
సాక్షి, అనంతపురం: అధికార టీడీపీ రాయదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా కలేకుర్తి జయరామిరెడ్డిపై కణేకల్ పోలీసులు అక్రమ కేసు బనాయించారు. ఈ క్రమంలో కలేకుర్తి జయరామిరెడ్డిపై బంధువుల మాట్లాడుతూ.. మంత్రి కాలువ శ్రీనివాస్ ఒత్తిడితోనే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ నేత సంజీవరాయుడిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా తనపై అక్రమ కేసు పెట్టారంటూ జయరామిరెడ్డి ఆందోళనకు గురవడంతో.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రాయదుర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఆయనను పరామర్శించారు.