అనంతపురం: జిల్లాలోని రాయదుర్గంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసులున్నాయనే నెపంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 100 మందికి పైగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలున్నారు. ప్రధానంగా పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలనే అరెస్టు చేయడంతో వైఎస్సార్ సీపీ మండిపడింది.
పోలీసులు ఈ రకమైన చర్యలకు దిగడం సరికాదని వైఎస్సార్ సీపీ నేత కాపు రామచంద్రా రెడ్డి తెలిపారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.