వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రాయదుర్గంలో ఆత్మహత్యా చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని బళ్లారి ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల చర్యకు నిరసనగా రాజశేఖర రెడ్డి అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, కార్యకర్తలు అతనిని అడ్డుకున్నారు. రాయదుర్గంలోనూ, నియోజకవర్గం అంతటా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.