీడీపీనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ విషయం తెలుగు తమ్ముళ్లకు అర్ధం కావడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని నిన్న కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేలకు సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదని ఆయన పేర్కొన్నారు. -
'టీడీపీకి సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదు'
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేలకు సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదని వారు పేర్కొన్నారు. సమైక్య ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. రెచ్చగొడితే ఉద్యమ రూపురేఖలు మారతాయని వారు హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత,శంకర్ నారాయణ చెప్పారు. రాయలసీమను విభజిస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని వారు ఆరోపించారు. -
లెటర్ ఇచ్చేముందు చంద్రబాబు ఆలోచించలేదు: కాపు
-
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కాంగ్రెస్ నేతల దాడి