‘ఉపాధి’ అక్రమాలపై విచారణకు ఆదేశం
Published Mon, Dec 12 2016 11:18 PM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
కాపు రామచంద్రారెడ్డి
రాయదుర్గం : నియోజకవర్గంలో ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కేంద్ర ప్రభు త్వం ఆదేశించినట్లు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలంయలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధి హామీ నిధులతో నీరు–చెట్టు కార్యక్రమం కింద యంత్రాలతో పనులు చేపట్టారన్నారు. కూలీల కడుపు కొడుతున్న నీరు–చెట్టు పనులు, పక్క దారి పడుతున్న ఉపాధి హామీ బిల్లులపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాను గత నెలలో ప్రధానమంత్రికి లేఖ రాశానన్నారు. స్పందించిన ప్రధానమంత్రి కార్యాల యం ఈ అక్రమాలపై సమగ్ర విచార ణకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాసిందన్నారు. ఆ ప్రతిని తనకు కూడా పంపిందని చెప్పారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు నభీష్, ప్రధానకార్యదర్శి అబ్బాస్, మండల కన్వీనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement