'ఎమ్మెల్యే కాపుపై కేసు నమోదు చేశాం'
అనంతపురం : వైఎస్ఆర్ సీపీ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశామని అనంతపురం ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. కౌన్సిలింగ్ పేరుతో తాము ఎవరినీ వేధించలేదని ఆయన శనివారమిక్కడ అన్నారు. వాహనాలు తనిఖీలు, సోదాలలో భాగంగా ఇప్పటివరకూ రూ.2.78కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎన్నికల భద్రత కోసం జిల్లాకు 5000మంది పోలీసులు కావాలని కోరినట్లు ఆయన తెలిపారు.
కాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి క్రమంగా కుదుటపడుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాయదుర్గం పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ మంగళవారం ఆయన పోలీసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స కోసం ముందు బళ్లారికి, అక్కడనుంచి బెంగళూరుకు తరలించిన విషయం విదితమే.