అనంతపురం : అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధింపులను నిరసిస్తూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసులున్నాయనే నెపంతో వందమందిని కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏ కారణం లేకుండా కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారన్నారు. పోలీసుల తీరును తప్పుబడుతూ ఆయన పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని గమనించిన పార్టీ కార్యకర్తలు కాపు రామచంద్రారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాయదుర్గం బంద్కు పిలుపునిచ్చింది.