
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమీపిస్తున్న వేళ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి నివాసంలో పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడంపై రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులు ఈ విధమైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
కొంతమంది అధికారులు, పోలీసులు మంత్రి కాల్వ శ్రీనివాసులకు తొత్తులుగా మారారని ఆయన ఆరోపించారు. సోదాలు చేస్తున్న సమయంలో మీడియాను అనుమతించకపోవడంపైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కుట్రలకు పాల్పడటంపై ఆయన మండిపడ్డారు.