సాక్షి, అమరావతి: టీడీపీకి పబ్లిసిటీ కావాలి కానీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. శాసన మండలిలో టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు టీడీపీ సభ్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. టీడీపీకి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్రంపై ప్రేమ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు తీరు ఇలానే ఉంటే టీడీపీలో ఎవరూ మిగలరని హెచ్చరించారు.
బినామీల కోసం బాబు ఆరాటం
కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. టీడీపీ విన్యాసాలు సర్కస్‌ను తలపిస్తున్నాయన్నారు. బినామీల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నాడని విమర్శించారు. ఎల్లో మీడియాతో చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకరించవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని కమిటీలు కూడా వికేంద్రీకరణనే సూచించాయన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాలా న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబాటు ప్రాంతాలపై సీఎం జగన్ దృష్టి సారించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment