నేడు రాయదుర్గంలో వైఎస్సార్ సీపీ రోడ్ షో | ysr congress party road show in rayadurgam | Sakshi
Sakshi News home page

నేడు రాయదుర్గంలో వైఎస్సార్ సీపీ రోడ్ షో

Published Tue, Mar 18 2014 2:56 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ysr congress party  road show in rayadurgam

రాయదుర్గం, న్యూస్‌లైన్ :వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాయదుర్గం పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటున్నారని, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, అశేషంగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో వైఎస్ విజయమ్మ చేపట్టిన రోడ్ షో కార్యక్రమానికి ప్రజలు ఉప్పెనలా తరలి వస్తున్నారన్నారు. యువతి, యువకులు, మహిళలు, వృద్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. కాగా పట్టణంలో మధ్యాహ్నం 2 గంటలకు కోతిగుట్ట నుంచి రోడ్‌షో ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి లక్ష్మి బజార్, పాత బస్టాండ్ మీదుగా వినాయక సర్కిల్ వరకు కొనసాగుతుందని ఆయన వివరించారు. వినాయక సర్కిల్‌లో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారన్నారు. అనంతరం బళ్ళారి రోడ్డు, శాంతినగర్ వైఎస్సార్ విగ్రహం వరకు రోడ్ షో సాగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ తరలి వచ్చి వైఎస్ విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement