
సాక్షి, అమరావతి: లోకేష్ అర్థం పర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. లోకేష్ అంటే మాకు భయం ఎందుకని.. మండలిలో ప్రశ్నలు రాకుంటే మేం ఎలా వెళ్తామని ప్రశ్నించారు. ఇవాళ మండలిలో ప్రశ్న ఉంది కాబట్టే వెళ్ళానన్నారు. చర్చ జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.
ప్రజలే బుద్ధి చెబుతారు..
ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడే సాంబిరెడ్డి మృతి చెందారంటూ చంద్రబాబు ఇంకా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉల్లిపాయలు కోసం సాంబిరెడ్డి క్యూలో నిలబడి తొక్కిసలాటలో మరణించలేదని..గుండెపోటుతోనే మృతి చెందారని స్వయంగా ఆయన కుటుంబసభ్యులే చెప్పిన కూడా చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.నీచ రాజకీయాలు మానుకోపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
చంద్రబాబు డ్రామాలాడుతున్నారు..
దేశం గర్వించే విధంగా మహిళల భద్రత కోసం బిల్లులు ప్రవేశ పెడుతున్నామని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. కీలక బిల్లులు పెట్టే సమయంలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశం అంతా ఏపీ వైపు చూసేలా మహిళల రక్షణకు చట్టం చేసామని చెప్పారు. సభలో కావాలనే టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు సలహాలు,సూచనలు ఇచ్చి సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment